నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

46 - పిండదాన మహాత్మ్య కథనమ్

వసువుపలికెను : ఇక ఇప్పుడు నీకు తృతీయ దినమున చేయవలసిన దానిని భుక్తి ముక్తి ప్రదాయకమగు గయాసంగమ ఫలప్రదమును చేప్పెదను. బ్రహ్మసరస్సున స్నానము చేసి పిండ ప్రదానముతో శ్రాద్ధము చేయవలయును. ఋణత్రయ విముక్తికి, శ్రాద్ధము కొరకు, పిండదానము కొరకు, తర్పణము కొరకు అర్ధసిద్ధి కొరకు ఈ తీర్థమున స్నానమును చేయుచున్నాను. ఆ కూపయూపముల మధ్యన శ్రాద్దము చేయుచు పితరులను తరింపచేయును. స్నానము చేసి పెరిగియున్న యూపము బ్రహ్మయూపమనబడును. బ్రహ్మసరస్సు స్నానము చేసి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. ప్రచార సమీపస్థ ములు బ్రహ్మ ప్రకల్పితములు ఆక్రములు. వీటిని సేచనమాత్రమున పితరులు మోక్షమునకు వెళ్ళెదరు. బ్రహ్మ సరోద్భూతము, సర్వదేవమయము, విభువు విష్ణు రూపమగు ఆత్రమును తడుపుచున్నాను. పితరులకు ముక్తి కలుగవలయును. కుంభకుశాగ్రహస్తుడగు ఒక ముని ఆమమూలమున సలిలమునుంచును. ఆమవృక్షములు తడియును. పితరులు తృప్తి పొందుదురు. ఒకే పని రెండు ప్రయోజనములను కలిగించును. ఆచమనము చేసి ఆమ్రమూలమున జలమునిచ్చు నరుని దేవతలు పేక్షించరు. యూపమును ప్రదక్షిణమును చేసి వాజపేయ ఫలమును పొందును. బ్రహ్మను నమస్కరించి పితరులను బ్రహ్మపురమునకు చేర్చును.

అను ఈ మంత్రముచే సమస్తమునుంచి “యమరాజ ధర్మారాజా అను ఈ మంత్రముచే సమస్తము నుంచి “యమారాజ దర్మరాజా నిశ్చలార్గో వితిస్థితిః తాభ్యాం బలిం ప్రయచ్ఛామి పితృణాం ముక్తి హేతవే” అని మంత్రము నుచ్చరించవలయును. ఇక పూర్వమంత్రముచే శ్వాన బలిని చేసి ఈ మంత్రముచే కాక బలిని చేయవలయును” ఐన్ద వారుణ వాయవ్యాయామ్యావైనైఋతాస్తధా

వాయసా: ప్రతిగృహ్ణాన్తు భూమౌ పిండం మయార్పితమ్” అనునది మంత్రము. తరువాత దర్భలను గ్రహించి బ్రహ్మతీర్థమున స్నానమును చేయవలయును. ఇట్లు మూడవదినమున కృత్యమును పూర్తి చేసి గదాధరుని నమస్కరించి బ్రహ్మచర్య పరుడు కావలయును. నాలుగవ దినమున ఫలు తీర్థమున స్నానాదికము నాచరించవలయును. గయాశీరమున సపిండక శ్రాద్దము నాచరించవలయును. గయాశిరమే ఇచట ఫలు తీత్రత్రయమైనది. క్రౌంచపాదము నుండి ఫలుతీర్థము గయాశిరము వరకుండును. గయాశిరమున నగాది నుండి ఉన్నది ఫలు తీర్థము. ఇదియే గయాసురుని ముఖము ఇచట స్నానము చేసి శ్రాద్ధమునాచరించవలయును. ఆది దేవుడగుగదాధరుడు వ్యక్తావ్యక్తము కొరకు .పితరుల ముక్తి కొరకు విష్ణ్వాది పదరూపముగా యుండెను. ఇచట దివ్యమగు విష్ణు పదము దర్శన మాత్రముననే పాపనాశనము. స్పృశించిననూ పూజించిననూ పితరులకు మోక్షమును ప్రసాదించును. సపిండకముగా శ్రాద్ధమునాచరించి తమ సహస్ర కులమునుద్దరించి విష్ణుపదమున విష్ణులోకమును చేర్చును.

