అధ్యాయము 64

పులస్త్య

1 - తతః సమాగచ్ఛతి వాసుదేవే మహీ చకంపే గిరయశ్చ చేలుః

క్షుభ్ధాః సముద్రా దివి ఋక్ష మండలో బభౌ విపర్యస్త గతి ర్మహర్షే

2 - యజ్ఞః సమాగా త్పర మాకులత్వం న వేద్మి కిం మే మదుహా కరిష్యతి

యధా ప్రదగ్దోऽసిమ మహేశ్వరేణ కిం మాం న సంధక్ష్యతి వాసుదేవః

3 - ఋక్సామ మంత్రాహుతి భి ర్హుతాది భి ర్వితానకీయాన్ జ్వలనాస్తు భాగాన్

భక్త్యా ద్విజేంద్రై రపి సంప్రపాదితాన్ నైవ ప్రతీచ్ఛంతి విభో ర్భయేన

4 - తాన్ దృష్ట్యా ఘోరరూపాంస్తు ఉత్పాతాన్ దానలేశ్వరః

పప్రచ్చోశనసం శుక్రం ప్రణిపత్య కృతాంజలిః

5 - కిమర్ధ మాచార్య! మహీ సశైలా రంభేవ వాతాభి హతా చచాల

కిమా సురీయాన్ సుహుతా నపీహభాగాన్ న గృహంతి హుతాశనాశ్చ

6 - క్షుభ్ధాః కిమర్ధం మకరాలయాశ్చ భో! ఋక్షా నభే కింప్రచరంతి పూర్వవత్

దిశః కిమర్ధం తమసా పరిప్లుతా దోషేణ కస్యాऽద్య వదస్వ మే గురో

పులస్త్యుడు

నారదా ! అలా భగవంతు డగు విష్ణుడు బయలు దేరగానే భూమి కంపించింది ! పర్వతాలు కదలి పోయాయి సముద్రాలు క్షోభించాయి ! నక్షత్ర మండల మంతా తమ గతులు తప్పాయి. యజ్ఞం చాలా కలవర పడి పోయింది అయ్యో! మధుసూధనుడు నన్నేమి చేయనున్నాడో గదా! పూర్వం మహేశ్వరునకు వలె ఈ వాసు దేవుడు గూడ నన్ను దగ్ధం చేస్తాడా ఏమి! ఋక్సామ మంత్రాలతో బ్రాహ్మణులు చక్కగా సమర్పించి నప్పటికీ ఆ ప్రభువునకు భయపడి యజ్ఞా గ్నులాహవిర్భాగా లను స్వీకరించ లేదు. ఆ భయంకర ఉత్పాతాలను చూచి దైత్య నాయకుడగు బలి చేతులు జోడించు కొని శుక్రాచార్యులతో యిలా అన్నాడు ఆ చార్య వర్యా! గాలి తాకిడికి కదలి పోయే అరటి చెట్టు మాదిరి భూమి చలిస్తోంది. మన అసురులు సమర్పించే మంత్ర పూతా లయిన హవిస్సులను అగ్నులు స్వీకరించడం లేదు అందువలన పర్వతాలు ఊగి పోతున్నాయి! సముద్రాలు క్షోభిస్తున్నాయి. ఆకాశాన ఎప్పటి వలె నక్షత్రాలు సంచరించడం లేదు. దిక్కులు తెలివి తప్పి పోతున్నాయి. ఎవరి దోషం వల్ల ఈ విపరీతాలు జరుగుతున్నాయో దయతో సెలవీయండి.

పులస్త్య

7 - శుక్ర స్తద్వాక్య మాకర్ణ్య విరోచన సుతేరితమ్

అధ జ్ఞాత్వా కారణం చ బలిం వచన మబ్రవీత్

పులస్త్యుడు

బలి మాటలు విని ఆ శుక్రుడు అందులకు కారణాలు గ్రహించి శిష్యునితో యిలా హితం పలికాడు.

శుక్ర

8 - శృణుష్వ దైత్యేశ్వర! యేన భాగాన్ నమీ ప్రతీ చ్చంతి హి ఆసురీయాన్

హుతాశనా మంత్ర హుతా నపీహ నూనం సమాగచ్చతి వాసుదేవః

9 - తదంఘ్రి విక్షేప మపారయంతీ మహీ సశైలా చలితా దితీశ!

తస్యాం చలత్యాం మకరాలయామి ఉద్వృత్త వేలా దితిజాద్య జాతాః

శుక్రుడు

దైత్యేశ్వరా ! చక్కగా వ్రేల్చ బడి ననూ హవిర్భాగా లను అగ్నులు స్వీకరించక యున్నవనుచో యిచ్చటకు వాసుదేవుడు తప్పక వస్తూ ఉండాలి. ఆయన అడుగుల భారాన్ని వహించ లేకనే పర్వతాలతో కూడిన భూమి కంపిస్తోంది. ఓ రాజేంద్రా! ఆయన నడుస్తూ ఉంటే సముద్రాలన్నీ క్షోభించి చెలియ కట్టలు దాటుతున్నాయి.

పులస్త్య

10 - శుక్రస్య వచనం శ్రుత్వా బలి ర్భార్గవ మబ్రవీత్

ధర్మం సత్యం చ పథ్యం చ సర్వోత్సాహ సమీరితమ్

పులస్త్యుడు

శుక్రుని మాటలు విని బలి ఆ భార్గవుని తో మహా ఉత్సాహ పూరితుడై సత్య ధర్మ సహితాలూ హితకరాలు అయిన మాటలన్నాడు.

బలి

11 - ఆయాతే వాసు దేవే వద మమ భగవన్ ధర్మ కామర్థ తత్త్వం

 కిం కార్యం కించ దేయం మణి కనక మథో భూ గజాశ్వాది కం వా

కిం వా వా చ్యం మురారే ర్నిజ హిత మధవా

 తద్ధితం వా ప్రయుంజే తథ్యం పథ్యం ప్రియంభో ! మమ పద శుభదం తత్కరిష్యేన చాऽన్యత్

బలి

భగవన్! వాసుదేవుడే వస్తున్నప్పుడు ధర్మార్ధ కామ సమ్మితంగా నేను చేయ వలసిన కర్తవ్య మేదో యివ్వవలసినది భూగజాశ్వమణి కనకాది సంపద ఏదో ఆ ప్రభువు తోనేమి మాట్లాడ నగునో, స్వలాభము, ఆయన లాభము, వీనిలో దేనిని అనుష్ఠించవలెనో, ఈ విషయాలన్నీ నాకు ప్రియకరంగా, హిత కరంగా, సత్య విహితంగా సెలవివ్వండి.

