భాగవత మహా పురాణము
10 - శ్రీకృష్ణుడు అర్జున వృక్షముల జంటను పడగొట్టి గంధర్వులకు శాపవిముక్తిని కలిగించుట
రాజోవాచ ।
కథ్యతాం భగవన్నేతత్తయోశ్శాపద్య కారణమ్ ।
యత్తద్విగర్తితం కర్మ యేవ వా దేవర్షేస్తమః ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను - ఓ పూజవీయా! వీరిద్దరి శాపమునకు గల కారణమును చెప్పుడు. దేవర్షియగు వారదువకు కోపము వచ్చేటంతటి అధికముగా అందించబడే ఏ పనిని వారు చేసిరి?
శ్రీశుక ఉవాచ ।
రుద్రస్యానుచరౌ భూత్వా పుదృపా ధనదాత్మటౌ ।
కైలాసోపవవే రమ్యే మందాకివ్యాం మదోత్కటౌ ॥
వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ ।
స్త్రీజనైరనుగాయద్భిశ్చరతుః పుష్పితే వవే ॥
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- కుబేరుని పుత్రులిద్దరు రుద్రుని అనుచరులైరి. దానితో వారు మిక్కిలి గర్వించి అతిశయమగు హర్షము గలవారై సుందరమగు కైలాసపర్వతమునందలి ఉద్యానవనమునందు పాటలు పాడుచున్న యువతులతో గూడి విహరించిరి. వారచట మందాకినీ నదీ వద్ద పువ్వులతో నిండిన ఉద్యానమునందు అన్నరసముతో చేసిన మద్యమును త్రావిరి. వారి కన్నులు మత్తుతో తిరుగాడుచుండెను.
అంతః ప్రవిశ్య గంగాయామంభోజవనరాజిని ।
చిక్రీడతుర్యువతిభిర్గజావివ కరేణుభిః ॥
వారిద్దరు పద్మముల గుంపులతో ప్రకాశించే గంగ లోపల యువతులతో బాటు ప్రవేశించి, ఏనుగుల జంట ఆడు యేనుగులతో క్రీడించునట్లుగా, క్రీడించిరి.
యదృచ్చయా చ దేవర్షిర్బగవాంస్తత్ర కౌరవ ।
అపశ్యన్నారదో దేవో క్షీబాణౌ సమబుధ్యత ॥
కురవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) పూజనీయుడగు దేవర్షి నారదుడు అక్కడకు వచ్చి వారిద్దరిని చూచి, వారు మత్తులో ఉన్నారని గమనించెను.
తం దృష్ట్వా వీడితా దేవ్యో వివస్తాశ్శావశంకితాః ।
వాసాంసి పర్యధుశ్శీఘం వివస్త్రా నైవ గుహ్యకౌ ॥
ఆయనను చూచి వస్త్రములు లేని ఆ అప్సరసలు సిగ్గు పడిరి. ఆయన శపించునేమోననే శంక గలవారై వారు వెంటనే వస్త్రములను ధరించిరి. కాని, వస్త్రములు లేని ఆ యక్షులిద్దరు వస్త్రములను ధరించనే లేదు.
తౌ దృష్ట్వా మదిరామతౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ ।
తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ ॥
ఆ ఇద్దరు యక్షకుమారులు ధనగర్వముతో గ్రుడ్డివారై మద్యముతో మత్తెక్కి ఉండిరి. వారిని అనుగ్రహించాలనే ఉద్దేశ్యముతో నారదుడు వారికి, శాపమునీయబోతూ ఇట్లనెను.
నారద ఉవాచ ।
వ హ్యవ్యో జుషతో జోష్యావ్ బుద్దిభ్రంశో రజోగుణః ।
శ్రీమదాదాభిజాత్యాదిర్యత్ర స్త్రీ ద్యూతమాపవః ॥
నారద మహర్షి ఇట్లు పలికెన - ఇంద్రియభోగములమ పేవించువావి బుద్దిని భ్రష్టు పట్టించేది ధనగర్వము మాత్రమే మంచి వంశములో పుట్టేవనే గర్వము గాని, విద్యాగర్వము మొదలైనవి గానీ, లేదా రజోగుణకార్యములైన కామవలు మొదలైనవి గాని, ధవగర్వము చే పేటంతటి హాని చేయలేవు. యువతి, జూదము, మద్యములు ఆ ధనగర్వములో భాగములై యుండుము.
