నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

74 - గోకర్ణ మహాత్మ్యమ్

మోహిని పలికెను:-

గురువర్యా ! మీరు చెప్పిన పుండరీక పురోపఖ్యానమును వింటిని. ఇపుడు నాకు గోర్ణఖ్యానమును చెప్పుము.

వసువు పలికెను :-

ఓ మోహినీ ! సర్వపాతక నాశనము పుణ్యప్రదము హర క్షేత్రమగు గోకర్ణము మాహాత్మ్యమును చెప్పెదను వినుము.పశ్చిమ సముద్ర తీరమున కలదు. ఒకటిన్నర యోజన విస్తారము కలదు. దర్శన మాత్రముననే ముక్తి ప్రదము. సగర పుత్రులు భూమిని త్రవ్వగా సాగరము పెరిగి భూమిని పెంచినది. తీర్థక్షేత్రకాననము ముప్పది యోజన విస్తారము కలదు. అచట అన్నియూ దేవాసుర మానవుల నిలయములే. కాని వారందరూ ఆస్థానమును వదిలి సహ్యాది పర్వతములను చేరిరి. అంతట సముద్రములో మునిగిపోయిన గోకర్ణ మహాక్షేత్రమును చింతించుచు మునివరులందరూ గోకర్ణ క్షేత్రమునుద్దరించదలచి ఆలోచించి మ హేన్రాచలముననున్న పరశురాముని దర్శించుకొనిరి. అచట పరశురామాశ్రమము ప్రశాంతములగు సౌమ్య -మృగములచే కూడియున్నది. అన్ని ఋతువులయందు ఆనందప్రదము. పండ్లతో పూలతో కూడియున్న చెట్లు కలది. దట్టమైన నీడగలది. సాటిలేనిది. సుగంధ మును ఆనందమును కలిగించు గాలి కలది. బ్రహ్మఘోషనినాదితమగు ఆశ్రమమును సంతోషముతో ప్రవేశించిన ఋషులు మృదుకృష్ణాజినోత్తరమగు బ్రహ్మాసనమున సుఖాసీనుడు, శిష్యులచే పరివృతుడు, శాంతుడు, తపోధనుడగు పరశురాముని చూచిరి. కాలాగ్నివలే మూడు లోకములను దహించి శాంతించి తపసులో నున్న పరశురాముని చూచి వినయముగా నమస్కరించిరి. అట్లు వచ్చిన ఋషులను చూచిన పరశురాముడు సాదరముగా ఆర్థ్యపాద్యాదులతో పూజించేను. అతిధ్యమును చేసి ఇట్లు పలికెను. మహానుభావులారా మీకు స్వాగతము. మీరెందుకొచ్చితిరో నానుండి కోరదగినదే మున్నదో వివరించుడు. అంతట మునులు పరశురామునితో ఓ భృగు శ్రేష్ఠా ! మేము గోకర్ణాశ్రమమునునండి వచ్చితిమి. సగర పుత్రులు భూమిని త్రవ్వి సముద్రమును వృద్ధి పరచగా గోకర్ణము సముద్ర జలము మునుగగా మేము అటనుండి వెడలి వచ్చితిమి. మీరు తమ మహిమచే నీట మునిగిన ఆశ్రమమును నీరును దూరముగా పారదోలి ఉద్ధరించుడు అని పలికిరి. వారి మాటలు వినిన పరశురాముడు తానాయుధ పరీత్యాగమును చేసితిని కదా ఎట్లని క్షణకాలము ఆలోచించెను. సాధు రక్షణము పరమ ధర్మమని నిశ్చయించి ధనుర్బాణములను గ్రహించి వారితో కలిసి బయలు దేరెను. మ న గిరినుండి దిగి వాయువ్య దిశగా తన పర్వతమును దాటి వెడలెను. గోకర్ణవాసులతో కలిసి సాగర తీరమును చేరెను. ఒక క్షణకాలము విశ్రమించి మేఘ గంభీర వాక్కుతో సముద్రునితో ఇట్లు పలికెను. ఓ సముద్రుడా! నేను భార్గవరాముడను. మునులతో వచ్చితిని. మాకు నీదర్శనమునిమ్ము. నీతో అత్యవసర కార్యము నిమ్ము. ఇట్లు పరశురాముని మాటలను వినికూడా అహంకారముతో పరశురాముని సన్నిధికి చేరలేదు. ఇట్లు పలుమార్లు పలిచిననూ సముద్రుడు రాకపోవుటచే కోపించిన పరశురాముడు ధనస్సును గ్రహించేను. ధనువున వహ్నిదైవమగు భార్గవాస్త్రమును సంధించి సముద్రుని ఇంకించుటకు నిశ్చయించెను. భార్గవరాముడు అస్త్రమును సంధించుటతో క్షోభను చెందిన సముద్రుడు యాద్గణ పరివృతుడై పరాశురామాస్త్ర సంతప్తుడై రామ భయముతో స్వరూపముతో వచ్చి పరశురామ పాదములను పరిగ్రహించేము. అంతట అస్త్రమును ఉపసంహరించి సముద్రునితో ఇట్లు పలికెను. గోకర్ల తీర్థము కనపడునటుల జలమును ఉపసంహరించుమ అనీ అంతట పరశురామాజ్ఞతో గోకర్ణమున నున్న జలమునుప సంహరించేను. పరశురాముడు కూడా గోకర్లవాసుడగు శంకరుని చక్కగా పూజించి మహేన్రాద్రిని చేరెను. ఆ మునులు మాత్రము అచటనే నివసించిరి. అచటనే మునులందరూ వ్రతమును స్వీకరించి తపమునోచరించి పునరావృత్తి రహితమగు మోక్షమును చేరిరి. ఆ క్షేత్రప్రభావముచే శంకరుడు భూతగణములతో దేవతలతో పార్వతీ దేవితో అత్యంత ప్రీతుడై అచటనే నిత్య నివాసము నేర్పరచుకొనెను. గోకర్ణ గత శంకర దర్శన మాత్రముననే పాపము పెనుగాలికి ఎండు టా కులవలె వెంటనే విడుచును. గోకర్ణమును సేవించ వలయునను కోరిక మానువులకు సామాన్యముడా కలగదు. గోకర్ణక్షేత్రమున నిర్బంధముతో మరణించిన స్థావర జంగమములు కూడా వెంటనే సనాతన స్వర్గమును చేరెదరు.

గోకర్ణ తీర్థ స్మరణ మాత్రముననే సకల పాపములు నశించును. ఈ గోకర్ణ క్షేత్రము సర్వతీర్థ నివాస భూతము. సర్వక్షేత్రములందు స్నానమాడి సదాశివుని పూజంచుట వలన కలుగు ఫలము గోకర్ణగత శివదర్శనము వలన కలుగును. కామక్రోధాది హీనులై గోకర్ణమున నివసించు వారు త్వరలో సిద్ధిని పొందెదరు. జపహోమపరులై నియమమును గ్రహించిన బ్రహ్మచారులు గోకర్ణమున నివసించిన అభీష్టసిద్ధిని పొందెదరు. గోకర్ణమున ఆచరించిన దానహామ జపాదులు పితృదేవద్విజార్చనములు ఇతరత్ర ఆచరించిన పోటీకంటే కోటి గుణిత ఫలమునిచ్చును. ఇట్లు చదువు వారికి వినువారికి సర్వపాప నాశకమగు గోకర్లక్షేత్ర మహాత్మ్యమును నీకు తెలిపితిని.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున గోకర్ణ మాహాత్మ్యమను డెబ్బది నాలగవ అధ్యాయము.