గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

28 – రుక్మాంగదాభిషేక వర్ణనం

ముకుంద రుక్మాంగదుని మోహించుట

చతుర్ముఖుడు:

అనతరం చతుర్ముఖుడిలా చెప్పసాగాడు. ‘ఓ వ్యాసమునీంద్రా! అలా వేటకై వచ్చి దప్పిగొని ముని ఆసరమానికి చేరుకున్న రుక్మాంగదుడు వాచక్నవి అనే మునీశ్వరుదినీ, మృదుమధురంగా మాట్లాడే అతని భార్య ముకున్దనూ చూసి, భక్తితో ఆ పుణ్యదంపతులకు  నమస్కరించాడు. ఆ తరువాత ముని స్నానార్ధం నదీతీరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దప్పిగొన్న రుక్మాంగదుడు ఆ మునిపత్నిని ‘ తల్లీ! నా నాలుక దప్పికతో పిడచకట్టుక పోతున్నది. కనుక నాకు త్రాగేందుకు కాసిని చల్లని మంచి నీటిని యిచ్చి పుణ్యం కట్టుకో!’ అన్నాడు.

ఆ మాటలకు ఆ మునిపత్నియైన ముకుంద ఒక క్షణకాలం ఆ రాజుయొక్క అందచందాలకూ ఠీవికీ మొహితురాలై అతడితో యిలా అన్నది. “ఓ రాజా! అనడంలో మన్మధుణ్ణి ధిక్కరించేలావున్నావు. నీవంటి సోగసుకాడిని ఇప్పటివరకూ ఎన్నడూ నేను చూసికూడా ఉన్దలెదూన్దలెదు! జయంతుడు, వసంతుడు, నలకూబరుడు కూడా అనడంలో, ఠీవిలో నీకాలి గోటికే సరిరారు! అపర మన్మధుడిలా ఉన్న నీయందు నామనస్సు చిక్కుకున్నది. కనుక కామాతురనైన నా కోరిక తీర్చి, నా ఆధారసుధా పానము చేయు! నా మనస్సు రంజిల్లచేయి!”

ఇంద్రియాలను నిగ్రహించినవాడూ, శమదమాలతో సాధనా సంపత్తిని అలవర్చుకున్నవాడైన ఆ రుక్మాంగదుడు ఆమె మాటలకు పిడుగుపాటుకు లోనైనట్లు విలవిలలాడాడు! ఆమెకు తగు బుద్దిగరుపుతూ యిలా అన్నాడు.

’ఓ ముకుందా! నీవి చపలతను వీడు! హ్యేయమైన పరదారా పరిగ్రహానికి – ఆ గజాననుని దివ్యానుగ్రహ లబ్దుడైన నేను ఎలా పాల్పడగలను?అధర్మురాలవూ, దుష్టురాలవైన నీవిచ్చిన నీటిని కూడా తాగటం పాపం! ఋషి ఆశ్రమము అత్యంత పాపమైనదని ఇక్కడికి వచ్చాను! ఇక ఇక్కడినుండి వెడతాను’ అంటూ లేచి వెళ్ళిపోబోయాడు!

వెంటనే ఆరాజు చేయి పట్టుకుని ముకుంద ఇలా అంది “ఓరాజా! బలాత్కారముగా యితరుల భార్యను చేపట్టినట్టివాడే నరకాన్ని పొందుతాడు, అంతేకాని తనంత తానుగా వలచివచ్చిన స్త్రీని  చేపడితే ఎత్తి ప్రమాదము లేదు! అంతేకాదు; సృష్టికర్తయైన ఆ బ్రహ్మదేవుడు కూడా కృత త్రేతా ద్వాపర యుగాలలో మా స్త్రీలకూ స్వాతంత్ర్యమిచ్చి వున్నాడు. కనుక నీవు నా కోరికను తీర్చు! లేదా నిన్ను రాజ్యభ్రష్టునిగా వనచారివిగా చేస్తాను!” అన్నది.

ఇలా అంటూ ఓరాజా! ముకుంద కామోద్దీపితురాలై పరుగెత్తి వచ్చి రుక్మాంగదుడామెను బలాత్కారంగా కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్నది. అప్పుడు రుక్మాంగదుడామెను బలంతో దూరంగా తోసివైచాడు! అప్పుడామే గాలివాటుకు పడిపోయిన అరటిచేట్టులా నేలనుపడి మూర్ఛిల్లింది! స్పృహలోకి వచ్చిన ఆమెతో రుక్మాంగద మహారాజు యిలా అన్నాడు.

