నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

42 - గుడధేను విధి కథనమ్

మోహినీ దేవి పలికెను : ఓ మహానుభావా! నీ ముఖ పద్మమునుండి ఉత్తమమగు గంగా మాహాత్మ్యమును వినిన నేను ధన్యురాలను. కృతకృత్యురాలను, నా జీవితము సఫలము, ఈ భూమండలమున గంగా సమమగు తీర్థమే లేదు. ఈ గంగా సందర్శనాదులకింతటి పలము తెలుపడినది. గుడధ్వన్వాదిధేనువుల విధానమును కూడా యధా క్రమముగా తెలుపుము. ఓ బ్రాహ్మణోత్తమా! నేను నీకు సర్వదా భక్తురాలను.

వసిష్ట మహర్షి పలికెను : ఆ మోహినీ వాక్యమును వినిన ఆమె పురోహితుడగు వసువు వేద శాస్త్రాగమతత్త్యజుడు కావున చిరునవ్వుతో ఇట్లు పలికెను.

వసువు పలికెను : ఓ మోహినీ! నీ వడిగిన గుడధేను విధానము శాస్త్రమున తెలుపబడిన విధముగా చెప్పెదను వినుము. చతుర్హస్తమితమగు కృష్ణా జినమును పూర్వ గ్రీవముగా నుంచవలయును. గోమయముచే అలుకవడిన భూమి పై దర్భలను పరిచి దర్భల పై నుంచవలయును. అచటనే ధేనువును ప్రాజ్మఖముగా ఉదక్పాదముగా సవత్సను కల్పించవలయును. చతుర్బారములచే నున్నది ఉత్తమగుడ ధేనువని చెప్పబడినది. ఒక భారము కలది వత్సనుంచవలయును. రెండు భారములు కల ధేనువు మధ్యమము. వత్స అర్ధ భారము కలది, ఒక భారము కల ధేనువు కనిష్ఠము. గృహవిత్తానుసారముగా వత్సచతుర్థాంశముతో నుండవలయును. ఉత్తమగుడ ధేను దాన సమర్థుడై యుండి కూడా ఇతర విధానమును అనుసరిం చినవానికి దుర్మతికి ఫలము కలుగదు. ఇట్లు ఘృత పరికల్పితములగు ధేనువత్సలు శికళ్లు క్లాంబరావృతములు, శుక్తి కర్ణములు, ఇక్షుపాదములు, శుద్ద ముక్తాఫలనేత్రలు సితసూత్ర శిరాలములు, సిత కంబలములు తామ గండూక పృష్ఠములు, సితచామరలోకములు విద్రుమ క్రమగో పేతములు, నవనీత స్తనాన్వితములు, కాంస్య దోహములు, ఇస్రనీలమణి కల్పిత తారకములు, సువర్ణ శృంగాభరణములు, శుద్ద రౌప్యఖురములు, నానాఫలసమాయుక్తములు, ఘ్రాణగంధ కరండకములుగా నిర్మించి ధూప దీపాదులచే అర్చించ వలయును. సర్వభూతములలో సర్వదేవతలలో ధేనురూపముతో నుండు లక్ష్మీదేవి నాకు శాంతిని ప్రసాదించుగావుత. రుద్రదేహస్థిత, శంకర ప్రియ అగు ధేనురూప యగు దేవి నాపాపమును తొలగించు గాత. శ్రీహరి వక్షస్థలమున, స్వాహారూపమున అగ్నిలో చంద్రార్క శక్రులలో అంశగా ధేనురూపముగా నుండు దేవి నాకు సంపదనిచ్చు గాత. చతుర్ముఖ లక్ష్మి, కుబేర లక్ష్మీ, లోక పాలుర లక్ష్మి యగు ధేనురూప నామ వరప్రదురాలగు గావుత. పితృ ముఖ్యులకు స్వధారూపముగా యజ్ఞ భు క్కులకు స్వాహారూప సర్వపాపహార యగు ధేనువు నాకు శాంతిని ప్రసాదించు గావుత. ఇట్లు ధేనువును ప్రార్థించి బ్రాహ్మణునకు నివేదించ వలయును. ఈ విధానము అన్ని ధేనువులకు అనువర్తించును. పాప వినాశినులను ప్రసిద్దిగాంచిన పది విధములగు ధేనువుల స్వరూపమును శాస్త్రోక్త విధానముగా వివరించెదను. సావధానముగా వినుము.

