నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

47 - గయామాహాత్మ్యమ్

వసువు పలికెను : అయిదవ రోజు గదాలోల తీర్థమున పూర్వము వలె స్నానాదికమునాచరించి సపిండకమగా శ్రాద్ధము నాచరించవలయును. తరువాత అక్షయ వటమున శ్రాద్దాదీకమునాచరించి పితరులను బ్రహ్మపురమును చేర్చెదరు. తరువాత బ్రహ్మ కల్పితులగు బ్రాహ్మణులను పూజించి భుజింప చేయవలయును. ఈ ప్రయత్నము చేతనే అక్షయ వటమున శ్రాద్ధము గావించి సావధానముతో వటేశుని దర్శించి, నమస్కరించి పూజించి పితరులను అక్షయము సనాతనమగు బ్రహ్మపురమును చేర్చెదరు. గదాప్రక్షాళణము గావించిన శ్రేష్ఠమగు గదాలోల మహాతీర్థమున స్వర్గప్రాప్తికి అక్షయమునకై శుద్ధి కొరకు స్నానమును చేయుచున్నాను. వటాగ్రమున ఏకాన్తమున బాల రూపమున యోగనిద్ర చే శయనించు యోగశాయికి నమస్కారము. సంసార వృక్ష శాస్త్రము అశేష పాపక్షయకరము, అక్షయ బ్రహ్మదాత యగు అక్షయ వటమునకు నమస్కారము. కలిగియుగమున మహేశ్వరలోకములు కావున గదాధరుడు లింగరూపిగా యున్న ప్రపితామహునికి నమస్కారము. పితామహునికి నమస్కరించి రుద్రపదమునకు పితరులను చేర్చును. హేతి యను రాక్షసుని వధించి అతని శిరమును రెండుగా చేసిన గద ఈ తీర్థమున కడుగబడెను. కావున ఈ తీర్థము గదాలోలమని ప్రసిద్ది నొందెను. బ్రహ్మపుత్రుడగు హేతి యను రాక్షసుడు అద్బుతమగు గొప్ప తపమునాచరించెను. తపసుచే ప్రీతులగు బ్రహ్మదులను దైత్యాదులచే వివిధ శస్త్రాదులచే మనుజులచే కృష్ణశానాది చక్రాదులచే అవధ్యుడుగా వరమును పొందెను. బ్రహ్మదులట్లేయని అంతర్థానము నందిరి. అంతట హేతిదేవతలను జయించెను. ఇనత్వమును పొందెను. అపుడు బ్రహ్మేశ్వరాదులు దేవతలు హరినాశ్రయించి బేతిని చంపుమని కోరిరి. అంతట హరి హేతి సురాసురులచే అవధ్యుడు నాకు బ్రహ్మాస్తమునిచ్చిన హేతిని చంపెదననెను. అపుడు దేవతలు విష్ణువునకు ఈ గదనిచ్చిరి. హేతిని చంపుమనిరి. అట్లు దేవతలు పలుకగా శ్రీహరి ఆగదను ధరించి యుద్దమున గదచే హాతిని చంపి దేవతలతో కలసి త్రిదివమునకు వెళ్ళెను.