హన్యంతే పశవో యత్ర వీర్ధయైజితాత్మభిః ।
మద్యమావైరిమం దేహమజరామృత్యు సశ్వరమ్ ॥
ధనగర్వము గలవారికి దయ ఉండదు. వారి దేహేంద్రియాదులు వారి వశములో నుండవు. వంచే స్వభావము గల ఈ దేహము ముసలిదనము గావి, మరణము గాని లేనిదని వారు భావించెదరు. అట్టివారు తినుటకై పశువులను చంపెదరు.
దేవపంజ్ఞితమవ్యంతే కృమివిర్బస్మసంజ్ఞితమ్ ।
భూతధ్రుక్తత్కృతే స్వార్ధం కి వేద విరయో యతః ॥
వరదేవుడు (రాజు), భూదేవుడు (బ్రాహ్మణుడు) అని పిలువబడే ఈ దేహమే మరణించిన పిదప (పాతిపెట్టినచో క్రిముల రూపముమ, (వదిలిపెట్టి వశుపక్ష్యాదులు భక్షించిన వివరించబడే పదార్దముయొక్క రూపమును (తగులబెట్టినచో బూడిద రూపముమ పొందుము. దీని కొరకై ప్రాణులకు ద్రోహమున చేయువాడు తనకు ఏది హిత తెలిసినవాడేవా? కాదు. ఎందుకంటే ప్రాణులమ హింసించుట వలన లభించేది వరకము.
దేహ కిమవ్నదాతువ్వం విషేక్తుర్మాతురేవ చ।
మాతు పితుర్వా బలివః క్రేతురగ్నేశ్శవోఽపి వా ॥
దేహము అన్నము పెట్టేవావి పొత్తా? లేక తండ్రిదా? లేక తల్లిదా? లేక తాతదా? లేక (సమ్న వసూలు చేస్తే) బలశాలియగు రాజుదా? లేక జీతభత్యమురివిచ్చువాడిదా? లేక (మరణించిన పిదప కాల్చే ఆగ్నిదా? (కాల్చకపోతేతివే) కుక్కదా?
ఏవం సాధారణం దేహమవ్య క్తప్రభవావ్యయమ్ ।
కో విద్యావాత్మపాత్కృత్వా హంతి జంతూవృతేఽవతః ॥
ప్రకృతినుండి పుట్టి ప్రకృతిలో కలిసిపోయే ఈ దేహము ఈ విధముగా ఇంతమందికి చేందియున్నది. మూర్ఖుడు తప్ప వివేకి ఎవడు దీనియందు నేను అనే అభిమానము గలవాడై దీని కొరకై జంతువులను చంపును? (చంపడు).
అసతశీమదాంధస్య దారిద్య్రః పరమంజనమ్ ।
ఆత్మాపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే ॥
ధనగర్వముతో గ్రుడ్డిదైన దుష్ణునకు పేదరికము గొప్ప అంజనము (చూపునిచ్చే మందు). పేదవాడు మాత్రమే ప్రాణులను తనతో సమానముగా చూచును.
యథా కంటకవిద్దాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథామ్ ।
జీవసామ్యం గతో లింగైర్న తథాఽవిద్ధకంటకః ॥
ముల్లు గ్రుచుకున్నవానికి నొప్పి గురించి, దాని వలన దేహములో కలిగే వికారములను గురించి తెలియును. అట్టివాడు ప్రాణులతో సమభావమును పొంది, తనకు కలిగిన నొప్పి ఇతరప్రాణులకు కలుగరాదని కోరుకొనును. కాని, ఏనాడూ ముల్లు గ్రుచ్చుకోనివాడు ఆ విధముగా ఇతరప్రాణుల గురించి తలపోయడు.
