లింగ మహా పురాణము
18 - అష్టాదశాధ్యాయము
దేవతలు పరమేశ్వరు నిట్లు ప్రార్థించిరి.
ఈ శివభగవానుఁడు బ్రహ్మవిష్ణు రుద్రాత్మకుఁడై కుమార దేవేంద్రాది రూపములు గలవాడునై పదునాలుగు లోకములుగాను, అశ్వినీ దేవతలుగాను, గ్రహతారా నక్షత్రములుగాను, ఆకాశముతో కూడిన దిశలు గాను, పంచమహాభూతములుగాను, సూర్యచంద్రులుగాను, ప్రాణకాల యమ మృత్యువులుగా నుండును. మరియు మోక్షమును కలుగఁజేయును. భూత భవిష్యద్వర్తమాన కాలములలోని విశ్వముగా నుండును. సత్యస్వరూపుడైన శివునకు నమస్కారము.
పరమేశ్వరా! నీవు ఈ ప్రపంచమునకు ఆది, అంతము నగువాడవు. భూర్భువస్వర్లోకముల యొక్క శీర్ష(అగ్రస్థాన)మున మహాకైలాసము నందు ఆనందపరిపూర్ణుడవై నివసించువాడవు;
నీవు అద్వితీయుఁడవైనను - ప్రకృతి పురుషాత్మకముగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగాను పలు తెఱుంగులు కలవాడుపై బ్రహ్మాండమునకు ఆధార మగుచున్నావు?
శాంతి, పుష్టి, తుష్టి, ఆహుతము, హుతము, విశ్వము, అవిశ్వము, దత్తము, అదత్తము, మతము, అకృతము, పరము, అపరమునై సజ్జనులకు, దుర్జనులై సజ్జనులు కాదలచినవారికిని, సుఖ ప్రదంబు పరమేశ్వర స్వరూపమేను;
“అపామసోమ మమృతా అభూమాన్మ జ్యోతి రవిదామ దేవాః కింనూనమస్మాన్ కృణ్వదరాతిః కిము ధూర్తి రమ్మతం మర్యస్య. శ్రు. ప్రత్యరము - (వయం = మేము;) సోమం = ఉమాసహితుడైన శివుని; అపాము = నేరవీ క్షణములలో త్రాగుడుము; (లేన = శివదర్శనముతో) అమృతాః = ముక్తులము; అభూము- అగుదుము; జ్యోతిః = శివలోకమును; ఆగన్మ= చేరుదుము; దేవాః = కొమాచులను గెలుప దలచువారీస్; అవిదాము = పరిగణింపము; అస్మాణ = శివారాధకుల మగు మము ఆరాతి:- కామక్రోధాద్యరిషడ్వర్గము; కిం న్యూనం కుణవత్ ? = ఏమి తక్కువ జేయును? (ఏమియు మమ్ము భంగపరుపఁజాలదని భావము) మర్త్యస్య = మరణధర్మముల గల శరీరాదికమునకు; ధూర్తిః = హింస అమృతంకిము? = అమృతముగా చెప్పఁబడునా? శరీరాదులు ఏనాటికైనను నశ్వరములే నని యర్ధము.
శివతత్త్వము జగత్తునకు హితమును చేకూర్చునది, సర్వజనకము, పావనము, “వాయువ్య దిశనుండి వచ్చు గాలితో వాయువును గుర్తించునట్లు” అగ్రాహ్యమగు మనస్సుతో గ్రహింపబడునది. తన లీలావిలాసముతో సౌమ్యంబు, చంద్రతేజస్సుతో శాంతంబునై, జగత్సంహారకము, భక్తుల అంతఃకరణమును తనలో చేర్చుకొనునదియు, మహత్తత్త్వము కబళముగా భక్షించునదియునై విలసిల్లునది.
