అధ్యాయము 1

1 - నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం

 దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేథ్

 త్రైలోక్యరాజ్య మాక్షిస్య బలే రింద్రాయ యో దదౌ:

 శ్రీధరాయ నమస్తస్మై చద్మ వామనరూపిణే

నారాయణునకు ఉత్తముడగు నరునకు సరస్వతీ దేవికి వ్యాసభట్టారకునకు నమస్కరించి జయ కావ్యమును (పురాణము లేక ఇతిహాసము) చదువవలెను. ముల్లోకముల వ్యాపించిన రాజ్యమును వామనుడను చద్మ వేషముతో వంచన ద్వారా బలి నుండి లాగికొని ఇంద్రున కొసగిన శ్రీధరునకు నమస్కారము.

2 - పులస్త్య మృషి మాసిన మాశ్రమే వాగ్విదాం వరం

 నారదః పరిపప్రచ్ఛ పురాణం వమనాశ్రయం

జ్ఞానులలో శ్రేష్టుడును , ధనయాశ్రమమున సుఖోపవిష్టుడైన వాడుమనగు పులస్త్య మహర్షిని నారదుడు వామనునకు సంబంధించిన పురాణమును గురించి ప్రశ్నించెను.

నారదుడు:

3 - కథం భగవతా బ్రహ్మన్ విష్ణునా ప్రభ విష్ణునా

 వామనత్వం దృతం పూర్వం తన్మ మాచక్ష్వ పృచ్చతః

నారదుడు:

బ్రహ్మర్షీ! సర్వ సమర్థుడై యుండియు పురాసమయమున విష్ణువు మరుగుజ్జు రూపమునేల ధరించెను.

4 - కథంచ వైష్ణవో భూత్వా ప్రహ్లాదో దైత్యసత్తమః

 త్రిదశై ర్యుయుదే సార్త మత్ర మే సంశయో మహాన్

దైత్య శ్రేష్టుడగు ప్రహ్లాదుడు పరమ వైష్ణవుడయ్యును దేవతలతో నేల యుద్ధమొనర్చేను? ఈ సంశయము నన్ను పీడించుచున్నది . దీనిని తొలగించుడు.

5 - శ్రూయతే చ ద్విజ శ్రేష్ట దక్షస్య దుహితా సతీ

 శంకరస్య ప్రియా భార్యా బభూవ వరవర్ణినీ

6 - కిమర్థం సా పరిత్యజ్య స్వశరీరం వరాననా

 జాతా హిమవతో గేహే గిరీంద్ర స్య మహత్మనః

7 - పునశ్చ దేవ దేవస్య పత్నీత్వ మగమ చ్చుభా

 ఏతన్మే సంశయం చింది నర్వవిత్ త్వం మతోన్సిమే

8 - తీర్థానం చైవ మహాత్మ్యం దానానం చైవ సత్తమ

 వ్రతానాం వివిదానాం చ విధి మాచక్ష్వ మే ద్విజ

బ్రాహ్మణోత్తమా! దక్షపుత్రి సతీదేవి శంకరునకు ప్రియమును గూర్చునర్దాంగి అయ్యెనుగదా. ఆ శుభాంగి యే కారణమున తన శరీరమును వడలి పర్వతేశ్వరుడగు హిమవంతు నింట మరల జన్మించెను? మరల దేవదేవుడగు శంకరుల నేల పరిణయమాడేను. ఈ నా సందేహములను సర్వజ్ఞుడవగు తాము తొలగింపుడు. ద్విజశ్రేష్టా! పలురకములగు వ్రతము లొనర్చు విధానములను, తీర్థక్షేత్రముల మహత్మ్యమును, దానముల మహిమను దయతో నాకెరిగింపుడు.

9 - ఏవ ముక్తో నారదేన పులస్త్యో మునిసత్తమః

 ప్రోవాచ వదతాం శ్రేష్టో నారదం తపసో నిదిమ్

ఈ విధముగ ప్రశ్నించిన తపోనిధి నారదునితో మునిశ్రేష్టుడు వదతాంవరుడగు పులస్త్యుడిట్లనెను.

