వామన మహా పురాణము
అధ్యాయము 20
లోమహర్షణ
1 - సముద్రాస్తత్రచత్వారో దర్విణా ఆహ్రుతాః పురా ।
ప్రత్యేకంతునరః స్నాతో గోసహస్రఫలంలభేత్ ॥
2 - యత్కించిత్క్రియతేతస్మిం స్థాపస్తీర్తే ద్విజోత్తమాః ।
పరిపూర్ణంతుతత్సర్వ మసిదుష్క్రుతకర్మణః ॥
3 - శతసాహస్రికం తీర్థం తథైవశతికం ద్విజాః ।
ఉభయోర్హినరఃస్నాతో గోసహస్రఫలం లభేత్ ॥
4 - సోమతీర్థం చతత్రాపి సరస్వత్యాస్తటే స్థితమ్ ।
యస్మిన్స్నాతస్తు పురుషో రాజసూయఫలం లభేత్ ॥
5 - రేణుకాశ్రమమాసాధ్య శ్రద్దదానోజితేంద్రియః ।
మాతృభక్త్యాచయత్పుణ్యం తత్ఫలంప్రాప్నుయాన్నరః ॥
6 - ఋణమోచనమాసాద్య తీర్థంబ్రహ్మనిషేవితమ్ ।
ఋనై ర్ముక్తోభవేన్నిత్యం దేవర్షిపితృసంభావైః ।
కుమారస్యాభిషేకంచ ఓజసంనామవిశ్రుతమ్ ॥
7 - తస్మిన్స్నాతస్తుపురుషో యశసాచసమన్వితః ।
కుమారపురమాప్నోతి కృత్వాశ్రాద్ధంతుమానవః ॥
8 - చైత్రషష్ట్యాంసితేపక్షే యస్తుశ్రాద్ధంకరిష్యతి ।
గయాశ్రాద్దేచయత్పుణ్యం తత్పుణ్యం ప్రాప్నుయాన్నరః ॥
9 - సన్నిహిత్యంయథా శ్రాద్ధం రాహుగ్రస్తేదివాకరే ।
తథాశ్రాద్దంతత్రకృతం నాత్రకార్యావిచారణా ॥
10 - ఓజసేహ్యక్షయం శ్రాద్ధం వాయునాథికతంపురా ।
తస్మాత్సర్వప్రయత్నేన శ్రాద్ధంతత్రసమాచరేత్ ॥
11 - యస్తుస్నానంశ్రద్దదాన శ్చైత్రషష్ట్యాంకరిష్యతి ।
అక్షయ్యముదకం తస్య పిత్రూణాముపజాయతే ॥
లోమహర్షణ
ప్రాచీన కాలంలో దర్వి నాలుగు సముద్రాలను వెలయించాడు. వానిలో ఒక్కొక్క దానిలో స్నానం చేసిన వానికి గోసహస్ర దానఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైనను ఎంతటి దుష్టుడు చేసిననూ పరిపూర్ణమవుతుంది. అక్కడే శతసాహశ్రిక శతికతీర్థాలు కూడా ఉన్నవి. ఆరెంటిలో స్నానం చేస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడే సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్తంలో మునిగినవాడు రాజసూయ యాగఫలం పొందుతాడు. రేణుకాశ్రమాన్ని సేవించిన శ్రద్దాళువు జితేంద్రియుడు మాతృసేవ చేసిన ఫలం పొందగలడు. బ్రహ్మ సేవితమైన ఋణమోచన క్షేత్రాటనం చేసిన పుణ్యుడు దేవర్షి పిత్రుఋణా లనుండి ముక్తుడౌతాడు. ఓజసతీర్థంగా వినుతిగాంచిన కుమారాభిషేక తీర్థాన మునిగినవాడు యశస్విఅవుతాడు. అచ్చట శ్రాద్ధ మొనరించినచో కుమారపుర ప్రాప్తి కలుగుతుంది. అక్కడ చైత్రశుద్ధ షష్టినాడొనర్చిన శ్రాద్ధం గయాశ్రాద్ద ఫలం యిస్తుంది. అంతేకాదు సన్నిహిత క్షేత్రంలో సూర్యగ్రహణవేళ చేసిన శ్రాద్దఫలం గూడ లభిస్తుంది. సందేహంలేదు. ఓజస క్షేత్రంలో చేసిన శ్రాద్ధం. అక్షయ ఫలమిస్తుందని పూర్వం వాయుదేవుడు చెప్పాడు. కనుక ఎలాగైనా ప్రయత్నించి అక్కడ చైత్ర షష్టినాడు చేసిన స్నానం పితరులకు అక్షయమైన ఉడక ప్రాప్తి కలుగజేస్తుంది.
