భాగవత మహా పురాణము
82 - బలరామ శ్రీకృష్ణులను గోపాలకులు గోపికలు కలుసుకొనుట
శ్రీశుక ఉవాచ ।
అథైకదా ద్వారవత్యాం వసతో రామకృష్ణయోః ।
సూర్యోపరాగస్సుమహానాసీత్కల్పక్షయే యథా ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాతి - వృత్తాంతమును చెప్పుచున్నాను. బలరాముడు, శ్రీకృష్ణుడు ద్వారకా నగరములో నివసించుచుండిరి. ఒకనాడు కల్పాంతమునందు వలె సంపూర్ణ సూర్య గ్రహణము పట్టెను.
తం జ్ఞాత్వా మనుజా రాజన్ పురస్తాదేవ సర్వతః ।
సమంతపంచకం క్షేత్రం యయు శ్శ్రేయోవిధిత్సయా ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ గ్రహణమును గురించి జనులకు ముందుగానే తెలిసెను. వారు ఈశ్వరుని ఆరాధించి తమకు మంగళమును కలిగించుకొనే కోరికతో అన్ని ప్రాంతములనుండి సమంతపంచకమనే క్షేత్రమునకు వెళ్లిరి.
నిఃక్షత్రియం మహీం కుర్వన్ రామశ్శస్త్రభృతాం వరః ।
నృపాణాం రుధిరో ఘేణ యత్ర చక్రే మహాప్రదాన్ ॥
పరశురాముడు ఆయుధధారులలో దిట్ట. ఆయన భూమిపై క్షత్రియులు లేకుండా చేయగోరి, ఆ సమంతపంచకమునందు రాజుల రక్తధారలతో పెద్ద కుండములను తయారుచేసేను.
ఈజే చ భగవాన్ రామో యత్రాస్పృష్ట్యాఽపీ కర్మణా ।
లోకస్య గ్రాహయన్నీతో యథాకన్యోఽఘాపనుత్తయే ॥
అచటనే సర్వసమర్థుడగు పరశు రామ భగవానుడు యజ్ఞమును కూడ చేసెను. ఆయనకు పొసంబంధము లేదు. అయినో, లోకమునకు శిక్షణని చ్చుటకై ప్రాకృతజనుడు వలే పాపమును పోగొట్టుకొనుటకు అట్లు చేసెను.
మహత్యాం తీర్థయాత్రాయాం తత్రాగన్ భారతీః ప్రజాః ।
వృష్ణయశ్చ తథాఽక్రూరవసుదేవాహుకాదయః॥
ఆ గొప్ప తీర్థయాత్రాసందర్భములో భారతదేశములోని ప్రజలు అచటకు వెళ్లిరి. అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్ర సేనుడు మొదలగు యాదవులు కూడ వెళ్లిరి.
యయుర్భారత తత్ క్షేత్రం స్వమఘం క్షయిష్ణవః । గదప్రద్యుమ్నసాంబాద్యాస్సుచంద్రశుకసారణైః ॥
ఆస్తేఽనిరుద్ధో రక్షాయాం కృతవర్మా చ యూథపః ।
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు మొదలగువారు తమ పాపములను పోగొట్టుకొన గోరి ఆ క్షేత్రమునకు వెళ్లిరి. గదుడు మరియు సేనానాయకుడగు కృత వర్మ సుచంద్రశుకసారణులతో గూడి ద్వారకారక్షణకై నిలిచియుండిరి.
తే రథైర్దేవధిష్ట్యా భైర యైశ్చ తరలప్లవైః ॥
గజైన్నదద్భిరభాభైరృభిర్విద్యాధరద్యుభిః ।
వ్యరోచంత మహాతేజాః పథి కాంచనమాలినః ॥
దివ్యప్రగ్వస్త్రసన్నాహాః కలత్రైః ఖేచరా ఇవ ।
వారు దేవతల విమానములను పోలిన రథములపై, కెరటముల వలె సాగిపోయే గుర్రములపై, మేఘముల వలే నినదించే ఏనుగులపై, విద్యాధరులవలె ప్రకాశించే జనులు మోసే పల్లకీల పై భార్యలతో గూడి వెళ్లిరి. గొప్ప తేజశ్శాలురగు ఆ యాదవులు బంగరు మాలలు, ప్రకాశించే పుష్పమాలలు, వస్త్రములు, కవచములు గలవారై మార్గమునందు దేవతలు వలె విశేషముగా ప్రకాశించిరి.