దరిద్రో నిరహంస్తంభో ముక్తస్పర్వమదైరిహ ।
కృచ్ఛ్రం యదృచ్ఛయాఽఽప్నోతి తద్ధి తస్య పరం తపః ॥
ఈ లోకములో బీదవానియందు అహంకారము, గర్వము ఉండవు. అన్ని రకముల గర్వములు ఆతనినుండి దూరమగును. ఆతనికి అనుకోకుండా.(ఈశ్వరేచ్చచే) కష్టము వచ్చును. అది వానికి గొప్ప తపస్సు అగుట నిశ్చితము.
నిత్యం క్షుత్ క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః ।
ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాఽపి వినివర్తతే ॥
ప్రతిదినము. ఆకలితో కృశించిన దేహము గలవాడై ఆహారమును కోరే బీదవానికి దేహాన్ని బట్టి ఇంద్రియములు కూడ దుర్బలములగును. అట్టివాడు హింసను చేయడు.
దరిద్రస్త్యేవ యుజ్యంతే సాధవస్సమదర్శినః ।
సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాద్విశుద్ధ్యతి ॥
పాధువులు అందరినీ సమముగా చూచెదరు. ఐనమా, వారితో సమాగమము బీదవారికి మాత్రమే కలుగుమ. వజ్రమలతోడి సమాగమము వలన ఆతడు అన్నాదులయందలి తృష్ణమ విడవాడుమ. దాని వలన వాచి అంతఃకరణము శీఘ్రమే విశేషముగా శుద్ధమగుమ.
సాధూనాం సమచిత్తానాం ముకుందచరణైషిణామ్ ।
ఉపేక్ష్యైః కిం ధవప్తంభైరవద్భిరవదాశ్రయైః ॥
సజ్జనులు చిత్తములో సమత్వము కలిగి మోక్ష ప్రదాతయగు శ్రీహరి పాదములమ శరణు వేడెదరు. వారికి ధనగర్వముతో దుష్టభోగములమ పేవించే దుష్టులలో పని యేమి? వారిని ఉపేక్షించుటయే మేలు.
తదహం మత్తయోర్మాధ్వ్యా వారుణ్యా శ్రీమదాంధయోః ।
తమోమదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మవోః ॥
కావున, నేను వీరిద్దరికి అజ్ఞానము వలన కలిగిన గర్వమును పోగొట్టెదను. దేహేంద్రియములకు వశులైయున్న వీరిద్దరు అన్నరసమునుండి తయారు చేసిన మద్యముతో మత్తెక్కి ఉన్నారు. స్త్రీలంపటులగు వీరు ధనగర్వముతో వివేకజ్ఞానమును కోల్పోయినారు.
యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ ।
న వివాససమాత్మానం విజానీతస్సుదుర్మదౌ ॥
అతోఽర్హతః స్థావరతాం స్యాతాం నైవం యథా పునః ।
స్మృతిస్పాన్మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్ ॥
వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్చతే ।
వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధభక్తీ భవిష్యతః ॥
వీరిద్దరు లోకపాలకుడగు కుబేరుని పుత్రులై కూడ అజ్ఞానముతో నిండి ఉన్నారు. వీరియందున్న గర్వము మిక్కిలి చెడ్డది. వీరికి తమ ఒంటిపై బట్టలు లేవనే సంగతి కూడ తెలియకున్నది. కావున, వీరికి చెట్లు జన్మ తగినది. నా అనుగ్రహముచే వీరు మరల ఇట్లు (గర్విష్ణులు) కాకుందురు. పైగా, వీరికి పూర్వస్మృతి ఉండును. ఆ జన్మలో కూడ నా అనుగ్రహము వలన వీరికి వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణుని సన్నిధి దొరుకును. వంద దివ్యసంవత్సరములు గడచిన పిదప వీరు మరల దేవత్వమును పొందెదరు. వీరికి భక్తి కూడ కలుగును.
