గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

27 – రుక్మాంగదాభిషేక వర్ణనం

వ్యాసమహర్షి:

అనతరం పరమ తపోనిధియైన వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో యిలా అన్నాడు. ‘ఓ చతురాననా! బుద్ధిశాలియైన విస్వామిత్రునిచేత భీమునికి ఏమి ఉపదేసమివ్వబడిందో, దేన్నీ అనుష్టించడంవల్ల అతని సకలాభీష్టములు నేరవేరినాయో, ఆ వివరం దయతో నాకు తెలియజేసి నన్ను మొహపులంపటాన్నుంచి విముక్తుడిని చెయ్యి!’

చతుర్ముఖుడు:

‘ఓ వ్యాసమునీంద్రా! విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము, ఉపకారము ఎనలేనిది! అత్యంత ప్రభావోపేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి విశ్వామిత్రుడు అతనితో యిలా అన్నాడు. ఓ రాజా! నీవీ మంత్రంచేతా భాక్తాభీస్తాప్రడుడూ, భాక్తవత్సలుడూ ఐన గజవదనుడి ఆరాధించు! నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్టించు! మీ పూర్వీకులందరిచేతా పూజలందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడై నీకు కోరినట్టి సకలాభీష్టాలనూ అనుగ్రహిస్తాడు! చతుర్విధ పురుషార్దాలనూ యివ్వగల దిట్టయే సంకర తనయుడూ, పార్వతీ ప్రియనందనుడైన గణపతి! కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి, గణేశానుగ్రహాన్ని పొంది కృతార్దుడివికా!”

ఆ మహర్షి మాటలకు కృతజ్ఞతాభావంతోనూ, ఆనందంతోనూ గొంతు గద్గదమవగా, మహర్షి యొక్క కరుణావాత్సల్యాలకు ఆనందాశ్రువులు కళ్ళలో చిప్పిల్లగా, భీమరాజు సాష్టాంగ దండప్రణామాలు ఆచరించి, ఆ మునివడ్డ శెలవు తీసుకొని, తన భార్య వెంటరాగా తన నగరానికి తిరిగి వెళ్ళాడు.

ఆ రాజుయొక్క నగర ఆగమన వార్తను తెలుసుకున్న మంత్రులు మంత్రులు ఆనందోత్సాహాలతో సైన్యంతోనూ, సమస్త రాజలాంఛనాలతోనూ, పరివారంతోనూ, ఎదురు వచ్చి నగరంలోకి తీసుకెళ్ళారు. నగరాన్నంతా ఎంతో వేడుకగా సర్వాంగ సుందరంగా అలంకరించి, సమస్త మంగళ వాయిద్యాలు ఊరేగింపుకు ముందు నడువగా భీమరాజునూ, అయన పత్నియైన చారుహాసినినీ రాజమందిరానికి వెంటబెట్టుకొని వెళ్ళారు.

“లోకమున పతినిచేరి పతివ్రతయైన స్త్రీ శోభించినట్లుగా, నేటికి మన భీమప్రభువు తిరిగి రావటంతో మన నగరానికే ఒక కొత్త జీవకళ వచ్చింది!” అనుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాలను హర్షాతిరేకంతో పంచుకున్నారు.

 ఆ నగరం అంటా కూడా నిండిన సంతోషంతోనూ, ఏ కోరతాలేనట్టి సర్వసమృద్ధితోనూ కళకళలాడింది. రాజమందిరాన్ని చేరుకోగానే ఆ రాజదంపతులు సమస్త ప్రజానీకానికీ నూతన వస్త్రాలంకారాలనూ, తాంబులాదికములనూ, వెలగాల అనేక ముత్యాల ఆభరణాలనూ బహుకరించి వారిని తృప్తులను చేసారు.

