అధ్యాయము 12

సుకేశి

1 - కర్మణా నరకానేతాన్ కేనగచ్చంతివై కథామ్

 ఏతద్వదంతు విప్రేంద్రాః పరంకౌతూహలం మమ

సుకేశి

ఓ విప్రశ్రేష్టులారా! ఏ ఏ కర్మలు చేస్తే ఈ నరకాలు సంభవిస్తాయి? వినాలని కుతూహలంగా ఉంది. చెప్పండి.

ఋషులు

2 - కర్మణాయేనయేనేహ యాంతిశాలకటంకట

 స్వకర్మఫలభోగార్థం నరకాన్ మేశృణుష్వతాన్

3 - వేదదేవద్విజాతీనాం యైర్నిందాసతతంకృతా

 యే పురాణేతిహాసార్థాన్ నాభినందంతి పాపినః

4 - గురునిందాకరాయే చ మఖవిఘ్నకరాశ్చయే

 దాతుర్నివారకాయే చ తేతేషునిపతంతిహి

5 - సుహృద్దంపతిసోదర్య స్వామిభృత్య పితాసుతాన్

 యాజ్యోపాద్యాయయోర్యైశ్చ కృతోభేదోదమైర్మిథః

6 - కన్యామేకస్యదత్వా చ దదాత్యన్యస్యయేధమాః

 కరపత్రేణపాట్యంతే తేద్విధా యమకింకరైః

7 - పరోపతాపజనకా శ్చందనోశీరహారిణః

 వాలవ్యజనహర్తారః కరంభసికతాశ్రితాః        

8 - నిమంత్రితోస్యతో భుంక్తేశ్రాద్దేదైశేసపైతృకే

 నద్విదాకృష్యతేమూఢ స్తీక్ష్ణతుండై: ఖగోత్తమైః

9 - మర్మాణియస్తుసాధూనాం తుదన్ వాగ్బిర్నికృంతతి

 తస్యోపరితుదంతస్తు తుండై స్తిష్ఠంతి పత్రిణః  

10 - యఃకరోతి చ వైశున్యం సాతూనామన్యథామతిః

 వజ్రతుండనఖాజిహ్వా మాకర్షంతేస్యవాయసాః

11 - మాతాపితృగురూణాం చ యే వజ్ఞాం చక్రురుద్దతాః

 మజ్జంతే వూయవిణ్మూత్రే త్వప్రతిష్టేహ్యదోముఖాః

12 - దేవతాతిథిభూతేషు భృత్యేష్వభ్యాగతేషు చ

 ఆభుక్తవత్సు యేశ్నంతి బాలపిత్రగ్నిమాతృషు

13 - దుష్టాసృక్పూయనిర్యానం భుంజంతేత్వధమాఇమే

 సూచీముఖాశ్చ జాయంతే క్షుధార్తాగిరివిగ్రహాః

14 - ఏకపంక్త్యుపవిష్టానాం విషమంభోజయంతియే

 విద్భోజనం రాక్షసేంద్ర నరకంతే వ్రజంతి చ

15 - ఏకసార్థప్రయాతంయే పశ్యంతశ్చార్థినం నరాః

 అసంవిభజ్యభుoజoతి తేయాంతి శ్లేష్మభోజనమ్

16 - గోబ్రాహ్మణాగ్నయః స్పృష్టాయై రుచ్చిష్టై: క్షపాచర

 క్షిప్యంతేహికరాస్తేషాం తప్తకుంభే సుదారుణే

ఋషులు

