లింగ మహా పురాణము
39 - షోడశ మహాదానములలో పదునొకండవ హిరణ్యాశ్వదానమును వివరించుట
అశ్వమేధయాగఫలమును మించిన ఫలము నొసగు హిరణ్యాశ్వదానముఁదగు విధానము ఎట్లనఁగా?
అశ్వమును - నాలుగు కాళ్లపై ముఖముపైనను తెలుపు అను పంచలక్షణములు కలిగియుండునట్లు యథాశక్తి బంగారముతో చేయించవలెను.
మరియు సమస్త ఆయుధములతో గూడ ఇంద్రరథమును యథాశక్తి బంగారము లేక వెండితో చేయించి - రథాగ్రమధ్యన సువర్ణాశ్వమును ఉచ్చైః శ్రవసముగా నెలకొలిపి పూజించియు ఇంద్రరథమునకు తూర్పునండు విద్వాంసుడైన సద్ర్బాహ్మణుని - దేవేంద్ర భావనతో నర్చించి - రథము నశ్వమును, సువర్ణదక్షిణ, నస్త్ర యుగ్మము అనువానితో భోజన తాంబూలములతోడను దానమొనరు. దానికి స్వర్గసుఖము చిరకాలము లభించును.
సువర్ణాశ్వప్రదాత - బ్రాహ్మణులకు, దీనులకు, అంధులకు, దరిద్రులకు, అనాథులకు, బాలురకు, వృద్ధులకు, కృశులకు, రోగార్తులకును అన్నదానముఁజేసి - వారిని సంతోషింపఁజేయవలెను.
ఇట్లు చేసినచో - స్వర్గమున ఇంద్రభోగములను చిరకాలము అనుభవింపఁబడుటే గాక - ప్రారబ్ధాంతమున కోటీశ్వరుఁడై భువిని - జన్మించుట సంఘటించును.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (39)వ యధ్యాయము.
Summary of chapter 147 of the Linga Mahā Purana is as follows:
The text expounds upon Pralaya, describing the multi-tiered process of cosmic dissolution where physical worlds, subtle dimensions, time, and elements are systematically reabsorbed back into the unmanifest body of Parameśvara Śiva, establishing that Mahādeva alone remains eternal and unchanged before creating the universe anew.