లింగ మహా పురాణము
9 - యోగవిఘ్న నిరూపణము
యోగాభ్యాసములో మొదలు - అలసత్వము, తరువాత వ్యాధిపీడ; ప్రమాదము (పొరపాటు) సంశయము (యోగసిద్ధిని శంకించుట) చిత్తము స్థిరము కాకుండుటయు, పట్టుదలతగ్గుట, భ్రాంతి (ఇది కష్ట తరముగా నమరి యొక సులభసాధనము నవలంబింప వలెనను భ్రమ) దుఃఖము, మనస్సుచెడు తలంపులు కలిగియుండులు- ఇంద్రియ సుఖానుభవము నందు ఆసక్తి యనుపది-యోగవిఘ్నములుగా చెప్పబడినవి.
శరీరము బరువుగలదైనచో ఆలస్యము; చిత్తము - నానావిధ విచారగ్రస్తమగునేని యోగమునందు ఉత్సాహము తగ్గుటయు శరీరములో సప్తధాతువులు సరిగా లేనిచో- వ్యాధులు సంభవించుటయు ఇవి పూర్వ కర్మవలన కలుగునవి. యోగ సాధనములను పాటింపనందున ప్రమాదము ఏర్పడును.ఇది యగునా కాదా అనునది - సంశయ మనఁబజుగునుచంచల స్వబావము వలన చిత్త శౌర్యము కొలువడును. యోగస్థానము లభించినను అచ్చోట మనస్సు నిలువనిచో యోగము సాధింపబడదు. యోగము నందు సదాచారము నందు శివునందును నిష్ఠ లేనిచో - విపరీతజ్ఞానము కలుగును.దానివలనబ్రాంతియేర్పడును.
వీని నన్నిటిని వైరాగ్యముతో నిరాకరింపవలెను. మరియు మిక్కిలి ఉత్సాహముతోడను పట్టుదలతోడను యోగవిఘ్నలన్నియు దూరమగును.
స్థూలత్వము - హస్రత్వము (పొట్టిగా నుండుట) బాలుడగుట, యువకుడగుట, వృద్ధుడగులుయు, పశుపక్ష్యాది నానాజాతి స్వరూపమును గురుతెఱ, గుటయు. భూమియందు వలె జలము నందుండుటయు వలయుచో సముద్రము గూడ త్రాగు సామర్థ్యము, కోరిన ప్రతిచోటును జలముగాంచుటయు - కోరబడు ప్రతివస్తువు అనుభవము లోనికి వచ్చుటయు- పాత్రలేకున్ననుఉదకమును చేత బట్టులుయు- హస్తమున అగ్నిని నిగ్రహించుటయు-దహింపబడి భస్మమైన వ్యక్తిని బ్రతికించుటయు-శరీరము రోగ రహిత మగులుయు మనస్సు వలె వేగముగా సంచరించుటయు ప్రాణులలో నివసించుటయు-పర్వతములు మొదలగు భారమును భుజముపై నిలుపుటయు చేతులతో వాయువును ధరించుటయు-బొటన వ్రేలు తాకిడి తోడనే భూమిని కంపింప జేయుటయు-ఇంద్రియ రూపములఁ గాంచుటయు- ఆకాశగమనము దూరమునుండి శబ్దమును వినుటయు-యథేష్టముఅన్నిటిలో ప్రవేశించుటయు-అన్నిటినుండి వెడలుటయు-రహస్యముల నన్నిటిని కనుగొనుటయు-తనకు ఇష్టమైన దానిని నిర్మించుటయు- ఇంద్రియజయము ప్రియమైనదానిఁ గాంచుటయు- సర్వభూత ప్రసాదము మృత్యుకాలమును జయించుటయు- క్రమశః- బ్రహ్మదేవుని సంపత్తు,విష్ణువు యొక్క ఐశ్వర్యంబు సంప్రాప్తము లగులుయు యోగమహిమలుగా నొప్పారుచున్నవికాని
శ్లో॥ విద్యతే తత్పరం శైవం- విష్ణునా నావగమ్యతే ।
అసంఖ్యేయగుణం శుద్ధం-కో జానీయా చ్చివాత్మకం? ॥
విష్ణువైభవమును మించిన శివమహిమను విష్ణువే కనుగొనఁజాలడు. లెక్కింప నలవిగాని గుణములు గలది, శుద్ధంబునగు శివవైభవము నెవడు తెలిసికొనిజాలును?
యోగమహిమల పై విరక్తి జెందినచో-మహేశ్వరుఁడు ప్రసన్నుఁడై ముక్తి నొసగును. శివానుగ్రహార్థము తన చేష్టిత మంతయు శివునిడే నని భావించువాడు-యోగ మహిమల ననుభవించుచునుముక్తుడగును.
యోగమహిమలుఎట్టవియనగా?
ఒకప్పుడు భూమిని విడనాడి తన యోగశక్తితో ఆకసమున సంచరించుటయు, మరియొకప్పుడు వేదముల నుచ్చరించుచు నవ్వాని యర్థమును వివరించుటయు, ఒకప్పుడుశ్రుతముసంతయు శ్లోకముల రచించి తెలుపులుయు మృగముల యొక్కయు పక్షులయొక్కయుపలుకులనుకనుగొనుటయు బ్రహ్మలోకము మొదలుకొని యుండు ప్రపంచమంతయుహస్తామలక(చేతిలోఉసిరికాయవలె) మగుటయు పెక్కు చెప్పనేల? వేలకొలదివిజ్ఞానములుయోగసిద్ధునకుకలుగును. ఐతే యోగమును విడువక నిత్య మభ్యసించుట వలననే విజ్ఞానము స్థిరపడును. తేజోరూపములు గల నక్షత్రాదుల నవలోకించును. వేల కొలది దేవ విమానములు గోచరించును. బ్రహ్మలోకమును వైకుంఠమును ఇంద్రయమాగ్ని వరుణాదులను పాతాళలోకములను యోగి- సమాధిలో చూడగలుగును.
సత్త్వగుణము లను పాత్రయందు ప్రసాదము అను తైలముతో కడలక నుండు స్థితి యనుఆత్మవిద్య యనఁబఱుగు దీపమును వెలిగించినచో హృదయమున గల చీకటిని పారదోలి-తనలో పరమాత్మను దర్శింపఁగలుగును. మహేశ్వరాను గ్రహము వలన ధర్మము, ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము, మోక్షంబు చేకూరును. పదివేల సంవత్సరములు చెప్పినను యోగాభ్యాసము తన్మహిమయు పూర్తికావు.
మునీశ్వరులారా! పశుపతికి సంబంధించి పెట్టిగః “యోగమునందు ఉత్తమ పురుషుడు నిష్ఠగల వారగుదురు. సామాన్యులకు ఇది అలవడుననది కాదు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (9) తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 9 of the Linga Mahā Purana is as follows:
The narrative outlines the various physical, mental, and environmental obstacles, known as yogāntarāyas, that spiritual practitioners encounter on the path of yoga, including illness, sloth, doubt, delusion, and celestial distractions. It offers detailed divine remedies, spiritual purifications, and constant remembrance of Parameśvara Śiva to overcome these impediments, assuring practitioners that unwavering devotion and perseverance lead to spiritual victory.