పులస్త్య

12 - తద్వాక్యం భార్గవః శ్రుత్వా దైత్య నాధేరితం వరమ్

విచింత్య నారద! ప్రాహ భూత భవ్య విదీశ్వరః

13 - త్వయా కృతా యజ్ఞ భుజోऽసురేంద్రా బహిష్కృతా యే శ్రుతి దృష్ట మార్గే

శ్రుతి ప్రమాణం మఖ ఖోజినో బహిః సురా స్తదర్ధం హరి రభ్యుపైతి

14 - తస్యా ద్వరం దైత్య సమాగతస్య కార్యం హి కి మాం పరిపృచ్చసే యత్

కౌర్యం న దేయం హి ప్రభో! తృణాగ్రం యదధ్వరే భూ కనకాదికం వా

15 - వాచ్యం తధా సామ నిరర్ధకం విభో! కస్తే వరం దాతు మలం హి శక్నుయాత్

తస్యోదరే భూర్భువ నాక పాల రసాత లేశా ని వసంతి నిత్యశః

పులస్త్యుడు

దైత్య నాధుని ఉత్తమ వచనం విని త్రికాల జ్ఞాని అయిన ఆ భార్గవుడు బాగా యోచించి యిలా అన్నాడు అసురేంద్రా! శ్రద్ధగా వినుము వేదాలు అసురులకు యజ్ఞభాగ భోక్తృత్త్వాని నిషేధించినవి శ్రుతి ప్రమాణంగా ఆ యజ్ఞ భాగార్హు లయిన దేవతలు ఈనీయజ్ఞంలో తిరస్కరింప బడినారు. వేదోక్తంగా దేవతలకు వారి భాగాలు యివ్వక పోవడం అందుకు వ్యతిరేకంగా దైత్యులకు హవిస్సులు యివ్వడం చూచి శ్రీ హరి వచ్చు చున్నాడు ఆయన యజ్ఞానికి వచ్చినపుడే మి చేయ వలెనని నీవు నన్నడిగితివి అందుకు నా సమాధానం విను ప్రభూ! ఆ విష్ణువుకు ఈ యజ్ఞంలో భూకనకాదులనేల కడ కొక గడ్డి పరక కొన (తృణా గ్రం) కూడా నీవు యివ్వకూడదు. అయితే తియ్యగా వ్యర్థపు మాటలు సామ ధోరణిలో ఆయనతో యిలా అనాలి. ఎవరి ఉదరంలో భూర్భువస్వర్లోకాల పాలకులు, రసాతలాధీశులు, ఎప్పుడూ నివసిస్తూ ఉంటారో, అటువంటి నీకు ఎవరు మాత్రం ఏమి యివ్వగలరు ప్రభూ! శుక్రుని హిత భోధ విని వదాన్యు డగు బలి యిలా అన్నాడు. ఓ భార్గవా ! నేను యింతవరకు ఎలాంటి హీన శీలుడు వచ్చి చేయి చాచినా నా దగ్గర ఏమీ లేదు, నీకే మీ యివ్వదలచను పొమ్మని ఏనాడూ అనలేదు. అలాంటప్పుడు లోకేశ్వరు డగు జనార్దనుడే వచ్చి ఆర్థిస్తే ఎలా కాదనగలను ఆచార్యా!

బలి

16 - మయా నచోక్తం వచనం హి భార్గవ ! న చాస్తి మహ్యం న చ దాతు ముత్సహే

సమాగతేऽప్యర్థిని హీన వృత్తే జనార్దనే లోక పతౌ కథం తు

17 - ఏవం చ శ్రూయతే శ్లోకః సతాం కథయతాం విభో

సద్భావో బ్రాహ్మణే ష్వేవ కర్త వ్యో భూతి మిచ్చతా

దృశ్య తే హి తథా తచ్చ సత్యం బ్రాహ్మణ సత్తమ

18 - పూర్వా భ్యాసేన కర్మాణి సంభవంతి నృణాం న్పుటమ్

వాక్కాయ మానసానీ హ యోన్యంతర గతాన్యపి

19 - కిం వా త్వయా ద్విజ శ్రేష్ఠ పౌరాణీ న శ్రుతా కథా

యా వృత్తా మలయే పూర్వం కోశ కార సుతస్య తు

బలి

ఐశ్వర్యం కాంక్షించు వారందరు బాహ్మణు లను గౌరవించ వలె నను పెద్దల సూక్తి ఒకటి కలదు. అది నిజమని ప్రపంచంలో కనిపిస్తూంది. పూర్వాభ్యాసవశాన జన్మాంతరాన గూడ పూర్వ జన్మపు అలవాట్లు మనోవాక్కాయాలలో వెంట నంటి యుంటాయని స్ఫుటంగా తెలుస్తుంది. ఓ ద్విజోత్తమా ! తాము పూర్వం మలయ పర్వతాన జరిగిన కోశ కార పుత్రుని వృత్తాంతం విన లేదా!

శుక్ర

20 - కథయస్వ మహా బాహో కోశ కార సుతాశ్రయామ్

కథాం పౌరాణి కీం పుణ్యాం మహా కౌతూహలం హి మే

శుక్రుడు

అది విని శుక్రుడు బలి తో ఓ మహాభుజా ! ఆ గాథ ఏమో నేను వినలేదు. నీవు వినిపించుము. వినవలె నని చాలా కుతూహలంగా ఉంది.

బలి

21 - శ్రుణుష్వ కథయిష్యామి కథా మేతాం మఖాంతరే

పూర్వాభ్యాస నిబద్ధాం హి సత్యాం భృగుకులోద్భవ!