శ్రీశుక ఉవాచ ।
ఏవముక్త్వా స దేవర్షిర్గతో నారాయణాశ్రమమ్ ।
నలకూబరమణిగ్రీవావాసతుర్యమలార్జునౌ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఇట్లు పలికి దేవర్షి నారదుడు నారా యణాశ్రమమునకు వెళ్లాను. నలకూబర మణిగ్రీవులు జంట మద్ది చెట్లు ఐరి.
ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః ।
జగామ శన కైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ ॥
నారదుడు భగవంతుని భక్తులలో అగ్రేసరుడు. ఆయన మాటను సత్యము చేయుటకై శ్రీహరి మెల్లగా ఎక్కడనైతే జంట మద్ది చెట్లు గలవో, అచటకు వెళ్లాను.
దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ ।
తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా ॥
నాకు దేవర్షి నారదుడు మిక్కిలి ప్రియమైనవాడు. కావున, ఆయన ఈ కుబేరపుత్రులనిద్దరిని గురించి ఏమి చెప్పెనో, దానిని నేను అటులనే చేసెదను (అని భగవానుడు తలచెను).
ఇత్యంతరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయౌ।
ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగతములూఖలమ్ ॥
ఇట్లు తలపోసి శ్రీకృష్ణుడైతే కలిసి పుట్టిన మద్ది చెట్ల మధ్యలోకి వెళ్లాను. ఆయన అట్లు ప్రవేశించినంత మాత్రాన రోలు అడ్డు పడినది.
బాలేన నిష్కర్షయతాఽన్వగులూఖలం తత్
దామోద రేణ తరసోత్కలితాంఘ్రిబంధౌ ।
నిష్పేతతుః పరమవిక్రమితాతివేప-
స్కంధప్రవాలవిటపా కృతచండశబ్దౌ ॥
బాలకృష్ణుడు ఉదరము చుట్టూ ఉన్న త్రాటితో తన వెనుకనే వచ్చుచున్న ఆ రోలును వేగముగా లాగగా, ఆ రెండు చెట్లు వ్రేళ్ల బంధముతో సహా పెకిలించబడినవై (పెద్ద) భయమును గొల్పే చప్పుడు చేస్తూ మొదలంటా నేల గూలినవి. పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని విక్రమ ముచే వాటి కాండము, కొమ్మలు, ఆకులు కూడ అధికముగా అల్లల్లాడినవి.
తత్ర శ్రియా పరమయా కకుభస్స్పురంతౌ ।
సిద్దావు పేత్య కుజయోరీవ జాతవేదాః ।
కృష్ణం ప్రణమ్య శిరసాఽఖిలలోకనాథం
బద్ధాంజలీ విరజసావిదమూచతుస్స్మ ॥
అప్పుడు ఆ రెండు చెట్లయందు ఆగ్ని వలె గొప్ప కాంతితో దిక్కులను ప్రకాశింపజేసే ఇద్దరు సిద్ధపురుషులు ప్రకటమైరి. వారు రజోగుణము (గర్వము) తొలగిన యక్షకుమారులే. వారు సకలలోకప్రభుడగు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి తల వంచి నమస్కరించి దోసిలి యొగ్గి ఇట్లు పలికిరి.
కృష్ణ కృష్ణ మహాయోగింస్త్వమాద్యః పురుషః పరః ।
వ్య క్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః ॥
ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు మహాయోగివి. నీవు సర్వకారణమగు పురుషోత్తముడవు. స్థూలము (పృథివ్యాదులు) మరియు సూక్ష్మము (గంధాదులు) అగు ఈ జగత్తు నీ రూపమేనని వేదవేత్తలు తెలియుదురు.
త్వమేకస్సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః ।
త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః ॥
సకలప్రాణుల దేహము-ఇంద్రియములు-అంతఃకరణము-ప్రాణములకు ప్రభుడవు నీవే. సర్వమును శాసించే కాలము నీవే. వినాశము లేని శ్రీహరి భగవానుడవు నీవే.