తత్ర స్నాత్వా మహాభాగా ఉపోష్య సుసమాహీతోః ॥
బ్రాహ్మణేభ్యో దదుర్గెనూర్వాసస్స్రగ్రుక్మమాలినీః ।
రామప్రదేషు వీధివత్పునరాప్లుత్య వృష్ణయః ॥
గొప్ప భాగ్యవంతులైన యాదవులు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో ఉపవాసము చేసి యథావిధిగా ఆపరశురామకుండములలో గ్రహణస్నానమును చేసిరి. పొరు పాడియావులను వస్త్రము, పుష్పమాల, బంగరు మాలలతో అలంకరించి బ్రాహ్మణులకు దానము చేసిరి. తరువాత వారు మరల విముక్తిస్నానమును చేసిరి.
దదుస్స్వన్నం ద్విజాగ్రేభ్యః కృష్ణే నో భక్తిరస్త్ర్వీతి ।
స్వయం చ తదనుజ్ఞాతా వృష్ణయః కృష్ణ దేవతాః ॥
యాదవులకు శ్రీకృష్ణుడే దైవము. మాకు శ్రీకృష్ణునియందు భక్తి కలుగుగాక! అని ప్రార్థించి, వారు బ్రాహ్మణశ్రేష్ఠులకు మంచి ఆహారమునిచ్చి, వారి అనుమతితో తాము కూడ భుజించిరి.
భుక్త్వోపవివిశుః కామం స్నిగ్ధచ్చాయాకంఘిపాంఘ్రిషు ।
తత్రాగతాం స్తే దదృశుస్సుహృత్సంబంధినో నృపాన్ ॥
వారు భుజించి దట్టని నీడ గల చెట్ల మొదళ్లయందు కూర్చుండిరి. వార చటకు వచ్చిన తమ బంధువులు, మిత్రులు అయిన రాజులను చూచిరి.
మత్స్యోశీనరకౌసల్యవిదర్భకురుసృంజయాన్ ।
కాంబోజకైకయాన్ మద్రాన్ కుంతీనానర్త కేరలాన్ ॥
వారు మత్స్య-ఉశీనర-కౌసల్య-విదర్బ-కురు-సృంజయ-కాంబోజ కేకయ-మద్ర-కుంతి-ఆనర్త- కేరళ దేశముల రాజులను చూచిరి.
అన్యాం శ్చైవాత్మపక్షీయాన్ పరాంశ్చ శతశో నృప ।
నందాదీన్ సుహృదో గోపాన్ గోపీశ్చోత్కంఠితాశ్చిరమ్ ॥
వారు ఇతరదేశముల రాజులను, తమ పక్షము (పాండవులు) వారిని, పర (దుర్యోధన) పక్షమువారిని వందల సంఖ్యలో చూచిరి. మరియు వారు నందుడు మొదలైన మిత్రులను, గోపాలకులను, చాలకాలమునుండి తహతహతో ఎదురు చూస్తున్న గోపికలను కూడ చూచిరి.
అన్యోన్యసందర్శనహర్షరంహసా
ప్రోత్పుల్లహృద్వ సరోరుహశ్రియః ।
ఆశ్లిష్య గాఢం నయనైస్స్రవజ్జలా
హృష్యత్త్వచో రుద్ధగిరో యయుర్ముదమ్ ॥
ఒకరినొకరు చూచుటచే కలిగిన హర్షముయొక్క వేగముచే వారి హృదయములు, పద్మములవంటి ముఖములు బాగా విప్పారి శోభిల్లెను. వారు పరస్పరము గట్టిగా కౌగిలించుకున్నప్పుడు శరీరము గగుర్పాటును పొంది కన్నులగుండా ఆనందబాష్పములు ప్రవహించేను. ఆనందముతో వారి మాట గద్గదమాయెను.