22 - ముద్గలస్య మునేః పుత్రో జ్ఞాన విజ్ఞాన పారగః

కోశకార ఇతి ఖ్యాత ఆసీద్ బ్రహ్మన్ స్తపోరతః

23 - తస్యాసీ ద్దయితా సాధ్వీ ధర్మిష్ఠో నామతః శ్రుతా

సతీ వాత్స్యాయన సుతా ధర్మ శీలా పతివ్రతా

24 - తస్యా మస్య సుతో జాతః ప్రకృత్యావై జడాకృతిః

మూక వన్నాలపతి స న చ పశ్యతి చాంధవత్

25 - తం జాతం బ్రాహ్మణి పుత్రం జడం మూకం త్వచక్షుషమ్

మన్యం మానా గృహ ద్వారి షష్ఠే ऽ హని సమురజత్

26 - తతో ऽభ్యగా ద్దురాచారా రాక్షసీ జాత హారిణీ

స్వం శిశుం కృశ మాదాయ సూర్పాక్షీ నామనా మతః

27 - తత్రోత్సృజ్య స్వపు త్రం సా జగ్రాహ ద్విజ నందనమ్

తమాదాయ జగామాధ భోక్తుం శాలోదరే గిరౌ

28 - తత స్తా మాగతాం వీక్ష్య తస్యా భర్తా ఘటోదరః

నేత్రహీనః ప్రత్యువాచ కి మానీత స్త్వయా ప్రియే

29 - సాऽబ్రవీత్ రాక్షసపతే! మయా స్థాప్య నిజం శిశుమ్

కోశ కార ద్విజ గృహే తస్యానీతః ప్రభో ! సుతః

30 - స ప్రాహ న త్వయా భద్రే! భద్ర మాచరితం త్వితి

మహాజ్ఞానీ ద్విజేం ద్రా ऽసౌతతః శప్స్య తికోపితః

31 - తస్మాచ్చీఘ్ర మిమం త్యక్త్వా మనుజం ఘోర రూపిణమ్

అన్యస్య కస్య చిత్ పుత్రం శీఘ్ర మానయ సుందరి

బలి

ఓభృగుకుల శ్రేష్ఠా ! ఈ యజ్ఞ సమయాన పూర్వాభ్యాస బలానికి సంబంధించిన సత్య గాథను వినిపిస్తున్నాను. వినండి బ్రహ్మన్ ! పూర్వం ముద్గల ముని పుత్రుడు జ్ఞాన విజ్ఞాన నిధీ తపో నిరతుడు నగు కోశ కారు డను వాడు గలడు. ఆయన భార్య పేరు ధర్మిష్ఠ. వాత్స్యాయనుని కుమార్తె. ధర్మశీల, సాధ్వి, పతివ్రత, ఆమె వలన నా మునికి జడాకృతి (మొద్దు) అయిన కొడుకు గలిగాడు. ఆ శిశువు మూగవానికి వలె మాటాడక గ్రుడ్డికి వలె చూడక ఉండగా నా బ్రాహ్మణి మూగి, గ్రుడ్డి, మొద్దుగా తలంచి పుట్టిన ఆ రోజున తన యింటి వాకిటి ముందు వదిలేసింది. అంతట అక్కడకు పసి కందుల ను అపహరించే ఒక పాపిష్టి రాక్షసి సూర్పాక్షి అనేది తన బక్క చిక్కిన శిశువుతో వచ్చింది. తన బిడ్డను ఆ వాకిట వదలి. ఆ రక్కసి ఆ బ్రాహ్మణ బాలుని తీసికొని శాలోదర పర్వతం మీద భక్షించేందుకు వెళ్లింది. దాని భర్త గ్రుడ్డి వాడైన ఘటో దరుడను వాడామెను చూచి ప్రియురాలా ! ఏమి తీసి కొని వచ్చావని అడిగాడు. అందుల కది ఓ రాక్షసేశ్వరా! నా బిడ్డను కోశ కారు డను బ్రాహ్మణుని వాకిట వదలి అతని శిశువును తీసుక వచ్చా నని చెప్పగా నాతడు కళ్యాణీ ! నీవు పొరపాటు గావించావు మహాజ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు కోపించెనా! మనలను శపించ గలడు కనుక వెంటనే ఈ ఫెూరాకారుడైన మనుష్య శిశువును వదలి పెట్టి మరొక బాలు నెవరినైన కొని రమ్మనెను.

