నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

80 - బృందావనమాహత్మ్యం

మోహిని మలికెను:- గురువర్యా! మధురా మాహాత్మ్యమును వనముల మాహాత్మ్యమును చక్కగా వింటిని. బృందావన రహస్యమును కూడా కొంచెము చెప్పుము. భూమియొక్క కీర్తిరహస్య భూతము బృష్ణావనము. దానిని వినుటకు నాకు కోరిక గలదు. కావున విస్తరముగా వర్ణింపుము.

వసువు పలికెను:- మోహినీ! బృన్దారణ్య రహస్యమును చెప్పెదను. వినుము. నేను గురువు వలన పొంది ఇంతవరకు ఎవ్వరికీ తెలుపలేదు. నారదమహర్షి నా గురువునకు తెలి పేను. నారదమహర్షికి గోపికాపతిరహస్యమును బృష్ణ చెప్పెను. అట్టి జగదుద్దార కారణమగు బృన్హా మాహాత్మ్యమును ఇపుడు నీకు చెప్పెదను. భగవత్రియుడగు నారదమహర్షి లోకములను పర్యటించుచు ఒకప్పుడు బృన్దావనమును చేరి పుష్పసరసీరమున నిలిచెను. ఈ సరస్సు మధురామండలమున నైఋతిదిశగా నున్నది బృందావనము మధురామండలమున నాలుగవస్థానము. గోపికాపతిరహస్య ప్రదేశము. ఇచటికి సమీపముననే గోవర్ధన పర్వతము కలదు. యమునానదీ తీరమున నందిగ్రామసమీపమున బృన్దాదేవి తపః ప్రదేశము. యమునా నదీ తీరమున సున్దరమగు బృన్గావనము కలదు. అచట పరమ పావనమగునది పుష్పసరస్సు. యమునానదీ తీరమున బృనా ఆశ్రమము అతి సుఖప్రదము. ఇచటనే చెలులతో శ్రీహరి విశ్రమించును. నారదమహర్షి దట్టమగు చెట్టునీడలో ముహూర్తకాలము విశ్రమించి, పుష్పసరోవరపు శీతల జలమును ఆ చమనము గావించి, మాధ్యాహ్నిక కర్మనాచరించి ససస్తీరమున నిలిచెను. సున్దరమగు ఆ బృన్దాశ్రమమున గోపాలకులు, గోపికలు నారదమహర్షి చూచుచుండగా బృందములుగా వచ్చుచుండిరి. ఇట్లు అచట ఒక రూము నిలిచి ఒకటిన్నరరము పగలుండగా అద్భుతమగు బృన్దాశ్రమమున ప్రవేశించెను. ఇచటనే కృష్ణభక్తి పరాయణురాలగు బృన్గా దేవి యుండును. అచటికి వచ్చినవారికి ఫలాదులతో సత్కారములను చేయుచుండును. సాధుసమ్మతుడగు నారదమహర్షి బృన్గాదేవిని ధ్యానయోగాంతమున కనులు తెరిచి అతిధియగు నారదునకు ఆసనమును అర్పించెను. బృందాదేవిచే సత్కరించబడిన నారదుడు ఆసనముపై కూర్చుండెను. గోపికాపతి రహస్యమును అతి రహస్యమును ఆదరముతో తెలియగోరెను. బృందాసత్కారమును స్వీకరించి బృందప్రసన్నురాలని తెలిసి హృదయభావమును తెలి పెను. బృన్గాదేవి ధ్యానయోగముతో నారదుని అభిమతమును తెలుసుకొని తన సఖియగు మాధవిని అచటికి పిలిచి ఇట్లు పలికెను. మహాత్ముడగు నారద మహర్షికి ప్రియమును చేకూర్చుము. ఈ ఆశ్రమమునకు పావనత్వమును చేకూర్చి నాకు ప్రీతిని కలిగించుము. తన ఆశ్రమమునకు వచ్చినవారికి ప్రీతిని కలిగించని ఆశ్రమము నక్కల ఇల్లువలె నిష్పలమగును. అంతట ఆ మాధవీదేవి బృన్గాదేవి ఆజ్ఞచే నారధుని తీసుకొని సరసీరమునకు వెళ్ళి వాయవ్య భాగమున స్నానము చేయుమని చెప్పెను. మాధవీదేవి ఆజ్ఞచే దేవర్షియగు నారదుడు శ్రీకృష్ణసంగమమును ధ్యానించుచు జలమున మునిగెను. నారద మహర్షి నీట మునుగు చుండగా మాధవీదేవి బృన్డేప్సితమును నెరవేర్చి బృన్దాస మీపమునకు వెళ్ళేను. అంతట నారద మహర్షి మునిగి లేచి తనను వనితారూపముగా చూచి ఆశ్చర్యమును చెందెను. అంతట శుచి స్మితయగు నారదీదేవి ఈశాన్య కోణమున నున్న ఉత్తమ భూషణాలంకృతమై చేసన్నదే తనను పిలుచుచున్న సౌందర్యవతియగు వనీతను చూచెను.

