నారద మహా పురాణము - ఉత్తరార్థము
82 - పురాణశ్రవణాదిఫలనిరూపణమ్
ఋషులు పలికిరి:- సాధుమహాశయా! సూతమహర్షీ! మీరు శ్రీకృష్ణ చరితామృతమును చెప్పితిరి. మేము వింటిమి. మీ అనుగ్రహమువలన కృతార్థులమైతిమి. వసువు బ్రహ్మలోకమునకు వెళ్లిన తరువాత బ్రహ్మ పుత్రికయగు మోహిని ఏమి చేసెనో మాకు తెలుపుడు.
సూతమహర్షి పలికెను:- ఓ మహర్షులారా! మీరందరూ శుభప్రదమగు మోహినీ చరితమును వినుడు. వసుపురోహితులు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిదప మోహినీదేవి పుణ్య తీర్థములను సేవించేను. బ్రహ్మపుత్రికయగు మోహిని వసువు చెప్పిన విధముగా యధావిధిగా తీర్థయాత్ర కొరకు గంగా తీరమునకు వెడలెను. అచట గంగాదితీర్థములలో స్నానమాడి యధావిధిగా దర్శించి బ్రాహ్మణులతో కలిసి పురోహితుడగు వసువు ఆయా తీర్థములకు చెప్పిన ఆయా విధులననుసరించి తీర్థములను సేవించుచు పర్యటించేను. ఆ తీర్థములందు విష్ణ్వాది దేవతలకు పూజించుచు బ్రాహ్మణులకు బహువిధ దానములనిచ్చుచు గయా తీర్థమున యధావిధిగా భర్తయగు రుక్మాంగదునకు పిండప్రదానమును గావించెను. కాశీ నగరమున విశ్వేశ్వరుని పూజించి పురుషోత్తమును చేరెను. అచట జగన్నాథుని నైవేద్యమును భుజించి పరిశుద్ధ దేహులై లక్ష్మణాచలమును చేరెను. అచట లక్ష్మణుని యధావిధిగా పూజించి సేతు తీర్థమునకు వెడలి రామేశ్వరుని పూజించి, మలిహోద్రిని చేరి పరశురాముని నమస్కరించెను. శివక్షేత్రమగు గోకర్ణమునకు వెడలి ఈశ్వరుని పూజించి బ్రాహ్మణులతో కలిసి ప్రభాసతీర్థమునకు వెళ్ళెను. అచట స్నానమాడి, దేవాదులకు తర్పణములనిచ్చి ప్రభాసయాత్రను జరిపి, ద్వారకయందు శ్రీహరిని చూచి కురుక్షేత్రమునకు వెడలెను. అచట కూడా యధావిధిగా యాత్రను జరిపి గంగాద్వారమును చేరి అచట స్నానమునాచరించెను. తరువాత కామోదాదేవిని దర్శించి సంతోషముచే నమస్కరించి, బదరికాశ్రమమును చేరి నరనారాయణ ఋషులను చక్కగా పూజించి కామాక్షీదేవిని దర్శించుటకు త్వరగా వెళ్ళేను. అచట సిద్ధనాధుని నమస్కరించి అయోధ్యకు చేరెను. సరయూనదిలో యధావిధిగా స్నానమాడి సీతాపతిని పూజించి మధ్యయాత్రానుసారముగా అమరకంటకమును చేరెను. అచట మహేశుని పూజించి ప్రతిస్రోతస్వియనగల నర్మదా తీర్థమును సేవించి ఓంకారేశుని దర్శించి మాహిష్మతీపురమునకు వెడలెను. అచట త్ర్యంబకేశుని పూజించి త్రిపుష్కరమును చేరెను. పుష్కరములయందు యధావిధిగా దానములనొసంగి సర్వతీర్ణోత్తమమగు మధురా తీర్థమును చేరెను. వింశతి యోజనముల అభ్యన్తర యాత్రను ఆచరించి, మధురానగరమునకు ప్రదక్షిణ మాచరించి చతుర్వ్యూహములను దర్శించెను. వింశతి తీర్థములలో స్నానమాచరించి యాత్రను ముగించి బహుదక్షిణలతో మధురానగర వాసులకు పదివేల గోవులను దానమొసంగేను. భక్తి పూర్ణమానసముతో వారిని పరమాన్నముచే భుజింపచేసి నమస్కరించి సోరిని విడిచి పుచ్చి యమునానదికి చేరేను. అంత పాపనాశిని యగు కాలిందీనదిలో ప్రవేశించిన మోహిని నేటికీ బయటికి రాలేదు. అటనుండి దశమీతిథిని