లింగ మహా పురాణము
32 - సువర్ణ మేదినీ (భూమి) దాన నిరూపణము
శుభ్ర ప్రదేశమున మండలమునందు మూరెడు పొడవు వెడల్పు ఎత్తున గల భూమిని - నలుచదరముగా యథాశక్తి బంగారముతో సప్తద్వీపములు భూమిచుట్టు చతుస్సముద్రములు, కులాచలములు, సమస్త పుణ్యతీర్థములు, మధ్యన మేరుపర్వతంబు నుండునట్లు చేయించవలెను.
అథవా జంబూద్వీపము మాత్రము అందు నవఖండములు నుండు నట్లు భూమ్యా కృతిని బంగారముతో చేయించి -మండలమున వేదికపై భూమి నునిచి దానిపై ఉమామహేశ్వరుల నర్చించి - శివభక్తుడైన సత్ బ్రాహ్మణునకు దక్షిణతో సహ సమర్పించవలెను. ఈ సువర్ణమేదినీదానము లింగమహాపురాణమున - శ్రేష్ఠముగా చెప్పఁబడినది.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (32)వ యధ్యాయము.
Summary of chapter 140 of the Linga Mahā Purana is as follows:
This chapter presents Prāyashcittavidhi, detailing specific penances, fasting regimes, and mantra recitations to expiate severe accidental or intentional transgressions. Nandi explains that sincere repentance combined with continuous chanting of the Rudra-hymns and worship of the Śiva Liṅga cleanses the mind and restores spiritual integrity.