భాగవత మహా పురాణము
9 - శ్రీకృష్ణుని రోలుకు కట్టివేసే లీల
ఏకదా గృహదాసీషు యశోదా నందగేహినీ ।
కర్మాంతరనియుక్తాసు నిర్మమంథ స్వయం దధి ॥
ఒకనాడు నందుని గృహిణియగు యశోద పెరుగును తానే చిలికెను. ఎందుకంటే, ఇంటిలోని పరిచారికలనమే ఇతరములగు పనులలో నియోగించెను.
యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ ।
దధినిర్మంథనే కాలే స్మరంతీ తాన్యగాయత ॥
ఆ బాలకృష్ణుని లీలలను ఈ గోకులములో కవులు పాటలుగా రచించిరి. యశోద పెరుగును చిలికే సమయములో వాటిని గుర్తు చేసుకుంటూ పాడెను.
క్షామం వాసః పృథుకటితటే బిభ్రతీ సూత్రనద్ధం
పుత్ర స్నేహస్నుతకుచయుగం జాతకంపం చ సుభూః ।
రజ్ఞ్వాకర్షశ్రమభుజచలత్కంకణౌ కుండలే చ
స్విన్నం వక్త్రం కబరవిగలన్మాలతీ నిర్మమంథ ॥
యశోద నడుమునందు పట్టుచీరను బంగరు మొలనూలుతో కట్టి ధరించి పెరుగును చిలుకుచుండగా పుత్రునియందలి ప్రేమచే పాలను స్రవించే ఆమె పాలిండ్లు చలించేను. అందమైన కనుబొమలు గల ఆమె కవ్వపు త్రాడును లాగుతూ ఉంటే శ్రమ వలన భుజములయందలి కంకణములు, కుండలములు కూడ కదలుచుండెను. ఆమె ముఖముపై చెమట పొడసూపగా, జుట్టుముడినుండి జాజులు జారిపోవుచుండెను.
తాం స్తన్యకామ ఆసాద్య మథ్నంతీం జననీం హరిః ।
గృహీత్వా దధిమంథానం న్య షేధత్ప్రీతీమావహన్ ॥
శ్రీకృష్ణుడు పాలను త్రాగగోరి ఆ తల్లి వద్దకు వచ్చి ప్రీతిని కలిగిస్తూ పెరుగును చిలుకుచున్న కవ్వమును పట్టుకొని, చిలుకుటను అడ్డుకొనెను.
తమంకమారూఢమపాయయత్ స్తనం
స్నేహస్నుతం సస్మితమీక్షతో ముఖమ్ ।
అతృప్తముత్సృజ్య జవేన సా యయౌ
ఉత్సచ్యమానే పయసి త్వధిశ్రీతే ॥
బాలకృష్ణుడు యశోద ఒడిలో జేరి కూర్చుండగా, ఆమె ఆతని చిరునవ్వుతో కూడిన ముఖమును చూస్తూ ప్రేమతో స్రవించే పాలను లైవించేను. కాని, ఆతడింకనూ తృప్తి జెందలేదు. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుచుండగా, ఆమె ఆతనిని విడిచి పెట్టి వెళ్లాను.
సంజాతకోపస్ఫురితారుణాధరం
సందశ్య దద్భిర్దధిమంథభాజనమ్ ।
భిత్త్వా మృషాశ్రుర్దృషదశ్మనా రహో
జఘాస హైయంగవమంతరం గతః ॥
బాలకృష్ణుడు కోపము వచ్చి పళ్లతో ఎర్రగా ప్రకాశించే క్రింది పెదవిని గట్టిగా కొరికి బెల్లం మొత్తే రాతితో పెరుగు చిలికే కుండను పగులగొట్టెను. ఆతడు ఉత్తుత్తి కన్నీళ్లు గలవాడై లోపలికి వెళ్లి చాటుగా నిన్నటి వెన్నను తినుచుండెను.
ఉత్తార్య గోపీ సుశృతం వయః పునః
ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకమ్ ।
భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్
జహాస తం చాపి న తత్ర పశ్యతీ ॥
గోపికయగు యశోద బాగా మరిగిన పాలను పొయ్యి దింపి మరల పెరుగు చిలికే చోటుకు వచ్చెను. అచట ఆమె పగిలిన పెరుగు కుండను చూచేమ. అది తన పుత్రుని పనియేనని గుర్తించి ఆమె నవ్వుకొనెను. పైగా, ఆతడు ఆమెకు ఆ చుట్టుప్రక్కల కావరాలేదు.
