నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

75 - లక్ష్మణాచలమహాత్మ్యమ్

మోహిని పలికెను : -

ఓ మహానుభావా ! పాప వినాశనమగు గోకర్ణ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు లక్ష్మణాచల మాహాత్మ్యమును తెలుపుము.

వసువు పలికెను :-

ఓ మోహినీ ! లక్ష్మణ మాహాత్మ్యమును చేప్పెదను. ఈ లక్ష్మణుని దర్శించిన వాడు. సర్వపాతక వినిర్ముక్తుడగును. చతుర్వ్యూహావతారములలో సంకర్షణ దేవుడు స్వయముగా సహస్ర శిరస్సులతో ఒక శిరసు పైన ఈ భూమండలమంతటిని ధరించు చుండును. ఈ సంకర్షణుడే లక్ష్మణునిగా అవతరించెను. సాక్షాన్నారాయణ దేవుడు బ్రహ్మాది వందితుడు రామునిగా అవతరించెను. ప్రద్యుమ్నుడు భరతునిగా అనిరుద్ధుడు శత్రుఘ్నునిగా అవతరించేను. బ్రహ్మాదులచే ప్రార్థించబడిన శ్రీమన్నారయణుడు దశరధమహారాజు వలన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపమున నలుగురిగా అవతరించెను. కొంత కాలమునకు విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షణ కొరకు రామలక్ష్మణులను యాచించెను. అంతట దశరధ మహారాజు మునీ శాప భయముచే ప్రాణములకంటే మిన్న అయిన రామలక్ష్మణులను విశ్వామిత్రునికి ఇచ్చేను. తాటకను చంపి, సుబాహువుని చంపి మారీచుని దూరముగా పడవేసి రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞమును కాపాడిరి. విశ్వామిత్రుని ప్రీతుని చేసిరి. అట్లు ప్రీతుడగు విశ్వామిత్రుని వలన అస్త్ర సమూహమును పొందిన రాముడు లక్ష్మణునితో కలసి అచటనే కొంత కాలముండెను. తరువాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిధిలా నగరమునకు తీసుకొని పోయెను. అంతట జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సత్కరించి బాలకులిద్దరు ఎవరి పుత్రులు? ఎచటి వారు అని అడిగెను. అపుడు విశ్వామిత్ర మహర్షి వారు దశరధుని పుత్రులు రామ లక్ష్మణులు అని తెలి పెను. అంతట జనక మహారాజు రామ లక్ష్మణులను చూచి ప్రీతుడై సీతను ఊర్మిలను రామ లక్ష్మణులకు భర్తలుగా మనసున కల్పించుకొనెను. త్రికాలజ్ఞుడగు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు మనోగతమును తెలుసుకొని సంతోషించి సీతాస్వయం వరమునకు మహేశ్వరుడు న్యాసముగా ఉంచిన ధనువును చూపుమని పలికెను. విశ్వామిత్రుని మాటను వినిన జనక మహారాజు త్వరగా మూడు వందల మంది భృత్యులచే సాదరముగా శివధనువును తెప్పించెను. శ్రీరామ చంద్రుడు ఆ శివధనువును ఎడమ చేతితో క్షణములో లేపెను. నారీ తాడును లాగి సులభముగా ఏనుగు చెరుకు గడను