32 - ఇత్యేవ ముక్తా సా రౌద్రాకాక్షసీ కామ చారిణీ

సమాజ గామ త్వరితా సముత్పత్య విహయసమ్

33 - స చాపి రాక్షస సుతో ని సృష్టో గృహబాహ్యతః

రురోద సుస్వరం బ్రహ్మన్ ప్రక్షిప్యాంగుష్ఠ మాననే

34 - సా క్రందితం చిరా చ్ఛ్రుత్వా ధర్మిష్ఠా పతి మబ్రవీత్

పశ్యస్వ యం మునిశ్రేష్ఠ! సశబ్ద స్తనయ స్తవ

35 - త్రస్తా సా నిర్జగామా ऽథ గృహ మధ్యా త్తపస్వినీ

స చాపి బ్రాహ్మణ శ్రేష్ఠః సమపశ్యత తం శిశుమ్

36 - వర్ణ రూపాది సంయుక్తం యథా స్వ తనయం తథా

తతో విహస్య ప్రోవాచ కోశ కారో నిజాం ప్రియామ్

37 - ఏతేనా విశ్య ధర్మిష్టే భావ్యం భూతేన సాంప్రతమ్

కోऽప్య స్మాకం ఛలయితుం సురూపీ భువి సంస్థితః

38 - ఇత్యుక్త్వా వచనం మంత్రీ మంత్రై స్తం రాక్షసాత్మజమ్

బ బంధోల్లిఖ్య వసుధాం సకుశేనా ద పాణి నా

39 - ఏతస్మి న్నంతరే ప్రాప్తా సూర్పాక్షీ విప్ర బాలకమ్

అంతర్ధాన గతా భూమౌ చిక్షేప గృహ దూరతః

40 - తం క్షిప్త మాత్రం జగ్రాహ కోశకారః స్వకం సుతమ్

సా చా భ్యేత్య గ్రహీతుం స్వం నా శకద్ రాక్షసీ సుతమ్

41 - ఇత శ్చే తశ్చ విభ్రష్టా సా భర్తార ముపాగమ త్

కథయామాస యద్ వృత్తం స్వ ద్విజాత్మజ హారిణమ్

42 - ఏవం గతాయాం రాక్షస్యాం బ్రాహ్మణేన మహాత్మనా

స రాక్షస శిశు ర్బ్రహ్మన్ భార్యా యై వినివేదితః

43 - స చాత్మతనయః పిత్రా కపిలాయాః సవత్సయ

దధ్నా సంయోజితో ऽత్యర్థం క్షీరేణేక్షు రసేన చ

44 - ద్వావేవ వర్థితౌ బాతౌ సంజాతౌ సప్త వార్షికౌ

పిత్రా చ కృత నా మానౌ నిశాకర దివాకరౌ

45 - నైశాచరి ర్దివాకీర్తి ర్నిశాకీర్తిః స్వపుత్రకః

తయో శ్చకార విప్రోऽసౌ వ్రత బంధ క్రియాం క్రమాత్

46 - వ్రత బందే కృతే వేదం పపాఠాऽసౌదివాకరః

నిశాకరో జడతయా న పపాఠేతి నః శ్రుతః

భర్త మాటలు విన్నంతనే కామ చారిణి అయిన ఆ భయంక రక్కసి త్వరగా ఆకాశ మార్గాన ఎగిరి పోయింది. (ఇక అక్కడ) ఇంటి బయట వదలి వేయ బడిన రాక్షస బాలుడు నోటిలో బొటన వ్రేలు పెట్టు కొని మధురంగా ఏడవసాగాడు. చాల సేపు ఆ ఏడుపుని విని ధర్మిష్ట భర్తతో ఓ విప్రోత్తమా! చూడు నీ కుమారునకు మాట వచ్చినది! అంటూ భయంతో యింట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆ బ్రాహ్మణుడు కూడ బయటకు వెళ్లి రూపు రేఖలలో తన పుత్రుని వలెనే ఉన్న ఆ శిశువను చూచి భార్యతో యిలా అన్నాడు. ధర్మిష్ఠా! మన శిశువు నేదో భూతం ఆవేశించి నట్టుంది. మంచి రూపం గలవా రెవరో మనలను వంచించుట కు ఈ భూమి మీద తిరుగుతున్నట్టుంది. మంత్రవేత్త అయిన ఆ కోశ కారుడు అలా అంటూ చేతిలో దర్భకర్ర పట్టుకొని నేల మీద ఏదో మంత్రం వ్రాసి ఆ శిశువును బంధించాడు. ఇంత లోపల ఆ సూర్పాక్షి తిరిగి వచ్చి వారలకు కనిపించ కుండా నా బ్రాహ్మణ బాలకుని యింటి కి దూరంగా నేల మీదకు విసిరేసింది. వెంటనే నేల మీద పడిన తన కుమారు నా కోశ కారుడు పట్టేసు కున్నాడు. ఆ రాక్షసి మాత్రం మంత్ర బద్దుడై న తన శిశువును తిరిగి తీసుకోజాలక అక్కడక్కడా ఎగురుతూ భర్త వద్దకు తిరిగి వెళ్లి బ్రాహ్మణ పుత్రునీ, తన పుత్రునీ యిద్దరినీ పోగొటుకొన్న విషయం చెప్పింది. రాక్షసి వెళ్లిపోయిన పిదప మహాత్ముడగు కోశ కారుడా రాక్షస శిశువును భార్యకు అప్పగించాడు తన పుత్రుని మాత్రం తాను స్వయం కపిల గోవు క్షీరాలు పెరుగూ చెరకు రసం త్రాగిస్తూ చక్కగా పెంచాడు. ఇద్దరు బాలురు పెరిగి ఏడేండ్ల వారయ్యారు. తండ్రి తన పుత్రునకు నిశాకరుడనీ, రాక్షసిపుత్రునకు దివాకరుడనీ పేర్లు పెట్టి వరుసగానిర్వురకూ ఉపనయనాలు చేశాడు ఉపనయనానంతరం దివాకరుడు వేదాధ్యయనం చేస్తే నిశాకరుడనీ, రాక్షసి పుత్రు నకు దివాకరు డనీ పేర్లు పెట్టి వరుసగా నిర్వురకూ ఉపనయనాలు చేశాడు. ఉపనయనానంతరం దివాకరుడు వేదాధ్యయనం చేస్తే, నిశాకరుడు మంద బుద్ది అయినందున, చదువు కోలేకపోయాడు.