త్వం మహాన్ ప్రకృతిస్సూక్ష్మా రజస్సత్త్వతమోమయీ ।
త్వమేవ పురుషోఽధ్యక్షస్సర్వ క్షేత్రవికారవిత్ ॥
సత్త్వరజస్తమోగుణాత్మకము, సూక్ష్మము అగు. ప్రకృతి నీవు. ఆ ప్రకృతినుండి ఆవిర్భవించిన మహత్తత్త్వము నీవే. ఆ ప్రకృతికి అధిష్టానమైన పూర్ణసాక్షి చైతన్యము నీవే. సకల క్షేత్రములయందలి
గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః ।
కో న్విపర్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః ॥
ప్రకృతియొక్క గుణముల కార్యములైన బుద్ధి మొదలగు వికారములు దృశ్యములు. వాటికి నీవు గోచరుడవు కావు. ఈ సంసారమునందు గుణకార్యములగు దేహాదులయందు ఆత్మభావముచే కప్పివేయబడిన వివేకము గల ఏ జీవుడు అనాది స్వయంసిద్దుడవగు నిన్ను తెలియగల్గును? (ఎవ్వడైననూ తెలియలేడు),
తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ।
ఆత్మద్యోతగుణైశ్ఛన్నమహిమ్నే బ్రహ్మణే నమః ॥
వసుదేవ పుత్రుడవగు నీవే సృష్టికర్తవగు భగవానుడవు. నీ వలన ప్రకాశించే సత్త్వాది గుణములు నీ యథార్థస్వరూపమును కప్పివేయును. అట్టి పరబ్రహ్మవగు నీ కొరకు నమస్కారము.
యస్యావతారా జ్ఞాయంతే శరీ రేష్వశరీరిణః ।
తై స్తైరతుల్యాతిశయైర్వీర్యైర్దేహిష్వసంగతైః ॥
నీవు చూపే ఆయా పరాక్రమములతో సమానమైనది గాని, అంతకంటే గొప్పది గాని లేదు. అట్టి పరాక్రమములు సామాన్యప్రాణులయందు సంభవము కావు. కానైతే, నీవు శరీరము లేనివాడవు. ఏ శరీరములయందైతే అట్టి పరాక్రమములు ప్రకటమగునో, అవి నీ అవతారములని తెలియవచ్చును.
స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ ।
అవతీర్ణోంఽశభాగేన సాంప్రతం పతిరాశిషామ్ ॥
పురుషార్థములకు ప్రభుడవగు అట్టి నీవు ఇప్పుడు సకలప్రాణుల అభ్యుదయము కొరకు, మోక్షము కొరకు కూడ అవతరించినావు. ఇది అంశముల ప్రాదుర్భావము గల నీ పూర్ణరూపము.
నమః పరమకల్యాణ నమః పరమమంగల ।
వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః ॥
ఓ శ్రీకృష్ణా! సర్వోత్తమమైన కల్యాణసాధనములు, సర్వోత్తమమైన కల్యాణమగు మోక్షము కూడ నీ రూపములే. వసుదేవపుత్రుడవగు నీవు శాంతుడవు. యాదవుల ప్రభువగు నీకు అనేక నమస్కారములు.
అనుజానీహి నౌ భూమంస్తవానుచరకింకరౌ।
దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్ ॥
ఓ అనంతా! మేమిద్దరము నీ అనుచరుడగు నారదుని కింకరులము. మాకు అనుమతినిమ్ము. భగవానుడవగు నీ దర్శనము మాకు నారదమహర్షి అనుగ్రహము వలన కలిగినది.
వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం
హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః ।
స్మృత్యాం శిరస్తవ నివాసజగత్ప్రణామే
దృష్టిస్సతాం దర్శనేఽస్తు భవత్తనూనామ్ ॥
మా వాగింద్రియము నీ గుణములను వర్ణించుటయందు, చెవులు గాథను వినుటయందు, చేతులు పూజాది కర్మలయందు, మనస్సు నీ పాదములను స్మరించుటయందు, శిరస్సు నీ నివాసస్థానమైన జగత్తునకు ప్రణమిల్లుటయందు, చూపు నీ రూపములే ఐన సత్పురుషులను దర్శించుటయందు సార్థకమగుగాక!