రుద్రపదమున శ్రాద్దము నాచరించి తనతోపాటు కులశతమును శివపురమును చేర్చును. బ్రహ్మపదమున చేసిననూ ఇదే ఫలితము. దక్షిణాగ్ని పదమున శ్రాద్దమునాచరించిన వాజపేయ ఫలము లభించును. గార్హపత్యపదమున శ్రాద్దము చేసినచో రాజసూయ ఫలము లభించును. చంద్రపదమున శ్రాద్ధము నాచరించిన అశ్వమేధ ఫలము లభించును, సత్యపదమున శ్రాద్ధము సోమలోకమునిచ్చును. చస్రపదమున చేయు శ్రాద్ధము ఇవ్రలోకమును చేర్చును. ఇతర పదములలో చేయు శ్రాద్ధము పాపులను కూడా సూర్యపురము చేర్చును. కార్తికేయ పదమున చేయు శ్రాద్దము పితృలోకమునకు పితరులను చేర్చును. అగస్త్యపదమున చేయు శ్రాద్దము బ్రహ్మలోకమున చేర్చును. అన్ని పదములలో కాశ్యప పదము శ్రేష్టము. తరువాత విష్ణుపదము రుద్రపదము బ్రహ్మపదము సర్వశ్రేష్టముగా చెప్పబడినది. ప్రారంభమున కాని సమాప్తిలో కాని వీటిలో ఒక పదమున చేయవలయును. ఇచట శ్రాద్ధకర్తకు మేలు చేకూరును. పూర్వము కశ్యపపదమున భరద్వాజముని శ్రాద్ధమును పిండ ప్రదానమును చేయుటకు సిద్దపడెను. అంతట ఆ పదమును బోధించుకొని శుక్ల కృష్ణ హస్తములు వెడలినవి. రెండు హస్తములను చూచిన భరద్వాజమునికి తండ్రి విషయమున సందేహము కలిగెను. అంత తన తల్లియగు శాంతను తండ్రి వరని యడిగెను. ఈ కశ్యపపదమున శుక్ల హస్తమున చేయవలయునా, కృష్ణ హస్తమున చేయవలయునా తండ్రెవరో నీవు తెలియుదువు కదా అతని మాటను వినిన శాంత కృష్ణవర్లున కీయమని పలికెను. అపుడు భారద్వాజుడు కృష్ణహస్తునకు పిండ ప్రదానము చేయ సిద్దపడెను. అంతట శ్వేత వర్ణుడు కనపడి నీవు నాకు ఔరసపుత్రుడవు కాన నాకిమ్మని అడిగెను. కృష్ణ వర్ణుడు నీవు నాక్షేత్రజుడవు. నాకు పిండమునిమ్ము అని అడిగెను. నీ మాత స్యైరణి కావున నీవు నాకు ఔరసపుత్రుడవు. అనెను. అంతట స్వైరిణీ పుత్రుడగు భరద్వాజుడు మొదట క్షేత్రికి, తరువాత బీజీకి పిండ ప్రదానమును గావించెను. ఇట్లు భక్తిచే ఇరువురికి పిండ ప్రదానమును గావించి వారిరువురు ప్రత్యక్షముగా మాట్లాడినందున తనను తాను కృతకృత్యునిగా తలచెను. భీష్ముడు విష్ణుపదమున శ్రాద్దమును చేయ సంకల్పించి పితరులనాహ్వానించెను. యధావిధిగా శ్రాద్ధమునాచరించి పిండదానమునకు సిద్ధపడెను. అంతట గయాశిరమున తండియగు శంతనుని హస్తములు చాపబడెను. కాని కరమున ఇచ్చుట. కధికారము లేదని భీష్ముడు భూమి యందుంచెను. అంతట శంతనుడు సంతోషించి నీవు శాస్త్రార్థమున నిశ్చలుడవు. కావున త్రికాల దర్శివై స్వేచ్చామరణము కలవాడవై అంతమున విష్ణులోకమున చేరెదవు అని పలికి ముక్తిని పొందెను.