అట్లు ఆమెచే పిలువబడిన నారది ఆమెను సమీపించినది. ఆ వనిత నారదీ దేవికి నమ్మకము కలిగించి ఓదార్చి మరొక ప్రదేశమునకు తీసుకొని వెళ్ళేను. అచట రత్నప్రాకారఖచితము వనితాకులమగు భవనమున చేర్చి వనిత మరలిపోయేను. నారదీదేవి కూడా అచటి వనితలచే సత్కరించబడినది. విశాఖా మొదలగు సఖ్పీన్షముచే ఓదార్చబడినది. వారిలో ఒక చెలి నారదీదేవిని అంతఃపురమునకు గొనిపోయినది. అచట నారది గోపికాపతిని దర్శించెను. దూతి వెడలిపోగానే ప్రియుడగు గోషికానాథుడు పిలువగా నారదీదేవి నమస్కరించి లజ్జుచే తలవంచి సమీపించెను. రసికుడగు గోపికాపతి చక్కగా ఆలింగనము చేసుకొని రమింపచేసి విడిచిపుచ్చాను. నారదీదేవి క్రమముగా మరల పుష్పసరస్సును చేరినది. అచట నున్న మాధవీదేవి నైఋతి కోణమున స్నానము చేయించెను. స్నానము చేసిన వెంటనే పుంభావమును పొందిన నారదుడు ఆశ్చర్యమును చెందెను. తరువాత బృన్గాదేవి ఆజ్ఞచే నారదమహర్షి సరస్సునను ఆగ్నేయ కోణమున తపము నాచరించుచు శ్రీకృష్ణ దర్శనమును కోరుచుండెను. ఇట్లు తపమునాచరించుచు బృన్గాదేవి పంపిన ఫలములచే జీవనమును గడుపుచుండెను. ఒకపుడు నారదమహర్షి ఆశ్రమమున తిరుగాడుచు ఒక యువతి పలికిన మధుర శబ్దమును వినెను. అధ్యాత్మ జ్ఞానముగల నారదమహర్షి ఆ శబ్దమును విని కుతూహలముతో వెత కుచు వనమును చేరి ఆమె స్థానమును చూడజాలక పోయెను. అంతట ఆశ్చర్యమును చెందిన నారదమహర్షి ఆదరముతో బృన్గాదేవిని అడిగెను. బృందాదేవి నారద మహర్షికి మొదటి నుండి కుబ్జవృత్తాంతమును తెలి పెను. భూమ్యంతరగుహస్థితయగు కుబ్జాదేవి ఉత్తమన్రీ. శ్రీకృష్ణభగవానునకు అత్యంత ప్రియురాలు. ఏకాంతమున స్వామికి పరిచర్యలను చేయించుచుండును. కుబ్జాదేవిని నేను తప్ప ఎవరూ తెలియ జాలరు. నీవు ఎవరిని చూడగోరి తపమునాచరించు చుంటివో ఆకుబ్జ వృత్తాంతమును సంక్షేపముగా తెలి పెదను. శ్రీకృష్ణభగవానుడు ప్రాతఃకాలమున తల్లి లేపగా లేచి స్నానమాడి భుజించి అనుచరులతో కలిసి గోవులను మేపుటకు అరణ్యమునకు చేరి బృందావనమున విశ్రమించేను. స్నేహితులగు గోపాల కులతో క్రీడించుచు ఆవులను త్రిప్పుచు ఇద్దరు మువ్వురు ప్రియమిత్రులతో నా ఆశ్రమమున కు వచ్చేను.