సుకేశీ! ఏ ఏ దుష్టకర్మలు చేస్తే యీ నరకాలు కలుగుతాయో, అంతా వివరంగా విను. ఎల్లవేళలా వేదాలను విప్రులను నిందిస్తూ పురాణేతిహాసాలనుద్వేషించే పాపులు, గురువులను దూషించేవారు, యజ్ఞాలు ద్వంసం చేసేవారు, దాతలను దానంచేయకుండా నివారించేవారు అందరూ ఈ నరకాల్లోపడతారు. స్నేహితులను, దంపతులను, అన్నదమ్ములను, స్వామిసేవకులను, పితాపుత్రులను, యాజ్ఞికోపాధ్యాయులను, దుర్భుద్భితో విడదీసేవారు, ఒకనికి తన కూతునిత్తునని చెప్పి యివ్వక మరొకరికి యిచ్చే అధములు, వీరందరను యమకింకరులు రంపాలతో రెండు ముక్కలుగా చీలుస్తారు. పరులకు తాపంకలిగించే వారు, చందనం, ఉశీరం (వట్టివేరు) చామరవ్యజనాలు, దొంగిలించేవారు, కరంభసికత నరకానికి పోతారు. శ్రాద్దనిమంత్రణం స్వీకరించి, మరొక చోట భుజించువారలను భయంకరఖగాలు తమ ముక్కులతో ముక్కలు ముక్కలుగా చీలుస్తాయి. మర్మవేధకాలయిన నిందావాక్యాలతో సాధువుల మనస్సులు నొప్పించు దుర్మార్గుల నెత్తిపై వ్రాలి గ్రద్దలు ముక్కులతో బయటకు లాగి చీల్చుతాయి. ఏ పొగరు బోతులు తలిదండ్రులను గురుజనులను అవమానిస్తారో, వారలు మలమూత్రాదులతో నిండిన అప్రతిష్టమనే నరకకూపాల్లో ముంచబడతారు. దేవతలకు, అతిథులకు, జీవాలకు, సేవకులకు అభ్యాగతులకు, బాలురకు, పితృదేవతలకు అగ్నికి పెట్టకుండా తాముభుజించే అధములు, చీము రక్తంతో కలిపిన మాంసాహారాన్ని, నోటినిండా సూదులు గ్రుచ్చబడుటచే, తినలేక ఆకలి తీరక వేదనతో ఆక్రోశిస్తూ ఉంటారు.వాళ్ళ శరీరాలు ఉబ్బిపోయి వికృతంగా ఉంటాయి. ఒకే పంక్తిలో కూర్చున్న వారికి పక్షపాతంతో భేదదృష్టితో వడ్డించే నీచులు, విధ్భోజనం అనే నరకంలో పక్షుల రెట్టలకుప్పలలో పడిపోతారు. పలువురతో కలిసి ప్రయాణం చేయునపుడు దారిలో తాము తెచ్చుకొన్న తినుబండారాలను యితరులతో పంచుకొనక తనే భుజించువారు శ్లేష్మభోజన ‘నరకగాములౌతారు. ఎంగిలి చేతులతో గోవులను బ్రాహ్మణులను పవిత్రాగ్నులను ముట్టుకునే వారి చేతులను ఎర్రగా క్రాగిపోయే కుంభాలలో వేసి కాల్చుతారు.

