గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

26 – పరంపరా వర్ణనం

విశ్వామిత్రుడు భీమునితో ఆ తరువాత జరిగిన కదాసంగ్రహాన్ని ఇలా వివరించాడు

విశ్వామిత్రుడు:

 “ఓ రాజా! ఇలా ఉండగా ఒకానొక మంచిరోజున సకలప్రజలూ సమావేశమై ఉండగా రాణి యైన సులభ పట్టపుటేనుగు తొండానికి ఒక పుష్పమాల తగిలించి, ‘ ఓ పట్టపు గజమా! ఈ రాజ్యంలో నీకు ఇష్టమైన వానిని ఈ పూలమాల అతని మెడలోవైచి, పాలనకై రాజుగా ఎన్నుకో!’ అని ఆదేశించగా ఆ భద్రగజము రాణి ఆజ్ఞను తలదాల్చి సింధూరంతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి, వేదపండితులైన బ్రాహ్మణులు, వందిమాగధులు తనను అనుసరించగా, వాద్యఘోషములు కూడా నడవగా, ఆ పుష్పహారాన్ని తొండంతో ధరించి, జనుల నందరినీ ఆఘ్రణిస్తూ, నగరాన్ని వీడి వెలుపలికిపోయింది. ఈ చిత్రాన్ని చూడటానికి నగరంలో స్త్రీలు తమ తమ పిల్లలతో గావాక్షముల పైకెక్కి చూడసాగారు. కొందరు ఆ గజము తమవంకకు చూడకపోవటంచేత నిరాశచెంది ఇండ్లకు వెనుదిరిగి వెళ్ళిపోయారు.

అప్పుడు ఆ పట్టపుటేనుగు మందగమనంతో కామలాసుతుడైన దక్షుడు దక్షుని వద్దకు వెళ్లి ఏకాగ్ర మనస్కుడై, భక్తితో గణపతిని అచంచల దీక్షతో ఆరాధిస్తూన్న అతని మెడలో ఆ పుష్పహారాన్ని వైచింది. ఈ దృశ్యాన్ని అంతరిక్షంలోనుండి గమనిస్తున్న దేవతా గణములు చకితులైనారు – అప్పుడు ప్రజలందరూ రాజుగా ఎంచుకోబడ్డ ఆ దక్షునికి తమ ప్రేమాదరములు ఉట్టిపడేలా – నూతనవస్త్రాలు, పుష్పమాలలు, వివిధములైన రత్నాభరణాలు సమర్పించారు. ఆ శుభతరుణంలో భేరి మృదంగరావాలు మారుమ్రోగాయి! దేవతలుకూడా సంతోషించి పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. మంత్రులిద్దరూ ఆ దక్షుని సమీపించి భక్తిమీర నమస్కరించి, అతడికి పరిస్థితిని వివరించి రాజుగా పట్టమును అలంకరించమని ప్రార్ధించారు, మంత్రులిరువురు చేరోపక్కా నిలువగా ప్రజలంతా ఆ దక్షప్రభువుకు నమస్కరించారు. రాజైనాక వేదపండితులైన బ్రాహ్మణులను తాంబూలాది సంభావనలతో ఆదరించి, తన తల్లిని కూడా వస్త్రాలంకారములతో పూజించి ఆమె చేత కూడా అనేక దానాలను చేయించాడు దక్షుడు. ఆ తరువాత ఆమెను రాజమాతగా పల్లకిలో ఊరేగింపచేసి తానూ స్వయంగా పట్టపుటేనుగను అధిరోహించాడు!

నానా వర్ణ పతాకములతో, పూల తోరణాలతో అలంకరించబడిన రాజనగరులోకి మంత్రులిరువురూ అశ్వారూడులై అనుసరిన్చగాఅనుసరిన్చగా ప్రవేశించాడు. వందిమాగధులు జయజయధ్వానములతో కైవారము చెయ్యసాగారు. అప్సరసలు నాట్యంతోనూ, గంధర్వులు తమ అమరగానంతోనూ అలన్రించారు! ఇక ప్రజలంతా ఒక సముద్రంలా జయ్జయధ్వానాలను ఉచ్చైస్వరంతో చేయగా సామంతులు, పురప్రముఖులతో కూడిన రాజసభాలోకి ప్రభువైన దక్షుడు ప్రవేశించాడు.