పులస్త్యుడు

10 - పురాణం వామనం వక్ష్యే క్రమాన్నిఖిల మాదితః

 అవధానం స్థిరం కృత్వా శృణుష్వ మునిసత్తమ

పులస్త్యుడు

ఓ మునిసత్తమా! నీవు కోరినట్లు మొదటి నుండియు క్రమముగా వామన పురాణమును సమగ్రముగ నుడివెదను. సావధానుడవై వినుము.

11 - పుర హైమవతీ దేవీ మందరస్థం మహేశ్వరం

 ఉవాచ వచనం దృష్ట్వా గ్రీష్మ కాల ముపస్థితం 

12 - గ్రీష్మః ప్రవృత్తో దేవేశ న చ తే విద్యతే గృహం

 యత్ర వాతాతపౌ గ్రీష్మే స్తితయో ర్నౌగమిష్యతః

13 - ఏవముక్తో భవాన్యా తు శంకరో వాక్య మబ్రవీత్

 నిరాశ్రయో హం సుదతి సదా – రణ్య చరః శుభే

14 - ఇత్యుక్తా శంకరే ణాథవ్రుక్షచ్చాయాసు నారద

 నిదాఘ కాల మనయత్ నమం శర్వేణ సా నతీ

15 - నిదాఘాంతే సముద్బూతో నిర్ణనాచరితో-ద్భుతః

 ఘనాంధకారితాశో వై ప్రావృట్ కాలో –తిరా గవాన్

16 - తం దృష్ట్వా దక్షతనుజా

 పావ్రుట్కాల ముపస్థితం

 ప్రోవాచ వాక్యం దేవేశం సతీ నప్రణయం తదా

17 - స్పురంతి నీలా బ్రగణే షు విద్యుతో వాశంతి కేకారమేవ బర్హి ణః

18 - వతంతి ధారా గగనా త్పరిచ్యుతా

 బకా బలాకాశ్చ నరంతి తోయదాన్

 కడంబానర్జాగున కేతకీద్రుమా :