మొదటి ది గుఢ ధేనువు. రెండవది ఘృతధేనువు. మూడవది పాలధేనువు. జలధేనువు నాలుగవది. క్షీరధేనువు అయిదవది. మధు ధేనువు ఆరవది. ఏడవది శర్కరా ధేనువు. దధిధేనువు ఎనిమిదవది. రత్నధేనువు తొమ్మిదవది. పదవది. స్వరూపముగా ధేనువు. ద్రవధేనువులు కుంభరూపములుగా నుండును. ఇతర ధేనువులకు రాశులుండును. ఇచట కొందరు సువర్ణ ధేనువును కూడా చెప్పేదరు. నవనీత ధేనువును, తైలధేనువును కూడా కొందరు మహర్షులు చెప్పేదరు. విధానము అర్చన మాత్రము ఇదే విధముగా నుండును. ప్రతి పర్వకాల మందు మంత్రా వాహనగావించి యధావిధిగా శ్రద్ధతో దానముగావించ వలయును. ఇట్లు చేసిన భుక్తి ముక్తులను ప్రసాదించును. ఈ ధేనువులు అనేక యజ్ఞఫల ప్రదములు సర్వపాపహారములు, శుభప్రదములు. అయన కాలమున విషువమున, వ్యతీపాతమున, యుగాదియందు, మన్వాదులందు, గ్రహణ కాలములందు భక్తి శ్రద్దా సమన్వితులై గుడధేన్వాదులను దానమును గావించ వలయును. తీర్థములందు కాని, స్వగృహమునందు కాని, విశేషించి గంగా తీరమున కాని దానమును చేయవలయును. ఇట్లు యధావిధిగా బ్రాహ్మణునకు గోదానమును గావించి విప్రునికి ప్రదక్షిణ మాచరించి, దక్షిణలచే సంతోషపరిచి ప్రీతియుక్తుడై ఋత్విజులకు నమస్కరించి పంపవలయును. తరవాత యధోవిధిగా అషమూర్తిధర దివ్య రూపగా గంగాదేవిని చూచి పూజించవలయును. శాలితండుల ప్రస్థముచే, ద్వీప్రస్థ క్షీరముల చే పాయసమును చేయించి తేనెను నేయిని ఒక పల మాత్రము వేసి భక్తి భావముచే కూడిన వాడై, ఆపాయసమును, అపూపములను, మోదక మండలములను గుంజార్థ సువర్ణమును రజతమును చందని గురు కర్పూర కుంకుమలను గుగ్గులమును బిల్వపత్రములను, దూర్వలను, గోరోచనమును, శ్వేత చందనమును, నీలోత్పలములను, ఇతర సుగంధ పుష్పములను శక్తి కొలది గంగ యందు పడవేయవలయును. ఈ మంత్రము చే పురాణోక్తముగా ఆచరించవలయును. “ఓం గంగాయై నారాయణ్యే శివాయై చ నమో నమ:” అని మంత్రము. అనగా గంగారూపు ధరించిన నారాయణికి శివకు నమస్కారము అని యర్థము. ప్రతి మాసమున ఇదే విధానమును ఆచరించవలయును. పూర్ణిమయందు, అమావాస్య యందు ప్రాతఃకాలమున సావధానముగా చేయవలయును. ఇట్లు ఒక సంవత్సరము భక్తితో శక్తి కొలది హవిష్యమును భుజించుచు మితాహారియై, బ్రహ్మచర్య ప్రతమునవలంబించి పగలుకొని రాత్రి కాని నియమముచే పూజించినచో సంవత్సరాంతమున అతనికి గంగాదేవి దివ్యవపు ర్థారిణియై దివ్య మాల్యాంబర ధారిణియై దివ్యరత్న విభూషితురాలై ప్రత్యక్ష రూపమున వరప్రదురాలై నిలుచును. ఇట్లు దీవ్యవపుర్థారిణియై ప్రత్యక్ష రూపముగా నీలిచిన గంగా దేవిని చూచి కృత కృత్యుడగును. తాను కోరిన కోరికలనన్నింటిని పొందును. నిష్కాముడైనచో ఆ జన్మలోనే మోక్షమును పొందును. ఇట్లు నీ వడిగిన గుడధేను విధానమును గంగార్చనమును, ముక్తి ప్రదమగు వ్రతమును ఒక సంవత్సరము చేయవలసిన దానిని, చేసిన శ్రీహరిని ప్రీతుని చేయు వ్రతమును చెప్పితిని.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గంగా మాహాత్మ్యమున గుడధేను విధికధనమను నలుబదిరెండవ అధ్యాయము.