స్త్రీయశ్చ సంవీక్ష్య మిథోత్సౌహృద -
స్మితామలాపాంగదృశోఽభిరేభిరే ।
స్త నైః స్తనాన్కుంకుమపంకరూషితాన్
నిహత్య దోర్భిః ప్రణయాశ్రులోచనాః ॥
ఒకరినొకరు చూచినప్పుడు అతిశయించిన ప్రేమ వలన పుట్టిన చిరునవ్వు వారి కన్నుల స్వచ్చమగు కటాక్షములకు తోడాయేను. ఆ స్త్రీలు ప్రేమతో నీరు నిండిన కన్నులు గలవారై, కుంకుమ ముద్ద అలదిన స్తనములు నొక్కుకొనునట్లుగా బాహువులతో ఒకరినొకరు కౌగిలించుకొనిరి.
తతోఽభివాద్య తే వృద్దాన్ యవి ఫైరభివాదితాః ।
స్వాగతం కుశలం పృష్ట్వా చక్రుః కృష్ణ కథా మిథః ॥
తరువాత ఆ యాదవులు పెద్దలకు నమస్కరించి పిన్నలచే నమస్కరించబడిరి. వారు పరస్పరము స్వాగతము పలికి, కుశలప్రశ్నలను వేసి, శ్రీకృష్ణుని గాథలను చెప్పుకుంటూ వినుచుండిరి.
పృథా భ్రాతృన్ స్వసౄర్వీక్ష్య తత్పుతాన్ పితరావపి ।
భ్రాతృపత్నీర్ముకుందం చ జహౌ సంకథయా శుచః ॥
కుంతి వసుదేవుడు మొదలగు సోదరులను, శ్రుతదేవి మొదలైన చెల్లెళ్లను, వారి పుత్రులైన, బలరామాదులను, శూరుడు మొదలగు తల్లిదండ్రులను, దేవకి మొదలగు సోదరభార్యలను చూచి వారితో ప్రేమపూర్వకముగా కబుర్లాడి మనస్సులోని క్లేశములను విడిచి పెట్టెను.
కుంత్యువాచ ।
ఆర్యభ్రాతరహం మన్యే ఆత్మానమకృతాశిషమ్ ।
యద్వా ఆపత్సు మద్వా ర్తాం నానుస్మరథ సత్తమాః ॥
కుంతి ఇట్లనెను --- పెద్దన్నా! నేను పుణ్యము చేసినదానను కానని నా తలంపు. ఎందుకంటే, మీరు సత్పురుషులే అయినా, ఆపదలలోనైనా నన్ను స్మరించకుంటిరి.
సుహృదో జ్ఞాతయః పుత్రా భాతరః పితరావపి ।
నానుస్మరంతి స్వజనం యస్య దైవమదక్షిణమ్ ॥
ఎవనికి దైవము ప్రతికూలముగనుండునో, అట్టి తమ వ్యక్తిని మిత్రులు, జ్ఞాతులు, పుత్రులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కూడ మరచెదరు.
వసుదేవ ఉవాచ ।
అంబ మాఽస్మానసూయేథా దైవక్రీడనకాన్నరాన్ ।
ఈశస్య హి వ లోకః కురుతే కార్యవేఽథవా ॥
వసుదేవుడిట్లు పలి కెను -- అమ్మా! మేము దైవము చేతిలో ఆట బొమ్మలైన మానవులము. మమ్ము తప్పు పట్టకుము. మనిషి ఈశ్వరుని వశములోనుండి పని చేయును; లేదా, ఈశ్వరునిచేతనే చేయించబడును.
కంసప్రతాపితాస్సర్వే వయం యాతా దిశం దిశమ్ ।
ఏతర్హ్యేవ పునః స్థానం దైవేనాసాదితాస్స్వసః ॥
ఓ చెల్లీ! కంసునిచే పీడించబడిన మేము పలు దిక్కులకు పారిపోతిమి. ఇప్పుడిప్పుడే దైవము మమ్ము మరల స్వస్థానమునకు తెచ్చినాడు.
శ్రీశుక ఉవాచ ।
వసుదేవోగ్ర సేనాద్యైర్యదుభిస్తేుఽర్చితా నృపాః ।
ఆసన్నచ్యుతసందర్శపరమానందనిర్వృతాః ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను -- వసుదేవుడు, ఉగ్రసేనుడు, అక్రూరుడు మొదలగువారు అచటకు వచ్చిన రాజులను సత్కరించిరి. ఆ రాజులు శ్రీకృష్ణ భగవానుని దర్శనము వలన మహానందమును పొంది సంతోషముగా నుండిరి.
భీష్మో ద్రోణోకంబికాపుత్రో గాంధారీ ససుతా తథా ।
సదారాః పాండవాః కుంతీ సృంజయో విదురః కృపః ॥
కుంతిభోజో విరాటశ్చ భీష్మకో నగ్నజిన్మహాన్ ।
పురుజిద్ద్రుపదశ్శల్యో ధృష్ట కేతుస్సకాశిరాట్ ॥
దమ ఘోషో విశాలాక్షో మైథిలో మద్ర కేకయౌ ।
యుధామన్యుస్సుశర్మా చ ససుతా బాహ్లికాదయః ॥
రాజానో యే చ రాజేంద్ర యుధిష్ఠిరమనువ్రతాః ।
శ్రీనికేతం వపుశ్శారేస్సస్త్రీకం వీక్ష్య విస్మితాః ॥
ఓ పరీక్షిన్మహారాజా! భీష్ముడు, ద్రోణుడు, అంబికాపుత్రుడగు ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులతో కూడిన గాంధారి, భార్యలతో కూడిన పాండవులు, కుంతి, సృంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, గొప్పవాడగు నగ్నజిత్తు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, ధృష్టి కేతువు, కాశీరాజు, దమ ఘోషుడు, విశాలాక్షుడు, మీథిలామద్ర కేకయరాజులు, యుధామన్యువు, సుశర్మ, కొడుకులతో కూడిన బాహ్లికుడు, ఇతరరాజులు, ధర్మరాజు అనుయాయులగు రాజులు అందాల రాశియగు శ్రీకృష్ణుని రూపమును, ఆయన భార్యలను చూచి ఆశ్చర్యచకితులైరి.
అథ తే రామకృష్ణాభ్యాం సమ్యక్ ప్రాప్తసమరణాః ।
ప్రశశంసుర్ముదా యుక్తా వృష్ణీన్ కృష్ణ పరిగ్రహాన్ ॥
తరువాత బలరామ శ్రీకృష్ణులచే ఆ రాజులు సత్కరించబడిరి. వారానందముతో, శ్రీకృష్ణునకు తనవారైన యాదవులను కొనియాడిరి.
అహో భోజపతే యూయం జన్మభాజో నృణామిహ ।
యత్పశ్యథాసకృత్కృష్ణం దుర్దర్శమపి యోగినామ్ ॥
ఆహా! భోజప్రభుడవగు ఓ ఉగ్రసేనా! ఈ లోకమునందు మానవులలో మీరే సఫలమైన జన్మ గలవారు. ఏలయన, యోగులకైననూ దర్శింప శక్యము కాని శ్రీకృష్ణుని మీరు సర్వదా చూచెదరు.
యద్విశ్రుతిశ్శ్రుతినుతేదమలం పునాతీ
పాదావనేజనపయశ్చ వచశ్చ శాస్త్రమ్ ।
భూః కాలభర్జితభగాకపి యదంఘ్రిపద్మ -
స్పర్శేత్థశక్తిరభివర్షతి నోఽఖిలార్థాన్ ॥
వేదములచే కొనియాడబడిన శ్రీకృష్ణ భగవానుని కీర్తి, ఆయన పాదములను కడిగిన నీరు గంగ, ఆయన .వాక్కు అయిన వేదము కూడ ఈ జగత్తును మిక్కిలి పవిత్రము చేయుచున్నవి. భూమి యొక్క శక్తిని కలికాలము నశింపజేసినా, ఆయన పద్మములవంటి పొదముల స్పర్శచే శక్తి ఆవిర్భవించిన భూమి మనకు సకలపురుషార్థములను వర్షించుచున్నది.