ఉలూఖలాంఫేరుపరి వ్యవస్థితం
మర్కాయ కామం దదతం శిచి స్థితమ్ ।
హైయంగవం చౌర్యవిశంకితేక్షణం
విరీక్ష్య పశ్చాత్పుతమాగమచ్చనైః ॥
బాలకృష్ణుడు తిరగబడిన రోలుపై స్థిరముగా కూర్చుండి ఉట్టియందలి నిన్నటి వెన్నను యథేచ్చగా కోతికి తినిపించుచుండెను. కాని, తాను వెన్నను దొంగిలించినందు వలన ఆతని చూపులలో ఆశంక తొంగిచూచుచుండెను. యశోద ఆ విధముగా ఉన్న పుత్రుని చూచి నిశ్శబ్దముగా వెనుకకు వచ్చెను.
తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరః
తతోఽవరుహ్యాపససార భీతవత్ ।
గోప్యన్వధావన్న యూప యోగినాం
క్షమం ప్రవేష్టుం తప సేరితం మనః ॥
బెత్తము పట్టుకొనియున్న ఆ గోపికను పరికించి చూచిన బాలకృష్ణుడు భయపడినవాడు వలె వేగముగా. ఆ రోలుపైనుండి క్రిందకు దిగి పారిపోయెను - యోగుల మనస్సు. ఆయనపై నిలుచుటకు యోగ్యమైనదియే. ఐననూ, తపస్సుచే ఏకాగ్రము చేయబడిన వారి మనస్సు ఆయనను చేరలేకపోవును (అనగా శ్రీహరి మనస్సునకు గోచరుడు కాడని యర్థము). అట్టి శ్రీహరి వెంట ఆమె పరుగెత్తెను.
అన్వంచమానా జననీ బృహచ్చలచ్ఛ్రోణీభరక్రాంతగతిస్సుమధ్యమా।
జవేన విస్రంసితకేశబంధనచ్యుతప్రసూనానుగతిః పరాఽమృశత్ ॥
తల్లి యశోద బాలకృష్ణుని వెంటబడి వెనుక వేగముగా పరుగెత్తాను. విశాలమైన కటిభాగము బరువుగా కదులుతుండగా, సన్నని నడుము గల ఆమె గమనము . మెల్లనగుచుండెను. విడిపోయిన జుట్టుముడినుండి పువ్వులు జారీ ముందుకు సాగుచున్న ఆమె వెనుక పడుచుండెను.
కృతాగసం తం ప్రరుదంతమక్షిణీ
కషంతమంజన్మషీణీ స్వపాణినా ।
ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం
హస్తే గృహీత్వా భిషయంత్యవాగురత్ ॥
బాలకృష్ణుడు తప్పు చేసి పైగా బిగ్గరగా ఏడ్చుచుండెను. ఆతడు తన చేతితో కళ్లను నలుపుచుండగా కాటుక మసి ముఖమంతా వ్యాపించుచుండెను. భయముతో వ్యాకులమైన కన్నులతో పైకి చూస్తున్న ఆతనిని యశోద చెయ్యి పట్టుకొని భయ పెడుతూ కొట్టబోయేను.
త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా ।
ఇయేష కిల తం బద్ధుం దామ్నాఽతద్వీర్యకోవిదా ॥
యశోదకు పిల్లవావియందు వాత్సల్యమే గాని, ఆతని శక్తి గురించి ఆమెకు తెలియదు. పిల్లవాడు భయపడినాడని గుర్తించిన ఆమె బెత్తమును పారవేసి, పిల్లవావివి కట్టివేయుటకు సంకల్పించెను.
న చాంతర్న బహిర్యవ్య వ పూర్వం నాపి చావరమ్ ।
పూర్వాపరం బహిశ్చింతర్జగతో యో జగచ్చ యః ॥
పరమాత్మయందు బయటలోపల అవే - లేడాలు గాని, ఆది-అంతములు గావి లేవు. పరమాత్మ జగత్తుకంటే ముందు, వెనుక (ప్రళయమువందు) కూడ ఉండును. జగత్తు లోపల ఉండే పరమాత్మ జగత్తువకు అతీతుడై యుండుమ. వాస్తవములో పరమాత్మయే జగద్రూపముగా ఉన్నాడు.
తం మత్వాఽఽత్మజమవ్యక్తం మర్త్యలింగమధోక్షజమ్ ।
గోపికోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా ॥
ఇంద్రియములకు గోచరము కావివాడు, నామరూపములకు అతీతుడు ఆగు పరమాత్మ మానవరూపములో అవతరించెను. అట్టి బాలకృష్ణుని గోపికయగు ఆ యశోద తవ పుత్రుడవి తలపోసి, మామూలు పిల్లవానివి వలె, త్రాటితో రోలువకు కట్టివేసెను.
తద్దామ బధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ।
ద్వ్యంగులోవమభూత్తేన పందధేఽవ్యచ్చ గోపికా ॥
తప్పు చేపీవ తన పుత్రుని గోపికయగు యశోద కట్టుచుండగా, ఆ త్రాడు రెండు అంగుళములు తక్కువ ఆయెను. ఆమె దానికి మరియొక త్రాడుమ జత చేపేమ.