సర్వారామప్రదమగు భవనమున నాచేకల్పించబడిన ఫలమూలాదులచే తృప్తి చెంది ప్రియురాలితో కలిసి పరుండెను. అత్యంత ప్రియురాలగు రాధచే సేవించబడుచు గోపికా ప్రియుడు ఆయా పొదలలో వేరువేరుగా ఒక ఝామున్నర విహరించును. అచట పరుండిన స్వామిని రాధాదులు వింజామరలచే వీచుచుందురు. ఝామున్నరకు స్వయముగా మేల్కాంచి తన ప్రియురాళ్ళను లాలించి గోపాలకులతో గోవులతో సాయంకాలమున సంతోషముతో ఇల్లు చేరును. చెలులందరూ తమ ప్రదేశమున చేరి ప్రియురాలగు రాధాదేవిని వెతకి ఆమెతో కలిసి వారందరూ ప్రతిదినమూ తమ తమ గృహములకు వెళ్ళేదరు. ఇట్లు ప్రతిదినము ఈ లీలలనే చేయుచుండును. ఈ లీలలను నేను మాత్రమే చూచుచుందును. బ్రహ్మ రుద్రాదులు కూడా చూడజాలరు. కుబ్జాసంకేత వైభవమును నేను కూడా చూడజాలకపోతిని. ప్రీతిప్రియుల మాటలచే తెలిసితిని. నీకు అతి రహస్యమును తెలుపుచున్నాను. పవిత్రమగు అంగరాగార్పణము వలన కుబాదేవి ఉత్తమ సంకేతమును పొందగలిగినది. కుబ్జాదేవి ఎప్పుడూ సేవించుటలోనే మునిగియుండును. ఒక్కడే యగు గోపికాపతిని పలువిధములుగా సేవించుచుండును. ఇచట ఇట్లు శతకోటి మిథునములు నివసించుచుండును. కుబ్జకృష్ణాను రూపములు నానా క్రీడాపరములుగా నుండి ఆద్యమిథునము నుండి పుట్టి ఇచటి వనమునకు శోభనిచ్చుచుండును. ఈ మిథునములు గతాగత రహితములు. నిత్యనూతనములు. తృతీయమునకు అగమ్యమై ద్వితీయమున ఐక్యమును పొందిన విలక్షణ రూపము సృష్టిస్థితిలయములకు ఏక మూలస్థానము. ఈ విషయమును నేనొక్కదానినే తెలియుదును. ఇపుడు నా నుండి విని నీవు కూడా తెలియుదువు. షట్కర్లగతమగు దుగ్ధమంత్రమును చక్కగా ఉపాసించుము. ఇట్లు బృన్దాదేవి తెలుపగా దుర్లభమగు విషయమును తెలిసి దుర్లభమగు ఆ మిథునమును చింతించుచూ అచటనే యుండెను. ఓ బ్రహ్మపుత్రా! ఇది గురు శిష్యుల రహస్యము. ఇతరులు తెలియజాలరు. మనధర్మము కూడా ఇదియే. మొదట ఒకడే తెలియును. తరువాత వినువాడు తెలియును. ఇదియే ఒకటే తత్యము కలదు. ఇచట నానా తత్యస్వరూపము లేదు. ఇట్లు నీకు అతి రహస్యమగు గోపికాపతి చరితమును తెలిపితిని.

