అధ్యాయము 19

పులస్త్యుడు

1 - తతస్తు దేవా మహిషేన నిర్జితాః స్థానాని సంత్యజ్యసవాహనాయుధాః

 జగ్ముః పురస్కృత్యపితామహంతే ద్రష్టుం తదా చక్రధరంశ్రియఃపతిమ్

2 - గత్వాత్వపశ్యంశ్చమిథఃసురోత్తమౌ స్థితౌఖగేంద్రాసనశంకరౌహి

 దృష్ట్వాప్రణమ్యైవచ సిద్ధిసాదకౌ న్యావేదయంస్తన్మహిషాదిచేష్టితమ్

3 - ప్రభోశ్విసూర్యేంద్వనిలాగ్ని వేధసాం జలేశశక్రాదిషు చాధికారాన్

 ఆక్రమ్యనాకాత్తురాకృతావయం కృతావనిస్థామహిషాసురేణ 

4 - ఏతద్భవంతౌశరణాగతానాం శ్రుత్వావచోబ్రూతహితంసురాణాం

 నచేద్వ్రజామో ద్యరసాతలంహి సంకాల్యమానా యుధిదానవేన

5 - ఇత్థంమురారిఃసహశంకరేణ శ్రుత్వావచోవిప్లుతచేతసస్తాన్

 దృష్ట్వాథచక్రేసహసైవకోపం కాలాగ్నికల్పో హరిరవ్యయాత్మా 

6 – తతో నుకోపాన్మధుసూదనస్య సశంకరస్యాపిపితామహస్య

 తథైవశక్రాదిషుదైవతేషు మహార్దితేజో వదనాద్వినిఃసృతమ్

7 - తచ్చైకతాంపర్వతకూటసన్నిభం జగామ తేజః ప్రవరాశ్రమేమునే

 కాత్యానస్యాప్రతిమస్యతేన మహర్షిణా తేజ ఉపాకృతంచ

8 - తేనర్షిసృష్టేన చ తేజసావృతం జ్వలత్ప్రకాశార్కసహస్రతుల్యమ్

 తస్మాచ్చజాతాతరలాయతాక్షీ కాత్యాయనీయోగవిశుద్ధదేహా

9 - మహేశ్వరాద్వక్త్రమథోబభూవ నేత్రత్రయం పావకతేజసాచ

 యామ్యేనకేశాహరితేజసాచ భుజాస్తథాష్టాదశ సంప్రజజ్ఞిరే

10 - సౌమ్యేనయుగ్మంస్తనయోఃసుసంహతం మధ్యంతథైంద్రేణచ తేజసా భవత్

 ఊరూచ జంఘేచ నితంబసంయుతే జాతే జలేశస్యతు తేజసాహి

11 - పాదౌచలోకప్రపితామహస్య పద్మాభికోశప్రతిమౌ బభూవతుః

 దివాకరాణామపి తేజసాం గుళీః కరాంగుళీచవసుతేజసైవ

12 - ప్రజాపతీనాం దశనాశ్చతేజసా యాక్షేణ నాసా శ్రవణౌచ మారుతాత్

 సాధ్యేనచభ్రూయుగళంసుకాంతిమ త్కందర్పబాణాసనసంనిభంబభౌ

13 - తథర్శితేజోత్తమముత్తమంమహ న్నామ్నాపృథివ్యామభవత్ప్రసిద్ధమ్

 కాత్యాయనీత్యేవతదాబభౌసా నామ్నాచ తేనైవ జగత్ప్రసిద్ధా

పులస్త్యుడు

