నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

59 - పురుషోత్తమ మహాత్మ్యమ్

వసువు పలికెను :- శ్రీకృష్ణ భగవానుడు నిరంజనుడు చిత్స్వరూపుడు జనార్దనుడు, జ్యోతి స్వరూపుడు. అతని లక్షణమును వినుము. ఆ భగవానుడు నిత్యము గోలోకమున అభ్యంతరమున నుండును. అతనొక్కడే పరబ్రహ్మ. దృశ్యాదృశ్య స్వరూపమును ధరించియుడును. అగోలోకమున గోవులు గోపాలురు గోపికలు, పూర్వభాగమున బృష్ణావనము, శతశృంగము, విరజానది, వేరు వేరు పక్షులుండును. ప్రకృతి ఉన్నంత వరకు గోలోకమున శ్రీకృష్ణభగవానుడు దృశ్యస్వరూపుముతో నుండును. ప్రలయ కాలమున నిదురించిన గవాదులు శ్రీకృష్ణభగవానుని తెలయజాలవు. జ్మోతిః పుంజాంతర్భాగమున సుందర శరీరధారియై కిశోరుడు, నీల మేఘశ్యాముడు పీతాంబరధారి, ద్విభుజుడు, మరళీహస్తుడు కిరీటాదివిభూషితుడు, రాధావక్షస్థలోజ్జలుడు  కైవల్యనాధునిగా యుండును. శ్రీ కృష్ణ భగవానునకు రాధ ప్రాణాధికప్రియతమురాలు. ఈ రాధ స్వర్ణవర్ణ చిద్రూపురాలు, ప్రకృత్యతీతురాలు. నిత్యస్వరూపులగు దేహస్థులగు రాధాకృష్ణులకు తెలుపుకు పాలకు, పృథివీగంథములకు భేదము లేనట్లు భేదము లేదు. సకల కారణములకు కారణమును నిర్దేశించ శక్యము కాదు. వేదములకు కూడా చెప్ప శక్యము కాని ఆ వస్తువును చెప్పజాలము. జ్యోతి అంతర్భాగమున నున్న శ్యామ సుందంరూపమును శివుడు మాత్రము చూడగలిగెను. ఎపుడో ఒక మారు ధ్యానగోచరమగును. అప్పటి నుండి కోరబడు గోలోకకథను నారదాదులు సనకోదులు మాత్రమే తెలియుదురు. వారు కూడా వినినదానిని మాత్రమే ధ్యానము చేయుచున్నారు కాని ఎప్పుడూ చూడలేదు. సనాతనుడగు శివుడు కూడా సాక్షాత్తుగా చూచుటకు తపించుచున్నాడు. కాని చూడలేకపోవుచున్నాడు. ధ్యాన గోచరమగు దానిని ధ్యానముచేయుచున్నాడు. ఒక మారు క్రీడించుచున్న రాధామాధువుల శరీరము రెండు భాగములాయెను. వామభాగము మాత్రము చతుర్భుజముగా నుండేను. రెండు రూపములు సమానరూపావయవము, సమాన వస్త్రాభరణములు కలదిగా నుండెను. అట్లే రాధా స్వరూపము కూడా రెండుగా ఆయెను. ఆ ఇద్దరూ ఈ స్వరూపమును చూచిరి. వీరు కూడా వారితో సమానముగా నున్నది. చతుర్భుజముగా నున్న సుందరమగు లక్ష్మీకాంతరూపమును శివాది భక్త బృందములు చాలా మార్లు చూచిరి. చతుర్భుజమగు దేవి రూపమును ఒకసారి బ్రహ్మ చూచెను. సృష్టి కార్యమున ముగ్ధుడగు బ్రహ్మకు దయతలచి చూపెను. సనత్కుమారునికి లక్ష్మి స్వయముగా వర్ణించినది. తత్త్యమూర్తి యగు విష్వక్సేనునకు శ్రీమన్నారాయణుడు స్వయముగా వివరించెను. ధర్మపుత్రుడు నారదునకు చెప్పెను. గోలోకవర్ణనమంతయూ రాధాకృష్ణమయము. ఉత్తమదేవ గణములచే పూజించబడు రాధాదేవి తాను కుతూహలముతో స్వయముగా శివరూపమును ధరించెను. ఆ రూపమును చూచి యోగీశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యకరముగా సమయోచితమగు మూల ప్రకృతి రూపమును ధరించెను. వామదేవుడు సంతోషముచే విపరీతమగు శరీరమును దాల్చియుండెను. కావున దుర్గారూపమును ధరించిన శ్రీహరిని రేయింబవళ్ళు ధ్యానించవలయును. రాధయే లక్ష్మీదేవి, సావిత్రి సరస్వతి గంగ వీరికి భేదములు లేవు. కామధేను స్వరూపిణి యగు ఈ విద్య అయిదు రూపములతో నుండెను.