 పుష్పాణి ముంచంతి సుమారుతాహతాః

19 - శ్రుత్త్వ్ వ మేఘస్య దృఢం తు గర్జితం

 త్యజంతి హంసాస్చ నరాంసి తత్ క్షణాత్

 యథా శ్రయాన్ యోగిగణాః సమంతాత్

 ప్రవృద్ద మూలానపి సంత్యజంతి

20 - ఇమాని యూ థాని వనే మృగాణాం

 చరంతి ధావంతి రమన్తి శంభో

 తథా –చిరాభాః సుతరాం స్పురంతి

 పశ్యేహ నీలేఘ ఘనేషు దేవ

 నూనం సమ్రుద్దిం సలిలస్య దృష్ట్వా

 చరంతి సూరా స్తరుణ ద్రుమేషు

21 - ఉద్వ్రు త్తవేగాః సహసైవ నిమ్నగా

 జాతాః శశాంకాంకిత చారుమౌళే

 కిమత్ర చిత్రం యధనుజ్జ్వలం జనం

 నిషేవ్య యోషి ద్రువతి త్వశీలా

22 - నీలైశ్చ మేఘైశ్చ నమామృతం నభః

 పుష్పైశ్చ నర్జా ముకులై-శ్చ నీపాః

 ఫలైశ్చ బిల్వాః పయసా తథాపగాః

 పత్రై: నపద్మైశ్చ మహాసరాంసి

23 - ఇతీ దృసే శంకరదు :హే ద్బుతే

 కాలే సురౌద్రే నను తే బ్రవీమి

 గృహం కురుష్వాత్ర మహాచలోత్తమే

 సునిర్వృతా యేన భవామి శంభో

పూర్వమొక పర్యాయము గ్రీష్మర్తువు సమీపించుట చూచి మందరగిరిపై ఆసీనుడైన మహేశ్వరుని చూచి భగవతి హైమవతి యిట్లనెను. “ప్రభూ! దేవాధిపా! వేసవి సమీపించినది. వేడి గాడ్పులకు మండుటెండలకు తట్టుకొని మనము నివసింపదగిన గృహము నీకు లేకపోయేనే!” అంతట భవానీతో శంకరుడనెను. “సుదతి! కళ్యాణీ! నేనెల్లపుడు నిరాశ్రయుడనై యరణ్యవాసమే చేయుచుంటిని .” శంకరుని మాట విని సతీదేవి (చేయునది లేక) భర్తతో ఆ వేసవి దినములు చెట్ల నీడలలో గడిపినది. వేసవి గడిచిన తోడనే మేఘముల గుంపులతో దిక్కుల చీకట్లు వ్యాపించగ వర్షాకాలమేతెంచెను. దిక్కులు జన సంచారం శూన్యములయ్యెను. అది చూచి దాక్షాయణి తన భర్తతో ప్రేమ పురస్పరముగా నిట్లనెను. “మహేశ్వరా! గుండెలు బ్రద్దలగునట్లు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నవి. మేఘములు గర్జించుచున్నవి. మెరుపులు మెరయుచున్నవి . నెమళ్ళు ఆడుచు కేకారవములు సేయుచున్నవి . ఆకసము నుండి తెరిపి లేకుండ జలధారలు పడుచున్నవి. బలాక పంక్తులు మేఘముల వెంట పరుగులిడుచున్నవి. గాలి తూపులకు కదంబ, సర్ణ, అర్జున, కేతకీవృక్షములు పుష్పములు రాల్చుచున్నవి . మేఘ గంభీర గర్జనలు విని తమ తమ నెలవులు వదలి వెళ్ళు యోగులకు వలెనే హంసలు కూడ సరోవరాలను వదలిపోవుచున్నవి. శంభో! అవిగో! లేళ్ళ గుంపులు అరణ్యమున ఎల్లెడల తిరుగాడుచున్నవి పరుగిడుచున్నవి; తమ ప్రియలతో రమించుచున్నవి. అటు చూడుడు, నల్లని మొగళ్ళమధ్య మెరుపుతీగలెంత మనోహరముగ ప్రకాశించుచున్నవో : నలుగడల నిండుకొనిన నీటి సమూహమును చూచి శూరులు తరుణ వృక్షాల మధ్య తిరుగాడుచున్నారు. ఓ చంద్రశేఖరా! ఉన్నట్టుండి నదులన్నియు వేగాన్ని పుంజుకున్నవి. కాగా దుశ్సీలుడగు వానిని సేవించిన స్త్రీ తన శీలాన్ని కోల్పోవుటలో ఆశ్చర్యమేముండును. ఆకాశాన్ని నీలి మబ్బులావరించినవి. సర్జ వృక్షాలు పుష్పాలతో, కడిమి చెట్లు మొగ్గలతో, బిల్వతరువులు ఫలాలతో, నదీ నదాలు జలాలతో సరోవరాలు పద్మపత్రాలతో నిండి యున్నవి. శంకరా! ఇలాంటి భయంకరమూ దు:సహమైన కాలాన ఈ కొండ కొమ్మున, నేను నిర్భయంగా సుఖించుటకనువైన గృహము నిర్మించుము.”

