గణేశ పురాణము - ఉపాసనా ఖండము
24 – దక్ష స్వప్న వృత్తాంతం
ఈ కధాగమనాన్నంతటినీ విశ్వామిత్ర మహర్షి చెబుతుండగా శ్రద్ధతో వింటున్న భీముడు ఇలా ప్రశ్నించాడు.
భీముడు:
ఓ మునీశ్వరా! ముద్గలునిచేత గణేశ మంత్రాన్ని ఉపదేశంగా పొందిన దక్షుడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్టించాడు? ఆ వృత్తాంతాన్ని వివరించండి! పవిత్రగాధ ఎంతవిన్నా అమృతంతో సమానంగా వుండి ఈ తనివి తీరడంలేదు!"
ఆ మాటలకు విశ్వామిత్రుడిలా బదులిచ్చాడు.
విశ్వామిత్రుడు:
'ఓ రాజకుమారా! అలా ముద్గలునివద్ద మత్రోపదేశాన్ని పొందిన ఆ దక్షుడు అక్క్డికి సమీపంలోనే ఉన్న 'కౌండిన్యవనామనే దట్టమైన అరణ్యంలో తన అనుష్టానాన్ని కొనసాగించాడు! ఆ అరణ్యం నానా రకములైన పుష్పలతా శొభితమై, వివిధములైన పక్షుల కిలకిలారావములతో విలసిల్లుతూ ఎంతో ఆహ్లాదభరితంగా, ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఏకాంతస్థలంలో కూర్చుని మంత్రానుష్టానమును తదేక దీక్షతో పన్నెండు సంవత్సరాల కాలం తన కొనసాగించాడు! షోడశోపచారాలతోనూ, మానసిక పూజనూ అరవై రోజులపాటు నిర్విరామంగా చేసాక, ఒకనాటి తెల్లవారుఝామున అతనికి ఒక దివ్యస్వప్నం కలిగింది.
అందులో సింధూరవర్ణంతో శోభిల్లుతూ, పెద్ద పర్వతంలావున్న ఒక ఏనుగు కలలో కనిపించింది. అది తన తొండముతో ఒక రత్న హారాన్ని ఈతని మెడలో వెయటమేకాక, అతడిని తనమూపుపైకి తొండంతో లేవనెత్తి లేవనెత్తి కుర్చోపెట్టుకుని సర్వాలంకార శోభితమైన రాజనగరిలోకి టీవిగా నడిచి వెళ్ళింది! అప్పుడు ఆ రాజకుమారుడు కలలోంచి మేల్కొని, తాను చూసిన దృశ్యాన్ని వివరంగా తన తల్లికి చెప్పి 'అమా! ఈ స్వప్నం యొక్క ఫలితం శుభమేనా? ఏనుగును స్వప్నంలో దర్శించవచ్చా?' అంటూ ఆదిగాడు! ద్దనికామె 'నాయనా! నీకు కలిగిన స్వప్నం సకల శుభాల్కూ సూచకమే! గజారోహణ ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది! కీర్తివంతుడవవుతావు!' అంటూ అభినందించింది.
అప్పుడు ఆ దక్షుడు ఎంతో సంతోషంతో తన తల్లితో, తనకు రాజ్యమే ప్రాప్తించినట్లయితే ఆమెకు సమస్త రాజభోగాలను కల్పించగలననీ, తృప్తిదీర ఆమెచే సద్భ్రాహ్మణులకు సువర్ణాన్ని గోసహితంగా దాన కూడా మిప్పించగలననీ, అప్పుడు ఆమె కోరిన వ్రతాలన్నీ యదేచ్చగా అనుసరించుకోవచ్చనీ’ తెలిపాడు.
ఆ మాటలకు ఏంటో ప్రీతితో సంతుష్టురాలై. ‘ సర్వదా నీవు ధర్మబుద్ధి కలిగి ఉందువు! దీర్ఘాయువువై దేవబ్రాహ్మణ పూజలందు అనురక్తి కలిగి చిరయశస్సును పొందెదవు గాక!’ అంటూ ఆశీర్వదించింది.
Chapter 24 Complete