తద్దర్శనస్పర్శనానుపథప్రజల్ప-
శయ్యాఽఽసనాశనసమౌనసపిండబంధః ।
యేషాం గృహే నిరయవర్త్మని వర్తతాం వః
స్వర్గాపవర్గవిరమస్స్వయమాస విష్ణుః ॥
నిమీరు ప్రవృత్తిమార్గమునందున్నా శ్రీకృష్ణ భగవానుని చూచి స్పృశించెదరు;, ఆయనతో కబుర్లాడుతూ కలిసి నడిచెదరు; ఆయనతో కలిసి తిని కూర్చుండి నిద్రించెదరు; మీకు ఆయనతో వివాహబంధముతో కూడిన దైహికసంబంధము గలదు. స్వర్గమోక్షముల అన్వేషణను విరమింపజేసే ఆయన స్వయముగా మీ ఇంటిలో ఉన్నాడు.
శ్రీశుక ఉవాచ ।
నందస్తత్ర యదూన్ ప్రాప్తాన్ జ్ఞాత్వా కృష్ణ పురోగమాన్ ।
తత్రాగమద్వృతో గో పైరనఃస్థాఛైర్దిదృక్షయా ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవులు ఆ సమంతపంచకమునకు వచ్చిరని తెలిసి నందుడు వారిని చూడగోరెను. గోపాలకులు బళ్లపై సామగ్రిని సర్దుకొని బయలుదేరిరి. ఆయన వారితో గూడి అచటకు విచ్చేసేను.
తం దృష్ట్వా వృష్ణయో హృష్టాస్తన్వః ప్రాణమివోత్థితాః ।
పరిషస్వజిరే గాడం చిరదర్శనకాతరాః ॥
ముఖ్యప్రాణము రాగానే అవయవముల చేష్టలు ఆరంభమగును. అదే విధముగా, ఆ నందుని చూచి యాదవులు హర్షముతో లేచి నిలబడిరి. చాల కాలము తరువాత చూచుటచే వ్యాకులమైన చిత్తము గల యాదవులాయనను గట్టిగా కౌగిలించుకొనిరి.
వసుదేవః పరిష్వజ్య సంప్రీతః ప్రేమవిహ్వలః ।
స్మరన్ కంసకృతాన్ క్లేశాన్ పుత్రన్యాసం చ గోకులే ॥
వసుదేవుడు చాల ప్రీతి జెంది ప్రేమకు పరవశుడై నందుని కౌగిలించుకొనెను. ఆయన కంసుడు పెట్టిన బాధలను, శ్రీకృష్ణుని నందగోకులములో దాచి పెట్టుటను కూడ గుర్తు చేసుకొనెను.
కృష్ణరామౌ పరిష్వజ్య పితరావభివాద్య చ ।
న కించనోచతుః ప్రేమ్ణా సాశ్రుకంఠౌ కురూద్వహ ॥
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! బలరామ శ్రీకృష్ణులు తల్లిదండ్రులను నమస్కరించి కౌగిలించుకొనిరి. ప్రేమ వారి కళ్లు నీటితో నిండి కంఠము గద్గదమగుటచే ఏమీ మాటలాడ లేకపోయిరి.
తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిరభ్య చ ।
యశోదా చ మహాభాగా సుతో విజహతుశ్శుచః ॥
గొప్ప పుణ్యాత్మురాలగు యశోద మరియు నందుడు ఆ కొడుకులిద్దరిని తమ ఒడిలో కూర్చుండబెట్టుకొని, చేతులతో కౌగిలించుకొని దుఃఖములను (కన్నీళ్లను) విడిచి పెట్టిరి.
రోహిణీ దేవకీ చాథ పరిష్వజ్య ప్రజేశ్వరీమ్ ।
స్మరంత్యా తత్కృతాం మైత్రీం బాష్పకంక్యౌ సమూచతుః ॥
రోహిణి మరియు దేవకి గోకులరాణియగు యశోదను కౌగిలించుకొనిరి. యశోద చూపిన మైత్రీ (పుత్రుని రక్షించుట) గుర్తుకు వచ్చి, వారిద్దరి కళ్లలో నీరు ఉబికి కంఠములు రుద్దములాయెను. వారామెతోనిట్లనిరి.
కా విస్మరేత వాం మైత్రీమనివృత్తాం వ్రజేశ్వరి ।
అవాస్యా ప్ర్యేంద్రమైశ్వర్యం యస్యా నేహ ప్రతిక్రియా ॥
ఓ గోకులరాణీ! ఇందైశ్వర్యము లభించినా మీ ఇద్దరి (యశోదానందుల) ప్రేమను ఎవతే మరువగలదు? మీ ప్రేమకు ప్రతిగా చేయదగ్గది ఈ లోకములో లేదు. మీ ఋణమును తీర్చుట శక్యము కాదు.
