నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

57 - పురుషోత్తమమాహాత్యము

వసువు పలికెను :-

దేవతలను, ఋషులను, పితరులను ఇతరులను తృప్తి పరిచి, ఆచమనము గావించి పొజియమముతో హస్తమాత్రముగా చతుష్కోణము, చతుర్ద్వారము, సుందరమగు పురమును, సముద్ర తీరమున లిఖించి పురమధ్యమున అష్టపత్రము కర్ణికా సహితముగా పద్మమును లిఖించవలయును. ఇట్లు మండలమును లిఖించి ఆ మండలమున అష్టాక్షర విధానము చే అజుడు విభుడగు నారాయణుని పూజించవలయును. ఇక ఇప్పుడు నీకు ఉత్తమమగు కాయ శోధనమును గురించి చెప్పెదను. రక్తము రేఫ సమన్వితమగు క్షకారమును హృదయమున చింతించవలయును. జ్వలించునది త్రిశిఖము, పాప సంచయమును దహించునది, చంద్ర మండల మధ్యస్థమగు ఏకారమును శిరసున చింతించవలయును. శుక్లవర్ణము కలది, భూమిని తడుపుచు అమృతమును వర్షించు చున్న ఏకారమును శిరమున చింతించ వలయును. ఇట్లు కాయ శుద్ధిచే పాపములు నశించి దివ్య దేహము కలవాడగును. తరువాత దేహము నందు ఆత్మయందు అష్టాక్షర మంత్రమును న్యాసము చేయవలయును. పోమపాదమున ఆరంభించి క్రమముగా న్యాసము గావించవలయును. పంచాంగమును, వైష్ణవమును, చతుర్వ్యూహము నుంచవలయును. తరువాత సాధకుడు మూలమంత్రముచే కరశుద్ధిని చేయవలయును. విడి విడిగా అన్ని వేళ్ళయందు ఒక్కొక్క దానిని ఒక్కొక్క వర్ణముతో నుంచవలయును. శ్యామ వర్ణముగల భూబీజముగు నకారమును దక్షిణపాదమున నుంచవలయును. కాలరూపమగు మోకారమును వామకటియందు ఉంచవలయును. పూర్వ బీజమగు నాకారమును దక్షిణ కటియందుంచ వలయును. తేజో బీజమగు రాకారమును నాభిదేశమునందుంచవలయును. వాయు బీజమగు యకారమును వామ స్కంధమున నుంచవలయును. జాకారమును దక్షిణ భుజమున నుంచవలయును. సకలలోకములుండు శిరస్సున యకారముండును. ఓంకారమును హృదయమున నుంచి వికారమును శిరస్సున నుంచి ప్లకారమును నేత్రములందుంచవలయును. వేకారము అస్రముగా చెప్పబడినది. శుక్లవర్లుడగు వాసుదేవుడు లలాటమున నుండును రక్తవర్ణుడు వహ్ని సన్నిభుడగు. సంకర్షణుడు ముఖమున నుండును. పీత వర్ణుడగు ప్రద్యుమ్నుడుహృదయమున, అనిరుద్దుడు మేహనేంద్రియమున, సర్వాతిగములందు సర్వశక్తి చతుర్వూహుడగు శ్రీహరి ఉండును. నాకు ముందు భాగమున శ్రీవిష్ణువు, వెనుక భాగమున కేశవుడు, దక్షిణ పార్వమున గోవిన్దుడు, వామ పార్శ్వమున మధు సూదనుడుండును. ఊర్థ్వభాగమున వైకుంఠుడు, అధో భూగమున వరాహస్వామి, అవాంతర దిశలయందు మాధవుడుండును. నడుచు, నిలుచు, మేలుకున్న నన్ను నరసింహ స్వామి కాపాడును. ఇట్లు విష్ణుమయుడై, కర్మనారంభించవలయును. దేహమునందున్న విధముగా దేవునియందు అన్నితత్త్యములను న్యాసమును చేయవలయును. సర్వ విఘ్నహరము, శుభమగు ఫకారాన్తము వర కు న్యాసము ఉద్దేశించబడినది. ఇచటనే అర్క చన్ద వహ్నిమండలములను ధ్యానించవలయును. భువనాంతర్భాగమున పద్మమధ్యమున విష్ణున్యాసమును చేయవలయును. తరువాత హృదయమున ఉత్తమ జ్యోతి రూపమగు ప్రణవమును చింతించి, సనాతన జ్యోతిరూపమును కర్ణికయందు ఆసీనమైనట్టు భావించి తరువాత యధాక్రమముగా అష్టాక్షర మన్తమును యధాక్రమముగా న్యాసమును గావించవలయును. ఇట్లు వ్యక్తముగా సమస్తముగా చేయునది ఉత్తమ పూజగా పేర్కొనబడినది. తరువాత ద్వాదశాక్షర మంత్రముచే సనాతన దేవుని పూజించవలయును.

