లింగ మహా పురాణము
32 - దారువనమునులు శివదర్శన సంతుష్టులై పునః ప్రార్థించుట
ఋషయ ఊచుః = మహర్షులు దిగువవిధము పలికిరి :-
శ్లో॥ నీలకంఠాయ దేవాయ - చితాభస్మాంగధారిణే । త్వం బ్రహ్మా సర్వదేవానాం - రుద్రాణాం నీలలోహితః ॥
దిగుంబరుఁడు, ప్రళయకర్త, త్రిశూలి, సుండరుఁడు, కరాళుఁడు (సంసారవృక్షము ను ఛేదింప గొడ్డలి వంటివాడు) కరాళవదసుఁడు, (భయంకర ముఖము గలవాడు) అరూపుఁడు (ప్రాకృత రూపములేనివాడు) సురూపుఁడు, విశ్వరూపుఁడు కలంకటుఁడు, (కటం = గజాననమస్తకం; కటతి = ప్రేమ్ణా లాలయ తీతికలుంకటః) (గణపతి తలకాయ ననురాగముతో లాలించువాడు) రుద్రుఁడు, స్వాహాకారుఁడు, (యజమాన స్వరూపుఁడు) సర్వప్రణతదేహుఁడు, (డేవముని మానవాదులచే నమస్కరింపబడు దివ్యశరీరము గలవాడు) నిత్యనీల శిఖండుడు, (ఎల్ల కాలమున నల్లనైన జబాజూటము గల యువకుఁడు) శ్రీకంఠుఁడు, (విషపానజన్యమగు కంఠశోభ గలవాడు) నీలకంఠుఁడు, దేవుఁడు (స్వయం ప్రకాశమానుడు) చితాభస్మాంగధారియు నగు మహేశ్వరునకు నమస్కారము.
పరమేశ్వరా! అమరులలో బ్రహ్మదేవుడవు! రుద్రులలో నీల లోహితుడవు! ప్రాణులందరిలో జీవాత్మవు! సాంఖ్యులు నిన్ను పురుషుడందురు. పర్వతములలో మహామేరు వగుదువు! నక్షత్రములలో చంద్రుఁడవు! ఋషులలో వసిష్ఠమహర్షివి! దివిషదులలో దేవేంద్రుఁడవు!
సమస్త వేదవాఙ్మయములో ఓంకార మగుదువు! సామసూక్తములలో శ్రేష్ఠమగు సామమంత్ర మగుడువు! అరణ్య మృగములలో సింహమగుదువు! గ్రామ్య పశువులలో వృషభమగుదువు! లోక పూజ్యులలో షడ్గుణైశ్వర్యసంపన్నుడగు భగవంతుడవు! అనాది కాలము నుండి వర్తమానంబగు చేతనాచేతన వర్గమునకు స్వరూపము నొసఁగువాడవు!
పూర్వము విధాత మాకు తెలిపిన నీ రూపమును చూపెట్టుము! కామము, క్రోధము, లోభము, విషాదము, మదము అనునవి - నీపు లలాటమున చేయి పెట్టి రగులుకొలిపిన ఫాలనేత్రాగ్ని యొక్క మంటులచే జగత్తును కాల్చునపుడు అట్టి అగ్నిజ్వాలలఁబోలియుండునవి. మేము శివాపచారము ఆసు అగ్నితో దహింపబడుచున్నాము. మమ్ము రక్షించుము! ప్రళయానంతరము సృష్టికాలమున నీ యమృత ధారలతో జీవాత్మల నాహ్లాదింపఁ జేయువాడవు! మేము ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుము! దేవదేవా! కోట్లు కొలది ప్రాణులలో కోట్లకొలది రూపములలో విరాజిల్లు వాడవు! నీ ఆద్యంతములను కనుగొనఁ జాలము. మమ్మను గ్రహించుము! సాష్టాంగమునిడు చున్నాము.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” - అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (32) ముప్పది రెండవ అధ్యాయము.
Summary of chapter 32 of the Linga Mahā Purana is as follows:
Continuing the divine praises, this chapter records another powerful hymn addressed to Prabhu Śiva by liberated souls and celestial beings. The hymn celebrates Śiva as the destroyer of Tripura, the drinker of Hālahala poison, the lord of Umā, and the supreme shelter for all creatures seeking relief from the blazing heat of worldly suffering.