ఇక ఇపుడు ప్రకాశమగు చరితమును చెప్పెదను. చక్కగా వినుము. ఈ తత్త్యమును నీ తండ్రికి చూపెను. చూపిన ప్రదేశమీ బ్రహ్మకుండమే. బృన్దావనమున ఈ కుండము పరమ పావనము. ఇచట స్వామి మూల రూపమును ధ్యానించుచు స్నానమాడినవారు నిత్య విహారియగు గోపికాపతి వైభవమును చూడగలడు. ఇచటనే తత్త్యమునెరిగిన ఇంద్రుడు గోవిందుని ధ్యానించెను. ఇట్లు ధ్యానించిన ప్రదేశమే గోవిన్ద కుండము. ఇచట స్నానమాడినవారు కూడా గోవిన్ద వైభవమును దర్శించగలరు. - ఏకరూపములో, బహురూపములతో గోపికలతో పొదలిండ్లలో క్రీడించిన రాసక్రీడ కూడా అత్యద్భుతము. పరమపావనము. ఇచటనే నందాది గోపాలకులు శ్రీహరి వైభవమును దర్శించిరి. ఇదియే తత్త్యప్రకాశతీర్థము. శ్రీయమునా జలమున కలదు. గోపాలకులకు కాలియమర్దనము చూపిన ప్రదేశము సర్వపాపాపహతీర్థము. గోపగోపీ జనమును దావాగ్నినుండి కాపాడిన ప్రదేశము కూడా పరమ పావనము. స్నానమాత్రమున సర్వపాపహారము. శ్రీకృష్ణ భగవానుడు విలాసముగా హయాకారమున నున్న కేశియను రాక్షసుని సంహరించిన ప్రదేశమున స్నానమాడినవారు శ్రీహరిలోకమును చేరెదరు. దుష్టుడగు వృషాసురుని సంహరించిన ప్రదేశము అరిష్టకుండము. స్నానమాత్రమున ముక్తి ప్రదము, ధేనుకాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, లంబాసురుడు శ్రీకృష్ణభగవానునిచే లీలగా చంపబడిన ప్రదేశములన్నియూ పవిత్ర తీర్థములే. వీటిలో స్నానమాడి పితృదేవతలకు తర్పణము లిడినవారు శ్రీకృష్ణానుగ్రహము వలన సకలాభీష్టములను పొందగలరు. శ్రీకృష్ణ భగవానుడు నిదురించిన, భుజించిన, సంచరించిన, వినిన, చూచిన ప్రదేశములన్నియూ విలక్షణ క్షేత్రములే. వీటిలో అశీతితమోధ్యాయః స్నానమాడినవారికి స్వర్గము లభించును. పుణ్యాత్ములకు గోపాలకులు స్వామి చరితమును వినిన ప్రదేశము, ధ్యానించిన, దర్శించిన, నమస్కరించిన, ఆలింగనము చేసుకోబడిన, స్తుతించబడిన, యాచించబడిన ప్రదేశములన్నియూ పరమ పావనములు. ఉత్తమగతి ప్రదములు. శ్రీ రాధాదేవి తపమునాచరించిన ప్రదేశము శ్రీ కుండమనబడును. ఇది పరమ పావనము. ఇచట స్నానదాన జపాదికములు అక్షయగతి ప్రదములు. వత్సతీము, చన్దసరస్సు, అప్పరస్పరస్సు, రుద్రకుండము, కామ కుండము, శ్రీహరి మందిరము, అలకనంద పొదలో నున్న విశాల, మనోహరమగు నీపఖండము, ధర్మకుండము, భోజనస్థలము, బలస్థానము, బృహత్సానువు, శ్రీహరి సంకేతస్థానము, నందిగ్రామము, కిశోరమండము, కోకిలకాననము, శేషశాయిపయోఃబ్ది, క్రీడాదేశము, అక్షయవటము, రామకుండము, చీర చౌర్యము, భద్రభాండీరబిల్వకము, మానసరస్సు, వలినము, భక్త భోజనము, అక్రూరము, తార్క్ష్యగోవిన్ద ము బహులారణ్యకము, ఇవన్నియూ కలిసి బృందావనకమండలమనబడును. ఇది యంతయూ పంచయోజన విస్తీర్ణము. పరమపావనము. పవిత్ర జన సేవితము, దర్శన మాత్రమున ముక్తి ప్రదము. సుదుర్లభమగు బృన్గావనమును దేవతలు కూడా చూడగోరెదరు. శ్రీహరి రహస్యలీలలను చూడగోరి తపస్సునాచరించియు చూడజాలక పోయిరి అని సంగములను విడిచి బృన్దవనమునాశ్రయించిన వారికి మూడులోకములలో దుర్లభమగునదేదియును లేదు. బృన్గావననామమును పలికిన వారికి కూడా నన్దనన్దనునియందు భక్తి కలుగును. బృన్దావనమునందు నరులు, నారీజనము, వానరులు, కృమికీటపతంగాదులు, పక్షులు, వృక్షములు, పర్వతములు, మృగములు, ఎప్పుడూ రాధాకృష్ణ నామమును జపించుచుందురు. కృష్ణమాయాభి భూతులు, కామకశ్మల చిత్తులు అగువారికి స్వప్నములలో కూడా బృన్తావన దర్శనము లభించదు. బృన్దావనమును దర్శించిన వారు సఫలమగు జన్మను పొందెదరు. శ్రీహరి కృపాపాత్రులయ్యెదరు. ఇంకనూ ఏమి చెప్పవలయును. ముక్తిని కోరువారు శుభప్రదము, పుణ్యప్రదమగు బృన్దావనమును సేవించవలయును. దర్శించవలయును. ధ్యానించవలయును. దీనిలో సరూపమగు కీర్థివర్ధకమగు మరియొక క్షేత్రము ఈ భూమండలముననే లేదు.

