20 - రవిమండలమున శివు నర్చింప నధికారుల నిరూపణము

సూత ఉవాచ:

సూర్య మండలమునందు సదాశివుని బ్రాహ్మణులు, క్షత్రియులు వైశ్యులును పూజింప నధికారము కలిగియుందురు స్త్రీలు శూద్రులును బ్రాహ్మణులతో రవిమండలస్థుడగు మహేశ్వరుని పూజింప జేయవలెను.

ఇట్లు నిర్వచించి శివుఁడంతర్ధానముఁజెందగా దేవతలు మునులును శివునుద్దేశించి ప్రణమిల్లినవారై రుద్రాధ్యాయమును పఠించి తమ తమ నెలవులకుఁ జనిరి.

అందువలన శివభక్తులు మహేశ్వరుని రవిమండల వర్తిగా ఆరాధించుట అతిముఖ్యమైనదని విదితమైనది.

“అగ్నిపూరాణప్రోక్తమగు శివుపూజానిధానమును వివరింపు” మని శౌనకాదిమునులు ప్రశ్నింపగా సూతమహాముని “పూర్వము సనత్కుమారునకు నందికేశ్వరుడు చెప్పినట్లు మీకు ప్రబోధించెద” నని చెప్పదొడఁగెను.

ఈ పూజావిధానము శివ ప్రోక్తమై స్తుతినిందాదులు లేనిదై తత్కాలముననే నమ్మకమును కలిగించునదియు గురుకరుణా లబ్దంబు అనాయాసముగా మోక్షము నొసఁగునదియునై యున్నయది.

గురువువలన శాస్త్రమువలనను నధికారము శిష్యునకు సంక్రమించును.

శాస్త్రములను సదాచారమునందు ప్రవర్తింపజేయువాడు ఆచార్యుడనబడును.

వేదార్థతత్త్వజ్ఞుఁడు, భస్మధారణాది పాశుపత వ్రతస్థుఁడు, శివుని శరణుఁ బొందువాడు, ప్రియదర్శనుడు, పంచాక్షరీవిద్యా ప్రదానముచే అభయము నొసఁగువాడు, విషయాసక్తి మనశ్చాంచల్యము లేనివాడు, సదాచారమును పాటించువాడు, ధీరఁడు, దేశ కాలాను గుణముగ బోధించువాడు నగు ఆచార్యు (గురుపు) సన్వేషించి అట్టి యాచార్యుని. శిపునివలె శిష్యుఁడు తను మనో ధనములతో శ్రద్ధాభక్తులతోడను ప్రసన్నుఁడగువరకు సేవింపవలెను.

గురువు ప్రసన్నుడైనచో సంసారపాశబంధము సద్య స్కాలముననే విడిపోవును. అందువలన శాంభవదీక్షా ప్రణాళయగు గురులే మాన్యుడు సదాశివుడు నని భావింపవలసి యుండును.

ఆచార్యుఁడు అనేక క్లేశములలో పరీక్షించినను శిష్యుడు బాధపడక - శివధర్మాసక్తుడై ఇంద్రియ నిగ్రహము, మనః స్థైరూము, శృతి స్మృతి మార్గము ననుసరించుటయు, నిత్యోత్సాహము, పరోపకార పారీణత, గురుసేవ, ఋజుస్వభావము, మ్మదు హృదయము ఆరోగ్యము, వృద్ధానుకూలత, ప్రియ సంభాషణము, నిగర్విత్వము, బుద్ధిబలము, అసూయా రాహిత్యము, అత్యాశ  లేకుండుటయు, పరిశుభ్రత, సదాచారము, శివభక్తి పరాయణత్వంబు కలవాడునై యుండవలెను.

మరియు స్నాన భస్మధారణాదులతో పరిశుద్ధుఁడు, వినయసంపన్నుడు, అబద్ధము కఠినము నైన భాషణము లేని వాడు, గుర్వాజ్ఞా పాలకుడు నగు శిష్యుడు శాంభవదీక్షను స్వీకరింప నర్హుడగును.

శాంభవ (పాశుపత) దీక్షఁ బరిగ్రహించుటకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు నధికారము కలిగియుందురు. గురువు షడధ్యశుద్ధి నొనర్చి యోగ్యుడైన శిష్యునకు శాంభవదీక్ష నీయవలెను.

ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (20)పయధ్యాయము.