ఆ తరువాత ఒకానొక శుభముహూర్తంలో భీమరాజు మహర్షిచేత ఉప్దేసించబడిన మంత్రాన్ని అనుష్టానం చేయడానికి కౌండిన్యపురంలోని దక్షునిచే నిర్మించబడిన గణేశమందిర ప్రాసాదాన్ని చేరుకున్నాడు. అక్కడ ఉపవాసాది నియమాలతో ఆ మంత్రాన్ని దీక్షగా జపిస్తూ సర్వకాల సర్వావస్థలలోనూ ఆ దేవదేవుడైన గణపతిని స్మరిస్తో, సమస్తమైన చరాచర సృష్టియంతటిలోనూ, పంచాభూతాలలోనూ సర్వాన్ని ఆ గజాననుని స్వరూపంగానే చూడసాగాడు. అతడికి దేన్నీ చూసినా భాగవ్త్స్వరూపంగానే తోచి దానియందు అపారమైన ప్రేమ కలిగేది. దాన్ని ఆలింగనం చేసుకొని ప్రేమించేవాడు.  ఇలా అంతటా భాగావద్దర్శనాన్ని పొందుతున్న ఆ రాజు ప్రవర్తనను చూసి కొందరాతనికి మతి భ్రమించిందనుకున్నారు. మరికొందరైతే అదేదో భూతావేశమనుకున్నారు. ఇలాఉండగా ఒకనాడు అతని అనన్యభక్తికి ప్రసన్నుడైన గజాననుడు భీమరాజు ఎదుట సాక్షాత్కరించాడు. అతని చేయిపట్టుకొని మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ దయతో ఇలా అన్నాడు.   

గజాననుడు:

   

‘ఓ రాజా! నీవు ముక్తుడవైనావు. నీ సమస్త అభీష్టాలన్నీనెరవేరుస్తాను! నీకు కావలిసిన వరం ఎదైనాసరే సంశయించక కోరుకో!’ ఆనాడు. అప్పుడుద్ వినంర్డుడై భీమప్రభువు యిలా బదులు పలికాడు. 

‘ఓ ప్రభు! నీ దివ్యచారనాలపైన యెనలేని ఎడదబాటులేనట్టి భక్తినే నేకోరేది! దాన్ని దయతో నాకు అనుగ్రహించు!’ అన్నాడు. అప్పుడు గజాననుడిలా అన్నాడు.

‘ఓ రాజా! నా అనుగ్రహంవల్ల నీకు గుణవంతుడు, రూపవంతుడూ బంగారువన్నె దేహకాంతితో ప్రకాశించేవాడైనటువంటి యోగ్యుడైన కుమారుడు వరపుత్రుడిగా కలుగుతాడు! నీవింక రాజ మందిరానికి వెళ్లి దేవబ్రాహ్మన పూజారతుడవై ఉండు!’ అంటూ అదృశ్యుడైనాడు.

అప్పుడు ఆ భీమరాజు భాగవతుడైన గానేసుని ఆజ్ఞమేరకు దేవతలనూ, రాజకొలువులో సమస్త బ్రాహ్మణులనూ తృప్తిపరుస్తూ, ‘ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆ గణేశుడు తృప్తినొందుగాక’! అనుకుంటూ దేవ,  భార్మనులను పూజించాసాగాడు. ఇలావుండగా కొంతకాలానికి ఆరాజుకు శుభప్రదుడైన మగ పిల్లవాడు జన్మించాడు! పుత్రోత్సవ సమయంలో అనేక దానధర్మాలను చేసి, ఆ బాలునికి ‘రుక్మాంగదు’గన్న నామకరణం చేసాడు.

దైవ దత్తుడైన ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. ఆ పిల్లవాన్ని విద్యాభ్యాసానికి గురుకుల వాసానికి పంపారు. కుశాగ్రబుద్ధియై, ఎకసంధాగ్రాహిగా చెప్పినవి చెప్పగానే నేర్చుకోసాగాడు. ఇలా ఆ బాలుడు కపిలముని వద్ద రెండో గజాననుదో అనిపించేలాగా సకల విద్యలలోనూ నిధియైనాడు. ఆ తరువాత భీమరాజు తన తనయుడికి ఒక శుభ ముహూర్తంలో పట్టాభిషేకం జరిపించాడు. ఆ రుక్మాం గదుడు కూడా తండ్రి వద్ద ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది, తదేకదీక్షతో ఆరాధించాసాగాడు. 

ఇలావుండగా ఒకానొకరోజు రుక్మాంగదుడు వేట నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు. అనేక జంతువులను వేటాడి అలసి, ఒకానొక ముని ఆశ్రమాన్ని చూసాడు. రమణీయమైన ప్రకృతితో, ఆహ్లాదకరమైన పరిసరాలతో, ఏంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఆశ్రమంలో నానా జంతువులూ భయాన్ని స్వభావ వైరాములనూ విడిచి స్నేహంతో మెలుగుతూ ఉన్నాయి. అటువంటి పరమపవిత్రమైన, ప్రశాంతమైన ఆశ్రమాన్ని రుక్మాంగదుడు చేరుకున్నాడు.

Chapter 27 Complete