పురాతన కల్పమున గోవర్ధనుడను ద్విజుడు సర్వసంసారమునుండి విరక్తుడై ఉత్తమ తపమునాచరించెను. అవ్యయుడగు శ్రీహరీ భగవానుడు తన క్రీడాస్థానమగు భూమండలమునకు వచ్చి బ్రాహ్మణునకు వరమునీయ సంకల్పించెను. దేవదేవేశుడు, శంఖచక్రగదాధరుడు, విలసత్కాస్తుభోరస్కుడు, మకరకుండలధారి, సుకిరీటుడు, సుకటకుడు, కలనూపుర భూషితుడు, వనమాలానిరీతాంగుడు, శ్రీవత్సాంకితవక్షసుడు, పీతకేశేయవస్రుడు, న వాంబుద సమప్రభుడు, సునాభి, సుందరగ్రీవుడు, సుక పోలుడు, సు నానీ కుడు, సుదంతుడు, సుస్మితుడు, సుజానువక్షస్మలుడు, కృపాసాగరుడు, పృషుడు, సుప్రసన్నముఖాంబుజుడు, అగు శ్రీహరిని చూచి సంభ్రమముతో లేచి భూమి పై దండవత్రణామములాచరించెను. వరమును కోరుమని స్వామి యడుగగా గోవర్ధనుడిట్లు పలికెను. పాదములనుండి నామూపుననుండుము. ఇదియే నాకు వరము. ఆ మాటలను విని గోవిన్దుడు మాటిమాటికాలోచించి గోవర్ధనుని పృష్టము నాక్రమించి నిలిచెను. అపుడు మరల గోవర్ధనుడిట్లు పలికెను. ఓ దేవా! నేను నిన్ను నాపృష్ఠమునుండి దించుటకు ఉత్సహించను. కావున ఇచట ఇట్లే స్థిరముగా నుండుము. అప్పటినుండి శ్రీహరి గోవర్ధన ద్విజుని విడిచి గిరిరూపధరుడగు గోవర్ధనమునకు వెళ్ళి నిలిచెను. శ్రీకృష్ణావతారమున శ్రీహరి గోవర్ధన పర్వతమును ద్విజునిగా తన సారూప్యమును పొందినవానిగా తెలిసి నందాదులచే భజింపచేసెను. ఇట్లు అన్నకూటముచే క్షీరానిదోహనముచే పర్వతరూపుడగు ద్విజునకు తృప్తి కలిగించి దాహము గొనినాడని తెలిసి నవమేఘములచే వర్షింప చేసి నీరుత్రాగించెను. అప్పటినుండి గోవర్ధనుడు వాసుదేవునకు మిత్రుడాయెను. గోవర్ధన పర్వతమును భక్తి కలిగి ఉపచారములచే పూజించిన వారు, ప్రదక్షిణముల నాచరించిన వారు మరల పుట్టరు. గోవర్ధన పర్వతము శ్రీహరినివాసము వలన పుణ్యప్రదమాయెను. గోవర్ధనపర్వతమును దర్శించిన, ఇతర పుణ్యపర్వతములను దర్శించ పనిలేదు. యమునాతీరము సుందరము కృష్ణక్రీడావిభూషితము. భూమండలమున ఇంత పవిత్రమైనది ఎచట కలదో నీవే చెప్పుము. కావున ఇతర వననదీపర్వతములను విడిచి సర్వ ప్రయత్నముతో బృన్దావనమును సేవించవలయును. ఇచట పవిత్రమగు యమునానది, పావనమగు గోవర్ధన పర్వతము కలదు. కావున బృన్గావకముకంటే పవిత్రమగు నది ఈ భూ మండలమున ఏది కలదు? కలికల్మషభీతులకు విషయాసక్తచిత్తులకు బృందావనముకంటే సేవించదగినది ఈ మూడు లోకములలో మరియొకటి లేదు. ఈ బృన్దావనమున నన్దగోపుత్రుడు, నెమలిపింఛమును ధరించినవాడు, నటవరవేషధారి, కర్ణికారభూషణుడు, వేణు నాదముతో హంసీరవమును