విరిచినట్లు విరిచెను. అంతట మిథిలాధిపతి సంతోషించి రామ లక్ష్మణులను సత్కరించి తన కన్యలను రామ లక్ష్మణులకు సమర్పించెను. విశ్వామిత్రుని వలన దశరధుని మరో ఇద్దరు పుత్రులు కలరని తెలిసి వారి తోపాటు దశరధుని కూడా ఆహ్వానించి తమ్ముని పుత్రికలను వారికి అర్పించెను. ఇట్లు వివాహము చేసుకొనిన నలుగురు పుత్రులతో జనక మహారాజు దారిలో భార్గవరాముని గర్వమును శ్రీరాముడు హరించెను. తలిదండ్రులతో సోదరులతో అయోధ్యలో చాలాకాలము ఆనందముగా గడిపెను. లీలామానుషత్వమును విడంబించుచున్న రామచంద్రుడు వసిష్టాది పండితులందరు బోధించగా తన మహిమను బ్రహ్మ స్వరూపముగా తెలుసుకొనెను. అంతట దశరథమహారాజు సర్వజుడగు శ్రీరామచంద్రుని చూచి ప్రీతి చెంది యౌవరాజ్య పట్టాభి షేకమును చేయు నుద్యుక్తుడాయెను. ఈ విషయమును దశరధునికి అత్యంత ఇష్టురాలగు కైకయీ దేవి రామ పట్టాభి షేకమును వారించి తన పుత్రుడగు భరతునికి పట్టాభిషేకమును కోరెను. అంతట రామ చంద్రుడు కైక సంతోషము కొరము తండ్రి అనుమతితో లక్ష్మణునితో సీతాదేవితో చిత్రకూటమునకు వెళ్ళేను. మునివేషమును ధరించి అచటనే కొంతకాలము నివసించేను. అంతట తాత ఇంటిలో ఉన్న భరతుడు తండ్రి మరణమును విని వచ్చి రాముని తలచుచు మరణించిన తండ్రిని తెలుసుకొని కైకను ధిక్కరించి రాముని అయోధ్యకు మరలించుటకు వెళ్ళేను. రామ చంద్రుడు తన పాదుకలను భరతునకిచ్చి పంపి అత్రి అగస్త్య సు తీక్ష మహరుల ఆశ్రమములకు వేను. రామచంద్రుడు ఋషుల ఆశ్రమములలో పన్నెండు సంవత్సరములు గడిపి భార్యతో తమ్మునితో పంచవటికి వెళ్ళను. అచటికి వచ్చిన శూర్పణఖను వికృతురాలను చేయగా ఆమే పంపిన ఖరదూషణాది రాక్షసులను పదునాలుగు వేల మందిని తీక్షనారాచములచే యమలోకమునకు పంపెను. ఈ విషయమును వినిన రాక్షసరాజగు రావణుడు మారీచుని బంగారులేడిగా పంపి రామలక్ష్మణులను దూరముగా పంపి సీతాదేవిని హరించి అడ్డగించిన జటాయువును సంహరించి లంకకు గొనిపోయెను. అంతట రామలక్ష్మణులు ఆశ్రమమును చేరి హరించిన సీతను వెదకుచు మరణించిన జటాయువును చూచి దహన సంస్కారము గావించి కంబంధుని సంహరించి శబరిని సందర్శించి ఋష్యమూక : ర్వతమును చేరిరి. హనుమంతుని సుకొని అతని శత్రువగు వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసెను. సుగ్రీవుని ఆజ్ఞచే హనుమదాది వానరేంద్రులు సీతను అన్వేషించుచు దక్షిణ సాగరమును చేరిరి. సంపాతి వాక్యము వలన సీతాదేవి లంకలో ఉన్నదని నిశ్చయించుకొనిరి. అంతట ఒక హనుమంతుడు మాత్రమే సముద్రము ఆవతలి వడ్డున ఉన్న లంకను చేరి సీతను చూచేను.