తరువాత మహానదిగా యున్న గాయత్రీ తీర్థమున ఉపవసించి గాయత్రీ అగ్రభామున స్నానమాచరించి సంధ్యోపాసన చేయవలయును. సపిండకముగా శ్రాద్ధము చేసి కులమునకు బ్రాహ్మణత్వమును కూర్చవలయును. సముద్యత తీర్థమున సావిత్రి ముందు స్నాన మాచరించి మధ్యాహ్నమున సంధ్యోపాసన గావించి పితరులను బ్రహ్మలోకమునకు చేర్చును. సరస్వతీ అగ్రభాగమున ప్రాచీ సరస్వతిలో స్నానము గావించి సాయంకాలమున సంధ్యోపాసన గావించి కులమును సర్వజులను చేయును. బహు జన్మలలో చేసిన సంధ్యాలోప పాపమునుండి విముక్తుడగును. విశాలాతీర్థమున భరతాశ్రమమున పదాంకితమగు ముండపృష్టమున గదాధరుని సమీపమున, ఆకాశగంగా తీర్థమున, గిరికర్ణాదులందు శ్రాద్ధమునాచరించువాడు, పిండప్రదానము చేయువాడు పితృశతమును బ్రహ్మలోకమునకు చేర్చును. గోదావైతరణిలో స్నాన మాచరించి ఇరువది యొక్క తరములనుద్ధరించును. గంగానదిలో గోప్రచారమున, మానస పదమున, పుష్కరిణియందు, గదాలోల తీర్థమున, అమరకక్షేత్రమున, కోటి తీర్థమున, రుక్మకుండమున, పిండ ప్రదానము గావించినచో పీతరులను స్వర్గమునకు చేర్చును. మార్కండేయేశ కోటీశులకు నమస్కరించి పితృతారకుడగును. పుణ్యోదయమగుపాండు శిలాదర్శన మాత్రముననే పవిత్రులై నరకములో నున్నవారు స్వర్గమును చేరెదరు. అని పలికి పాండవుడు శాశ్వతపదమును చేరెను. ఘృతకుల్య, మధు కుల్యా, దేవికామహానది ఈ శిలయందు సంగతయే మధుస్రవగా ప్రసిద్ధిగాంచినది. ఈ మధ్రుస్రవలో స్నానమాచరించిన వాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును పొందును. పితృ తర్పణముగావించి, సపిండ శ్రాద్ధమునాచరించి సహస్ర కులమునుద్దరించి విష్ణు పదమును చేర్చును. ఉద్బీజ్ఞములు, స్వేదజములు, అండజములు జరాయుజములగు ప్రాణులలో ఏ ప్రాణి అయిననూ మధుస్రవాతీర్థమున మరణించినచో విష్ణు లోకమును పొందును. ఈ దశాశ్వమేధమునిచ్చు హంస తీర్థమున శ్రాద్దము నాచరించిన స్వర్గమును పొందును. దశాశ్వమేధ హంస తీర్థములను నమస్కరించి శివలోకమును పొందును. మతంగ పదమున శ్రాద్దమునాచరించువాడు బ్రహ్మలోకమును పొందును. బ్రహ్మ విష్ణ్వాదులతో కలిసి శమీగర్భమున అగ్నిమధనము చేసిన ప్రదేశము మంధోకుండమను తీర్థము. ఈ తీర్థము పితరులకు ముక్తిని ప్రసాదించును. ఇచట తర్పణము పిండదానము స్నానమును చేసినవాడు ముక్తిని పొందును. రామేశకరకేశ్వరులకు నమస్కరించి పితరులను స్వర్గమున చేర్చును. గయా కూపమున పిండదానము వలన అశ్వమేధ ఫలమును పొందును. భస్మకూటమున భస్మస్నానముచే పితరులను తరింపచేయును.