మునే! మహిషునిచే నిర్జింపబడి దేవతలెల్లరు తమతమ లోకాలను ఆయుధాలు వాహనాలతో సహా వదలి బ్రహ్మను ముందుంచుకొని లక్ష్మీపతియైన నారాయణుని వద్దకు వెళ్ళిరి. అచట శివకేశవుల నిర్వురను చూచి నమస్కరించి ఆ సిద్ధి ప్రదాయకులతో దుష్టుడైన మహిషుని అత్యాచారాలను యిలా విన్నవించారు – “ప్రభో! దురాత్ముడైన మహిష దానవుడు సూర్యచంద్ర వాయ్వగ్ని పితామహవరుణెంద్ర ఆశ్వినులాదిగా గల దేవతల అధికారాలను అపహరించి వారలను స్వర్గం నుంచి భూమికి తరిమి వైచినాడు. అలా తరుమబడిన మేమందరము మీ శరణాగతులమైనాము. మాకు మేలగు విధానము చెప్పండి. లేనిచో ఆ దానవుని దెబ్బల కోడి మేము రసాతలానికి పోయెదము. దేవతల దీనవచనాలను వినిన వెంటనే అవ్యయుడైన శ్రీ హరికాలాగ్ని వలె క్రోధంతో నిండిపోయినాడు. ఆ వెంటనే శంకర పితామహులు క్రోధ మూర్చితులయ్యారు. వారితో బాటు యింద్రాది దేవతలందరి ముఖాలు క్రోదారుణాలైనాయి. ఆ విధంగా దేవతల నుండి బయలు దేరిన క్రోధాగ్ని ఒక భయంకరమైన శిఖరంగా ఆవిర్భవించి అసమాన తేజస్వి అయిన కాత్యాయని మహర్షి ఆశ్రమంలో ఆయన తేజంతో కలిసి విజృంభించింది. జ్వలించుచున్న సహస్ర సూర్యకాంతితో వెలిగే ఆ మహాజ్యోతి నుంచి యోగవిశుద్ధ శరీరంతో అతి సుందరమూర్తి అయిన కాత్యాయనీ దేవి నిర్గమించింది. శివుని జ్యోతితో ఆమె ముఖము, అగ్ని కాంతితో మూడు కన్నులు, యముని తేజస్సు వల్ల కేశాలు, విష్ణుతేజం వల్ల పదునెనిమిది బాహువులు ఏర్పడినవి. చంద్రుని కాంతి చక్కని స్తనయుగంగా, యింద్రతేజంతో నడుము, వరుణ కోపాగ్ని వల్ల తొడలు జంఘాలు పిరుదులు, బహ్మ తేజం వల్ల పదాబ్జాలు, ఆదిత్యుల కాంతి వల్ల పాదాంగుళులు, వసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు ప్రజాపతుల కాంతితో దంతములు, యక్షతేజంతో నాసిక, మరుత్తుల వల్ల చేతులు, సాధ్యుల తేజంతో కనుబొమలు, రూపొంది ఆమె కందర్పుని బాణాసనం లాగ తేజరిల్లింది. కాత్యాయన మహర్షి తపశ్శక్తితో నిండిన ఆ తేజోమూర్తి ఆ సమయాన్నుంచీ కాత్యాయనీ దేవిగా జగత్ప్రసిద్ధి వహించింది.