ఇట్లు హృదయావధారణ తరువాత కర్ణికయందు బహిర్బాగమున నుంచవలయును. చతుర్బుజుని మహాసత్త్యుని సూర్యకోటి సమప్రభుని ధ్యానించి మహాయోగమును క్రమముగా అవాహన చేయవలయును. మీన రూపధారి, నరసింహ స్వామి, వామనుడు, వీరందరు నాకు నారాయణుని అగ్రభాగమున రావలయును. నీకు సుమేరువు పాదపాఠము. పద్మ కల్పితమగు ఆసనము. సర్వతత్త్యహిత ము కొరకు మధుసూధనా నీవుండుము. ఓ సనాతనా! పద్మనాభా! నీ పాదములకు పాద్యమును, కమల పత్రాక్షా! మధుసూధనా! శ్రీవిషూ! బ్రహ్మాదులచే కల్పించ బడిన పాద్యమును నాచేత స్వీకరించుము. ఓ పురుషోత్తమా? భక్తిచే నివేదించు అర్యమును గ్రహించుము. సర్వపాపహారీ, శుభప్రదము అగు, మందాకినీ జలమును నాచే భక్తి పూర్వకముగా నివేదించబడు ఆచమనీయమును స్వీకరించుము. నీవే జలము. నీవే పృథివి. నీవే అగ్నివి. నీవే వాయువు. లోకాచారము ననుసరించి జలముచే స్నానము చేయించు చున్నాను. దేవతంతు సమాయుక్తములు, యజ్ఞవర్ణసమన్వితములు స్వర్ణ వర్ల ప్రభలు అగు వస్త్రములను స్వీకరించుము. నాకు నీ శరీరము తెలియదు. చేష్ణ తెలియదు. నేను నివేదించు గంథమును స్వీకరించి లేపనము చేసుకొనుము. ఋగ్యజుస్సామమంత్రములచే బ్రహ్మచేత్రి వృతమగు, సావిత్రీ గ్రంథి సంయుక్తమగు ఉపవీతమును నీకర్పించు చున్నాను. దివ్యరత్న సమాయుక్తములు, వహ్ని భాను సమప్రభలు అగు అలంకారములు నీ అవయవములను అలంకరించును. సూర్య చంద్రుల మెరుపు అగ్నుల జ్యోతి నీ స్వరూపమగుచుము. వనస్పతీరసము, దివ్యము, గంధాడ్యము, సురభియగు ధూపమును నేను అర్పించు వానిని స్వీకరించుము. షడ్రస సమన్వితము స్వాదు యగు నాచే సమర్పించబడు చతుర్విధాన్నమును నైవేద్యముగా స్వీకరించుము. పూర్వదలమున వాసుదేవుని, దక్షిణదలమున సంకర్షణుని, పశ్చిమమున ప్రద్యుమ్నుని, ఉత్తరమున అనిరుద్ధుని న్యాసము గావించవలయును. ఆగ్నేయమున వరాహస్వామిని నైఋతి దిక్కున నరసింహుని వాయవ్యమున మాధవుని, ఈశాన్యమున త్రివిక్రముని న్యాసము చేయవలయును. అష్టాక్షర మంత్రమునకు చుట్టూ గరుడన్యాసముగావించ వలయును. వామ పార్శ్వమున చక్రమును, దక్షిణ పార్శ్వమున శంఖమును, దేవునకు దక్షిణమున మహాగదను వామ భాగమున శార్హధనువును న్యాసము గావించవలయును. దక్షిణమున అమ్ముల పొదను, వామభాగమున ఖడ్గమునుంచవలయును. దక్షిణమున శ్రీని, ఉత్తరమున పుష్టిని ముందు వనమాలను, తరువాత శ్రీవత్సకౌస్తుభములనుంచవలయును. పూర్వాది చతుర్దశలయందు హృదయాదిన్యాసము గావించవలయును. తరువాత మూలలందు దేవదేవుని అస్రన్యాసమును గావించవలయును. ఇంద్రుని, అగ్నిని, యముని, నైఋతిని, వరుణుని, వాయువును, కుబేరుని, ఈశుని బ్రహ్మతో అనస్తుని ఊర్ధ్వాభాగములందు అయా మంత్రములచే పూజించవలయును. ఇట్లు మండలస్థుడగు జనార్ధనుని పూజించి, పూజలనందిన శ్రీహరిని దర్శించిన వారు శ్రీహరిలో ప్రవేశించేదరు. ఈ విధానము ననుసరించి మండలస్థుడగు జనార్ధనుని ఒకమారు పూజించిననూ అభిమతకామనలను పొందును. జన్మ మృత్యు జరాభయములను విడిచి శ్రీవిష్ణు పదమును పొందును. సర్వకాలములందు భక్తిచే ఏమరుపాటు లేక నారాయణుని స్మరించు వానికి నివాసమునకు శ్వేతద్వీపము లభించును. ఓంకారాది సమాయుక్తమగు తదీయనమస్కారము నామ సహితము సర్వ తత్త్యములను మన్తముగా చెప్పబడును. ఈ విధానముతోనే గంధపుష్పాదులను నివేదించవలయును. ఒక్కొకరికి యధోద్దిష్టముగా యధాక్రమముగా నాచరించవలయును. యధోక్త క్రమముగా ముద్రలను ప్రదర్శించలయును. మూల మంత్రము చే జప మును చేయవలయును. అష్టావింశతికాని, అష్టకాని, అష్టోత్తర శతమును కాని జపించవలయును. కామ్య కర్మలందు యధోక్తమును యధాశక్తీ సావధానముగా జపించవలయును. పద్మము, శంఖము, శ్రీవత్సము, గద, గరుడము, చక్రము ఖడ్గము, శార్ణము, అను ఎనిమిది ముద్రలు చెప్పబడినవి. ఓ పురాణ పురుషోత్తమా! పరమ స్థానమునకు వెళ్ళుము. నీ స్థానమును బ్రహ్మాదిదేవతలు కూడా తెలియరు. మన్త పూర్వకముగా యధోక్త విధిగా అర్చనము తెలియని వారు ఇచట మూలమంత్రముచే అచ్యుతుని పూజింతురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబదియేడవ అధ్యాయము.