శ్రీశుక ఉవాచ ।
ఇత్థం సంకీర్తిస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వరః ।
దామ్నా చోలూఖలే బద్ధః ప్రహసన్నాహ గుహ్యకౌ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికేను --- ఆ ఇద్దరు యక్షులు గోకులప్రభుడగు శ్రీకృష్ణభగవానుని ఈ విధముగా చక్కగా కీర్తించిరి. ఆయన ఇంకనూ త్రాటితో రోటికి కట్టబడియుండెను. ఆయన నవ్వుతూ వారిద్దరితో నిట్లనెను.
శ్రీభగవానువాచ ।
జ్ఞాతం మమ పురై వైతదృషీణా కరుణాత్మనా ।
యచ్చ్రీమదాంధయోర్వాగ్భిర్విభ్రంశోఽనుగ్రహః కృతః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- మీరిద్దరు ధనగర్వముతో వివేకమును కోల్పోయినప్పుడు దయాహృదయుడగు నారదమహర్షి తన వాక్కులతో మీ ఇద్దరిని దేవత్వమునుండి కూలద్రోసి అనుగ్రహమునే చేసినాడు. ఈ విషయము నాకు ముందే తెలియును.
సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనామ్ ।
దర్శనాన్నో భవేద్బంధః పుంసోఽక్ష్ణోస్సవితుర్యథా ॥
సూర్యప్రకాశము రాగానే కళ్లకు చీకట్లు దూరమగును. అదే విధముగా ద్వంద్వములను సమత్వదృష్టితో స్వీకరించే సత్పురుషులను దర్శించుట వలన మానవునకు సంసారబంధము దూరమగును. సత్పురుషుల మనస్సు పూర్తిగా నా పైనే నిలిచియుండును.
తద్గచ్చతం మత్పరమౌ నలకూబర సాదనమ్ ।
సంజాతో మయి భావో వామీప్సితః పరమోఽభవః ॥
ఓ నలకూబరా! కావున (సాధుదర్శనము బంధనివృత్తికి హేతువు గనుక), మీరిద్దరు మీ గృహమునకు వెళ్లుడు. నన్నే సర్వాతీశాయియగు గమ్యముగా సేవించుడు. నాయందు అతిశయించిన (నిష్కామమైన) ప్రేమ గలవానికి పునర్జన్మ లేదు. మీకు అపేక్షితమైన అట్టి ప్రేమ మీకు కలిగినది.
శ్రీశుక ఉవాచ।
ఇత్యుక్తౌ తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః ।
బద్ధోలూఖలమామంత్ర్య జగ్మతుర్దిశముత్తరామ్ ॥
ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్దే దశమోఽధ్యాయః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- రోటికి కట్టివేయబడి ఉన్న బాలకృష్ణుడు ఇట్లు పలుకగా, వారిద్దరు ఆయనకు ప్రదక్షిణము చేసి పలుమార్లు నమస్కారములను కూడ చేసి ఉత్తరదిక్కు వైపు వెళ్లిరి.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు అర్జున వృక్షముల జంటను పడగొట్టి గంధర్వులకు శాపవిముక్తిని కలిగించుటను వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 10 of the Bhāgavata Mahā Purana is as follows:
While bound to the wooden grinding mortar, toddler Kṛshṇa crawled into the courtyard, dragging the heavy mortar behind Him between two massive Arjuna trees (*Yamalārjuna*). These trees were formerly Nalakūvara and Maṇigrīva, the two wealthy sons of Kuvera, who had been cursed by Devarshi Nārada to stand as trees for a hundred celestial years due to their intoxicated, prideful behavior. As Kṛshṇa pulled the mortar sideways between the trunks, His divine strength uprooted both colossal trees, causing them to crash to the ground with a thunderous roar. From the fallen trees emerged two radiant celestial figures, who offered profound prayers glorifying Bhagavān's mercy before returning to the heavenly realms.