నారద మహా పురాణము - ఉత్తరార్థము
50 -కాశీమాహాత్మ్యమ్
వసువు పలికెను:- ఇక ఇపుడు దేవాదులచే చేయబడిన యథాయోగ్యఫలప్రదమగు యాత్రాకాలమును చెప్పేదను. పూర్వము చైత్రమాసమున దేవతలచే ఈ యాత్ర విధించబడినది. అచట నుండి కామ కుండమున స్నానపూజాదులు నిర్వర్తించిరి. జ్యేష్ఠమాసమున సిద్దులు ఈ యాత్రను చేసిరి. వీరు రుద్రావాసమున కుండమున స్నానపూజాదులు నిర్వర్తించిరి. ఆషాడమున - ప్రియాదేవీ కుండమున స్నానపూజాదులు చేయు గంధర్వులు ఈ యాత్రనాచరించిరి. శ్రావణమాసము లక్ష్మీకుండమున నుండి సొనార్చన పరాయణులకు విద్యాధరులు ఈ యాత్రను చేసిరి. భాద్ర పదమాసమున మార్కండేయ ప్రదముననుండి స్నానపూజాతత్పరులగు యక్షులచే ఈ యాత్ర నాచరించబడినది. మార్గశిరమాసమున కోటి తీర్థముననుండి స్నానపూజా విధాయకులగు పన్నగులు ఈ యాత్ర నాచరించిరి. పుష్యమాసమున కపాలమోచనమున నున్న స్నానధానార్చనలు గావించు గుహ్యకులు ఈ యాత్రను ఆచరించిరి. ఫాలున మాసమున కాలేశ్వర కుండస్తులు స్నానపూజాది తత్పరులగు పిశాచులు ఈ యాత్రను నిర్వహించిరి. శుభప్రదమగు ఫాలునమాసమున శుద్ధ చతుర్ధశి పిశాచి యను పేర ఇందువలననే ప్రసిద్ధిగాంచినది. ఇక ఇప్పుడు నీకు యాత్రాకృత్యమునుచే ప్పెదను. ఈ కృత్యమును నిర్వర్తించిన వాడు యాత్రా ఫలమునుపొందును. మిష్టాన్నముతో కూడిన ఫలపుష్పసమన్వితములగు, వస్త్రసంఛిదితములగు ఉదకుంభములను దానము చేయవలయును. చైత్రశుక్లతృతీయ మహాఫలప్రద. ఈనాడు మానవులు భక్తిభావముతో గౌరీదేవిని దర్శించవలయును. స్నానమాచరించి గో(పేక్షమునకు వెళ్లవలయును. స్వర్ద్వారమున కాలికాదేవిని పూజించవలయును. ఇచట మరియొకదేవి పరాయని సంవర్తలలితాదేవి చెప్పబడినది. ఈ దేవి సర్వకామ ఫలప్రద గావున భక్తిచే దర్శించవలయును. తరువాత శివభక్తులు శివవ్రత పరులగు బ్రాహ్మణులను భుజింపచేయవలయును. సమృద్దిగా వస్త్రములను దక్షిణల నర్పించవలయును పంచగిరులనుద్దేశించి రసములను గంధములను బ్రాహ్మణులకు అర్పించవలయును. ఇట్లుచేసిన ఉత్తమ శ్రేయస్సును సౌభాగ్యమును పొందును. ఆయాక్షేత్రా వాసములందు విఘ్న ప్రదులగు వినాయకులను ఇపుడు చెప్పెదను. వీరిని పూజించి నరుడు నిర్విఘ్నముగా ఫలమును పొందును. మొదట డుండిని దర్శించవలయును. తరువాత వినాయకుని దేవీ వినాయకుని, గోప్రేక్షుని, హస్తి హస్తిని మరిమొక వినాయకుని సిందూర్యనామకుని చతుర్ధియందు చూడవలయును. వీరు వినాయకులు వీరికి మోదకములనర్పించవలయును. ఈ కృత్యముచే సిద్ధిని పొంది జయమును పొందును. ఇక ఇపుడు క్షేత్రరక్షిణిలగుచండికలను చెప్పెదను. దక్షిణమున దుర్గ, నైఋతమున అంతరేశ్వరి, పశ్చిమమున అంగారేశ్వరి, వాయవ్యమున భద్రకాళికా, ఉత్తరమున