47 - తం భమంధవాశ్చ పితరౌ మాతా భ్రాతా గురు స్తథా

పర్యనిందం స్తథా యే చ జనా మలయ వాసినః

48 - తతః స పిత్రా క్రుదేన క్షిప్తః కూపే నిరూదకే

మహా శిలా చోపరి వై పిధాన మవరో పయత్

49 - ఏ వం క్షిప్త స్తదా కూపే బహు వర్ష గణాన్ స్థితః

తత్రా స్త్యామలకీ గుల్మః పోషాయ ఫలి తో ऽభవత్

50 - తతో దశసువర్షే షు నమతీతేషు భార్గవ! తస్య

 మాతాऽగమ త్కూపం తమంధం శిలయా చితమ్

51 - సా దృష్ట్యా నిచితం కూపం శిలయా గిరి కల్పయా

ఉచ్చః ప్రోవాచ కేనేయం కూపోపరి శిలా కృతా

52 - కూపాంతస్థః స తాం వాణీం శ్రుత్వా మాతు ర్నిశాకరః

ప్రాహ ప్రదత్తా పిత్రా మే కూపోపరి శిలా త్వియమ్

53 - సాऽతిభీతాऽబ్రవీత్ కోऽసి కూపాంతస్దోऽద్భుత స్వరః

సోऽస్యాహ తవ పుత్రోऽస్మి నిశాకరేతి విశ్రుతః

54 - సాऽబ్రవీ త్తనయో మహ్యం నామ్నాఖ్యాతో దివాకరః

నిశాకరేతి నామా ऽహో న కశ్చి త్తనయోऽస్తిమే

55 - స చాऽహ పూర్వచరితం మాతు ర్నిరవశేషతః

సా శ్రుత్వా తాం శిలాం సుభ్రూః సముత్ధ ప్యాన్యతోऽక్షిపత్

56 - సోత్తీర్య కూపాద్ భగవన్! మాతుః పాదా వవందత

సా స్వానురూపం తనయం దృష్ట్యా స్వజన మగ్రతః

57 - తత స్తమాదాయ సుతం ధర్మిష్ఠా పతి మేత్య చ

కథయామాస తత్సర్వం చేష్టితం స్వ సుతస్య చ

58 - తతోऽన్వపృచ్చ ద్విప్రోऽసౌ కిమిదం తాత! కారణమ్

నోక్తవాన్ యదృవాన్ పూర్వం మహత్కౌతూహలం మమ

59 - తచ్ఛ్రుత్వా వచనం ధీమాన్ కోశ కారం ద్విజోత్తమమ్

ప్రాహ పుత్రోऽద్భుతం వాక్యం మాతరం పితరం తథా

అతనిని తల్లి దండ్రులు బంధువులు, గురువులు, ఆ మలయ నివాసు లందరూ ఏవగించుకుని నిందించారు, తండ్రి కోపంతో ఆ బాలుణ్ణి ఒక నీరు లేని బావిలో పడ ద్రోసి పెద్ద బండతో దానిని కప్పివేశాడు. అలా ఆ బావిలో పాపమా బాలుడు చాలా ఏండ్లు పడి ఉన్నాడు. దాని మీద ఉసిరికచెట్లు పెరిగి కాయలు కాశాయి. ఆచార్యా! అలా పదేండ్లు గడచిన మీదట వాని తల్లి ఎందుకో ఆ అంధ కూపం వద్దకు వెళ్లి పైన పెద్ద బండను చూచి ఎవరీ బావిని బండతో కప్పి వేశా రని పెద్దగా అరచింది. బావిలో ఉన్న నిశాకరుడు తల్లి స్వరం విని నా తండ్రే నన్నీ బావిలో వేసి శిలతో కప్పి వేశాడని లోపల నుండి చెప్పాడు. ఆ వాణి విని ఆమె భయంతో బావిలో నుండి మాటాడునదెవరని అడిగింది. అందుల కాస్వరము నేను నీ కుమారుడను నిశాకరు డనువాడ నని బదులు చెప్పగా నామె నిశాకరుడను కుమారుడు నాకు లేడే నాకొడుకు దివాకరుడని చెప్పగా నా బాలుడు తన ఉదంత మంతా పూస గ్రుచ్చినట్లు గా వివరించాడు అది విని తత్తర పాటుతో నా సుందరి ఆ బండను తొలగించి వేసింది. ఆ(బాలుడు) బయటకు వచ్చి తల్లికి పాదాభివందనం చేశాడు. అచ్చముగా తన రూపురేఖల తో నొప్పి యున్న ఆ బాలుని చూచి ఆ ధర్మిష్ఠ యింటికి తీసుక వెళ్లి భర్తకు తన వారందరకు చూపి అతడు చెప్పిన దంతా వారలకు తెలిపింది. అది విని తండ్రి ప్రేమతో బాబూ చిన్నప్పుడు నీవు మూగి వలె ఎందు కున్నావు? ఈ హఠా త్పరిణామం ఏల కలిగిందని అడిగాడు. బుద్ధిమంతుడు బ్రాహ్మణోత్తము డగు నా కోశకారుని ప్రశ్న విని ఆ బాలుడు తల్లి దండ్రుల కాశ్చర్యం కలుగునట్లుగా యిలా అన్నాడు.

నిశాకర

60 - శ్రూయతాం కారణం తాత! యేన మూకత్వ మాశ్రితమ్

మయా జడత్వ మనఘ! తథాంధత్వం స్వచక్షుషః

61 - పూర్వ మాస మహం విప్ర కులే వృందార కస్య తు

వృషాకపేశ్చ తనయోమాలా గర్భ సముద్భవః

62 - తతః పితా పాఠయ న్మాం శాస్త్రం ధర్మార్థ కామదమ్

మోక్షశాస్త్రం పరం తాత! సేతిహాస శ్రుతిం తథా

63 - సో ऽహం తాత! మహాజ్ఞానీ పరావర విశారదః

జాతో మదాంధస్తే నాऽహం దుష్కర్మాభిరతో ऽభవమ్

64 - మదా త్సమభవల్లోభస్తేన నష్టా ప్రగల్భతా

వివేకో నాశ మగమత్ మూర్ఛ భావ ముపాగతః

65 - మూఢ భావతయా చాऽథ జాతః పాప రతోऽస్మ్యహమ్

పరదార పరార్ధేషు రతి ర్మే చ సదాऽభవత్

66 - పరదారాభి మర్శి త్వాత్పరార్థ హరణా దపి

మృతోऽస్మ్యుద్బందనేనా హం నరకం రౌరవం గతః

67 - తస్మాద్వర్ష సహస్రాంతే భుక్త శిష్టే తదాగసి

అరణ్యే మృగహా పాపః సంజాతోऽహం మృగాధిపః

68 - వ్యాఘ్రత్వే సంస్థిత స్తాత బద్ధః పంజరగః కృతః

నరాధిపేన విభునానీతశ్చ నగరం నిజమ్

69 - బద్ధస్య పంజరస్థస్య వ్యాఘ్రత్వేऽధిష్ఠితస్యచ

ధర్మాత్ధ కామ శాస్త్రాణి ప్రత్యభా సంత సర్వశః

70 - తతో నృపతి శార్దూలో గదా పాణిః కదాచన

ఏక వస్త్ర పరీధానో నగరా న్నిర్యయౌ బహిః

71 - తస్య భార్యా జితా నామ రూపేణాऽప్రతిమా భువి

సా నిర్గతే తు రమణే మమాంతిక ముపాగతా

72 - తాం దృష్ట్వా వవృధే మహ్యం పూర్వాభ్యాసా న్మనోభవః

యధైవ ధర్మ శాస్త్రాణి తధాऽహ మవదం చ తామ్

73 - రాజపుత్రి ! సుకల్యాణి నవ యౌవన శాలిని

చిత్తం హరసి మే భీరు కోకిలా ధ్వనినా యథా

74 - సా మద్వచన మాకర్ణ్య ప్రోవాచ తను మధ్యమా

కథ మేవాऽవయోర్వ్యాఘ్ర ! రతి యోగ ముపేష్యతి

75 - తతోऽహ మబ్రువం తాత ! రాజపుత్రీం సుమధ్యమామ్

ద్వార ముద్ఘాటయస్వాద్య నిర్గమిష్యామి సత్వరమ్

76 - సాऽప్యబ్రవీద్దివా వ్యాఘ్ర! లోకోऽయం పరిపశ్యతి!

రాత్రా వుద్ఘాటయిష్యామి తతో రంస్యావ స్వేచ్చయా

77 - తామేవాహ మవోచం వై కాలక్షేపేऽహమక్షమః

తస్మా దుద్ఘాటయ ద్వారం మాం బంధాచ్చ విమోచయ

78 - తతః సా పీవర శ్రోణీద్వార ముద్ఘాటయ న్మునే!

