నారద మహా పురాణము - ఉత్తరార్థము
31 - మాఘమాహాత్యమ్
వసిష్ఠ మహర్షి పలికెను : ఆ కాషీలావచనమును వినిన సంధ్యావళి ఆదరముగా ఇట్లు పలికెను. ఓ కాఫీలా నీ మాటల వలన ఇప్పుడు నాకొశ్చర్యము కలుగుచున్నది. నీవు కుత్సితగతికి వెళ్ళుచుండగా ఎట్లు చూడగలను? నీచ జాతినుండి నీవు విముక్తురాలవగుటకు ఏమి చేయవలయును? నాకా విషయమును చెప్పుము. నిన్ను చూచి నాకు దుఃఖము కలుగుచున్నది. కోమలము మృదువు నవనీతము వంటి నీ శరీరము మాంసపిండముగా నుండుట చూచి నా మనసులో దయ కలుగుచున్నది.
కాష్ఠీల పలికెను : ఓ సుందరీ! నా కొఱకు సమస్త భూమండలమును దానము గావించినను నాకు నీచజాతి నుండి విముక్తి లభించదు. నాకు విముక్తిని కలిగించి ఉత్తమ గతిని ప్రసాదించు గొప్ప పుణ్యమును తెలి పెదను వినుము. ఈ మాఘమాసము సర్వమాసములలో ఉత్తమ మాసము. ఈ మాసమున బ్రహ్మహత్యాది పాపములు ఆక్రోశించును. మాఘమాసము దుర్లభము. మానవ జన్మ దుర్లభము. ఉషఃకాల స్నానము, శ్రీకృష్ణ సేవనము, యధావిధిగనుపవసించు హరి వాసరము దుర్లభము. మాఘమాసమున దేవతలు తమ తేజస్సును జలమున నుంచేదరు. కావుననే మాఘమాసమున జలము విశేషముగా పావనము. మాఘ మాసమున ప్రాతఃకాలమున స్నానము చేయువానికి లభించు గతి యుద్ధమున శూరులకు కూడా లభించదు. భావి, చెరువు నదులలో మాఘస్నానము శ్రేష్ఠము. కూపజలము, ఖాండజలము మధ్యమములు. వేడి నీరు అధమము. పుణ్యము సుఖములచే లభించదు. దుఃఖముల చేతనే లభించును. స్నానము ధర్మసేవనమునకే కాని శరీర శుద్ధి కొఱకు కాదు. వహ్నిని హోమము కొఱకు సేవించవలయును కాని శీతమును వారించుటకు కాదు. సూర్యోదయమునకు ముందే స్నానమాడవలయును. ఆకాశమున మేఘములు కప్పియుండగా ఉదయించుచున్న సూర్యుని ప్రార్ధించవలయును. నద్యాదికము లేనిచో కొత్త కుండలోని నీరు రాత్రిపూట గాలి కుంచినది గంగాజలసమమని చెప్పెదరు. మాఘ స్నానమును చేయువాడు దుర్గతిని చెందడు. మాఘ స్నానము శుద్ధి చేయని పాతకములు లేవు. అగ్ని ప్రవేశము కంటే మాఘోషస్నానమే శ్రేష్ఠము. బ్రతికినపుడు దుఃఖించును. మరణించి సుఖించును. కావున మాఘ స్నానము విశిష్టము. ప్రతి దినము శర్కరతో కూడిన తిలలు దానము చేయవలయును. తరువాత బ్రాహ్మణునికి సూర్యుడు నిరంజన విష్ణురూపుడు ప్రీతి చెందునని షడ్రసాన్నమును భుజింపచేయవలయును.
బ్రాహ్మణ జంటకు వస్త్రములను సప్టాన్నములను ఆర్పించవలయును. ముప్పది మోదకములను శర్కరా సహితములగు అన్నములను దానము చేయవలయును. మూడు భాగములు తిలలు, ఒక భాగము శర్కరను, భోగ్యములగు తాంబూలాదులను భక్తిచే దానము గావించవలయును నదులలో నదీముఖముగా, ఇతర ప్రదేశములలో సూర్యముఖముగా గంగాది తీర్ధములను ఆవాహన గావించి స్నానము చేయవలయును. అనేక జన్మలలో తెలిసీ తెలియక చేసిన పాపములన్నియూ నీ తేజస్సుతో హతమగుగాక. ఓ దివాకరా! జగన్నాధాః ప్రభాకరా! నీకు నమస్కారము. ఓ అచ్యుతా! ఈ నా మాఘస్నానమును పరిపూర్ణమును గావించుము. మాఘస్నానము చేయువాని కంటే తీర్ధస్నానము చేయువాడు అల్పఫలమును పొందును. తీర్థస్నాము వలన స్వరమును పొందును. మాఘ స్నానము వలన పరమ పదమును పొందును. మాఘ శుక్ల ఏదాదశి ఆదివారమున వచ్చినచో మహా పాతకములను నశింప చేయును. నక్షత్ర యోగము లేకున్ననూ శుక్లైకాదశి చేడు రాజు రాజ్యమును బోనాడునట్లు పాపములను దహింప చేయును. దుష్ట పుత్రుడు కులమును, దుష్టభార్య భర్తను అధర్మము ధర్మమును, దుష్టమంత్రి రాజును., అజ్ఞానము జ్ఞానమును అనాచారము ఆచారమును, అసత్యము సత్యమును, వాదము సంవాదమును, ఉష్ణము హిమమును, అనర్ధము అర్ధమును, పాపము కీర్తిని, గర్వము తపస్సును, రసము మహారోగములను, శ్రాద్దమును సంకేతము నశింపచేయునట్లు ఆచరించబడిన