హృదయములో - ప్రాణము సంచు సమస్తదేవతలు నివసింతురు, హృదయము నందు నాదముగా అకార ఉకార మకారములను మించియుండువాడవు;
శిరః స్థానీయమగు అకారము - ఉత్తరభాగముగాను, పాదస్థానీయమగు మకారము-మధ్యభాగము గాను; ఉకారము.- ఉత్తర భాగసమీపము గాను గల ఓంకారము శివుఁడే నని తెలియవలెను. ఓంకారమే ఊర్వగ మనమును కలుగఁజేయుచు ప్రాణములను రక్షించును గాన ప్రణవ మనఁబడుచున్నయది.
శివుఁడు- సమస్తము వ్యాపించుటచే సర్వవ్యాపి యనియు; బ్రహ్మదేవుఁడు శ్రీహరియు తన ఆద్యంతములను కనుగొనకుండుట వలన అనంతుడనియు; సంసారసాగరము నుండి జీవాత్మలను తరింపజేయులచే తారు డనియు; అతి స్పల్ప స్వరూపముతో సూక్ష్మశరీరములలో ప్రవేశించుటచే సూక్ష్ముఁడనియు; ప్రధానముగా నలుపు, పురుషుడుగా ఎరువు గలవాడగుట జేసి నీలలోహితుడనియు; శుక్ర (రేతస్సు) మును జారవిడిపించువాడు గాన శుక్రమనియు; సమస్తమును ప్రకాశింపజేయును గాన వైద్యుతుడనియు; గొప్పది విస్తరించునదియునగుటచే పరబ్రహ్మంబనియు; అద్వితీయుఁడగుటచే తురీయు (నాలుగవవా) డనియు; చరాచర ప్రాణులను శాసించువాడగుటఁజేసి ఈశ్వరుఁడనియు; నిజరూపమును ముక్తులకు నావిర్భవింపఁ జేయు వాడగుట వలన భగవానుఁడనియు; లోకముల నన్నిటి నేకైకముగా తనలోనికి తీసికొని మరల విసర్జించుటవలన - లీలా విలాసముగా జగత్తును రక్షించుట, వలనను మహేశ్వరు డనియు సర్వవిద్యాధిపతి యగుటచే ఈశాను డనియు; వేర్కొనబడును.
దిశలు ఉపదిశలును శివుఁడేను; అనాది కాలస్థితుఁడై బ్రహ్మాండ గర్భమున ప్రవేశించి ప్రప్రథమము ఆవిర్భవించియు జీవాత్మల ననుసరించువాడగును. అనృతాహంకారపరీతులగు జీవాత్మలారా ! సర్వదా సర్వావస్థలలోను మిమ్ము వెంటాడు వాడు శివుఁడని తెలియకున్నారు.
వేదవచస్సులు శంకరుఁడు సర్వజ్ఞుఁడనియు, నీల లోహితుఁడనియు, సమస్తంబు శివుడేననియు, నిర్దేశించినవి. అట్టి మహాపురుషునకు నమస్కారము.
హిరణ్యబాహువు, హిరణ్యపతి, అంబికాపతి, సువర్ణరేతస్కుఁడు, ఉమాపతి, విరూపాక్షుఁడు, విశ్వరూపుఁడు నగు శివుఁడు మొదట బ్రహ్మదేవుని పుట్టించి వేదముల నాతని కుపదేశించెను. అట్టి శివుడు ఏకరూపుఁడు, పురుషుఁడు, రుద్రుఁడు, పురుహూతుఁడు, పురుష్టుతుఁడు, హృదయమున వెంట్రుక కొనయంత ఆతిసూక్ష్మరూపముతో నుండువాడు, నని శివుని తమ యంత:కరణము నందు ధ్యానించువారికే శాశ్వతశాంతి (ఆనందానుభవము) లభించును. తదితరులకు ప్రాప్తింపదు.
గహనమైన హృదయములో చిదాకాశము నందు గల వాలాగ్ర పరిమిత స్థలమున ఋతము సత్యంబు నగు మహాదేవుని చింతింప వలెను.