ఉద్ఘాటితే తతో ద్వారే నిర్గతోऽహం బహిః క్షణాత్

79 - పాశాని నిగడాదీని భిన్నాని హి బలా న్మయా

సా గృహీతా చ నృప తే ర్భార్యాం రమితు మిచ్చతా

నిశాకరుడు

తండ్రీ నేనిన్నాళ్లు మందమతిగా మూగిగా, గుడ్డివానిగా ఎందుకు నడుచు కున్నానో ఆ కారణం చెబుతున్నా వినుము. ఓ విప్రా! పూర్వం నేను బృందారక వంశంలో వృషాకపికి మాల యను భార్య వల్ల పుత్రుడుగా పుట్టాను. తండ్రి నాకు ధర్మార్ధ కామాలతో పాటు శృతి స్ముతి ఐతిహాసాల తో గూడిన మోక్షశాస్త్రం నేర్పించాడు. అలా సకల శాస్త్ర కోవిదుడనైనందున విద్యామదం తల కెక్కి చెడు దారులు తొక్క సాగాను. మదం వల్ల లోభం, దాని వల్ల తెలివి, నశించడం తో వివేక భ్రష్టుడ నయ్యాను. ఆమూఢత్వం వల్ల పాపాభిరతి ఎక్కువై పరదారల ననుభవిస్తూ, పరద్రవ్యాపహరణ చేశ్తూ పూర్తిగా చెడి పోయాను. ఒక పర్యాయం పరస్త్రీ సంగమం, దొంగతనాన్ని పురస్కరించుకొని ఉరిశిక్షకు గురియై మరణించి వేయేండ్లు రౌరవ నరక యాతన లనుభవించాను. అప్పటికీ పాపం పూర్తిగా తీరక ఒక మహారణ్యంలో వ్యాఘ్రజన్మ యెత్తి జీవ హింస చేస్తూండగా ఒక రాజు నన్ను పట్టి బంధించి నగరానికి గొని పోయి బోనులో బంధించి ఉంచాడు. అంత నొక నాడా రాజు వంటరిగా గదా పాణియై ఏక వస్త్రం ధరించి పట్నం వెలుపల వేటకై వెళ్లాడు. ఆ పులి జన్మలో గూడ ధర్మార్ద కామ శాస్త్రాలన్నీ కరతలామలకంగానే ఉన్నాయి. రాజు బయటకు వెళ్లిన తర్వాత నా రాజు భార్య జిత అనే అపూర్వ సుందరి నా బోను వద్దకు వచ్చింది. ఆమె అందం నవయవ్వనం అంగ సౌష్ఠవం చూడగానే నాకు పూర్వ జన్మ వాసన వల్ల కామోద్రేకం కలిగి ధర్మ శాస్త్రాలకు వలెనె కామ సంబంధమైన పలుకులు ఆమెతో యిలా పలికాను. ఓ రాజ పుత్రీ నవయావనంతో మిస మిస లాడే కల్యాణీ ! నీ కోకిల ధ్వనితో నా చిత్తాన్ని అపహరించి వేశావు. నిన్ను పొందనిదే నా కూరట గలుగదు. అందులకా జవజవలాడు నడుముతో, వక్షోజ భారంతో నూగిస లాడే ఆ కామిని ఓ వ్యాఘ్రమా! భోనులో నున్న నీవు నన్నెట్లు పొంద గల వనగా నా పులి బోను తలుపూడ దీయము ఒక్క గంతులో నిన్ను కలుసు కుంటా నన్నాను. అందుల కాగడు సరి జాణ పగలైన చో ఎవరైనా చూడ గలరు. రాత్రి కానిమ్ము అప్పుడు తలుపు తీయుదును. స్వేచ్చగా మన మిద్దరం రతి సౌఖ్యాలను భవించ వచ్చు అని చెప్పగా కామాతురుడైన వ్యాఘ్రుడు అబ్బా ! నే నంత వరకు తాళ లేను వెంటనే నా కోర్కె తీర్చుమనగా ఆ తెగువరి బోను తలుపు తెరచింది. వెంటనే ఒక్క అదుటున బయటకు దూకి ఆ పులి రాణిని కౌగలిలో బంధించింది.

80 - తతో దృష్టోऽస్మి నృపతే ర్భృత్యై రతులవిక్రమైః

శస్త్ర హస్తైః సర్వత శ్చ తై రహం పరివేష్టితః

81 - మహాపాశైః శృంఖలాభిః సమాహత్య చ ముద్గరైః

వధ్యమానోऽబ్రువ మహం మా మా హింసధ్వ మాకులాః

82 - తే మద్వచన మాకర్ణ్య మత్వైవ రజనీచరమ్

దృఢం వృక్షే సముద్భధ్య ఘాతయంత తపోధన!

83 - భూయోగతశ్చ నరకం పర దార నిషేవణాత్

ముక్తో వర్ష సహ స్రాంతే జాతోऽహం శ్వేత గర్దభః

84 - బ్రాహ్మణస్యాగ్ని వేశస్య గేహే బహు కళత్రిణః

తత్రాపి సర్వ విజ్ఞానం ప్రత్యభాస త్తత్తో మమ

85 - ఉపవాహ్యః కృత శ్చాస్మి ద్విజ యోషిద్భి రాదరాత్

ఏకదా నవ రాష్ట్రాయాం భార్యా తస్యా గ్ర జన్మనః

86 - విమతి ర్నామతః ఖ్యాతా గంతు మైచ్చద్ గృహం పితుః

తామువాచ పతి ర్గచ్చ ఆరుహ్య శ్వేత గర్దభమ్

87 - మాసేన గమనం కార్యం నస్థేయం పరత స్తతః

ఇత్యేవ ముక్తా సా భర్త్రా తన్వీ మా మధిరుహ్య

88 - బంధనా దవముచ్యా ధ జగామ త్వరితా మునే!

తతోऽర్ధ పధి సా తన్వీ మత్పృష్ఠా దావరుహ్య వై

89 - అవతీర్ణా నదీం స్నాతుం స్వరూపా చా ర్ద్ర వాససా

సాంగోపాంగాం రూపవతీం దృష్ట్యా తా మహ మాద్రవమ్

90 - మయా చాऽభి ద్రుతా తూర్ణం పతితా పృథివీతలే

తస్యా ముపరి హో తాత ! పతితో ऽహం భృశాతురః

91 - దృష్టో భర్త్రా ను సృష్టే న నృణా తదను సారిణా

ప్రోక్షిప్య యష్టిం మాం బ్రహ్మన్ సమాధావ త్త్వరాన్వితః

92 - తద్భయాత్ తాం పరిత్యజ్య ప్రదృతో దక్షిణా ముఖః

తతోऽభిద్రవత స్తూర్ణం ఖలీన రసనా మునే!

93 - మమా సక్తా వంశ గుల్మై దుర్మోక్షో ప్రాణనాశనే

తత్రాసక్తస్య షడ్రా త్రా న్మ మా భూ జ్జీవిత క్షయః

94 - గతోऽస్మి నరకం భూయా స్తస్మా న్ముక్తో ऽభవం శుకః

మహారణ్యే తధా బద్ధః శబరేణ దురాత్మనా

95 - పింజరే క్షిప్య విక్రీతో వణి క్పుత్రాయ శాలినే

తేనా ప్యంతః పురవరే యువ తీనాం సమీపతః

96 - శబ్ద శాస్త్ర విదిత్యేవ దోషఘ్న శ్చేత్యవస్థితః

తత్రాసత స్తరుణ్య స్తా ఓదనాంబు ఫలాదిఖిః

97 - భక్ష్యైశ్చ దాడిమ ఫలైః పుష్ణాంత్యహ రహః పితః!