17 - సూర్యేందుతారకా దృష్టా యైరుచ్చిష్టైశ్చకామతః

 తేషాంనేత్రగతోవహ్ని ర్దమ్యతే యమకింకరైః

18 – మిత్రజాయాభఛగినీ జ్యేష్టోభ్రాతాపితాస్వసా

 జామయోగురవోవృద్దాయైః సంస్పృష్టాఃసదా నృభిః

19 - బద్దాంఘ్రయస్తే నిగడై ర్లోహై ర్వహ్నిప్రతాపితైః

 క్షిప్యంతే రౌరవేఘోరే హ్యాజాసుపరిదాహినః

20 - పాయసంకృశరం మాంసం వృథాభుక్తాని యైర్నరైః

 తేషామయోగుడాస్తప్తాః క్షిప్యంతే వదనే ద్భుతాః

21 - గురుదేవ ద్విజాతీనాం వేదానాంచనరాధమైః

 నిందానిశామితాయైస్తు పాపానామితి కుర్వతామ్

22 - తేషాంలోహమయాః కీలా వహ్నివర్ణాః పునః పునః

 శ్రవణేషునిఖస్యంతే ధర్మరాజస్య కింకరైః

23 - ప్రసాదేవకులారామాన్ విప్రవేశ్మ సభామఠాన్

 కూపవాపీతడాగాంశ్చ భంక్త్వావిద్వంసయంతియే

24 - తేషాం విలపతాంచర్మ దేహతః క్రియతే పృథక్

 కర్తికాభిః సుతీక్ష్ణాభిః సురౌద్రైర్యమకింకరైః

25 - గోబ్రాహ్మణార్క మగ్నించ యేవై మేహంతిమానవాః

 తేషాంగుదేనా చాంత్రాణి వినికృంతంతివాయసాః

26 - స్వపోషణ పరోయన్తు పరిత్యజతిమానవః

 పుత్రభ్రుత్యకళత్రాది బంధువర్గమకించనమ్

 దిర్పిక్షసంభ్రమేచాపి సశ్వభోజ్యేనిపాత్యతే

27 – శరణాగతంయేత్యజంతి యెచబంధనపాలకాః

 పతంతియంత్రపీడేతే తాడ్యమానాస్తుకింకరైః

28 - క్లేశయంతిహి విప్రాదీన్ యేహ్యకర్మసు పాపినః

 తే పిష్యంతే శిలాపేషే శోష్యంతేపి చ శోషకైః

29 - న్యాసాపహారిణః పాపా బధ్యoతే నిగడై

 రపి క్షుత్ క్షామాః శుష్కతాల్వోష్ఠాః పాత్యంతే వృశ్చికాశనే

30 - పర్వామైథునినః పాపాః పాదారరతాశ్చ యే

 తే వహ్నితప్తాం కూటాగ్రా మాలింగంతే చ శాల్మలీమ్

31 - ఉపాద్యాయ మదఃకృత్య యైరదీతం ద్విజాధమైః

 తేషామద్యాపకో యశ్చ సశిలాం శిరసావహేత్

32 - మూత్రశ్లేష్మపురీషాణి యైరుత్సృష్టాని వారిణి

 తేపాత్యంతే చ విణ్మూత్రే దుర్గందే పూయపూరితే       

33 - శ్రాద్దాతిథేయమన్యోన్యం యైర్భుక్తం భువిమాన వైః

 పరస్పరం భక్షయంతే మాంసాని స్వాని బాలిశాః

34 - వేదవహ్ని గురుత్యాగీ భార్యాపిత్రో స్తథైవ చ

 గిరిశ్రుంగాదదః పాతం పాత్యంతేయమకింకరైః

35 - పునర్భూపతాయో యే చ కన్యావిద్వంసకాశ్చ యే

 తద్గర్బశ్రాద్ధభుగ్యశ్చ కృమీన్బక్షే త్పిపీలికాః

36 - చాండాలదంత్యజాద్వాపి ప్రతేగృహ్ణతి దక్షిణామ్

 యాజకో యజమానశ్చ సో శ్మాంతః స్థూలకీటకః

37 - పృష్ఠమాంసాశినో మూడా స్తథైవోత్కోచ జీవినః

 క్షిప్యంతే వృకభక్షేతే నరకే రజనీ చరః     

38 - స్వర్ణస్తేయీ చ బ్రహ్మఘ్నః సురాపో గురుతల్పగః

 తథాగోభూమిహర్తారో గోస్త్రీబాలహనాశ్చయే

39 - ఏతేనరాద్విజా యేచ గోషు విక్రయిణస్తథా

 సోమవిక్రయిణో యేచ వేదవిక్రయిణస్తథా     

40 - కూటసభ్యాస్త్వశౌచాశ్చ నిత్యనైమిత్తనాశకాః

 కూటసాక్ష్యప్రదాయే చ తే మహారౌరవే స్థితాః