ఏతావదృష్ట పితరౌ యువయోస్స్మ పిత్రోః
సంప్రీణనాభ్యుదయపోషణపాలనాని ।
ప్రాప్యోష తుర్బవతి పక్ష్మ హ యద్వదక్ష్ణో
న్యస్తావకుత్ర చ భయౌ న సతాం పరస్స్వః ॥
ఓ పూజనీయురాలా! ఈ బలరామ శ్రీకృష్ణులు కన్న తల్లిదండ్రులనెరుగరు. వారికి మీరే తల్లిదండ్రులు. వారిని మీకు అప్పజెప్పగా మీరే వారిని కంటికి రెప్పలా పోషించి పాలించి ప్రేమను జూపి అభివృద్ధిని కలిగించితిరి. వారు మీ వద్ద ఎట్టి భయమైనా లేకుండా నివసించిరి. సత్పురుషులకు స్వపరభేదము ఉండదు.
శ్రీశుక ఉవాచ ।
గోప్యశ్చ కృష్ణముపలభ్య చిరాదభీష్టం
యత్ప్రేక్షణే దృశిషు పక్ష్మకృతం శపంతి ।
దృగ్భిృర్హృదీకృతమలం పరిరభ్య సర్వాః
తద్భావమాపురపి నిత్యయుజాం దురాపమ్ ॥
గోపికలందరు కూడ చాలకాలము తరువాత ప్రియతముడగు శ్రీకృష్ణుని చూచిరి. ఆయనను చూచునప్పుడు కంటికి రెప్పపాటును పెట్టిన బ్రహ్మదేవుని వారు తిట్టుచుందురు. వారాయనను చూపులతో హృదయములో ప్రతిష్టించి గట్టిగా కౌగిలించుకొని ఆయనతో ఐక్యమును పొందిరి. అది సర్వదా యోగనిష్ఠ గలవారికైననూ పొంద శక్యము కాదు.
భగవాంస్తాస్తథాభూతా వివిక్త ఉపసంగతః ।
ఆశ్లిష్యానామయం పృష్ట్వా ప్రహసన్నిదమబ్రవీత్ ॥
అట్టి భావైక్యమును పొందియున్న ఆ గోపికలను శ్రీకృష్ణ భగవానుడు ఏకాంతములో కలిసి కౌగిలించి కుశలప్రశ్నలను వేసి నవ్వుతూ ఇట్లనెను.
అపి స్మరథ నస్సఖ్యస్స్వానామర్థచికీర్షయా ।
గతాంశ్చిరాయితాశ్చాత్రుపక్షక్షపణచేతసః ॥
ఓ చెలికత్తెలారా! శత్రుపక్షీయులను నశింపజేసి నా వారలకు ప్రయోజనములను చేకూర్చుటపై నా మనస్సు లగ్నమయ్యెను. అందుకొరకై వెళ్లిన నేను విలంబమే చేసితిని. నేను మీకు గుర్తు ఉన్నానా?
అవ్యవధ్యాయథాస్మాన్ స్విచకృతజ్ఞావిశంకయా ।
నూనం భూతాని భగవాన్ యున వియునక్తి చ ॥
నేను కృతజ్ఞుడను కాననే చిన్న శంకతో మీరు నా గురించి చెడుగా తలపోయుట లేదు గదా? భగవంతుడు నిశ్చయముగా ప్రాణులను కలిపి విడదీయుచుండును.
వాయుర్యథా ఘనానీకం తృణం తూలం రజాంసి చ ।
సంయోజ్యాక్షిపతే భూయస్తథా భూతాని భూతకృత్ ॥
గాలి మేఘముల గుంపును, గడ్డిని, దూదిని, ధూళిని కలిపి మరల అంతటా చెల్లాచెదరు చేయును. అదే విధముగా, సృష్టికర్త (కాలము) ప్రాణులను కలిపి విడదీయును.