కదాచి త్పద్మ పత్రాక్షీ శ్యామా పీన పయో ధ రా

98- సుశ్రోణీ తనుమధ్యా చ వణి క్పుత్ర ప్రియా శుభా

నామ్నా చంద్రావలీ నామ సముదాట్యాంథ పంజరమ్

99 - మాం జగ్రాహ సుచార్వం గీ కరాభ్యాం చారుహాసినీ

చకారోపరి పీనాభ్యాం స్తనాభ్యాం సా హి మాం తతః

రాజు భార్యను నేను బలాత్కారంగా రమింప బోవుట చూచి బల శాలులైన పెక్కురు రాజ సేవకులు శస్త్రాలు ధరించి నన్ను చుట్టుముట్టి రోకళ్లతో మోది త్రాళ్లతో గొలుసులతో బంధించారు. చావు తప్పదని యెంచి నేను మానవ భాషలో నన్ను హింసింపకు డని పెద్దగా అరిచాను. అందుకు వారు వెరగు పడి నన్నొక భూత మని తలచి చెట్టుకు గట్టిగా బంధించి చావగొట్టారు. ఓ తపోధనా ! అలా పరస్త్రీగమ్యం కారణంగా మరణించి వేయేండ్లు నరకానంతరం ఒక తెల్లని గాడిదగా పుట్టాను. పెక్కురు భార్యలు గల అగ్నివేశ్యు డను బ్రాహ్మణ గృహంలో సర్వ శాస్త్ర జ్ఞానం తో తిరగసాగాను ఆ బ్రాహ్మణుని భార్యలను ఆదరంతో వీపుపై నెక్కించు కుని సరదాగా తిప్పే వాడిని. పూర్వపు కామేచ్ఛ ఏమాత్రం తగ్గ లేదు. ఒక పర్యాయమా ద్విజుని భార్యలలో నవరాష్ట్రానికి చెందిన విమతి యను యువతి పుట్టినింటికి బయలు దేరగా నామె భర్త ఆమెతో మన తెల్ల గాడిద నెక్కి పోయి నెల రోజులలో తప్పక తిరిగి రమ్మని చెప్పాడు. అంతనా సుందరి నా మీదనెక్కి పగ్గాలు వదలి త్వరగా వెళ్లుతూ మార్గ మధ్యంలో ఆగి నా వీపు నుంచి దిగింది ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో దిగి స్నానం చేసి తడిసిన వస్త్రలతో పైకి వచ్చింది. తెల్లని తడి చీరెలో ఆమె అందమైన శరీరం లోని అంగాలు ఉపాంగాలు స్పష్టంగా బలిష్ఠంగా కనిపించడంతో మరల నా కామ వాంఛ తీవ్రమై ఆమె మీదకు పరుగెత్తగా ఆమె భయంతో క్రింద పడి పోయింది. కామాతురత తో నే నామె మీద వెళ్లి పడిపోయాను. యజమానుడు ఆమె వెను వెంటనే పంపిన మనుషులు నన్ను చూచి కర్ర లెత్తుకొని మావైపు పరు గెత్తారు. దానితో భయపడి నేనా సుందరిని వదలి దక్షిణ దిశగా పరుగిడి దారిలో ఒక వెదురు పొదకు చిక్కు కొని నా ముక్కు తాడు బిగుసుక పోయింది. దానిని విడిపంచు కొన లేక అక్కడే నీరు ఆహారం లేక ఆరు రాత్రులు గడపి మరణించాను. మళ్లీ యధా ప్రకారం ఘోర నరకం అనుభవించి చిలుకగా పుట్టాను. అరణ్యంలో విహరిస్తూవుంటే ఒక క్రూరుడైన శబరుడు నన్ను పట్టుకొని పంజరం లో బంధించి ఒక కోమటి పుత్రునకు విక్రయించాడు. ఆతడు ధనికుడు, శాస్త్రాలు తెలిసి మాటలు నేర్చిన చిలుక నయినందున నేనున్న చో యింట్లో ని దోషాలు పోతా యని నమ్మి అంతఃపురంలో యువతు లయిన భార్యల వద్ద నన్ను వదిలాడు వారలు నాకు అన్నం నీరు దానిమ్మ గింజలు కమ్మని భక్ష్యాలు పెడుతుంటే నా పలుకులు తో ఆ మదవతులను రంజింప చేస్తూ బాగా పుష్టంగా బలిసి పోయాను. ఒక నాడు తామర రేకుల వంటి కన్నులు బలిసిన చన్నులు గుండ్రని పిరుదులు సన్నని నడుముతో యవ్వన మదంతో విర్ర వీగుతున్న ఆపణికుత్రుని ప్రియురాలు చంద్రావళి అనునది నా పంజరం తెరచి నన్ను చేతిలో పట్టు కొని తన చన్నుల మీద నెక్కించు కోగానే నేను కామంతో విజృంభించి ఆమె బిగుతుగా నున్న స్తనాల పైన గెంతుతూ ఆమెను రంజింప చేస్తూ నా కోరిక తీర్చుకో సాగాను. అలా నేను మగ పోడుములు పోతుండగా ఆ జాణ నన్ను తన కంఠ హారం లోని మర్కట బంధానికి కట్టి వేసుకుంది అలా బద్దుడనై పాప ఫలంగా మరణించాను. మరల ఘోర నరకం అనుభవించి పాప శేషం వల్ల ఒక చండాలు నింటి ఎద్దుగా బుట్టాను.