శంకరుడు

24- ఇత్థం త్రినేత్రః శ్రుతిరామణీయకం

 శ్రుత్వా వచో వాక్యమిదం ఐభాషే

 న మే – స్తి విత్తం గృహసంచయార్తే

 మ్రుగారిచర్మావరణం మమ ప్రియే

25 - మమోపవీతం భుజగేస్వరః శుభే

 కర్ణేసి పద్మశ్చ తథైవ పింగళః

 కేయూర మేకం మమ కంబళ స్త్వహి

 ర్ద్వితీయ మన్యో భుజగో ధనంజయః

26 - నాగస్తథైవాస్వతరో హి కంకణం

 సవ్యేతరే తక్షక ఉత్తరే తథా

 నీలోపి నీలాంజన తుల్యవర్ణః

 శ్రోణీతటే రాజతి సుప్రతిష్ట:

శంకరుడు

తన ప్రియురాలి ఈ శృతిమనోహరా లైన మాటలు విని ఆ ముక్కంటి “ఓ ప్రియురాలా

 నేనేమి చేయుదును గృహ సంపాదనమునకు నా వద్ద ధనములేదు. నేను ధరించేది పులితోలు. జన్నిదమా పాపరేడు. పద్మ పింగళులనే సర్పాలు నాకు చెవి పోగులు. నేను ధరించే కేయూరాలు కంబళ ధనంజయాలనే విషధరాలు. కుడి ఎడమ చేతులకు నేను తొడిగే కంకణాలు అశ్వత్తర, తక్షక నాగులు. పోతే కాటుక రంగుతో నిగనిగలాడే మహోరగం నీలుడు నామొలతాడు. ఇంతకు మించి నావద్ద ఏమి గలదు?“ అనెను.

పులస్త్యుడు

27 - ఇతి వచన మతోగ్రం శంకరా త్సా మృడానీ

 ఋతమపి తదసత్యం శ్రీమ దాకర్న్య భీతా

 అవనితల మవేక్ష్య స్వామినో వానక్రుద్బ్రాత్

 పరివదతి నరోషం లజ్జయోచ్చ్వస్య చోష్ణ్నం

పులస్త్యుడు

సాధారణ గృహ నిర్మాణము చేసుకోజాలని తన అశక్తతను వెల్లడించుచున్న శంకరుని ఆపలుకులు సత్యములైనను కర్ణ కటువులూ అరుచి కరములగుటచేమృడానికి తృప్తి కలిగించలేదు. లజ్జారోషాలతో క్రుంగి పోయి వేడి నిట్టూర్పులు విడుచుచు చూపులు నేల మీద నిలిపి భర్తతో ఇలా అన్నది .

పార్వతి

28 - కథం హి దేవదేవేశ ప్రావృట్కాలో గమిష్యతి

 వృక్షమూలే స్థితాయా మే సదు:ఖేన వదామ్యతః

పార్వతి

 “ప్రభు అయితే ఇలాంటి భయంకరమూ దుర్బరమైన వర్షాకాలం చెట్ల క్రింద తడుస్తూ రోదిస్తూ ఎలా గడప గలను? అందులకే యింతగట్టిగా నేను మాటాడుచుంటిని.”

శంకరుడు

29 - ఘనావస్థితదేహయాః ప్రావృట్కాలః ప్రయస్యతి

 యథాంబుధారా న తవ నిపతిష్యంతి విగ్రహే

శంకరుడు

“ ప్రియురాలా! ఇందులో ఇష్టమేమి? వర్షాకాలమంతయు మేఘాలను ఆసనముగా చేసి కొని వాని మీద, నీ శరీరం పైనొక నీటి బిందువు కూడా పడకుండునట్లు నివసింపగలవు సుమా!

పులస్త్యుడు

30 - తతో హరస్తద్ఘనఖండ మున్నత మారుహ్య తస్థౌ సహ దక్షకన్యయా

 తతో భవన్నామ తదేశ్వరన్య జీమూతకేతు స్త్వితి విశ్రుతం దివి

పులస్త్యుడు

అంతట శంకరుడు దాక్షాయణితో నొక ఎత్తైన మేఘఖండము నదిరోహించి ఆసీనుడయ్యెను. ఆకారణమున నామహేశ్వరునకు స్వర్లోకమున జీమూతకేతువను పేరు సార్థకమాయెను .

అధ్యాయము 1 complete