నిఃక్షీరా సంగమమున స్నానము చేయుట వలన పాపములు నశించును. రామ పుష్కరిణిలో శ్రాద్ధమునాచరించిన పితరులను బ్రహ్మలోకమునకు చేర్చును. సుషుమ్నా మహానదిలో స్నానము గావించినచో ఇరువది యొకటీ తరములనుద్దరించును. వసిష్ణ తీర్థమున స్నానము గావించి వసి ప్లేశుని నమస్కరించిన అశ్వమేధ ఫలమును పొందును. ధేనుకొరణ్యమున కామధేను పదమున స్నానము చేసి అచటి దేవుని నమస్కరించి పిండ ప్రదానము గావించిన పితరులను బ్రహ్మలోకమున చేర్చును. కర్దమాల తీర్థమున, గయానాభి యందు ముండ పృష్ట సమీపమున స్నానము గావించి చండికకు నమస్కరించి శ్రాద్దము గావించిన పితరులను స్వర్గమున చేర్చును. ఫలు చండీశుడను పేరు గల సంగమాధీశుని అర్చించిన ఈ ఫలమే లభించును. గయాగజము, గయాదిత్యము గాయత్రీ, గదాధరుడు, గయ, గయాశిరము అను ఆరుగయలు ముక్తి దాయకములు. గయయందు వృషోత్సర్జనము గావించి ఇరువది యొక తరముల నుద్దరించును. జితేంద్రియుడగు విప్రుడున్న ప్రదేశమున ఆద్యుడగు గదాధరుని ధ్యానించి శ్రాద్ధమును పిండ ప్రదానము నాచరించవలయును. నూరు కులములనుద్దరించి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. తరువాత జనార్దన దేవుని యధావిధిగా పూజించి దధ్యోదనమును నైవేద్యమునిడి తచ్చేషముతో శ్రీరామచంద్రుడు అరణ్యమునకు వెళ్ళగా భరుతుడు పర్వతము నధిరోహించి యుండెను. తండ్రికి పిండాదికములనిచ్చి అచట రామేశుని స్థాపించి సాము చేసి రామేశునికి నమస్కరించి సీతారాములను చేరెను. కావున నరుడు అచటికి వెళ్ళి స్నానమాచరించి సావధానముతో రామేశుని నమస్కరించి, రాముని సీతను నమస్కరించి శ్రాద్ధమును పిండ ప్రదానమును గావించి విష్ణులోకమును చేరును. తానే కాక నూరు కులములనుద్ధరించి పితరులతో విష్ణులోకమును చేరును. శిలాదక్షిణ హస్తమున కుండ పృష్ఠమువైపు శ్రాద్ధాదులనాచరించి పితరులను బ్రహ్మపురమును చేర్చును. సీతాద్రీయొక్క దక్షిణ పర్వతమున కుండుడు తపమునాచరించెను. పుణ్యముగ మతంగపదమున పిండప్రదుడు పితరులను స్వర్గమును చేర్చును. శిల యొక్కరామహస్తమున అంతకగిరి ధరించబడినది. మహాత్ముడగు అగస్త్యుడు ఇచటికీ ఉదయాద్రిని తెచ్చెను. ఇచట పిండ ప్రదుడు పితరులను స్వర్గమున చేర్చును. తన తపస్సునకు కుండము చేయుబడినది. ఇచట బ్రహ్మ సావిత్రి కుమారులతో నుండెను. హాహా హూహూ మొదలగు గంధర్వులు గీతవాద్యములను చేయుచుండిరి మధ్యాహ్నమున అగస్త్యతీర్థమున స్నానమాడి సావిత్రిని ఉపాసించి కోటి జన్మలు వేదపారగుడు ధనాఢ్యుడగు విప్రునిగా పుట్టును. అగస్త్యతీర్థమున స్నానమాడి పిండములనిచ్చువాడు పితరులను స్వర్గమున చేర్చును. ఇక బ్రహ్మయోనిని ప్రవేశించి వచ్చువాడు పునర్జన్మరహితుడై పరబ్రహ్మను పొందును. గయా కుమారుని నమస్కరించి బ్రాహ్మణ్యమును పొందును. సోమకుండమున అభిషేకాదులచే పితరులను సోమలోకమున చేర్చును.