12 - తత్రపంచవటంనామ తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్ ।
మహాదేవఃస్థితోయత్ర యోగమూర్తిదరఃస్వయమ్ ॥
13 - తత్రయస్నాత్వా-ర్చయిత్వాచ దేవదేవం మహేశ్వరమ్ ।
గాణపత్యమవాప్నోతి దేవతైస్సహమోదతే ॥
14 - కురుతీర్థంచవిఖ్యాతం కురుణాయత్రవైతపః ।
తప్తంసుఘోరంక్షేత్రస్య కర్షణార్థం ద్విజోత్తమాః ॥
15 - తస్యఘోరేణతపసా తుష్టఇంద్రో-బ్రవీద్వచః ।
రాజర్షేపరితుష్టో-స్మి తపసా-న్సేసువ్రత ॥
16 - యజ్ఞంయేచకురుక్షేత్రే కరిష్యంతి శతక్రతోః ।
తేగమిష్యంతిసుకృతాం లోకాన్పాపవివర్జితాన్ ॥
17 - అవహస్యతతఃశక్రో జగామత్రిదివంప్రభుః ।
ఆగమ్యాగమ్యచైవైనం భూయోభూయో-వహస్యచ ॥
18 - శతక్రతురనిర్విన్నః పృష్ట్వాపృష్ట్వా జగామహ ।
యదాతుతపసోగ్రేణ చకర్షదేహమాత్మనః ॥ ।
తతఃశక్రో-బ్రవీత్ ప్రీత్యా బ్రూహియత్తేచికీర్షితమ్ ॥
అక్కడ ముల్లోకాల్లో ఖ్యాతిగాంచి యోగమూర్తియైన మహాదేవ నివాసమైన పంచవట తీర్థముంది. అక్కడ స్నానంచేసి మహేశ్వరుని అర్చించినచో గాణపత్యం సిద్దించి దేవతలతో కలిసి సుఖిస్తాడు. ఓ బ్రాహ్మణోత్తములారా ! అక్కడే భూమిదున్నుటకై కురురాజు ఘోరతపస్సు చేసిన కురుతీర్థం ఉంది. ఆయన చేసిన ఉగ్రతపస్సుకు సంతోషించి “రాజర్షీ ! నీ తపస్సుకు సంతోషించాను. ఈ కురుక్షేత్రంలో ఇంద్రయాగం చేసినవారు పాపరహితములయిన సుకృతిలో కాలము పొందుతారన్నాడు. అంతట నవ్వుతూ ఆ ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. అలాగే ఇంద్రుడు నవ్వుతూ మాటిమాటికి వస్తూ వెళ్తూ కురుతో మాట్లాడుతూ గడిపాడు. చివరకు తీవ్రమైన తపస్సు చేసి కురు తనదేహం పవిత్రం గావించికొనగా ఇంద్రుడు సంతోషంతో వచ్చి నీకేం కావలెనో కోరుకొనుమని ప్రేమతో అడిగాడు.
కురు
19 - యేశ్రద్దధానాస్తీర్తే-స్మిన్ మానవానివసంతిహ ।
తేప్రాప్నువంతు సదనం బ్రహ్మణఃపరమాత్మనః ॥
20 - అన్యత్రకృతపాపాయే పంచపాతక దూషితాః ।
అస్మింస్తీర్తేనరాః స్నాత్వా ముక్తాయాంతుపరాంగతిమ్ ॥
21 - కురుక్షేత్రేపుణ్యతమం కురుతీర్థం ద్విజోత్తమాః ।
తంద్దృష్ట్వా పాపముక్తస్తు పరం పదమవాప్నుయాత్ ॥
కురు
“యీ తీర్థంలో శ్రద్దా భక్తులతో నివసించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి. ఈ తీర్థంలో స్నానం చేసిన వారలెక్కడ ఏ పాపాలు చేసినా పంచ పాతకాలు చేసినా సరే ముక్తులై పరమపదం పొందవలె. కురుక్షేత్రంలోని తీర్థాలన్నింటిలో కురుతీర్థం పవిత్రమైనది. బ్రాహ్మణులారా! దాని దర్శనమాత్రాన్నే పాపముక్తులై పరమపదం పొందుతారు. కురుతీర్థంలో స్నానం చేసినవాడు ముక్త పాపుడై కురువు అనుగ్రహంతో పరమపదం పొందుతాడు.