సీతాదేవికి శ్రీరామాంగుళీయకమునిచ్చి నమ్మకము కలిగించి రామ లక్ష్మణుల కుశలమును వినిపించి ఆమెనుండి చూడామణిని పొంది, ఆశోకవనమును భంగపరిచి సైన్యముతో పాటు అక్షకుమారుని చంపి, ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రముచే బంధింప బడి, రావణుని చేరి, అతనితో మాటలాడి, లంకాపురమును మొత్తము దహించి, మరల సీతాదేవిని చూచి అనుజ్జును పొంది సాగరమును లంఘించి రాముని చేరి సీతా వృత్తాస్త్రమును వినిపించెను. రావణ నివాసమున సీత కలదని వినిన రాముడు కపి సైన్యముతో సముద్రమును చేరెను. సముద్రుని అంగీకారముచే సాగరమున సేతువును నిర్మించి అవతలి తీరమును చేరి సైన్యమును నిలిపెను. అంతట విభీషణుడు సీతాదేవిని రాముని కర్పించమని బోధించిననూ రావణుడంగీకరించక పాయేను. రావణుడు పాదముతో తన్నగా విభీషణుడు రాముని చేరి శరణు జొచ్చెను. అంతట రామ చంద్రుడు లంకను ముట్టడించెను. అపుడు రావణాసురుని మంత్రులు, అమాత్యులు, పుత్రులు, భృత్యులు రావణాజ్ఞచే యుద్ధము చేసి రామ లక్ష్మణులతో వానరేశులతో నాశమునొందిరి. లక్ష్మణుడు ఇస్రజిత్తును నిశిత శరముచే అంతము గావించెను. రామ చక్రుడు కుంభకర్ణుని రావణుని సంహరించేను. విభీషణునిచే రావణునికి అంత్య క్రియలను జరిపించి తన ప్రియురాలగు సీతాదేవిని అగ్నిలో శోధించి విభీషణునకు రాక్షసాధిపత్యము నొసంగి, కల్పాంతము వరకు ఆయుష్యము నోసంగి, వ్రతమును ముగించుకొని అయోధ్యా నగరమును పుష్పక విమానము చే చేరి, నందిగ్రామమున నున్న భరతుని అయోధ్యకు చేర్చి వారితో కలిసెను. తల్లులందరికి నమస్కరించెను. సోదరులందరూ వసిషాజ్ఞను పొంది రామునికి రాజ్యాభి షేకమునుగావించిరి. అప్పటినుండి శ్రీరామచంద్రుడు ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించుచు లోకాపవాదమునకు భయపడి ధర్మజ్ఞుడు కావున సీతాదేవిని పరిత్యజించేను. సీతాదేవి వాల్మీకి ఆశ్రమమును చేరి సుఖముగా నివసించేను. కుశలవులను పుత్రులను యధావిధిగా నాచరించెను. శ్రీమద్రామాయణమును రచించి కుశలవులకు బోధించెను. కుశలవులు మహారులతో రామాయణమును గానము చేయుచు ప్రసిద్ధిని గాంచిరి. శ్రీరామ చంద్రుడాచరించు అశ్వమేధయాగమునకు వచ్చిరి. అచట శ్రీరామ చంద్రుడు కుశలవులచే గానము చేయబడిన తన చరిత్రను విని ప్రసన్న మనస్కుడై సీతాదేవితో వాల్మీకి మహర్షిని పిలిపించెను. జగన్మాతయగు సీతాదేవి కుశలవులను శ్రీరామచంద్రున కర్పించి భూవివరమున జొచ్చేను. అది అత్యద్బుతమాయెను. తరువాత శ్రీరామ చంద్రుడు బ్రహ్మచర్యమును అవలంబించి యజ్ఞముల నాచరించుచు పదమూడు వేల సంవత్సరములను రాజ్య పాలన గావించుచు భూలోకమున నివసించెను. అంతట యధా సమయమున యమధర్మరాజు రామచంద్రుని చేరి బ్రహ్మ సందేశమును వైకుంఠమును చేరమని చెప్పుటకు