 రాధికాపతియగు శ్రీ కృష్ణభగవానుడే లక్ష్మీపతి. అతనే బ్రహ్మరూపుడు. ధర్మ స్వరూపుడగు నారాయణుడు. ఇట్లు అజుడగు శ్రీకృష్ణుడు కూడా అయిదు రూపములను ధరించియుండెను. ఈ కృష్ణభగవానుని కార్యకారణరూపముగా ధ్యానించుచుందురు. ఈ రూపముతో ప్రేమసంబద్దుడై విషయ రూపముతో శివుడగును. రాధారూపమును, రాధాపతి రూపమును స్వయముగా సచ్చిత్సుఖ స్వరూపముగా చూచెదరు. దేవతేజస్సు నుండి ఉద్భూతమగు ఈశ్వరి యగు మూల ప్రకృతి కృష్ణరూపురాలు ఈమెయే దైత్య సంహారకారణి. దక్షపుత్రియగు సతీరూపమును ధరించి, శివుని ఆశ్రయించినది. భర్తను నిందించుట చూచి సతీదేవి తన దేహమును విడచెను. హిమంతుని భార్యయగు మేనయందు పుట్టి తపమునాచరించి మరల శివుని పొంది శివప్రదురాలాయెను. శస్తముగా ఈ కృష్ణుని రాధయే శివమోహన తత్పరురాలు. జగదంబాస్వరూపురాలు. విభువు కూడా స్వయముగా మాయా స్వరూపుడు. కావుననే కుమారస్వామి, గణపతి కూడా ఈ రూపములే. శ్రీకృష్ణుడే స్వయముగా గణపతి. శివుడే కుమారస్వామి. రాధా రూపమునాశ్రయించిన స్వామినే కొందరు శివునిగా చెప్పెదరు. రాధ శ్రీకృష్ణవక్షస్నలముననుండును. వీరిద్దరికీ భేదములేదు. కృష్ణుడే మూలప్రకృతి. శివుడే రాధిక. ఈ ఇద్దరూ ఒకటా జంటయా అని ఎవ్వరూ నిశ్చయింపజాలరు. మనచే నిర్దేశించబడు స్వరూపము కేవలము ఉపలక్షణము మాత్రమే. శాస్త్రములు వేదములు వర్ణించు ఈశ్వర స్వరూపము ప్రాకృతము మాత్రమే. కావున నిర్దేంచవీలగును. అనిర్దేశ్యమగు దానిని ‘న’, ‘న2’ అని చెప్పజాలము అని నిషేధించబడుచున్నది. కావున శరణాగతులు ప్రభువును నిషేధ శేషము యందురు. సర్వకర్మలకు శాస్త్రములని యామకముగా నుండును. కర్మలనాచరించు జీవుడు ఈశ్వరాంశ స్వయముగా విభువు. ప్రకృతి కంటే పరుడే. నీత్యుడే.కాని మాయామోహితుడు.సాక్షిగా ఉండు ఈశ్వరుడు మాత్రము స్వయముగా పూర్ణుడు. జీవునితో కలిసి ఉండువాడు. అతనిని కలిసి ఉండు జీవుడు తెలియజాలడు. పరమాత్మను ఆశ్రయించినవారు శంఖచక్రగదా పద్మములచే అలంకరించబడిన . భుజద్వయము కలవారు ప్రపన్నులనబడును. ఈ ప్రపన్నులు రెండు విధములుగా నుందురు. ఆర్త ప్రపన్నులు, దృప్తప్రపన్నులు అని. ఆర్త ప్రపన్నులు మాత్రము స్వామి వియోగమును ఏమాత్రము సహించజాలరు. దృప్త ప్రపన్సులు జన్మాంతరము వరకు సహించగలరు. వీరు నిర్దయులు. సదసజ్జనులు. మహాలక్షి ప్రపన్నులైనవారు సఖిభావమునాశ్రయింతురు. ఇట్టి వారు జపించు మంత్రమును బ్రహ్మ చెప్పిన దానిని ఇపుడు చెప్పెదను.

“గోపీజనవల్లభ చరణం శరణం           ప్రపద్యే” అను మంత్రము పదునారు వర్ణములు కలది. ఈ మంత్రమును సాక్షాత్తుగా లక్ష్మిదేవియే ప్రకాశింపచేసినది. మొదట సనత్కుమారునకు, తరువాత శంకరునకు ప్రకాశింపచేసినది. సఖిభావమునాశ్రయించి గోపికాబృన్ల మధ్యగతుడగు రాధామాధవ నామము గల ఆత్మను ధ్యానించవలయును. గరువులందు ఈశ్వరభావముచే ఎల్లపుడూ ప్రణతుడై యుండవలయును. విష్ణు భక్తులందు సత్కారపూర్వకముగా ప్రవర్తించవలయును. ఇతరులను సమభావముతో చూడవలయును. ప్రేమ బంధనముచే రాధాకృష్ణులను రాత్రి పగలు ధ్యానించవలయును. అన్ని పర్వకాలములందు యాత్రలను, పర్వ మహోత్సవములను ఆచరించవలయును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమను యాబది తొమ్మిదివ అధ్యాయము.