భీమచండ, ఈశాన్యమున మహామత్తా, పూర్వమున ఊర్ధ్వకేశసమితయగు శాంకరి, ఆగ్నేయమున అధఃకేశ్, మధ్యన చిత్రఘంట; ఈ చండికలను దర్శించువానికి ప్రీతిచెందిన వారై క్షేత్రమును రక్షించుచుందురు. పాపులకు ఈ చండికలు ఎల్లపుడు విఘ్నములను కలిగించుచుందురు. కావున ఉత్తమసిద్ధిని, సంతానమును, విభవమును, సుఖమును కోరువారు వినాయకులతో కూడియున్న ఈక్షేత్రపాలికలనుఎల్లపుడూ పూజించవలయును. భక్తిచే గంధపుష్పనైవేద్యాదులను సమర్పించవలయును. ఇచటనే మరియొక విశేషమును గూర్చి నీకు చెప్పెదను. ఇచటనే శుభజలములు గలమూడునదులు ప్రవహించుచుండును. ఈ నదులను దర్శించినంతనే బ్రహ్మహత్య తొలగి పోవును. వీటిలో ఒకటి త్రిఫ్రోతా, రెండవది మందాకిని, మూడవది. మత్యోదరి. ఈ మూడు పుణ్యప్రదములు. వీటిలో మధ్యమేశ్వరమున నున్న మందాకిని మహాపుణ్యకరము. త్రిసోతిక యున్నందున అవిముక్త పుణ్యప్రద. ఓంకారమున మత్స్యోదరి పుణ్యప్రద ఈస్థానమున గంగవచ్చుకాలము అత్యంత పుణ్యతమకాలము. ఈకాలము దేవతలకు కూడా దుర్లభము. వరణాసిక్త సకాలమున, - జాహ్నవీజలవిప్లుతమున పుణ్యతమమగు నాగేశ్వరమున స్నానము చేయువాడు దేనిని ఆలోచించును? గంగమత్స్యదరీ సమాయుక్త మగునపుడు శివుడు స్నానము చేయగా కపాలము విడిచెను. కావున ఇచట కపాల మోచనమను గొప్ప సరస్సు సర్వప్రాణులను పావనము చేయునది, పరమ పుణ్యప్రదముగా ప్రసిద్ధి గాంచినది.
ఓంకారేశ్వరసన్నిధిలో మత్స్యదరీ గంగాజలమున స్నానమాచరించి ఓంకారేశ్వరుని దర్శించి శోకమును, జరను, మృత్యువును విడుచును. మత్స్యదరీజలమున స్నానమాడిన వాడు సాక్షాత్తుగా ఓంకారేశ్వరుడను శివుడే యగును. నీ మీది వాత్సల్యముచే ఈ రహస్యమును చెప్పితిని. ఓంకారమున ఆకార ఉకార మకారములు కలవు. వీటిలో అకారము విష్ణులోకగతిప్రదము. ఆకారమునకు దక్షిణ భాగమున ఉకారము చెప్పబడినది. ఇచటనే దేవాచార్యుడగు బృహస్పతి ఉత్తమసిద్దిని పొందెను. ఇచట ఓంకారము అవ్యయమగు బ్రహ్మపదముగా తెలియ వలయును. ఆకార ఉకారములకు ఉత్తరభాగమున విష్ణుసంజ్ఞితమగు మకారము కలదు. ఈ లింగమునే మహర్షియగు కపిలముని సిద్ధి పొందెను. భీష్ముడు వారాణసికి చేరి ఉత్తమమగు పంచాయతనమును దేవేశుని ఆరాధించుచు అచటనే యుండెను. ఈ స్థానమున శివుడు స్వయముగా ఆవిర్భవించెను. సర్వదేవతలచే స్తుతించబడుచు గోప్రేక్షకుడని ప్రసిద్ధిని గాంచేను. గోపేక్షేశ్వరుని చేరి దర్శించి పూజించిన మానవుడు దుర్గతిని పొంద జాలడు. కల్మషములనుండి విముక్తుడగును. అరణ్యములోనుండు సురభులు దావాగ్నిచేదహించబడుచు తిరుగుచు ఈ ప్రదమును చేరి శాంతిని పొంది జలపానమును చేసినవి. అప్పటినుండి ఈ ప్రదమును కపిలా హ్రదమందురు. ఇచటనున్న శివుని