శ్రీరామ చంద్రుడు రుద్రపదమున పిండార్పణ చేయుటకు. సిద్దము కాగా తండ్రి యగు దశరధుడు స్వర్గమునుండి చేయి చాచి వచ్చేను. శాస్త్రాతి క్రమభయముచే శ్రీరాముడు చేతిలోనిడక రుద్రపదమున ఇచ్చెను. అపుడు దశరథ మహారాజు రామునితో ఇట్లు పలికెను. నీవిట్లు రుద్రపదమున పిండ ప్రదానము చేయుటచే నేను తరించితిని. నాకు రుద్రలోకము లభించినది. కరమున పిండ ప్రదానము చేసిన స్వర్గము లభించదు. నీవు చాలా కాలము రాజ్యమును చేసి ప్రజలను చక్కగా పాలించి సదక్షిణలుగా యజ్ఞముల నాచరించి విష్ణు లోకమును చేరెదవు. అయోధ్యాజనులతో క్రిమికీటాదులతో విష్ణులోకమునకు వెళ్ళేదవు. ఇట్లు పలికి దశరధ మహారాజు రుద్రలోకమును చేరెను. కనకేశుని కేదారమును నారసింహుని వామనుని రథమార్గమున పూజించి పితరులనందరిని తరింపచేయువచ్చును. గయాశిరమున ఎవరి పేరుతో పిండ ప్రదానమును చేయునో వారు నరకములోనున్న స్వర్గమును, స్వర్గములోనున్న మోక్షమును పొందెదరు. గయా శిరమున కందమూల పలాదులచే కాని శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానముగావించిన పితరులను స్వర్గమును చేర్చును. విష్ణ్యాది పదములు కనపడుచోట ఆ పదముల ముందు శ్రాద్ధము చేసినచో ఆయా లోకములకు పితరులు చేరుదురు. ముండ పృషాద్రి యంతట ఈ పదముల గురుంలుండును. ఇచట పూజించబడిన పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. గదచే గయాసురుని శిరము రెండుగా చేసి ఆగదను ఈ తీర్థమున కడిగేను కావున గదిలోలమనబడును. ఋషిక్రౌంచరూపముచే ముండ పృష్టమున తపము నాచరించెను. అతని పాదముల ముద్ర పడుటచే క్రౌంచ పాదమని పేరు కలిగినది. విష్ణ్వాది పదములు ఇచట లింగరూపముగా నన్నవి. రుద్ర పదాది తీర్థములలో దేవాది తర్పణమును గావించి శ్రాద్ధమును ఆచరించి ఈ నాలుగవ దినమున కృత్యమునాచరించి పవిత్రుడై కర్మాధికారమును పొంది శ్రాద్ధమును చేయువాడు బ్రహ్మలోకమును పొందును. ప్రేతశిలయందు కల తీర్థములందు స్నానము నాచరించి తర్పణము గావించి సపిండకముగా శ్రాద్ధము చేసినచో పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. ఆ బ్రహ్మలోకముననే ప్రలయకాలము వరకు ఉందురు. ఆనందింతురు. స్వేదజ అండజ జరాయుజ ప్రాణులన్నింటిలో శిలాపృష్ఠమున తనువును చాలించిన ప్రాణులు ఏడువందల తరములలో విష్ణుసాయుజ్యమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గయా మాహాత్మ్యమున విష్ణ్వాది పదమున పిండదాన మాహాత్మ్య కధనమను నలుబది యారవ అధ్యాయము.