“ఓ అవివేకురాలా! నీవు పరమపవిత్రుడూ, అగ్నిహోత్రం వంటి వాడైన వాచక్నవి ముని భార్యవు! ఇలా పరపురుషుడిపై మనసుపడటం నీకు ధర్మభ్రష్టుత్వాన్నీ, నరకప్రాప్తినీ కలిగిస్తుంది! అటు సూర్యుడిటు పొడిచినా – సముద్రాలే ఇంకినా, నా మనస్సు నీ పాపపు కోరికను అంగీకరించాడు!” అంటూ నిరీకరించాడు’ – అంటూ నారదుడు ఆ కధాగమనాన్ని ఇలా కొనసాగించాడు.

ముకుంద రుక్మాంగదుని శపించుట

ఆ మాటలకు తోకతొక్కిన త్రాచులా లేచిన ముకుంద రుక్మాంగదుణ్ణి యిలా శపించింది!

‘ఓ రాజా నీ తిరస్కారంవాళ్ళ నేనేలాటి కష్టాన్నీ, వ్యధను పొందానో, నీవు అలాగే కుష్టు వ్యాధితో భాదితుదవవుదువుగాక! వజ్రకఠినమైన నీ హృదయం కరుగకపోవటంవల్ల నీకి శాపమిస్తున్నాను’!

ఆ మాటలకు రుక్మాంగదుడు ఏంటో నొచ్చుకుని అట్టి శంఖిణి తనకు ఎదురవటం కేవలం తన పూర్వజన్మకృత పాపఫలమే అనుకోని మనస్సులో ఖేదపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు! అలా వెడుతుండగా మార్గ మధ్యంలో అతని శరీరమంతా కొంగ శరీరంవలే తెల్లటి శ్వేతకుష్టుతోవ్యాపించబడింది! ఏంటో వ్యాకులపడ్డ రుక్మాంగదుడు దుఃఖసాగరంలో మగ్నుడై గజానుడిని యిలా అన్నాడు.

‘ఓ గజాననా! నా వాళ్ళ నీకేం అపరాధము జరిగింది? ఏ అదృశ్యశక్తినన్నీ ముని ఆశ్రమానికి తీసుకువచ్చింది? దుష్టురాలైన ఈ మునిపత్ని అసలు నాకెందుకు తటస్థపడింది? ఓ సిద్ధిపతీ! పరమ దయాకరుడవే! ఐనా, నీ దయయోక్క ప్రయోజనాన్ని దుష్టులే ఎక్కువగా పొందుతారనుకుంటాను.

భక్తులను రక్షించేందుకూ దుష్టులను శిక్షించేందుకే నీ అనుగ్రహ అవతారలన్నమాటను నిజం చేయవాప్రభూ? స్వైరిణి దుష్ప్రవర్తనగల ఈ మునిపత్ని దురాగతాన్ని సహించి ఎందుకు ఊరుకున్నావు? ఈమె దుష్ప్రవర్తన యిలా అప్రతిహతంగా కొనసాగావలిసిందేనా? మేలిమి బంగారు శరీరపు వన్నెకలిగి కాంతివంతంగా ప్రకాశించే నా శరీరం ఈనాడు ఇటువంటి దుస్థితిని పొందటానికి కారణమేమిటి? ఏ పూర్వ కర్మ దుష్కర్మఫలంగా నాకీ అగత్యమేర్పడింది? ఓ పార్వతీనందనా! దీన జనావ్నా! నిన్ను తప్ప అన్యులాక్=ను ఏమాత్రమూ శరణువేడని వాడనే! నీవీ నాకు దిక్కు! ఎప్పటిలాగే నేను నీయందే అచంచలమైన భక్తి విశ్వాసాలతో నీ పాదపద్మాలనే అనవరతము సేవిస్తాను! కాని ఈ రోగాభూయిష్టమైన శరీరాన్నీ – నా అమంగళకరమైన రూపాన్ని నా ప్రజలకు యిక చూపించబోను! ఈ శరీరాన్ని యింక ఇక్కడే ప్రాయోపవేశంతో శుష్కింపచేస్తాను!” అని నిశ్చయించుకొని ఆ రుక్మాంగదుడు ఒక మఱ్ఱిచెట్టుక్రింద కూర్చున్నాడు. అతని వెంటవచ్చిన భటులు తమ ప్రభువుకై వేదికి, ఎక్కడా జాడ కనుగొనలేక, సాయంసంధ్య అవుతుండగా తమతమ యిళ్ళకు వెనుదిరిగారు. ఈ విధంగా భటులు చంద్రుడికై చక్రవాక పక్షుల్లా తమ ప్రభువుకు దూరమై తీవ్ర వియోగ భాధకు లోనైనారు.

Chapter 28 Complete