23 - స్వర్గద్వారంతతోగచ్చేత్ శివద్వారేవ్యవస్థితమ్ ।
తత్రస్నాత్వాశివద్వారే ప్రాప్నోతిపరమంపదమ్ ॥
24 - తతోగచ్చేదనరకం తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్ ।
యత్రపూర్వేస్థితో బ్రహ్మ దక్షిణేతు మహేశ్వరః ॥
25 - రుద్రపత్నీ పశ్చిమతః పద్మనాభోత్తరేస్థితః ।
మధ్యే ఆనరకం తీర్థం త్రైలోక్యస్యాపిదురభమ్ ॥
26 - తస్మిన్స్నాతస్తు ముచ్యేత పాతకైరుపపాతకైః ।
వైశాఖేచయదా షష్టీమంగలస్యదినం భవేత్ ॥
27 - తదాస్నానంతత్రకృత్వా ముక్తో భవతిపాతకైః ।
యఃప్రయచ్చేతకరకాంశ్చతురోభక్ష్య సంయుతాన్ ॥
28 - కలశం చతథాదద్యా దపూవైః పరిశోభితమ్ ।
దేవతాః ప్రీణయే త్పూర్వం కరకైరన్నసంయుతైః ॥
29 - తతస్తుకలశం దద్యాత్ సర్వపాతకనాశనమ్ ।
అనేనైవవిధానేనయస్తు స్నానంసమాచరేత్ ॥
30 - సముక్తఃకాలుషై : సర్వైః ప్రయాతిపరమంపదమ్ ।
అన్యత్రాపియదాషష్టీ మంగళేన భవిష్యతి ॥
31 - తత్రాపిముక్తిఫలదాక్రియా తస్మిన్ భవిష్యతి ।
తీర్థేచ సర్వతీర్థానాం యస్మిన్ స్నాతోద్విజోత్తమాః ॥
32 - సర్వదేవైరనుజ్ఞాతః పరంపదమవాప్నుయాత్ ।
కామ్యకంచవనం పుణ్యం సర్వపాతకనాశనమ్ ॥
33 - యస్మిన్ ప్రవిష్టమాత్రస్తు ముక్తోభవతికిల్బిషై: ।
యమాశ్రిత్యవనంపుణ్యం సవితాప్రకటః స్థితః ॥
34 - పూషానామద్విజశ్రేష్టా దర్శనాన్ముక్తి మాప్నుయాత్ ।
ఆదిత్యస్యదినేప్రాప్తే తస్మిన్స్నాతస్తుమానవః ।
విశుద్ధదేహోభవతి మనసాచింతితంలభేత్ ॥
తర్వాత శివద్వారంలో ఉన్న స్వర్గద్వారానికి వెళ్ళాలి. అక్కడ శివద్వారంలో స్నానం చేస్తే పరమపదం లభిస్తుంది. అచట నుంచి ముల్లోకాలలో పేరొందిన అనరక తీర్థాన్ని చేరుకోవాలి. అక్కడ తూర్పు దిక్కున బ్రహ్మ దక్షిణాన మహేశ్వరుడు పశ్చిమాన రుద్రపత్ని ఉత్తరంగా పద్మనాభుడు ఉంటారు. మధ్యభాగాన అనరకమనే దుర్లభమైన తీర్థం ఉంది. అక్కడ స్నానం చేస్తే మహాపాతక ఉపపాతకాలన్నీ పోతాయి. వైశాఖషష్టి మంగళవారంనాడచట స్నానం చేసి పాపవిముక్తులు కాగలరు. అక్కడ నాలుగుపాత్రలలో అన్నము, అప్పాలతో నింపిన కలశాన్ని దేవతలకు ప్రీతిగా సమర్పించాలి. సర్వపాప నాశనానికి కలశదానం చేయాలి. ఈ విధంగా ఎవరు స్నానం చేస్తారో వారు సర్వపాపముక్తులై పరమపదానికి వెళ్తారు. షష్టితో కూడిన మంగళవారంరోజున యితరత్రాకూడా యీ విధంగా చేస్తే ముక్తి లభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా! తీర్థాల్లో ఉత్తమ మైన ఈ తీర్థంలో స్నానం చేసిన నరుడు సర్వదేవానుమతుడై పరమపదం పొందుతాడు. పుణ్యదాయి అయిన కామ్య కవనంలో ప్రవేశించినంతనే సర్వపాతకాలు నశించి మానవుడు ముక్తి పొందుతాడు. ఆ వనంలో సూర్యుడు పురుషుడనే పేరుతో విరాజిల్లు తున్నాడు. ఆయనను దర్శించి నంతనే ముక్తి కలుగుతుంది. ఆదివారంనాడచటస్నానం చేయు నరుడు విశుద్ధదేహుడై మనోరథాలన్నీ సఫలంగావించుకుంటాడు.
అధ్యాయము 20 complete
Summary of chapter 93 of the Vāmana Mahā Purana is as follows:
Enraged by Her act of preserving Sage Vashishṭha, Sage Viśvāmitra cursed the river Sarasvatī to flow with blood, causing dark spirits and rākshasas to assemble along Her banks. Distressed by Her plight, holy ascetics gathered at the riverbank and offered intense prayers to Parameśvara Śiva, who restored Sarasvatī to Her pristine purity and redeemed the blood-stained waters. The site was transformed into the purifying Rākshasa-tīrtha, where bathing cleanses devotees of all dark influences and past misdeeds.