14 - దదౌ త్రిశూలం వరదస్త్రీశూలీ చక్రంమురారిర్వరుణశ్చ శంఖమ్

 శక్తంహుతాశఃశ్వసనశ్చచాపం తూణౌ తథాక్షయ్యశరౌ వివస్వాన్     

15 - వజ్రంతథేంద్రఃసహఘంటయాచ యమోథ దండం ధనదో గదాంచ

 బ్రహ్మాక్షమాలాంసకమండలుంచ కాలోసిముగ్రం సహచర్మణాచ

16 - హారంచసోమః సహచామరేణ మాలాం సముద్రో హిమవాన్ మృగేంద్రమ్

 చూడామణింకుండలమర్ధచంద్రం ప్రాదాత్ కుఠారం వసుశిల్పకర్తా

17 - గంధర్వరాజోరజతాలినుప్తం పానస్య పూర్ణంసదృశం చ భాజనమ్

 భుజంగహారంభుజగేస్వరోపి అమ్లానపుష్పామృతవఃస్రజంచ

18 - తదాతితుష్టాసురసత్తమానాం అట్టాట్టహాసం ముముచే త్రినేత్రా

 తాంతుష్టవుర్దేవవరాః సహేంద్రాః సహిష్ణురుద్రేంద్వనిలాగ్నిభాస్కరాః

19 - నమోస్తుదేవ్యైసురపూజితాయై యాసంస్థితాయోగావిశుద్ధదేహా

 నిద్రాస్వరూపేణమహీం వితత్యతృష్ణాత్రపాక్షుద్భయదాథకాంతిః

20 - శ్రద్ధాస్మృతిఃపుష్టిరథోక్షమాచ

 ఛాయాచ శక్తిః కమలాలయాచ

 వృత్తిర్దయాభ్రాంతిరథేహమాయ నమోస్తు దేవ్యై భవరూపికాయై

21 - తతఃస్తుతాదేవవరైర్మృగేంద్ర మారుహ్య దేవీప్రగతావానీద్రమ్

 వింధ్యంమహాపర్వతముచ్చశృంగం చకార యం నిమ్నతరం త్వగస్త్యః

ఆ దేవికి వరప్రదాతయగు శూలపాణి త్రిశూలం యిచ్చాడు. శ్రీహరి చక్రం యిచ్చాడు. వరుణుడు శంఖం, అగ్ని శక్తి ఆయుధం, వాయువు ధనుస్సు సూర్యుడు అక్షయ శరతూణీరాలు, యింద్రుడు వజ్రంఘంట, యముడు దండం, కుబేరుడు గద, అక్షమాలకమండములు బ్రహ్మ, కాలుడు మహోగ్ర ఖడ్గం డాలు, యిచ్చారు. చంద్రుడు కంఠహారం చామరాలు, సముద్రుడు మాలను, హిమవంతుడు మృగరాజును (వాహనం, సింహం) శిరోమణి, కుండలాలు, చంద్రరేఖను విశ్వకర్మ గండ్రగొడ్డలిని ఆ దేవికి యిచ్చారు. కుబేరుడు రాజతానులిప్తమైన ఉత్తమ పానపాత్రను శేషుడు సర్పమణిహారం, ఋతువులు ఎన్నడు వాడని పుష్పమాలను సమర్పించారు. ఆ విధంగా దేవతా శ్రేష్ఠుల చేత సంభావించబడి ఆ త్ర్యంబకేశ్వరి అట్టాట్టహాసం చేసింది. దానితో బ్రహ్మ విష్ణు రుద్రేందాదులతో గూడిన దేవసమూహమంతా సంతోషించారు. ఈ విధంగా స్తోత్రం చేశారు. “దేవతల చేత పూజింపబడు దేవీ! నీకు నమస్కారము! పృథివి యందలి సకల జీవులలో నిద్రారూపాన తృష్ణగా, లజ్జగా, ఆకలిగా, భయంగా, కాంతిగా, శ్రద్ధగా, స్మృతి, పుష్టి, క్షమ, ఛాయ, శక్తి, లక్ష్మి వృత్తి, దయా, భ్రాంతి, కోరిక, మాయ, యిత్యాది రూపాల్లో నిండి సంసార రూపాన ఉండే పరమేశ్వరీ! నీకు నమస్కారము! తల్లీ నీకు నమస్సులు!” ఆ విధంగా దేవతలంతా స్తోత్రం చేసిన వెంటనే ఆ దేవి సింహం మీద స్వారీ చేస్తూ, ఎత్తైన శిఖరాలతో ఉంటూ, అగస్త్యముని వల్ల అనంతరం తగ్గి కుంచించుకుపోయిన వింధ్య పర్వతానికి వెడలిపోయెను.

నారదుడు

22 - కిమర్థమద్రింభాగవానగస్త్య స్తంనిమ్నశృంగం కృతవాన్ మహర్షిః

 కస్మైక్వతేకేనచకారణేన ఏతద్వదస్వామలసత్త్వవృత్తే

నారదుడు

22 - మహర్షే! భగవంతుడగు నగస్త్య మహర్షి ఎందువలన ఎవరి కొరకు వింధ్యాద్రి ఔన్నత్యాన్ని తగ్గించెను పుణ్యపురుషులగు మీరు నాకవి వివరించుడు

పులస్త్యుడు

23 - పురాహివింధ్యేనదివాకరస్య గతిర్నిరుద్దా గగనేచరన్య

 రవిస్తతఃకుంభభవంసమేత్య హోమావసానే వచనంబభాషే

24 - సమాగతోహం ద్విజదూరతస్త్వాం కురుష్వ మాముద్ధరణం మునీంద్ర!