ద్వాదశి పాప సంఘమును నశింపచేయును. బ్రహ్మహత్య, సురాపానము, చౌర్యము, గుర్వంగ నాసంగమము అను మహాపాతకములను కూడా శీఘ్రముగానశింపచేయును. ఈ పాపములన్నింటిని పుష్కరము, నైమి శారణ్యము, కురుక్షేత్రము, ప్రభాసము, గయ, రేవా, సరస్వతి, గంగా, యమునా, ప్రయాగము, దేవిక, సరస్సులు, ఇతర నదులు, హోమదానతపములు, పురాణములలో చెప్పబడు ఇతర సుకృతములు నశింపచేయజాలవు. ఒక్క హరివాసరము మాత్రమే నశింపచేయును. ఒక మారు ఉపవాసముతో పాపారాశులన్నియూ నశించును. పృధివిదానము ఒకవైపు హరివాసరము ఒకవైపుంచినచో రెండు సమములు కాజాలవు. హరివాసరమే అధికము అని బ్రహ్మ చెప్పెను. ఈ హరివాసరమున బంగారముతో వరాహమూర్తిని చేసి మటము పైన కొత్త తామ్రపాత్రలో సర్వబీజాన్వితము, శ్వేత వస్త్రాచ్చాదితము, హిరణ్యసహితము, దీపశోభితము, పుష్పమాలాలంకృతము అగుదానిలో నుంచి యధావిధిగా పూజించి, రాత్రి జాగరణ చేసి, ప్రాతఃకాలమున, విష్ణుభక్తుడు కుటుంబియగు బ్రాహ్మణునకు దానము గావించవలయును. వరాహ ప్రతిమాయుత మగు ఆకుంభమును నైవేద్య పరిచ్ఛద సహితముగా దానము గావించి, బ్రాహ్మణులను భుజింపచేసి బంధు మిత్రులతో కలిసి తాను పారణ చేయవలయును. ఇట్లు చేసినచో మరల జన్మ కలుగదు. చాలా జన్మలలో తెలిసీ తెలియక చేసిన పాపములనన్నింటి సూర్యోదయము చీకటిని నశింపచేసినట్లు నశింప చేయును. ఓ శుభకరురాలా! ఇట్లు శాస్త్రవిధిననుసరించి నేను ద్వాదశీవ్రతమును వర్ణించితిని. నీవు పూర్వజన్మలో ఈ వ్రతము నాచరించితివి. దీని వలన నీకు సాటిలేని పుష్టియున్నది. ఉండగలదు. నీకే నీ భర్తను పుత్రునకు సర్వకాలములందు సుఖములనిచ్చును. ఆవ్రత పుణ్యములో నాలుగవ భాగమును నాకిచ్చితివేని నేను ప్రీతితో శ్రీహరి పరమధామమును పొందెదను. పూర్వజన్మలో నేను చేసిన విత్తాపహరణ పాపమును నశింపచేయగల నాలుగవ భాగమును నాకిమ్ము. జీవితముతో, విత్తముతో భర్తను వంచించిన స్త్రీ నూరు జన్మలు క్రిమిగా పుట్టి పుల్కసిగా” సంభోగమును ధనమును యాచించు భర్తకు ఆరెంటిని ఈయని స్త్రీ కాఫీలగా పుట్టును. కావున ఆ పాపము నశించుటకు ద్వాదశి వలన కలిగిన పుణ్యములో నాలుగవ భాగమునిమ్ము. నా యందు జాలికలదేని ఇమ్ము. ఇట్లు యాచించిన, కాఫీలా వాక్యమును, విని, చేతిలో జలమును తీసుకొని ఆమె కోరిన పుణ్యమునిచ్చితిని. నేను పూర్వజన్మలో ఏకాదశీ ఉపోషము వలన కలిగిన పుణ్యములో నాలుగవ భాగముచే ఈ కాఫీల విముక్తిని పొందుగాక. పూర్వ జన్మకృతపాపము నశించుగాక. నా మాట సత్యము సత్యము. నేనిట్లు పలికిన వెంటనే ఆకాఫీల విద్యుత్సమ ప్రభయై దివ్యవిమానమున కూర్చుండి విష్ణు పదమునకు వెళ్ళుటను చూచితిని. కావున ఈలోకమున భర్తయే దైవము. భర్తను వంచించరాదు. సద్గతిని కోరు భార్య ధనముచే జీవితముచే మోసగించరాదు. కావున ఓమోహినీ, నా భర్త కొరకు నీ ఇష్టమునిచ్చెదను. కావున చెప్పుము. ధనమును, దేహమును, పుత్రుని, ఇంకా ఇతరములను కూడా. ఇచ్చెదను. ఈలోకమున భర్తకాక ఇతర దైవమే లేదు. అట్టి భర్త కొరకు ధనమును కాని జీవితమును కాని త్యాగము చేయవలయును. అట్లు చేసినచో కల్పకోటి శతము విష్ణులోకమున విరాజిల్లును అగ్నిసాక్షిగా వివాహమాడిన బ్రాహ్మణపుత్రి కఠినురాలై ఘోరవ్యసనములు కల భర్తను దానము చేసెను కాని అతను కోరిన ధనము నీయజాలకపాయెను. ఆపాపముచే కాఫీలగా పుట్టెను. నేను కుమారిగా యుండి తండ్రి యింటిలో దీనిని చూచితిని. కావున నేను ఈ సత్యమును హితమును తెలిసి నా భర్త కొఱకు సర్వమునీయగలను. స్వీకరించుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణము ఉత్తర భాగమున మెహినీ చరితమున కాష్ఠీలోపాఖ్యానమున మాఘ మహాత్మ్యమను ముప్పది యొకటవ అధ్యాయము.