100 - తతోऽహం కృతవాన్ భావం తస్యా విలసితుం ప్లవన్

తతోऽనుప్ల వత స్తత్ర హరే మర్కట బంధనాత్

101 - బద్ధోऽహం పాప సంయుక్తో మృతశ్చ తదనంతరమ్

భూయోऽపి నరకం ఘోరం ప్రపన్నొऽస్మి సుదుర్మతిః

102 - తస్మా చ్చాహం వృషత్వం వై గతశ్చండాల పక్కణే

స చైకదా మాం శకటే నియోజ్య స్వాం విలాసినీమ్

103 - సమారోప్య మహాతేజా గంతుం కృతమతి ర్వనమ్

తతోऽగ్రతః స చండాలో గతత్వే నా స్య పృష్ఠతః

104 - గాయంతీ యాంతి తచ్చ్రు త్వా జాతోऽహం వ్యధితేంద్రియః

పృష్ఠతస్తు సమాలోక్య విపర్యస్త స్తథోప్లుతః

105 - పతితో భూమి మగమమ్ తదక్షేక్షణ విక్రమాత్

యోక్త్రే సుబద్ద ఏవాస్మి పంచత్వ మగమం తతః

106 - భూయో నిమగ్నో నరకే దశవర్ష శతాన్య పి

తత స్తవ గృహే జాత స్త్వహం జాతి మనుస్మరన్

107 - తావంత్యేవాద్య జన్మాని స్మరామి చా ను పూర్వశః

పూర్వాభ్యాసాచ్చ శాస్త్రాణి బంధనం చాగతం మమ

108 - తదహం జాతవిజ్ఞానో నా చరిష్యే కధంచన పాపాని

 ఘోర రూపాణి మనసా కర్మణా గిరా

109 - శుభం వా ప్య శుభం వాపి స్వాధ్యాయం శాస్త్ర జీవికా

బంధనం వా వధో వాऽపి పూర్వా భ్యాసేన జాయతే

110 - జాతిం యదా పౌర్వికీం తు స్మరతే తాత ! మానవః

తదా స తేభ్యః పాపేభ్యో నివృత్తిం హి కరోతి వై

111 - తస్మా ద్గమిష్యే శుభ వర్ధనాయ

 పాప క్షయా యా థ మునే! హ్యరణ్యమ్! భవాన్ దివాకీర్తి మిమం సుపుత్రం గార్హస్థ్య ధర్మే వినియోజయస్వ

ఆ చండాలు డొకనాడు నన్ను బండికి గట్టి అడవికి తీసికెళ్తున్నాడు. బండి మీద తన భార్యను కూర్చుండ బెట్టి తాను ముందు నడుస్తున్నాడు. వాడి వెనుక నేను బండి లాగుతూ పోతున్నాను. ఇంతలో వాని జవరాలైన భార్య గొంతు విప్పి బండి మీద కూర్చోని హాయిగా పాట పాడుతూంది. ఆ మద విహ్వలాంగి పాట వినగానే నా యింద్రియాలు పట్టు దప్పాయి. వాని సంక్షోభాన్ని అణచు కోలేక ఒక పరి వెను తిరిగి చూచి, అకస్మాత్తుగా వెనుకకు పరుగు దీశాను. కాడికి నా మెడ గట్టిగా బంధింప బడి ఉన్నందున క్రింద బడి మెద ఒరుసు కుని ప్రాణాలు విడిచాను. మరల పది వందల యేండ్లు నరక యాతన లనుభవించి అనంతరం నీ యింట్లో జన్మించాను. ఇంత వరకు నే నెత్తిన జన్మలన్నీ నాకు వరుసగా జ్ఞాపక మున్నాయి. పూర్వాభ్యాసం వల్ల శాస్త్ర జ్ఞానంతో బాటు బంధనం కూడ సంక్రమించింది. జాత స్మరుడ నగు నేను యిక మీద మనో వాక్కాయాలతో ఎలాంటి పాపాలు చేయ బోను. శుభాశుభాలు, స్వాధ్యాయం, శాస్త్రం జీవికౌ బంధనం కాని వధకానీ యివి ఏవైనా పూర్వ జన్మాభ్యాసం వల్లనే కలుగుతాయి. తండ్రీ! పూర్వ జన్మల స్మృతి కలిగిన మానవులకు పాప నివృత్తి కలుగుతుంది. కనుక పాప రహితుడ నైన నేనిక మంచిని పెంచు కొనుటకు శేషించిన పాప లేశ క్షయార్థం అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటాను. మీరు సుపుత్ర డగు దివాకరుని గార్హస్థ్య ధర్మంలో ప్రవేశ పెట్టండి.

బలి

112 - ఇత్యేవ ముక్త్వా స నిశాకర స్తదా ప్రణమ్య మాతాపితరౌ మహర్షే!

జగామ పుణ్యం సదనం మురారేః ఖ్యాతం బదర్యాశ్రమ మాద్య మీడ్యమ్

113 - ఏవం పురాభ్యాసరతస్య పుంసో భవంతి దానా ధ్యయనాదికాని

తస్మాచ్చ పూర్వం ద్విజవర్యవై మయా అభ్యస్త మాసీ న్నను తే బ్రవీమి

114 - దానం తపో వాऽధ్యయనం మహర్షే! స్తేయం మహా పాతక మగ్ని దాహమ్! యజ్ఞాని చైవాభ్యసతాం హి పూర్వం

 భవంతి ధర్మార్థ యశాంసి నా ధ

బలి

ఓ ఆచార్యా! ఇలా చెప్పి తలి దంద్రులకు ప్రణమిల్లి ఆ నిశాకరుడు మురారి పుణ్య సదనం సంస్తవనీయం, పురాతన తమమైన బదరికాశ్రమానికి వెళ్లాడు. ఈ విధంగా గురూత్తమా! పూర్వాభ్యాస బలం వల్ల మానవులకు దానా ధ్యయనాది గుణాలు అలవాటు ఏర్పడతాయి. దానాధ్యయనాలను నేను యింతకు పూర్వపు జన్మలలో ఆచరించాను. అవి నన్ను వదలవు. మహర్షే! దాన తపోऽధ్యయనాలు, చౌర్యం పాతకం, గృహదహనం, జ్ఞానం, దర్మ, అర్ధ,కామ, యశో, కీర్తులు యివన్నీ పూర్వా చరిత కర్మల వల్లనే సంక్రమిస్తాయి.

పులస్త్య

115 - ఇత్యే ముక్త్వా బలవాన్ స శుక్రం

 దైత్యేశ్వరః స్వం గురు మీశితారమ్ ధ్యాయం స్తదాస్తే మధు కైటభఘ్నం

 నారాయణం చక్ర గదా సి పాణిమ్

పులస్త్యుడు

నారదా ! శుక్రాచార్యునితో యిలా చెప్పి, మహా బలశాలి యగు నా దైత్యేశ్వరుడు బలి చక్రవర్తి, చక్ర గదా ఖడ్గ ధరుడు కైటభ సంహారి యగు నారాయణుని సన్నిధానం కల్పించుకుని, ఆ ప్రభుధ్యానంలో నిమగ్నుడైనాడు.

అధ్యాయము 64 Complete