మయి భక్తిర్హి భూతానామమృతత్వాయ కల్పతే ।
దిష్ట్యా యదాసీన్మత్స్నేహో భవతీనాం మదాపనః ॥
నాయందలి భక్తి ప్రాణులకు మోక్షమునీయ సమర్థమగుచున్నది. ఇది నిశ్చయము. నన్ను పొందునట్లు చేసే నాయందలి భక్తి పూజనీయలగు మీకు కలుగుట అనేది మంగళము.
అహం హీ సర్వభూతానామాదిరంతోనంతరం బహిః ।
భౌతికాసాం యథా ఖం వార్భూర్వాయుర్ద్యోతిరంగనాః ॥
యువతులారా! ఎందుకంటే, జగత్తులో సకలపదార్థములు పృథివి జలము-అగ్ని-వాయువు-ఆకాశములనే పంచభూతములనుండి పుట్టి వాటి లోనే విలీనమగును. అదే విధముగా, సకలప్రాణులు నానుండి పుట్టి నాలో విలీనమగును. ప్రాణుల లోపల (అంతర్యామి), బయట (కాలము) నేనే.
ఏవం హ్యేతాని భూతాని భూతేష్వాత్మాఽఽత్మనా తతః ।
ఉభయం మయ్యథ పరే పశ్యతాభాతమక్షరే ॥
ఈ విధముగా జగత్తులోని భౌతికపదార్థములు, ప్రాణుల దేహములు పంచభూతములయందు ప్రతిష్ఠ గలవి. పరమాత్మ వాటియందు భోక్తయగు జీవుడు రూపముగా వ్యాపించియున్నాడు. పాంచభౌతికదేహము, భోక్తయగు జీవుడు అనే రెండు వాటికి అతీతమైన అవినాశియగు నాయందు ప్రకాశించుచున్నవని తెలియుడు.
శ్రీశుక ఉవాచ ।
అధ్యాత్మశిక్షయా గోప్య ఏవం కృష్ణేన శిక్షితాః ।
తదనుస్మరణధ్వస్తజీవకోశాస్త్రమధ్యగన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శ్రీకృష్ణుడు గోపికలకు ఆత్మతత్త్వమునుపదేశించి వివేకవతులుగా చేసెను. వారాయననే నీరంతరముగా స్మరించుటచే వారిలోని పరిచ్చీన్నభావము నశించి, వారాయనను ఆత్మరూపముగా పొందిరి (జీవన్ముక్తులైరి).
ఆహుశ్చ తే నలిననాభ పదారవిందం
యోగేశ్వ రైర్హృది విచింత్యమగాధబోధైః ।
సంసారకూపపతితోత్తరణావలంబం
గేహంజుషామపి మనస్యుదయాత్సదా నః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధే ద్వ్యశీతితమోఽధ్యాయః ॥
ఆ గోపికలైతే ఇట్లు పలికిరి -- ఓ పద్మనాభా! లోతైన జ్ఞానము గల సనకాది యోగీశ్వరులు కూడ నీ పాదపద్మమును హృదయములో ధ్యానించెదరు. సంసారమనే నూతిలో పడినవారలకు నీ పాదము పైకి వచ్చే ఆలంబనమగుచున్నది. అట్టి నీ పాదము ఇంటి పనులలో ఉన్నా మాకు మనస్సులో ఎల్లవేళలా ప్రకాశించు గాక!
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో బలరామ శ్రీకృష్ణులను గోపాలకులు గోపికలు కలుసుకొనుటను వర్ణించే ఎనుబది రెండవ అధ్యాయము ముగిసినది (82).
Summary of chapter 82 of the Bhāgavata Mahā Purana is as follows:
During a total solar eclipse, people from all over India gathered at the holy pilgrimage site of Samanta-pañcaka in Kurukshetra. Śrī Kṛshṇa, Balarāma, the Vṛshṇi dynasty, King Yudhishṭhira, the Pandavas, and great rishis assembled there. The residents of Vṛndāvana—including Nanda Mahārāja, Yaśodā-devī, and the gopīs—also traveled to Kurukshetra to see Kṛshṇa after long years of separation. The reunion was charged with emotional tears and love. Śrī Kṛshṇa met His foster parents, embracing Nanda and Yaśodā with deep filial affection.