చేరియున్నది. సూర్యోదయ కాలమున స్మార్తులను, అరుణోదయ కాలమున శ్రాతులను, నిశీధ కాలమున వైష్ణవులను చేరి దూషింప చేయును. మోహినీ వేధరహితయగు ఏకాదశిన ఉపవసించి ద్వాదశినాడు శ్రీహరిని పూజించినచో వైకుంఠమును పొందెదరు. మోహిని బ్రహ్మపుత్రిక. ఏకాదశి విష్ణుపుత్రిక. విష్ణు పుత్రికతో పోటీ చేయుటకు బ్రహ్మ మోహినిని సృజించెను. రుక్మాంగద రాజర్షి విష్ణుభక్తి పరాయణుడు కావున అతనిని ఏకాదశీ వ్రతమునుండి వారించజాలకపోయెను. భార్యాపుత్ర సహితముగా రుక్మాంగదుడు విష్ణులోకమును చేరిన తరువాత ఏకాదశిని ద్వేషించుచు
దశమీతిధిలో మోహిని నివసించుచున్నది. ఇట్లు మీకు మోహినీ చరితమును తెలిపితిని. మోహిని ఏ కార్యమునకు సృజించబడి ఇచట ఎట్లు నివసించుచున్నదో మీకు వివరముగా తెలిపియున్నాను.
ఓ బ్రాహ్మణోత్తములారా? మీకు భక్తి ముక్తి ప్రదమగు నారదీయోత్తరభాగమును చెప్పితిని. ఈ భాగమున ప్రతిక్షణము ప్రతిపదము శ్రీహరియందు భక్తిని పెంపొందించును. పది లక్షణములతో కూడియున్న నారదీయ మహాపురాణమును భక్తితో వినినవారు శ్రీ విష్ణుపదమును చేరెదరు. ఈ నారదీయ పురాణము ధర్మార్థకామ మోక్షములను నాలుగు పురుషార్థములకు కారణము. సర్వపురాణములకు ఇదియే 'బీజము. ఈ పురాణమున ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును శ్రీ వేదవ్యాస భగవానులు విస్తరముగా వర్ణించిరి. నారదీయ మహాపురాణము అలౌకిక చరిత్రచే శోభితము. నాకు వ్యాస భగవానులు తెలిపిరి. ఈ పురాణమును అందరికీ ఉపదేశించరాదు. వ్యాస భగవానుడు స్వశిష్యులకు పైలాదులను విడిచి నాకు మాత్రమే వ్యాఖ్యానముగావించెను. అట్టి వేద వ్యాస భగవానుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. ఈ నారదీయమహాసంహితను పండితోత్తముడగు నారద మహర్షికి మహానుభావులకు సనకాది మహర్షులు ప్రకాశింపచేసిరి. పరమహంస స్వరూపియగు శాశ్వత బ్రహ్మరూపుడగు భగవానుడు విజ్ఞాన విజృంభితమగు నారదీయ మహాపురాణమును సనకాదులకు ఉపదేశించెను. సాక్షాద్భగవత్స్వరూపుడు అధ్యాత్మజ్ఞానము కల నారదమహర్షి వేదవ్యాస మహర్షికి రహస్యముగా ఉపదేశించెను. వేదవ్యాస మహర్షి నాకుపదేశించెను. చదువువారికి వినువారికి చతుర్వర్గ ఫలప్రదము పరమరహస్యము, భూలోక దుర్లభము అగు ఈ నారదీయ మహాపురాణమును నేను మీకు ఉపదేశించితిని ఈ నారదీయ మహాపురాణమును చదివినవారు, వినినవారు బ్రాహ్మణులైనచో వేదవిదులగుదురు. క్షత్రియుడు భూమండలమును జయించును. వైశ్యుడు ధన సమృద్ధిని పొందును. శూద్రుడు దుఃఖనివృత్తిని పొందును. ఈ నారదీయ మహాపురాణము ఇరువది అయిదువేల శ్లోకములు గలదని చెప్పబడినది. అయిదు పాదములు కలది అని వేదవ్యాస భగవానులు చెప్పిరి. నారదీయ మహాపురాణమును వినినచో సర్వసందేహములు తొలగిపోవును. కోరికలు కలవారికి కోరికలు తీరును. నిష్కాములకు మోక్షములభించును. నైమిషారణ్యమును, గయను, పుష్కరమును, మధురానగరమును, ద్వారకానగరమును, నర నారాయణాశ్రమమును, కురుక్షేత్రమును, నర్మదాతీర్థమును, శ్రీపురుషోత్తమ క్షేత్రమును ఇంకా ఇతర పుణ్య తీర్థములను దర్శించువారు. ఆయా తీర్థములలో హవిష్యమును భుజించుచు, ధర పై పడుకొనుచు, నిస్సంగులై, జితేంద్రియులై ఈ నారదీయ మహాపురాణమును చదివినచో భవసాగరము నుండి విముక్తులగుదురు. వ్రతములలో ఏకాదశీ, నదులలో గంగ, అరణ్యములలో బృవనము, క్షేత్రములలో కురుక్షేత్రము, పురములలో కాశీపురి, తీర్థములలో మధురాతీర్థము, సరస్సులలో పుష్కర సరస్సు, పురాణములలో నారదీయ మహాపురాణము సర్వశ్రేష్ఠములు. గణేశభక్తులు, సూర్యభక్తులు, శ్రీవిష్ణుభక్తులు, శక్తిభక్తులు, శివభక్తులు అందరూ సకాములు నిష్కాములు ఈ మహాపురాణమునకు అధికారులు. ఏ కోరికను సంకల్పించుకొనినవారు పురుషులు కాని స్త్రీలు కాని ఆదరముతో ఈ నారదీయ మహాపురాణమును వినినూ వినిపించిననూ ఆయా కోరికలు తీరును. రోగార్తులు రోగ విముక్తులగుదురు. భయార్డులు భయముక్తులగుదురు. నారదీయపురాణ పఠన శ్రవణమువలన జయమును కోరువారు జయమును పొందెదరు. సృష్ట్యాదిలో రజోగుణముచే, మధ్యకాలమున సత్యగుణముచే జగత్పాలనను, అంతమున తమోగుణముచే సంహారమును చేయు సర్వాత్మయగు పరమాత్మకు నమస్కారము. ఋషులు, మనువులు, సిద్ధులు, లోకపాలకులు, ప్రజాపతులు, బ్రహ్మాదులు సృజించబడిన పరమాత్మకు నమస్కారము. వేదము కూడా అచటి నుండి మరలివచ్చును. మనసు వెళ్ళజాలదు. అట్టి రూపరహితుడు, చిత్స్వరూపుడగు పరమాత్మ స్వరూపమును తెలియవలయును. అతని సత్యము చేతనే ఈ జగత్తు సత్యముగా విచిత్ర రూపముగా ప్రకాశించును. అట్టి తమోతీతుని నిరుణుని నమస్కరించుచున్నాను. ఆదిమధ్యలలో పుట్టుకలేనివాడు, అస్తమున ఏకాక్షరస్వరూపుడు, నానారూపములచే ప్రకాశించువాడు యగు ఆ పరమాత్మకు నమస్కారము. చరాచరరూపమగు ఈ జగత్తంతయూ నిరంజనుని వలననే పుట్టినది. అతనిలోనే నిలుచును. లీనమగును. అదియే సత్యము. ఏకరూపమగు జ్ఞానము. శైవులు శివుడని, సాంఖ్యులు ప్రధానమని, యోగులు పురుషుడని, మీమాంసకులు కర్మయని, వైశేషికాదులు విభువని, శక్తిచింత కులు శక్తియని, చెప్పబడు అద్వితీయము నానారూపక్రియాస్పదమగు పరబ్రహ్మను నమస్కరించుచున్నాను. మానవులకు భగవద్భక్తియే భగవత్స్వరూపమును ప్రసాదించును. అట్టి భక్తిని పొందిన తరువాత ఇతర లాభములను కోరు పశువెవడు? భగవద్విముఖులై సంసారమున సంచరించు మానవులకు సత్సంగమము లేనిదే సంసారారణ్యమునుండి విముక్తి లభించదు. సాధువులు సదాచారపరాయణులు సర్వలోక హితానుషంగులు, దీనులయెడ దయాపరులు, భగవంతుని ఆశ్రయించిన మహానుభావులు లోకులను తరింపజేతురు. ఓ మహరులారా! ఈ లోకమున మీరు ధన్యతములు, సాధు సమ్మతులు. మీరు ఎప్పుడూ నిత్యనూతన మగు వాసుదేవుని కీర్తిని గానము చేయుచు చేయించుచుంటిరి. లోకకళ్యాణమును కాంక్షించి మీరు సర్వకారణ కారణమగు శ్రీమన్నారాయణుని స్మరింపచేసితిరి. మీ వలన నేను ధన్యుడనైతిని. అనుగ్రహించబడితిని.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున ఈ పురాణ శ్రవణాది ఫలనిరూపణ మను ఎనుబదిరెండవ అధ్యాయము సమాప్తము.