గెలిచినవాడు, వైజయన్త మాలావృతాంగుడు అహంపదార్థభూతుడు హంసస్వరూపుడగు శ్రీ కృష్ణభగవానుడు గోపాలులతో గోపికలతో ప్రతినిత్యము విహరించుచుండును. పార్వతీ సహితుడగు పరమేశ్వరుడు అర్ధనారీస్వరూపుడు భక్తి పరవశుడై రహస్యముగా శ్రీకృష్ణ భగవానుని ధ్యానించు చుండును. బ్రహ్మ గాయత్రీ స్వరూపముతో నున్న స్త్రీ మూర్తిని హృదయ కుహరమున నిలుపుకొనును. ఇంద్రుడు వేయి కనులతో నిత్యము శశీ రూపమున దర్శించుచుండును. ఆదిశేషుడు రసజ్ఞుడు. కావున తన ప్రియురాలిని వేణు నాదశ్రవణము నుండి రహస్యముగా కాపాడుచుండును. అనగా ఇతరుల విషయమేమి చెప్పవలయును? భేదమును, శోషణమును, తాపమును, భేదమును పొంది గోపిక శ్రీ గోపీనాధాధరసుధను సాదరముగా పానము చేయుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు బృన్దావనమును చేరి రాత్రులందు చంద్రుని వెన్నెలలచే కాంతివంతమగు పొదలలో గోపికలతో క్రీడించేను. ఆ గోపికల అదృష్టమును ఏమని చెప్పవలయును. వీరి చరణ పరాగము బ్రహ్మాదులకు కూడా దుర్లభమే. బృందావనమున గల తృణమృగఖగకృమిప్రాణి బృందములు బ్రహ్మ రుద్రేందాదులచే పూజింపదగినవగును. అట్టి బృందావనమును చేరి బ్రహ్మభూతుడగు శ్రీహరి సుఖాంభోధికల్లోలమగ్నుడై ప్రేమస్నిగ్ధుడై విహరించుచుండును. ఈ బృన్దావనమున క్రూరప్రాణులు సైతము సహజముగు క్రౌర్యమును వైరమును విడిచి యధేచ్చముగా మైత్రితో సుఖముగా నుందురు. కావున మానవులు శ్రీకృష్ణుని కంటే ఇతరుల నాశ్రయించి ఎక్కడ ఆనందించగలరు? ఇట్లు సకల భూమండల పుణ్యరూపముగా నున్న బృన్దా వనమును చేరినా మనస్సు అంధకారమును, ఈ జగత్తును తృణీకరించి ఎప్పుడూ ఆనందించుచున్నది. ఇచట గోపీనాథుడు ప్రతి పదమున (పేమార్ధహృదయుడై ఎక్కువ తక్కువలను లెక్కించక భక్తులనుద్దరించుచుండును. గోపాలకులను, గోపికలను, ఇచటి ఖగమృగ నగములను, గోపగోభూరజమును తలచి దర్శించి ప్రేమపాశబద్ధుడై నమస్కరించుచుందురు. భక్తియందు మనస్సులగ్నమగును. కావున గోపికాపతికంటె సేవించదగిన వారెవరో నాకు మాత్రము తెలియదు. ఇట్లు బృందావనమాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. ఇక చెప్పవలసిన దేమియూ లేదు. సంసారభూతులకు మనుజులు ఈ బృందావనమాహాత్మ్యమునే వినవలయును. అనవలయును. స్మరించవలయును, ధ్యానించవలయును. ఈ బృందావనమాహాత్మ్యమును శుచియై వినిననూ చదివిననూ వారు విష్ణుతుల్యులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తరభాగమున వసుమోహినీసంవాదమున శ్రీ బృన్దావనమాహాత్మ్యమను ఎను బదియవ అధ్యాయము.