అశుచిగా ఉంటూ ఎంగిలి నోటితో చేతులతో, ఎవరైతే సూర్యుని చంద్రుని నక్షత్రాలను కావలయునని చూచెదరో వాళ్ళ నేత్రాగ్నిని (జ్యోతిని-చూపును) యమకింకరులు లాగివేస్తారు. మిత్రుని భార్యను, తన తల్లిని, అగ్రజుని, తండ్రిని, తోబుట్టువును, కుమార్తెను, చుట్టపు ఆడువారిని, గురువులను, పెద్దలను ఎవరు తమ కాలితో తాకుదురో ఆ పాపుల పాదాలను యినుప సంకెళ్ళతో కట్టి మోకాళ్ళ వరకు అగ్నిలో కాచి రౌరవనరక జ్వాలల్లో తోసేస్తారు. పాలలో వండిన పరమాన్నాన్ని, మాంసాన్ని భగవన్నివేదనము చేయకుండా భుజించే వారినోళ్ళలో, నిప్పులో కాచిన యినుప గుండ్లను కుక్కుతారు. గురుదేవ బ్రాహ్మణులను వేదాలను గురించి చేసే నిందా వాక్యాలను ఓపికగా వినే పాపుల చెవులలో యమదూతలు, ఎర్రగా కాల్చిన మేకులు గ్రుచ్చుతారు. చలివేంద్రాలను, దేవకులాలను, గుడులను, తోటలోని చెట్లను, బ్రాహ్మణుల యిండ్లను, సభామంటపాలను, మథాలను, బావులను చెరువులను, కూల్చినాశనం చేసే సంఘద్రోహుల చర్మాలను పదునైన కత్తులతో ఒలిచి, యమదూతలు, బాధతో పెద్దగా విలపించే వారలను క్రూరంగా హింసిస్తారు. ఆవులకు బ్రాహ్మణులకు సూర్యునకు అగ్నికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జనము చేయువారల గుదస్తానాన్ని ముక్కులతో చీల్చికాకులు లోపలి ప్రేవులను బయటకు లాగుతాయి. కరువు కాటక పరిస్థితుల్లో తన తలిదండ్రులను పుత్ర భ్రుత్యబార్యా బాంధవులను అన్నార్తులుగా వదలి పెట్టి తానొక్కడే కడుపు నింపుకునే వాడు శ్వభోజనమనే నరలోకానికి పోతాడు. శరణు జొచ్చిన వారిని వదలివేయువాడు, యితరులను చెరసాలలలో బంధించువారు ‘యంత్రపీడ’ మనే నరకంపాలౌతారు. ఏ ప్రయోజనం లేకుండా ఉబుసుపోకకు విప్రులను యితరులను బాదించే పాపులను యమదూతలు శిలాయంత్రాల్లో పిండి పిండిగా విసిరినిప్పుల మీద కాలుస్తారు. తమ వద్దదాచుకొన్న యితరుల సొమ్ము అపహరించే దురాత్ములు, ఆకలితో ఎండిన నాలుకలతో అక్రోశిస్తూంటే, వారలను యమదూతలు సంకెళ్ళతో బంధించి వృశ్చికాశనమనే నరకంలో తోసేస్తారు. పర్వదినాల్లో స్త్రీ సంగమం చేసేవారిని, పరస్త్రీలను చెరిచే వారిని, శాల్మలి అనే నరకంలోనికి త్రోసి వారల చేత అక్కడ భగభగమండే మేకులతో కూడిన యినుపస్తంభాలను ఆలింగనం చేయిస్తారు. ఉపాధ్యాయుని కన్న ఎత్తైన ఆసనం మీద కూర్చొని అధ్యయనంచేసిన శిష్యులూ ఆ గురువూ యిద్దరూ తమనెత్తిమీద రాతిబండలు మోయవలసి వస్తుంది. నీళ్ళలో మలమూత్ర విసర్జనం, నిష్టీవనం చేసే వారలను విణ్మూత్ర మనే దుర్గంధ పూర్ణమైన నరకంలోకి తోసివేస్తారు. శ్రాద్దాది కార్యాలలో పరస్పరం ఒకరింటికొకరువెళ్ళి భోజనము చేయు మూర్ఖులు, పరస్పరం ఒకరి మాంస మొకరు తినవలసి ఉంటుంది. వేదాలను, అగ్నులను, గురువులను, భార్యా, పితరులను వదలి పెట్టే పాపులను యమకింకరులు గిరిశిఖరాల నుంచి క్రిందకు పడద్రోయుదురు. విధవలను పెండ్లాడువారు, కన్యలను చెరచువారు, అట్టివారల పితృదేవతలతో సహా మురికి గుంటలలోని పురుగులను చీమలను భక్షించగలరు. శూద్రచండాలుర నుంచి దక్షిణలు తీసికొనిన పురోహితుడు ఆ పురోహితుని నియమించిన యజమానీ యిద్దరూ శిలా గర్భంలో పురుగులయి జన్మిస్తారు. లంచగొండులూ పృష్టమాంస భుక్కులూ, ఓ దైత్యేశ్వరా! వృక్షభక్షమనే నరకంలో పడతారు. బంగారం దొంగిలించువారు, బ్రాహ్మణులను చంపువారు, సురాపానం చేయువారు, గురువు భార్యను పొందువారు, యితరుల గోవులను భూములను అపహరించువారు, గోవులను స్త్రీలను శిశువులను చంపువారు, సోమ విక్రయం వేద విక్రయం చేసే విప్రులు, మోసగాళ్ళు, అపవిత్రులు, నిత్య నైమిత్తికాదులు వదలినవారు, తప్పుడు సాక్ష్యం చెప్పువారు, మహారౌరవ నరకాన్ని పొందుతారు.

