లింగ మహా పురాణము
100 - దక్షయజ్ఞ వినాశనము, దేవతలను శివుడనుగ్రహించుటయు
వీరభద్రుఁడు అను గణేండ్రుని శివుఁడు పంపగా వీరభద్రస్వామి తన వెంట్రుకలనుండి గణాధిపతులను పుట్టించి భూలోకమున గంగాద్వారమునకు చేరువన గల కనఖలక్షేత్రమున దక్ష ప్రజాపతిచే చేయఁబడు యజ్ఞముఁడగు వాటికను సమీపించెను.
అట్టితఱి పర్వతములు భూమియు కదలుచుండెను, ప్రచండవాయువులు వీచుచుండెను. సముద్రము ఉప్పొంగుచిండెను. అగ్నులు సూర్యుడును మందకొడిగా ప్రకాశించుచుండెను. గ్రహములు వెలుతురు గోలుపోయెను. దేవతలు దానవులును వేరువేరుగా గుర్తింపబడుకుండిరి.
ఇట్టి భయోత్పాతములు చెలరేగుచుండగా వీరభద్రస్వామి తన గణములను వెంటనిడుకొని దక్షుని సమీపించయు దక్షా! నిన్ను మునుల నమరులను దహింప నన్ను శివుఁడు పంపెను.” అని వచించి మొదట-యజ్ఞవాటికను దహింపగా గణాధిపతులు సంక్రుద్ధులై యూపస్తంభములను పెఱకి పడవేసిరి. ప్రస్తోతలను హోఅతలను కాల్చి అందరిని గంగా ప్రవాహమున పారవేసిరి. దేవేంద్రుడు యుద్ధమునకై లేపిన హస్తమును వీరభద్రుడు స్తంభింపజేయుటే గాక భగుని నేత్రమును పెకిలించి పూషుని దంతములను పడగొట్టియు చంద్రుని పాదాంగుష్ఠముతో పొడిచియు యముని దండమును
విరిచియు ఈశానుని త్రిశూలముతో కొట్టియు- దేవతలండలిని ఖడ్గాద్యాయుధ ప్రయోగముతో నోడించెను. దేవేంద్రుని శిరస్సును ఖండించెను. అగ్నిదేవుని హస్తద్వ యమును నాలుక నూడదీసి తలపై తన్నెను.
అంత శ్రీహరి క్రోధావిష్టుడై యుద్ధమునకు తలపడగా విష్ణు వీరభద్రులకు ఘోరయుద్ధము జరిగెను. అట్టతఱి విష్ణువు తన యోగశక్తిచే శంఖచక్ర గదా హస్తులు అసంఖ్యాతులునగు గణములను పుట్టింపగా వారందరిని గదతో పడవేసినవాడై విష్ణువుఁదగు శిరస్సున (గద)తో కొట్టి ఉరస్సున ప్రహరించినందున శ్రీహరి తెలివిదప్పి క్రింద పడినవాడై క్షణములో మరల తెలివిగలవాడై చక్రమును లేపగా వీరభద్రస్వామి కేశవుని చక్రమును స్తంభింపజేసెను. అందువలన నారాయణుడు. పర్వతము వలె కదలనివాడై యండగా శార్జధనుస్సు గూడ వీరభడ్రుడు మూడు తునకలుఁజేసెను. అట్టతఱి విష్ణువు యొక్క శిరస్సు, తెగినదై వీరభద్రుని నిట్టూరుపు చే ఆహవనీయాగ్నియంచు దగ్ధ ముయ్యెను.
ఇట్టి ధ్వంసము గాంచి భీతిల్లిన యజ్ఞము మృగరూపమున సరుగిడుచుండగా దానిని దొరికించుకొని శిరస్సును పడగొట్టెను. ఆ పిమ్మటు “ధర్ముడు“ అను ప్రజాపతిని, జగత్పూజ్యుడగు కశ్యపుని, అరిష్టనేమిని. ఆంగీరస మహర్షిని, కృష్ణాశ్వుని శిక్షించి - దక్షుని శిరస్సుపై కాలితో తన్ని యాతని తలకాయను చేధించి అగ్నియందు దహించెను.
ఇంతలో భగవానుఁడైన బ్రహ్మదేవుఁడు నమ్రుఁడై ‘‘స్వామీ! కోపము చాలించుము! అమరులందరిని పరాజితుఁలజేసితివి గాన ప్రసన్నుఁడవై నీ గణములను శాంతింపఁజేసి వీరి ఉపరాధములను క్షమింపుము!” అని ప్రార్థింపగా వీరభద్రస్వామి గణములతో కూడ శాంతించెను.
ఈ దృశ్యమునంతయు అంతరిక్షమున వీక్షించుచున్న మహేశ్వరుడు కరుణాంతరంగుడై హతులైన వారందరికి సమీచీనములగు రూపముల నొసఁగి విష్ణువునకు దేవేంద్రునకను శిరస్సులంబ్రసాదించి - మునులను జీవింపజేసియు - దేవమాతయుగు సరస్వతీ దేవికి నాసాగ్రమునొసగియు మరణించినవారి నందరిని బ్రతికించియు అనేక వరముల నొసగెను. దక్షునకు మేకతల కాయు నంటించి బ్రతికించెను.
దక్షుడు జీవించి తెలివి గలవాడై దోసిలొగ్గియు, దేవదేవుడైన మహేశ్వరుని భక్తిభావమున కొనియాడగా బ్రహ్మ దేవుడు, దేవేంద్రాదిసురలు, నారదాది మునీంద్రులును “మమేశ్వరా! పాంహి “యని ప్రార్ధించిరి. తరువాత మహేశ్వరుడు నిండు దయతో దక్షునకు గాణ పత్యము నొసంగగా - భగవాసుడుగు నారాయణుడు గూడ భవు ననేక విధముల స్తుతించినందున ప్రసన్నుడైన మహేశ్వరుడు హరి బ్రహ్మోతులను కటాకించి యంతర్థానముఁ జెండెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ యను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (100)వ అధ్యాయము.
Summary of chapter 100 of the Linga Mahā Purana is as follows:
Continuing the narrative of Daksha's sacrifice, this chapter describes how Vīrabhadra and the fierce Gaṇas decapitated Daksha, routed the arrogant sacrificial assembly, and humbled the devas. When Daksha's severed head was replaced with that of a goat, Daksha realized Mahādeva's supreme majesty, bowed before Him in deep repentance, and offered prayers of devotion, receiving Śiva's divine forgiveness.