యదాఽఽసీత్తదపి మ్యావం తేవావ్యదపి సందధే ।
తదపి ద్వ్యంగులం మ్యావం యద్యదాదత్త బంధవమ్ ॥
ఆ త్రాడు కూడ రెండు అంగుళములు తక్కువగా ఉండేమ. అప్పుడామె మరియొక త్రాడును కూడ జత చేయగా, అది కూడ రెండు అంగుళములు తక్కువయే ఉండెమ. ఈ తీరున ఎన్ని త్రాళ్లేమ కట్టివా, రెండు అంగుళములు తక్కువయే ఉండెను.
ఏవం స్వగేహదామా యశోదా సందధత్యపి ।
ఈ విధముగా యశోద తన యింటిలోని త్రాళ్లను జత చేయుచునే యుండెను. ఆమెను చూచి గోపికలు ముసి ముసి నవ్వులు నవ్వుచుండిరి. వారితో బాటు ఆమె కూడ నవ్వుతూ, చాల ఆశ్చర్యమును పొందెను.
స్వమాతుస్పిన్నగాత్రాయా విగ్రస్తకబరస్రజః ।
దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాఽఽసీత్స్వబంధనే ॥
తన తల్లియగు యశోద ఒళ్లంతా చెమటలు పట్టి, జుట్టుముడినుండి పూల మాల జారిపోయెను. ఆమె అలసటను చూచిన శ్రీకృష్ణుడు దయతో తనను తానే బంధించుకొనెను.
ఏవం సందర్శితా హ్యంగ హరిణా భృత్యవశ్యతా ।
స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే ॥
ఓ పరీక్షిన్మహారాజా! లోకపాలకులతో సహా ఈ జగత్తు శ్రీహరి వశములోమమది. ఆ శ్రీహరి అవకారములు తీకుసుడు. పంతంత్రుడే ఐననూ, నిశ్చయముగా భక్తపరతంత్రుడు అనే విషయమును ఈ వృత్తాంతము చూపుచున్నది.
నేమం విరించో న భవో న శ్రీరప్యంగసంశ్రయా ।
ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ప్రాప విముక్తిదాత్ ॥
మోక్ష ప్రదాతయగు శ్రీహరినుండి గోపికయగు యశోద ఏ అను గ్రహమునైతే పొందెనో, అట్టి ఈ అనుగ్రహమును బ్రహ్మదేవుడు, శివుడు, ఆయన శరీరమునాశ్రయించే లక్ష్మీదేవి అనే ముగ్గురు కూడ పొందలేదు.
నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః ।
జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ ॥
యశోదాతనయుడగు ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకములో ఏ విధముగానైతే తానే అయి ఉన్న ఆత్మజ్ఞానులకు మరియు భక్తి గలవారలకు తేలికగా లభించునో, ఆ విధముగా దేహాభిమానము గలవారలకు లభించడు.
కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభుః ।
అధాకీదరునౌ పూర్వం గుహ దపదాతుజౌ ॥
తల్లి ఇంటి పనులలో మునిగియుండెను. సర్వసమర్థుడగు శ్రీకృష్ణునకైతే రెండు మద్ది చెట్లు కనబడెను. అవి పూర్వజన్మలో కుబేరుని పుత్రులగు ఇద్దరు యక్షులు.
పురా నారదశా పేన వృక్షతాం ప్రాపితౌ మదాత్ ।
నలకూబరమణిగ్రీవానితి ఖ్యాతౌ శ్రీయాఽన్వితౌ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్థే నవమ్యోఽధ్యాయః ॥
నలకూబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు సంపద గలవారు. గర్వించియున్న వారిద్దరిని నారదుడు చెట్లు కమ్మని శపించగా వారట్లే ఐరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుని రోలుకు కట్టివేసే లీలను వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
Summary of chapter 9 of the Bhāgavata Mahā Purana is as follows:
On an auspicious morning, Mother Yaśodā personally churned fresh butter while singing the glorious deeds of her infant son. When Kṛshṇa awoke and demanded milk, Yaśodā placed Him on her lap. Suddenly noticing a pot of milk boiling over on the hearth, she set Kṛshṇa down to attend to the stove. Enraged by her departure, Kṛshṇa broke a clay churning pot with a stone, stole butter, and retreated to an inner room to feed it to monkeys. Returning to find the broken pot, Yaśodā chased the playful child with a small stick. Catching Him, she decided to bind Him to a wooden grinding mortar with rope as a gentle punishment. However, when she attempted to tie Him, the rope proved two inches too short. She joined more ropes together, but every addition remained precisely two inches short, demonstrating that no material bond can capture the Supreme Personality of Godhead without pure devotion (*Bhakti*). Seeing His mother exhausted and perspiring, Kṛshṇa mercifully bound Himself (*Dāmodara*).