ఊర్ధ్వరేతస్కుఁడు, విరూపాక్షుఁడు, కృష్ణపింగళ వర్ణములుగల అర్ధనారీశ్వరుఁడు, ఒకడే యైన ననేక రూపములతో నుండువాడు నగు పరమేశ్వరుఁడు ప్రతి యోని (జన్మ) నధిష్ఠించియుండును.
“ప్రాణేష్వంతర్మనసో లింగ మాహు - ర్యస్మి క్రోధో యాచ తృష్ణా క్షమాచ -తృష్ణాంఛిత్వా హేతుజాలస్య మూలం మా బుద్ధ్యా సంచిత్య స్థాపయిత్వాచ రుద్రే” శ్రుతి.
“పంచప్రాణములు మనస్సు ననువాని మధ్య నుండునది ప్రాణలింగమనఁబడును. మనస్సు ముఖ్యముగా గల సూక్ష్మశరీరమున క్రోధము, ఆశ, ఓర్పు, మొదలగు గుణములు నెలకొనియున్నవి. అన్నిటికీ మూలమగు తృష్ణ (ఆశ)ను విడనాడి బుద్ధిచే శివమహిమను చింతించుచు శివునందు మనస్సును నిలువవలెను. లేక నిశ్చయాత్మక జ్ఞానమున శివుని యుత్కృష్ట రూపమగు (శివ) లింగమును స్థూలశరీరమునందు ధరించి శాంభవదీక్షాధృత ఇష్టలింగము నందు - శివషడక్షర మహామంత్ర జపాత్మకమగు ప్రాణ లింగాను సంధానమును పురస్కరించుకొని కారణ శరీరాంతర్గతము జ్యోతిఃస్వరూపంబు నగు భావలింగమును ధ్యానింపవలెను.” అని శ్రుత్యర్థము.
ఇట్టి భావలింగమే రుద్రుఁడనియు శాశ్వతుఁడనియు ముఖ్యుఁడనియు, పరమేశ్వరుఁడనియు, పరాత్పరపరుడనియు, బ్రహ్మవిష్ణు వహ్నివాయ్వాది జనకుఁడనియు, శివ తత్త్వవిదులు నిర్వచించుచున్నవారు.
ఏతాదృశభావన పాశుపతవ్రతములో ముఖ్యమైనది. ఇక “నీ వ్రతమును స్వీకరించెద” నని త్రికరణశుద్ధిని సంకల్పించి అగ్నిముఖాదులతో వహ్నిని రగులుకొలిపి ఋగ్యజ: సామవేద మంత్రయుక్తముగా, ఉపవాసము , పరిశుభ్రత, జలస్నానము, శుక్లప స్త్రధారణము, శుక్లయజ్ఞోపవీత ధారణవము, శ్వేత పుష్పమాలికా ధారణము, శ్రీ గంధానులేపనము అను సత్క్రియలుజేసియు; విరజామంత్రముల నుచ్చరించుచు. ఘృతచరు సమిధాదులతో హవనము జేసినచో నిర్మలుడు కాగలుగును.
విరజామంత్రార్ధ మొట్టిదనఁగా? నా పంచ ప్రాణవాయువులు, వాఙ్మసశ్చరణములు, శ్రోత్ర జిహ్వాఘ్రాణములు, బుద్ధియు, శిరః పాణిపార్చ్వ వృష్ఠోదరములు, జంఘా శిశ్న పాయూవస్థ మేడ్రములు, త్వజ్మాంస రక్త మేధోరిన్ ధులు శబ్ద స్పర్శరూప రస గంధములు, పృథివ్యాది పంచమహాభూతములు, శుద్ధములగుగాక!
అన్నము ప్రాణము నందు ప్రాణము బుద్ధియందు, శుద్ధమగుగాక !