 దదస్వదానంమమయన్మనీషితం చరామి యేన త్రిదివేషునిర్వృతః

25 - ఇత్థందివాకరవచోగుణసంప్రయోగి శ్రుత్వా తదాకలశజో వచనం బభాషే

 దానందదామి తవయన్మనస స్త్వభీష్టం నార్థీ ప్రయాతి విముఖోమమకశ్చిదేవ

26 - శ్రుత్వావచోమృతమయం కలశోద్భవస్యప్రాహ ప్రభుః కరతలేవినిదాయమూర్ద్ని

 ఏషోద్యమేగిరివరః ప్రరుణద్ధిమార్గం వింధ్యస్య నిమ్నకరణేభగవన్ యతస్వ    

27 - ఇతిరవివచనాదథాహ కుంభజన్మా కృతమితి విద్ధిమయాహి నీచశృంగమ్

 తవకిరణజితోభవిష్యతేమహీధ్రో మమచరణసమాశ్రితస్య కావ్యథాతే !

28 - ఇత్యేవముక్త్వాకలశోద్భవస్తు సూర్యంహి సంస్తూయ వినమ్యభక్త్యా

 జగామసంత్యజ్యహిదండకంహి వింధ్యాచలం వృద్ధవపుర్మహర్షిః     

29 - గత్వావచఃప్రాహమునిర్మహీధ్రం యాస్యే మహాతీర్థవరం సుపుణ్యం

 వృద్దోస్మ్యశక్తశ్చతవాదిరోఢుం తస్మాద్భవాన్ నీచతరోస్తు సద్యః

30 - ఇత్యేవముక్తోమునిసత్తమేన సనీచశృంగస్త్వభవన్మహీధ్రః

 సమాక్రమచ్చాపి మహర్షిముఖ్యః ప్రోల్లంఘ్య విoధ్యం త్విదమాహశైలమ్

31 - యావన్నభూయోనిజమావ్రజామి మహాశ్రమం ధౌతవపుఃసుతీర్థాత్

 త్వయానతావత్త్విహవర్ధితవ్యం నోచేద్ విశప్స్యేహ మవజ్ఞయాతే      

32 - ఇత్యేవముక్త్వాభగవాన్ జగామ దిశం స యామ్యాం సహసాంతరిక్షమ్

 ఆక్రమ్యతస్థేసహితాం తదాశాం కాలే వ్రజామ్యత్ర యదామునీంద్రః

33 - తత్రాశ్రమంరమ్యతరంహికృత్వా సంశుద్ధజాంబూనదతోరణాంతమ్

 తత్రాథనిక్షిప్యవిదర్భపుత్రీం స్వమాశ్రమం సౌమ్యముపాజగామ

34 - ఋతావృతౌ పర్వకాలేషునిత్యం తమంబరే హ్యాశ్రమమావసత్ సః

 శేషంచకాలంసహిదండకస్థః తపాశ్చచారామితకాంతిమాన్ మునిః

35 - వింధ్యోపిదృష్ట్వాగగనేమహాశ్రమం వృద్ధిం నయాత్యేవ భయాన్మహర్షేః

 నాసౌనివృత్తేతిమతింవిధాయ నసంస్థితో నీచతరాగ్రశృంగః

36 – ఏవంత్వగస్త్యేనమహాచలేంద్రః సనీచశృంగోహి కృతోమహర్షే

 తస్యోర్ద్వశృంగేమునిసంస్తుతాసా దుర్గాస్థితా దానవనాశనార్థమ్

37 - దేవాశ్చసిద్దాశ్చమహోరగాశ్చ విద్యాధరాభూతగణాశ్చసర్వే

 సర్వాప్సరోభిఃప్రతిరామయంతః కాత్యాయనీంతస్థుర పేతశోకాః

పులస్త్యుడు

పూర్వమొక పర్యాయం వింధ్యుడు ఆకాశం పొడవున పెరిగిన సూర్యుని గమనాన్ని నిరోధించెను. అంతట రవి కుంభజుడగు నగస్త్యుని చేరి ఆ ముని హోమ కార్యానంతరం యిట్లనెను. ఓ బ్రాహ్మణ శ్రేష్టా! బహుదూరాన్నుంచి వచ్చియున్నాను; నన్నుద్ధరింపుము. నేను నిరాటంకముగా అంతరిక్షగమనం చేయుటకు వీలుగ నామనోవాంఛితాన్ని ప్రదానం చేయుము. సూర్యుని