కాక శిల యందు కాకులకు చేయు బలి క్షణకాలమున మోక్షమునిచ్చును. స్వర్గద్వారేశ్వరునికి నమస్కరించి స్వర్గము నుండి బ్రహ్మలోకమును పొందును. ఆకాశగంగ యందు పిండప్రదానము చేయువాడు నిర్మలుడై పితరులను స్వర్గమునకు చేర్చును. శిలాదక్షిణ హస్తమున భస్మకూటమును దరించెను. కావున అచట హరుడు భస్మకూటాద్రియని నామకరణమును చేసెను. ఇచట నటుడు, వటేశ్వరుడు ప్రపితామహుడు అచట నివసించును. భస్మకూటాద్రి అగ్రభాగమున రుక్మిణీ కుండము, పశ్చిమ భాగమున కపిలానదీ కలదు. కపిలానదీతీరమున కపిలేశుడు కలడు. ఇచటనే ఉమాసోమ సమాగమము కలదు. కపిలానది యందు స్నానము చేసి కపిలేశునికి నమస్కరించి పూజించవలయును. ఇచట శ్రాద్ధప్రదుడు స్వర్గమును పొందును. మహాశకుండమున గౌరీ మంగళ సర్వసౌభాగ్య ప్రద అర్చించ బడవలయును. భస్మకూటమున గల జనార్దన హస్తమున పిండప్రదుడు స్వస్వమంత్రములతో ఇతరులకు సత్యముగా తిలలు లేక దథిసంమిశ్ర పిండప్రదానము గావించిన వారందరు విష్ణులోకమును పొందెదరు. ఓ జనార్దనా నా హస్తమున ఈ పిండమును నేనిచ్చుచున్నాను. నేను మరణించినపుడు గయాశ్రాద్ధమున నీవు సోకు పిండమును చేయవలయును. నేను నీకు ఎవరెవరి కొరకు పిండమునిచ్చితినో వారు మరణించినపుడు వారికి నీవు పిండములనిమ్ము. పితృరూపియగు జనార్ధనా! నీకు నమస్కారము ఓ పితృపాత్రా ముక్తి హేతువగునీకు నమస్కారము. గయయందు పితృరూపముగా జనార్దనుడే స్వయముగా నుండెను. ఆ పుండరీకాక్షుని దర్శించిన వాడు ఋణత్రయ విముక్తులగుదురు. ఓ పుండరీకాక్షా! ఋణత్రయ విమోచనా నీకు నమస్కారము. లక్ష్మీకాంత! పితృమోక్షప్రదా? నీకు నమస్కారము. జనార్దనుడుగు పుండరీకాక్షుని పూజించి స్వర్గమును పొందును. వామజానువునువంచి భూమి మీద నుంచి జనార్ధనుని నమస్కరించి సపిండకముగా శ్రాద్ధమును చేసి సోదరులతో విష్ణులోకమును చేరును. శిలావామ భాగమున ప్రేతకూటగిరి కలదు. ప్రేత శిలామయము పాపాఢ్యమగు ఈ పర్వతమును యమధర్మరాజు తన పాదముచే శిలాపాదభాగము నుండి దూరముగా పడవేసెను. ధనుష్కరూపముతో విఘ్నకరులగు చాలా మంది ప్రేతలు ఇచట విడివిడిగా ఉండిరి. ఈ తీర్థము పితృవిముక్తి కొరకు శ్రాద్ధమును చేయు వారి సంపర్కముతో ప్రేత కూటము పవిత్రత నందెను. ఇచటనే 'ప్రేత కుండము కలదు. ఇచట ప్రతి పదమున దేవతలు నివసించియున్నారు. ఇచట స్నానము గావించి శ్రాద్ధ పిండాదికములనిచ్చినచో పితరులు పేతత్వ విముక్తులగుదురు. కీకటములందు గయ పవిత్రమైనది.రాజ గృహము వనము పవిత్రములు. ఇచటి చ్యవనాశ్రమము పావనము. ఇచట నది పావనము. వైకుంఠము, లోకదండము, గిరికూటము శోణగము, ఇవియన్నియూ పుణ్యప్రదములు. ఈ తీర్థ ములలో శ్రాద్ధ మును పిండ ప్రదానమును గావించినచో పితరులను

బ్రహ్మాపురమునకు చేర్చును.