ఒక పల్లకీని చక్కగా అలంకరించి మద్గల మహర్షిని సగౌరవంగా కొనిరంమని దక్షుడు ఆదేశించాడు. పల్లకీకూడా మంత్రి సమంతుడిని ఛాత్రచామరాది రాజలాంచనములతో ముద్గాలునివద్దకు పంపాడు. అప్పుడు వారు రాజాజ్ఞననుసరించి ముద్గాలుని పల్లకీలో ఆరోహిమ్పచేసి తమవెంట సభాస్తలికి తీసుకువచ్చారు. అది చూచినా రాజు సిమ్హాసనమునుంది దిగ్గున లేచి, మహర్షికి సాదరంగా ఎదురెల్లి, తన కిరీటంతోసహా ఆయ పాదాలకు తలను భక్తితో ఆన్చి, ఆయనను రాజసింహాసనంపై కూర్చుండ చేసి, ఆయన అనుమతితో తనూ మరో ఆసనంపై కూర్చున్నాడు. సామంతరాజుల బృందంతో పాటు ఆ ముద్గాలుని యధావిధిగా సత్కరించి, భక్తితో ప్రణమిల్లాడు, అతిధిపూజను చేసి, పాడిఆవును ఆ మహర్షికి వినయంగా సమర్పించాడు.

దక్షుడు:

అప్పుడు దక్షుడు మద్గాలమునితో ఇలా అన్నాడు

‘ఓ మునిసత్తమా! తమ యొక్క మహిమావిశేషం యిప్పుడే ఈ పురజనులకు వెల్లడైంది. తమ దివ్యానుగ్రహ ప్రభావంచేతనే నాకు రోగారహితమైన సుందర శరీరము, రాజ ప్రాప్తియూ కలిగినవి! ఇప్పుడు పూర్వపు నా దురవస్థ తలుచుకుంటేనే వాళ్ళు జలదరిస్తున్నది. అప్పటి ఆ దుస్థితికీ, తమ అనుగ్రహప్రాప్యమైన ఈనాటి స్థితికీ పోలికే లేదు! ఓ మునీశ్వరా! మహాత్ముల దివ్యానుగ్రహానికి అసాధ్యమన్నదే లేదు! రోగిని నిరోగిగా, భోగిగా చేయటం దయానిదులైన మీకే చెల్లింది! తమ దివ్యహస్తాన్ని నా సిరస్సుపైన ఉంచి తమ అనుగ్రహాన్ని నాపై ప్రసారించండి! తమరే సాక్షాత్ వినాయకస్వరూపులు.’

ముద్గలుడు:

ఆ మాటలకు ముద్గలుడు చిరునవ్వు మోముతో రాజును అనునయిస్తూ యిలాఅ న్నాడు.

‘నాయనా! దాక్షా! నాయొక్క అనుగ్రహ విశేషం చేత ఇక మీదట నీకు ఎన్నడూ శత్రుభయం కలగదు! అంతేకాదు! నీవు సంకల్పించినదే తడవుగా నీ మనోకామనలన్నీ తప్పక తప్పక నేరేవేర్తాయి!” అంటూ ఆశీర్వదించాడు. అనతరం లెక్కలేనన్ని పాడి పసువులను, అగ్రహారాలను ఆ ముద్గల మహర్షికి భక్తితో సమర్పించి ప్రణమిల్లాడు దక్షుడు. ఇతర వేదపండితులకు కూడా గోవులను, వస్త్రాలను ధనధాన్యాలను బహుకరించాడు.

వారుకూడా అతడిని చిరికీర్తివికమ్మని ఆశీర్వదించి తమతమ నేలవులకు తిరిగి వెళ్ళిపోయారు! మంత్రులనూ, పరిచారకులనుకూడా తగిన రీతిన సత్కరించి, అందరి మన్ననలనూ పొంది ప్రీతిపాత్రుడైనాడు! ఆ తరువాత కుండిన నగరంలో జీర్ణమైవున్న పాత ఆలయాన్ని ఉద్ధరించి, గజాననుని మూర్తిని ప్రతిష్టించాడు. అందులో సౌందర్యోపేతమైన ఒక ప్రాకారాన్నికూడా వైభవోపేతంగా నిర్మించాడు. వల్లభుడనే రాజు ఈ వృత్తాంతాన్నంతటినీ విని, తనకు స్వప్నంలో గానేసుడు ఆదేశించిన ప్రకారం ‘వీరసేన’ అన్న కుమార్తెను యిచ్చి దక్షునితో విఅభావంగా జరిపించాడు. ఆ దంపతులకు బృహద్భానుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ బృహద్భానుడికి ఖడ్గధరుడు, అతనికి సులభుండు, వానికి పద్మాకరుడు, పద్మాకరునకు వపుర్దీప్తి అనేవాడూ, వానికి చిత్రసేనుడూ, చిత్రసేనునికి నీవూ జన్మించారు!’ అంటూ విశ్వామిత్రుడు భీమేరాజుకు అతని వంశావళిని తెలియజేయగా -                 

 ‘ఓ మునిపున్గావా! భక్తాభీష్టఫల ప్రదుడైన ఆ వినాయకుడు నా ఎలా ప్రసన్నుడౌతాడో, అతడి అనుగ్రహాన్ని పొందే విధమును దయతో నాకు తెలియచేసి నన్ను కృతార్దుడిని చేయ’ మంటూ భీముడు విశ్వామిత్రమహర్షిని ప్రార్ధించాడు.

Chapter 26 Complete