ముందు మనిద్దరము మాటలాడు చుండగా ఎవ్వరూ రారాదు. వచ్చినవారు వధించ బడవలయును అని పలికెను. శ్రీరామ చంద్రుడు అట్లే ప్రతిజ్ఞ గావించెను. లక్ష్మణుని పిలిచి ఇచట ద్వారమున నిలువుము. ఇచటికి వచ్చిన వారు వధారులగుదురు అని తెలిపేను. లక్ష్మణుడు అటులనే యని రామాజ్ఞను పరిపాలించు చుండెను. ఎవరినీ లోపల ప్రశేశించనీయలేదు. ఇట్లు ఏకాంతమున శ్రీరామచంద్రుడు యమధర్మరాజుతో సంభాషించు చుండెనని తెలిసి దుర్వాస మహర్షి అటకొచ్చెను. అట్లు వచ్చిన దుర్వాస మహర్షి లక్ష్మణుడు నమస్కరించి రామచంద్రుడు రహస్య సమాలోచనలో నుండెను. ఒక ముహూర్త కాలము నిలువుడని పలికెను. దుర్వాసమహర్షి ఆమాటలను విని కాలమునకు కావలసిన దానిని చేయువాడు కావున కోపించి నన్ను లోనికి ప్రవేశించనిమ్ము. లేనిచో నిన్ను భస్మము గావించెదనని పలికెను. దుర్వాస మహర్షి వాక్యమును వినిన లక్ష్మణుడు తత్తరాపాటుతో మునికి భయపడి రామ చంద్రునికి తెలుపుటకు లోనికి వెళ్ళేను. యమధర్మ రాజు వచ్చిన లక్ష్మణుని చూచి మాటలాడుట ముగించి ప్రతిజ్ఞను నెరవేర్చుమని పలికి రామాజ్ఞతో వెడలెను. అంతట శ్రీరామచంద్రడు ధర్మ భృఛ్చేష్టుడు బయటికి వచ్చి దుర్వాస మహర్షిని సత్కరించి భుజింప చేసెను. తరువాత నమస్కరించి అతనిని సాగనంపి లక్ష్మణుని తో ఇట్లు పలికెను. లక్ష్మణా ధర్మ కారణమున సంకటము ప్రాప్తించినది. నీవు వధ్యుడవయితివి. దైవము బలీయము. కావున నేను విడిచితిని. యధేచ్చముగా వెడలుము. అని అంతట లక్ష్మణుడు సత్య ధర్మములలో నిలిచిన శ్రీరామచంద్రునికి నమస్కరించి దక్షిణ దిశగా వెళ్ళి పర్వతము పై తపము నాచరించెను. అంతట శ్రీరామచంద్రుడు కూడా బ్రహ్మ దేవుని చే సాకేత పురములో కోసల రాజ్యముతో పాటు స్వధామమును చేరెను. కోసల వాసులు కూడా దివ్యదేహులై యోగి దుర్లభమగు రామధామమును చేరిరి. గోప్రతారమును సరయూనదిలో రాముని ధ్యానించి స్నానమాడిన వారు దివ్య దేహులై యోగిదుర్లభమగు రామధామమును చేరిరి. లక్ష్మణుడు కూడా కొంతకాలము తపోయోగబలము కలపొడై రామాను గమమున స్వధామమును చేరెను. లక్ష్మణుడు నివసించి తపమాచరించిన ఆ పర్వతము ఉత్తమ క్షేత్రమాయెను. లక్ష్మణాచలమున లక్ష్మణుని సందర్శించిన వారు కృతార్థులై నిస్సందేహముగా శ్రీహరి మందిరము చేరెదరు. ఈ క్షేత్రమున స్వర్ణ గోభూ అశ్వాది దానములు ప్రశస్తములు. ఇచట లక్ష్మణుని దర్శనము దుర్లభము. అగస్త్యమహర్షి ఆజ్ఞచే లక్ష్మణ దర్శనమును పొందినచో మోక్షము తప్పక లభించును. ఇది. లక్ష్మణాఖ్యాన సహితమగు రామ చరిత్రము. ఈ చరితమును వినిన వారు, వినిపించినవారు రామచంద్రుని ప్రీతిపాత్రులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున రామ లక్ష్మణ చరిత్ర సహిత లక్ష్మణాచల మాహాత్మ్యమను డెబ్బది యైదవ అధ్యాయము.