ఇట్లు నీ యర్థము గల మంత్రములలో హవనము నొనర్చి శివాగ్ని నుపసంహరింపఁజేసి అందునుండి విభూతిని స్వీకరించి “ అగ్నిరితి భస్మ” ఇత్యాది మంత్రముల నుచ్చరించుచు శరీరావయవముల నన్నిటి సుచూశనముఁజేసికొని శివ షడక్షర మహామంత్రమును జపించవలెను. ఏకాగ్రశివభక్తులు, శివలింగము నవినాభావముతో ధరించి వామకరతలమున నిత్యము పూజింపవలెను. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సన్న్యాసులు వానప్రస్థులు గృహస్థులు బ్రహ్మచారులు నీ వ్రతమునాచరింపవలెను.
భస్మ సుద్ధూతనముఁజేసికొని త్రిపుండ్రములఁ దాల్చు ద్విజుఁడు మహాపాతకముల నుండి విముక్తఁడగును. అగ్నియొక్క వీర్యము భస్మ యగును గొన భస్మధారి వీర్యవంతుఁడగునని తెలియవలెను.
భస్మస్నానతత్పరుడు, భస్మశాయియునగు బ్రాహ్మణుఁ (ద్విజు) డు సర్వపాపములను
పోగొట్టుకొని ప్రారబ్ధాంతమున శివసాయుజ్యము నొందును,
అందువలన ప్రతి మానవుడు, భస్మధారీ విషయమై “ అరే “ అనకుండా” త్వం” అను ఏకవచనము నుపయోగింపక సత్కరింపవలెను భస్మధారి నవమానించినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహింపరు,
“భస్మధారి నా కుమారుడైన గణనాథుని వలె నాకు ప్రియుఁడగు“ ననియు, భస్మధారులను విరోధించువాడు నరకదుఃఖముల ననుభవించు ననియు“ శంకరుఁడు పార్వతీదేవికి బోధించెను.
శ్లో॥ గృహస్థో బ్రహ్మహీనోఽపి త్రిపుండ్రం యో న కారయేత్ ॥
పూజా కర్మ క్రియా తస్య దానం స్నానం తథైవ చ ।
శ్లో॥ నిష్ఫలం జాయతే సర్వం యథా భస్మని వైహుతమ్ ॥
గృహస్థుఁడు- తపస్సు లేనివాడైనను భస్మరే ఖాత్రయమును ధరింపని యెడల నవ్వాడు చేయు పూజనము పుణ్యకార్యము యజ్ఞాది సత్క్రియ - దానము స్నానము ఇత్యాది సమస్తంబు బూడిదలో ఆహుతి వలె వ్యర్థములగును.
అందువలన ప్రతి పుణ్యాచరణమ కు ముందు సుస్నాతుఁడై విరజాగ్నిభస్మను, లే, లౌకిక భస్మను ధరించుట ప్రశస్తము శ్రేయస్కరంబు నని బ్రహ్మదేవుఁడు నిర్వచించి యమరులతో గడ దేవదేవుని సుతించి దేవతలు భస్మధారులు కాగా తానును భస్మను ధరించి ధ్యానానంద నిర్బరుఁడాయెను.
అంత బ్రహ్మాది దేవతల నను గ్రహించులుకై పశుపతి యంబతో ప్రమధగణములతోడను సాక్షాత్కరింపగా నవ్వారు రుద్రాధ్యాయము నుచ్చరించుచు ప్రార్థించినందున మహేశ్వరుఁడు సంతోషించి “వరము నొసఁగెద “ నని నుడివెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (18)వ యధ్యాయము.
Summary of chapter 126 of the Linga Mahā Purana is as follows:
This chapter outlines Dānamaheśvara, specifying the precise codes of conduct, auspicious lunar timings, and mental purity required while offering divine gifts. Nandi emphasizes that a gift offered without arrogance, to a deserving recipient, and with complete surrender to Mahādeva yields infinite spiritual fruit compared to gifts offered for ostentation.