వృషధ్వజుడందురు. ఇచట సాక్షాత్తు శివుడు సర్వకాలములందు సన్నిహితుడై దృశ్యమానుడై యుండెను. ఇంద్రియనిగ్రహముతో ఈ కపిలాహ్రదమున స్నానమాచరించి వృషధ్వజుడగు శివుని దర్శించి సర్వయజ్ఞవలమును పొందును. ఇచట శివుని పూజించి మరణించినవాడు స్వర్గమును పొందును. దేహ భేదముచే అతిదుర్లభమగు గణత్వమును పొందును ఈ ప్రదేశముననే పూర్వము బ్రహ్మ స్వయముగా గోవులను సర్వలోక శాంతికొరకు అందరిని పవిత్రము చేయుటకు భద్రదోహమను సరస్సును ఏర్పరిచెను. ఈ సరస్సు పరమపావనము. సర్వపాపహరము. ఇచట స్నానమాడినవాడు సాక్షాత్తు వాక్పతియగును. బ్రహ్మ ఇచట స్వయముగా శివుని తీసుకొని వచ్చి స్థాపించెను. విష్ణువు బ్రహ్మ అంశమును సంగ్రహించి ఇచట స్థాపించెను కావున ఇచట శివుడు హిరణ్యగర్భనామముతో నుండెను. మరల ఇచట బ్రహ్మ స్వర్లోకేశ్వరమను పేరుగల లింగమును కారణాంతరమున స్థాపించెను ఈలింగదర్శనమున శివలోకమున విరాజిల్లును. ఇచట మృతి చెందిన వాడు మరల పుట్టడు. యోగులకు లభించు అనంతగతి ఆతనికి లభించును ఈ ప్రదేశముననే ఒక రాక్షసుడు దేవకంటకుడు వ్యాఘేశ్వరుని దర్శించిన వారు దుర్గతిని పొంద జాలరు. హిమవంతుని చే స్థాపించబడిన శైలేశ్వరలింగమిచట కలదు. ఈ లింగమును దర్శించిన నరుడు దుర్గతిని పొందడు. ఉత్సలుడు విరలుడను రాక్షసులిద్దరు బ్రహ్మవరగర్వముతో స్త్రీ లౌల్యమును కనబరచగా పార్వతీదేవి సంహరించేను. ఈ కథను చిహ్నముగా లింగము స్థాపించబడినది. జ్యేష్ఠ స్థానము నాశ్రయించిన ఈ లింగమును దర్శించిన మనుజుడు ప్రతి జన్మలో సిద్దుడై దుఃఖించడు. ఇచట అంతట దేవతలు లింగములను స్థాపించిరి. ఈ లింగమును దర్శించినవారు దేహభేదమున గణత్వమును పొందరు. ఇచట వారాణసీ నదీ పవిత్రము పాపనాశిని. ఈ క్షేత్రమున చేరి గంగతో కలిసినది. ఈ వారాణసీ గంగా సంగమమున. బ్రహ్మలింగమును స్థాపించెను. ఈ లింగము సంగమేశ్వరమని ప్రసిద్ధి గాంచినది. ఈ దేవనదీ సంగమమున స్నానమాచరించి సంగమేశ్వరుని పూజించినవాడు జన్మభయమును పొందడు. ఈ యుగమును భృగుపుత్రుడగు శుక్రుడు స్థాపించెను. ఈ లింగమునకు శుక్రేశ్వరుడని పేరు. సర్వసిద్దామరార్చితమి లింగమును చూచి సర్వకిల్బిషముక్తుడై సద్యోమోక్షమును పొందును. మరణించినచో మరల జన్మించడు. ఇచట జంబుకాసురుని శివుడు చం పెను. ఈ లింగమును చూచిన వారు సర్వకామనలను పొందును. ఇంద్రాదిదేవతలు ఈలింగములను స్థాపించిరి. ఈ లింగములు పవిత్రములు సర్వకామప్రదములు. ఇట్లు ఈ అవిముక్త క్షేత్రమున నున్న అన్ని లింగములను గూర్చి నీకు విస్తరముగా చెప్పితిని.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున కాశీ మాహాత్మ్యమను యాబది యవ అధ్యాయము.
