లింగ మహా పురాణము
14 - అఘోర సముద్భవ నిరూపణము
సూతుఁడు చెప్పఁ దొడఁగెను.
పీతవాసము అను కల్పము తరువాత ఆసితము అను కల్పము ప్రవర్తించెను. దివ్యములైన వేయి సంవత్సరములు అవాంతరప్రళయము ముగిసిన పిమ్మట బ్రహ్మ దేవుఁడు సృష్టికొనసాగుటకు పుత్రకాముఁడై పరమేశ్వరుఁ బ్రార్ధింపగా కృష్ణ (నలుపువన్నె) వర్ణముతో ఆవిర్భవించిన కుమారుఁగాంచెను.
ఆ కుమారుఁడు తన తేజస్సుతో ప్రకాశించుచు-నల్లని బట్టలఁ దాల్చి- కృష్ణయజ్ఞోపవీత ధారియై నల్లని పువ్వుల హారమును ధరించిన వాడై అఘోరుఁడను పేరు గలవాడై యుండెను.
బ్రహ్మదేవుఁడు ఆ కుమారుని నమస్కరించి ప్రార్థించిన పిడప అఘోరుని పార్శ్వమునుండి కృష్ణ వర్ణము గల నలుగురు-కృష్ణుడు కృష్ణ శిఖుఁడు, కృష్ణాస్యుఁడు, కృష్ణవ స్త్రదృక్, అనువారు ఉదయించిరి. వారు వేయి వత్సరములు శివ ధ్యానయోగము నాచరించి తమ శిష్యులకు ప్రబోధించిరి. ఆ తరువాత శివైక్యమును చెందినవారైరి. ఇట్టి అఘోరో పాసనముఁ జేసినవారు పునర్జన్మ రహితులై శివసాయుజ్యము నొందుదురు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” ఆనుశాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున(14) పదునాలుగవ యధ్యాయము.
Summary of chapter 14 of the Linga Mahā Purana is as follows:
This chapter details the awe-inspiring manifestation of Aghora, the fourth divine face of Mahādeva, facing the southern direction, dark as a storm cloud, and embodying the destructive power that annihilates cosmic ignorance and evil. Sūta Romaharshaṇa narrates how Aghora manifested during the Kṛshṇakalpa to destroy demonic forces, protect righteous seekers, and reveal the fierce yet benevolent aspect of Śiva.