41 - దశవర్షసహస్రాణి తావత్ తామిన్రకే స్థితాః

 తావచ్చైవాందతామిస్రే అసిపత్రవనే తతః

42 - తావచ్చైవఘటీయంత్రే తప్తకుంభే తతఃపరమ్

 ప్రపాతోభవతే తేషాం యైరిదందుష్కృతం కృతమ్

43 - యేత్వేతే నరకారౌద్రా రౌరవాద్యాస్తవోదితాః

 తేనర్వేకరమశః ప్రోక్తాః కృతఘ్నేలోకనిందితే

వీరంతా పదేసి వేల సంవత్సరాలు తామిస్రక, అంధతామిస్ర అసిపత్రవన, ఘటీయంత్ర, తప్తకుంభ నరకాలలో వరుసగా యాతనలనుభవిస్తారు. నేను వివరించిన ఈ నరక యాతనలన్నీ వరసగా క్రుతఘ్నులు లోకనిందకులు గూడ అనుభవిస్తారు.

44 - యథాసురాణాం ప్రవరోజనార్దనో యథాగిరీణామపి శైశిరాద్రిః

 యథా యుదానాం ప్రవరం సుదర్శనం యథాఖగానాం వినతాతనూజః

 మహోరగాణాం ప్రవరోప్య నంతో యథా చ భూతేషుమహీవ్రధానా

45 - నదీషు గంగా జలజేషు పద్మం సురారిముఖ్యేషు హరాంఘ్రి భక్తః

 క్షేత్రేషుయద్వత్కురుజాంగలంవరం తీర్తేషుయద్వత్ప్రవరం పృథూదకమ్     

46 - నరస్సు చైవోత్తరమానసం యథా వనేషుపుణ్యేషుహినందనం యథా

 లోకేషుయద్వత్పదనం విరించేః సత్యంయథాదర్మవిధిక్రియాసు

47 - యథాశ్వమేధః ప్రవరఃక్రతూనాం పుత్రోయథాస్పర్శవతాం వరిష్టః

 తపోధనానామపి కుంభయోనిః శ్రుతిర్వరాయద్వదిహాగమేషు

48 - ముఖ్యఃపురాణేషు యథైవ మాత్స్యః స్వాయంభువో క్తిస్త్వపి సంహితాసు

 మనుః స్మృతీనాం ప్రవరోయథైవ తిథీషుదర్శో విషువేషుదానమ్

49 - తేజస్వినాం యద్వదిహార్కఉక్తో ఋక్షేషుచంద్రో జలధిర్ హ్రదేషు

 భవాన్ యథా రాక్షససత్తమేషు పాషేశునాగః స్తిమితేషు బందః

50 - దాన్యేషుశాలి ర్ద్విపదేషువిప్రః చతుష్పదేగౌఃశ్వపథాం మృగేంద్రః

 పుష్పేషు జాతీ నగరేషుకాంచీ నారీషురంభా శ్రమిణాంగృహస్థః

51 - కుశస్థలీ శ్రేష్ఠతమాపురేషు దేశేషు సర్వేషు చ మధ్యదేశః

 ఫలేషు చూతోముకులేష్వశోకః సర్వౌషదీనాం ప్రవరాచపథ్యా

52 - మూలేషుకందః ప్రవరోయథోక్తో వ్యాదిష్వజీర్ణంక్షణదా చరేంద్ర

 శ్వేతేషు దుగ్ధం ప్రవరంయథైవ కార్సాసికం ప్రావరణేషు యద్వత్

53 - కళాసుముఖ్యాగణితజ్ఞతాచ విజ్ఞానముఖ్యేషు యథేంద్రజాలమ్

 శాకేషుముఖ్యాత్వపికాకమాచీ రసేషుముఖ్యం లవణం యథైవ

54 - తుంగేషుతాలో నలినీషుపంపావనౌకనేష్వేవచ ఋక్షరాజః

 మహీరుహేష్వేవయథావటశ్చ యథాహరో జ్ఞానవతాం వరిష్టః

55 - యథాసతీనాంహిమవత్సుతాహి యథార్జునీనాం కపిలావరిష్టా

 యథావృషాణామపి నీలవర్ణో యథైవసర్వేష్వపి దుఃసహేషు

 దుర్గేషు రౌద్రేషు నిశాచరేశ నృపాతనం వైతరణీప్రదానా