ఏడవ నారదీయమహాపురాణము సమాప్తము.
ఓం శాస్త్రి: శాంతిః శాంతిః
శ్రీ కృష్ణార్పణమ్
ఈ మహాపురాణమునకు అధికారులు. ఏ కోరికను సంకల్పించుకొనినవారు పురుషులు కాని స్త్రీలు కాని ఆదరముతో ఈ నారదీయ మహాపురాణమును వినినూ వినిపించిననూ ఆయా కోరికలు తీరును. రోగార్తులు రోగ విముక్తులగుదురు. భయార్డులు భయముక్తులగుదురు. నారదీయపురాణ పఠన శ్రవణమువలన జయమును కోరువారు జయమును పొందెదరు. సృష్ట్యాదిలో రజోగుణముచే, మధ్యకాలమున సత్యగుణముచే జగత్పాలనను, అంతమున తమోగుణముచే సంహారమును చేయు 'సర్వాత్మయగు పరమాత్మకు నమస్కారము. ఋషులు, మనువులు, సిద్ధులు, లోకపాలకులు, ప్రజాపతులు, బ్రహ్మాదులు సృజించబడిన పరమాత్మకు నమస్కారము. వేదము కూడా అచటి నుండి మరలివచ్చును. మనసు వెళ్ళజాలదు. అట్టి రూపరహితుడు, చిత్స్వరూపుడగు పరమాత్మ స్వరూపమును తెలియవలయును. అతని సత్యము చేతనే ఈ జగత్తు సత్యముగా విచిత్ర రూపముగా ప్రకాశించును. అట్టి తమోతీతుని నిరుణుని నమస్కరించుచున్నాను. ఆదిమధ్యలలో పుట్టుకలేనివాడు, అస్తమున ఏకాక్షరస్వరూపుడు, నానారూపములచే ప్రకాశించువాడు యగు ఆ పరమాత్మకు నమస్కారము. చరాచరరూపమగు ఈ జగత్తంతయూ నిరంజనుని వలననే పుట్టినది. అతనిలోనే నిలుచును. లీనమగును. అదియే సత్యము. ఏకరూపమగు జ్ఞానము. శైవులు శివుడని, సాంఖ్యులు ప్రధానమని, యోగులు పురుషుడని, మీమాంసకులు కర్మయని, వైశేషికాదులు విభువని, శక్తి చింత కులు శక్తియని, చెప్పబడు అద్వితీయము నానారూపక్రియాస్పదమగు పరబ్రహ్మను నమస్కరించుచున్నాను. మానవులకు భగవద్భక్తియే భగవత్స్వరూపమును ప్రసాదించును. అట్టి భక్తిని పొందిన తరువాత ఇతర లాభములను కోరు పశువెవడు? భగవద్విముఖులై సంసారమున సంచరించు మానవులకు సత్సంగమము లేనిదే సంసారారణ్యమునుండి విముక్తి లభించదు. సాధువులు సదాచారపరాయణులు సర్వలోక హితానుషంగులు, దీనులయెడ దయాపరులు, భగవంతుని ఆశ్రయించిన మహానుభావులు లోకులను తరింపజేతురు. ఓ మహర్షులారా! ఈ లోకమున మీరు ధన్యతములు, సాధు సమ్మతులు. మీరు ఎప్పుడూ నిత్యనూతన మగు వాసుదేవుని కీర్తిని గానము చేయుచు చేయించుచుంటిరి. లోకకళ్యాణమును కాంక్షించి మీరు సర్వకారణ కారణమగు శ్రీమన్నారాయణుని స్మరింపచేసితిరి. మీ వలన నేను ధన్యుడనైతిని. అనుగ్రహించబడితిని.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున ఈ పురాణ శ్రవణాది ఫలనిరూపణ మను ఎనుబదిరెండవ అధ్యాయము సమాప్తము.
ఏడవ నారదీయమహాపురాణము సమాప్తము.
ఓం శాంతిః శాంతిః శాంతిః
శ్రీ కృష్ణార్పణమ్.
