లింగ మహా పురాణము
16 - బహువిధములైన శివరూపములను నిరూపించుట
మునీశ్వరులు బహువిధములుగా పేర్కొనిన శివరూపములను సనత్కుమారునకు నందికేశ్వరుఁడు చెప్పదొడఁగెను.
క్షేత్రజ్ఞఁడు పురుషుఁడనియు, ప్రధానము ప్రకృతి యనియు, ప్రకృతి వికారములన్నియు వ్యక్తములనియు, ప్రధానమును వ్యక్తముగా పరిణమింపఁజేయునది కాని మనియు, ఈ నాలుగును మహేశ్వరుని రూపములనియు, ఆగమూర్ణవ పారగులు నిరూపించిరి.
హిరణ్యగర్భుఁడు పురుషుడు ప్రధానము వ్యక్తము అను నాలుగు రూపములు గలవాడు పరమేశ్వరండని కొందరు ఆచార్యులు ప్రతిపాదించిరి.
సూత్రము నండు మణిగణములవలె లోకములన్నియు తనయందు ఆధారపడియుండుటచే పరమేశ్వరుడు సూత్రమన బడును. మహాదేవుడు సర్వభూతాంతర్యామి యని కొందరు నుడివిరి. చరాచర ప్రాణులయొక్క శరీరములు పిండములు కాగా ఒక్కొక్క శరీరము నకు ఏర్పడిన జాతిస్వరూపము గలవాడు శివుఁడేను, సూత్రము, అవ్యాకృతమున్ను శివరూపములేను.
శివుఁడు హరి బ్రహ్మాదుల నతిక్రమించి యుండుటచే పరుఁడనఁబడును. ప్రాజ్ఞుడు, తైజసుఁడు, విశ్వుడు నను సంజ్ఞలు శివునకే చెల్లును. సుషుప్తి, స్వస్నము, జాగ్రత్తు నను మూడవస్థలు జగత్సృష్టి స్థితిలయ కారణములగుచున్నవి. బ్రహ్మ విష్ణరుద్ర స్వరూపములు కలిగియుండువాడు మహేశ్వరుడేను;
నాలుగవవాడగు మహేశ్వరుని శరీరధారులు తమ మనస్సులో ధ్యానించి తరించుచున్నవారు.
కర్త - క్రియ- కార్యము , రణము, ప్రమాత, ప్రమాణము - ప్రమేయము ప్రమితి యివియన్నియు శివుఁడేనని భావింపవలెను. సముద్రము యొక్క తరంగముల వలె అవ్యాకృతము,ప్రాణము, విరాట్ రూపము, పంచభూతములు, ఇంద్రియములున్ను శివుని విభూతులగును. శివునికంటె వేరైన పరమాత్మ లేడని భావింపవలెను. భూరాది పంచవింశతి తత్త్వములను మించిన వాడు శివుఁడని వేదశాస్త్ర వాఙ్మయము - చాటినది.
సదాశివుఁడు, మహేశ్వరుఁడు, రుద్రుఁడు, విష్ణువు, బ్రహ్మాదులును శివునివలననే ఆవిర్భవించిరి. సూర్యుని నుండి కిరణములవలె ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు పరమేశ్వరుని వలననే ఉదయించినవి.
సర్వాత్మకుఁడు, సర్వాశ్రయవిధాయకుడు నగు శివుని శ్రేయస్కాముడు మనోవాక్కాయ ములతో భజింపవలెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున(16)వ యధ్యాయము.
Summary of chapter 124 of the Linga Mahā Purana is as follows:
This chapter presents the sixteen Mahādānas, the most exalted forms of charity in Sanātana Dharma, including the donation of gold equal to one's weight, golden elephants, golden chariots, and land empires. Nandi explains that performing these grand gifts with humility wipes away major karmic offenses and grants the donor divine status among the devas.