అర్ధగర్భితాలయిన మాటలు విని అగస్త్యుడు – నన్నర్ధించిన వారెవ్వరూ విఫలులై తిరిగి వెళ్ళరు ణీ మనోవాంఛితము తెలుపుము. నెరవేర్చెదను. అనగా అమృతోపమాలైన ఆ మాటలకు సంతోషించి చేతులు జోడించుకొని సూర్యుడు – ‘ఈ పర్వత శ్రేష్టుడు ణా మార్గాన్ని నిరోధించినాడు. ఈ వింధ్యుని ఔన్నత్యాన్ని తగ్గించండి. అని విన్నవించెను. ‘దివాకరా! ననాశ్రయిచితివి. నీకేమి బాధకలుగును? వింధ్యుని శిఖరములను అణచినట్లే తెలియుము. ణీ కిరణ ప్రసారానికిక ఆటంకం ఉండదు, అని సూర్యుని ఊరడించి అగస్త్యుడు, భక్తితో రవికి మ్రొక్కి దండకారణ్యం వదలి వింధ్యాచలానికి ప్రయాణించెను. వింధ్యుని చూచి కుంభజుడు అచలోత్తమా! నేను ముసలివాడను. పుణ్యతీర్థయాత్రలకై వెళ్ళుచున్నాను. నిన్ను దాటిపోజాలకున్నాను. కనుక నీవు వెంటనే క్రిందకు వంగి నాకు దారి యిమ్మనెను. ఆ ముని శ్రేష్టుని కోరికను తలదాల్చి వెంటనే వింధ్యుడు పొట్టి వాడాయెను. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత నాగస్త్యుడతనితో నిట్లనెను. ఓ శైలమా! నేను తీర్థావగాహనం చేసి పరిశుద్దుడనై నిజాశ్రమానికి తిరిగి వచ్చువరకు నీవు పెరుగకుండా యిట్లే పడియుండుము. లేనిచో నీయవజ్ఞకు శపింపగలను. ఆ విధంగా ఉద్ధతుడగు వింధ్యుని హెచ్చరించి అగస్త్యుడాకాశామార్గాన దక్షిణ దిశగా వెళ్లి, తగిన అదనుచ్చోచి తిరిగి పోవ ఉద్దేశ్యముతో నచటనే స్థిరపడిపోయెను. అచట బంగారు తోరణాలతో రమ్యంగా ఉండే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని విదర్భ రాజపుత్రియుగు భార్య లోపాముద్ర నచటవదలి నిజాశ్రమానికి వెళ్ళెను. ఋతు ఋతువుకూ పర్వసమయాల్లో ఆ మహర్షి ఆకాశంలోని ఆ ఆశ్రమంలో ఉంటూ ఇతర సమయాల్లో దండ కారణ్యంలోని నిజాశ్రమానికి వెళ్తూ ఉంటాడు. ఇక వింధ్యుడు గూడ ఆకాశంలోని ఆ దివ్యాశ్రమాన్ని చూచి భయపడి పెరుగుటమాని ఆ తేజస్వి తిరిగి వస్తాడని ప్రతీక్షిస్తూ తన శిఖరాలను వంచుకొనియే యున్నాడు. ఈ విధంగా తపోధనుడగు నగస్త్యుడా వింధ్యుని తల పొగరణచి పాదాక్రాంతు నొనరించినాడు. మహర్షే! మునీశ్వరులంతా స్తోత్రాలు చేస్తూండగా నాకాత్యాయనీ దుర్గ రాక్షస సంహారం చేసే సంకల్పంతో ఆ వింధ్యాద్రి ఊర్ధ్వ శృంగాన్ని అధిరోహించి నిలచింది. ఇక తమ బాధలు మరచి దేవతలు సిద్ధులు, ఉరగులు, విద్యాధరులు, భూతగణాలు, అప్సరసలు ఆ కాత్యాయనీ దేవిని రంజింపచేస్తూ ఆమె సేవలో ఉండి పోయారు.

అధ్యాయము 19 complete