శిలాదక్షిణ పొదమున గృధ్రకూటగిరి కలదు. ఈ గిరిని యమధర్మరాజు తన స్టైర్యమునకు ఈ గిరిని ధరించెను. ఇచట తాను స్వయముగా తన స్థిరతకు గృధ్రరూపమున తపము నాచరించి సిద్ధిని పొందెను. కావుననే ఈ గీరికి గృధ్రకూటమని పేరు. ఇచట గృధేశ్వరుడు శివుడు. ఇచట స్నానము చేసి గృధేశ్వరుని దర్శించి శివపురమును చేరును. అచట గృధ్రపురమునకు వెళ్ళి సమయమొచ్చినపుడు స్వర్గమును చేరును. ఋణమోక్షమును పాపమోక్షమును శివుని దర్శించి శివుని పొందును. ఈ పర్వతము తన ఆదిపాదముతో శిలోదనమాక్రమించబడినది. ఇచట విఘ్ననాశకుడుగు విఘ్నేశుడు. గజరూపముతో నుండెను. ఈ విఘ్నేశుని దర్శించి విఘ్నవినిర్ముక్తుడగును. పితరులను శివపురము చేర్చును. ఇచట స్నానము చేసి గాయత్రిని గయాదిత్యుని దర్శించి స్వర్గము చేరును. ఆది పాదమున నున్న బ్రహ్మను దర్శించి పిత్సతారకుడగును. నాభి యందు పిండప్రదుడు పితరులను బ్రహ్మపురము చేర్చును. ముండ వృష్ణమునకు శోభ కొరకు ఉత్తమారవిందమేర్పడెను. ముండ ప్పషారవిందములను చూచి పాపముల నుండి విముక్తుడగును. శృంగులచే, దండ్రులచే, ప్యాలములచే, విషముచే, వహిచే, స్త్రీలచే, జలములచే, సంగమమును చాలా దూరమున విడువవలయును. సర్పములకు అపకారమును చేయుచు మరణించినవాడు, విద్యుత్తుచే మరణించినవాడు, రాజుచే శిక్షించబడినవాడు (శౌర్యమున పరదారలనురమించుచు వారి పతులచే ద్వేషముచే చంపబడినవాడు అసమానులచే, సంకీర్ణులచే, చాండాలులచే విరోధమును చేసి వారిచే చంపబడినవారు, చాండాలాదులను ఆశ్రయించినవారు, గోవులకు అగ్నిని విషమునిచ్చిన వారు, పాఖండులు, క్రూరబుద్దులు, క్రోధముచే విషమును, అగ్నిని, శస్త్రమును, ఉద్బంధనమును, జలమును ప్రయోగించినవారు, గిరుల నుండి వృక్షములనుండి పడినవారు, కుశిల్ప జీవులు, పంచసూనాధికారులు, యజ్ఞములలో సభలలో దీన ప్రాయులు, నపుంసకులు, బ్రహ్మదండహతులు, బ్రాహ్మణహతులు, మహాపాతకులు. వీరంతా పతితులనబడుదురు. వీరు గయా కూప భస్మస్నానముచే శుద్ధిని పొందెదరు. ఇది గయామాహాత్మ్యము. ఇట్లు నీకు చెప్పితిని. ఈ మాహాత్మ్యము సర్వపాపప్రశమనము. పితృముక్తిదాయకము. శ్రాద్దమున కాని, పర్వకాలమున కాని, ప్రతి నిత్యము ఈ మాహాత్మ్యమును భక్తిచే వినువారు, వినిపించువారు బ్రహ్మలోకమును పొందెదరు. ఈ గయా మాహాత్మ్యము, శుభములకు నిలయము, పరమపావనము, ధన్యము, నరులకు స్వర్గతిదాయకము, యశస్కరము, ఆయుష్యకరము, పుత్రపౌత్ర వివర్ధనము. కావున దీనిని చదువవలయును. వినవలయను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున గయా మాహాత్మ్యమను నలుబది ఏడవ అధ్యాయము.