56 - పాపీయసాంతద్వదిహకృతఘ్నః సర్వేషు పాపేషు నిశాచరేంద్ర

 బ్రహఘ్నగోమ్నాదిషు నిష్కృతిర్హి విద్యేతనైవాస్యతు దుష్టచారిణః

 ననిష్కృతిశ్చాస్తి కృతఘ్నవృత్తేః సుహృత్కృతంనాశయతోబ్దకోటిభిః       

రాక్షసేంద్రా! దేవతలందరిలో శ్రేష్ఠుడు జనార్దనుడైనట్లు, పర్వతాల్లో హిమవంతంవలె, ఆయుధాల్లో సుదర్శనం మాదిరి, పక్షులలో గరుత్మంతుని వలె, జాతి సర్పాల్లో అనంతునికి వలె, భూతాల్లో ప్వథ్వివలె, నదులలో గంగ, జలజాల్లో పద్మం ఎలా శ్రేష్ఠములో అసురులలో శివభక్తుడెట్లో, క్షేత్రాల్లో కురుజాంగలం, తీర్థాలలో పృథూదకం, సరస్సులలో మానసం, వనాల్లో నందనవనం, లోకాల్లో బ్రహ్మలోకం, ధర్మాదిక్రియాలలో సత్యం ఏ విధంగా శ్రేష్ఠమైనవో, యజ్ఞాల్లో అశ్వమేధం, ప్రియబంధువులలో పుత్రుడు, తపస్వులలో అగస్త్యుడు ఎలా ముఖ్యులో, ఆగమాల్లో వేదాలు, పురాణాల్లో మత్సపురాణం, సంహితలలో స్వాయంభువసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులలో అమావాస్య, విషునాల్లో దానం ఎంత శ్రేష్టాలో, తేజఃపుంజాల్లో సూర్యుడెట్లో, నక్షత్రాల్లో చంద్రుడెట్లో, జలాశయాల్లో సముద్రం ఎట్లు ముఖ్యమో, రాక్షసవర్యులలో నీ వెట్లో, పాశాల్లో నాగపాశం, స్తిమితులలో బంధితుడు, దాన్యాలలో వరి, ద్విపాత్తులలో విప్రుడు, చతుష్పాత్తులలో ఆవు, శ్వాపదాల్లో సింహం, పుష్పాల్లో జాజి, నగరాల్లో కాంచీ, స్త్రీలలో రంభ, ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం, పురములలో కుశస్థలి , దేశాల్లో మధ్యదేశం, ఫలాల్లో మామిడి, మొగ్గలలో అశోకం, ఔషదాల్లో హరీతకి (కరక్కాయ), గడ్డలలో కంద ఎట్లు ఉత్తమములో, వ్యాధులలో అజీర్ణ రోగం, తెల్లని వానిలో పాలు, బట్టలలో నూలు (ప్రత్తి) వస్త్రాలు, కళలలో గణితం, విజ్ఞానాల్లో మహేంద్రజాలం, శాకాలలో కాకమాచి (ఆకుకూర), షడ్రసాలలో లవణం, ఎత్తైన చెట్లలో తాళం, పద్మ సరస్సులలో పంపాసరం, వనచరాలలో జాంబవంతుడు, వృక్షాల్లో వటం, జ్ఞానులలో శివుడు ఎలా శ్రేష్టులో, పతివ్రతలలో పార్వతి, ఆవులలో కపిలగోవు, ఎడ్లలో గూడనీలపుటెద్దు ఎలా శ్రేష్టాలో, భరింపరాని నరకాలన్నింటిలో వైతరణి ఎంత దుస్తరమైనదో అట్లే ఓ నిశాచరపతీ! పాపులందరలో కృతఘ్నుడు పరమనికృష్టుడు! కృతఘ్నత్వం సర్వపాపాల్లో భయంకరమైంది. బ్రహ్మహత్య గోహత్యా పాతకాలకైనా నిష్కృతి (ప్రాయశ్చిత్తం) ఉండవచ్చుగాని, స్నేహితులొనరించుమేలు మరచిన కృతఘ్నుడికి కోటి సంవత్సరాలకైనా నిష్కృతి లేదు. ఇది నిజం.

అధ్యాయము 12 complete