వామన మహా పురాణము
అధ్యాయము 7
లోమహర్షణ
1 - ఏవం స్తుతో_థ భగవాన్ వాసుదేవ ఉవాచతామ్ ॥ ।
అదృశ్యఃసర్వభూతానాం తస్యాఃసందర్శనేస్థితః ॥
లోమహర్షణ
అదితికావించిన స్తోత్రం విని భగవంతుడగు వాసుదేవుడితరులెవ్వరికి కనబడకుండా ఆమెకు మాత్రమే గోచరించి యిలా అన్నాడు.
భగవానుడు
2 - మనోరథాంస్త్వమదితే యానిచ్చస్యభివాంఛితాన్ ।
తాంస్త్వంప్రాప్స్యసిధర్మజ్ఞే మత్ప్రసాదాన్నసంశయః ॥
3 - శృణుత్వంచ మహాభాగే వరోయస్తేహృదిస్థితః ।
మద్దర్శనంహివిఫలం నకదాచి ద్భవిష్యతి ॥
4 - యశ్చేహత్వద్వనేస్థిత్వా త్రిరాత్రం వై కరిష్యతి ।
సర్వేకామాః సమృధ్యం తే మనసాయానిహేచ్చతి ॥
5 - దూరస్థో_పివనంయస్తు ఆదిత్యాః స్మరతేనరః ।
సో_పియాతిపరం స్థానం కింపునర్నివసన్ నరః ॥
6 - యశ్చేహబ్రాహ్మణాన్ పంచత్రీన్ వా ద్వావేకమేవవా ।
భోజయేచ్చ్రద్ధయా యుక్తః సయాతి పరమాంగతిమ్ ॥
భగవానుడు
ఓ ధర్మజ్ఞురాలవగునదితీ! నా అనుగ్రహంచేత నీ మనోరథాలన్నీ నెరవేరగలవు. నా దర్శనం విఫలం కాజాలదు. అందువల్ల ణీ మనస్సులోని వరం (కోరిక) తప్పక సిద్ధిస్తుంది. ఈ అదితి వనం (కురుక్షేత్రం ) లో మూడు నిద్రలు చేసి సాధన చేయునో అతని మనోవాంచలన్నీ సిద్ధించగలవు. దూరాన్నుంచి ఈ అదితివనాన్ని స్మరించైనా వారలకే పరమపదం ప్రాప్తించగలిగియుండగా, అక్కడ ఆవాసం చేయువారి విషయం చెప్పవలెనా? ఈ ప్రదేశాన భక్తి శ్రద్ధలతో ఐదుగురకో, ముగ్గురకో, ఇద్దరికో లేక ఒకరికైనా సరే భోజనం పెట్టి తృప్తి పరచు వారల కక్షయలోక ప్రాప్తి కలుగును.
7 - యదిదేవప్రసన్నస్త్వం భక్త్యామే భక్తవత్సల ।
త్రైలోక్యాధిపతిఃపుత్ర స్తదస్తు మమవాసవః ॥
8 - హృతంరాజ్యం హృతశ్చాస్య యజ్ఞభాగ ఇహాసురైః ।
త్వయిప్రసన్నే వరద తత్ప్రాప్నోతి సుతోమమ ॥
9 - హృతంరాజ్యం నదుఃఖాయ మమపుత్రస్య కేశవ ।
ప్రసన్నదాయ విభ్రంళో బాధాంమే కురుతేహృది ॥
అదితి
భక్తవత్సలా! దేవా! ణా భక్తికి సంతసించినచో నాపుత్రుడగు ఇంద్రుడు త్రిలోకాధిపతి అగుగాక. అతడు కోలుపోయిన రాజ్యం యజ్ఞభోగాలు ణీ అనుగ్రహం వల్ల మరల నా పుత్రునకు లభించుగాక. రాజ్యం పోయినందుకు నా కుమారునకు చింతలేదు. శరణాగతులకు దాయభాగ విభ్రంశం కలగడమే నన్ను వేధించుచున్నది.
భగవానుడు
10 - కృతఃప్రసాదోహి మయా తవదేవి యథేప్సితమ్ ।
స్వాంశేన చైవతేగర్భే సంభవిష్యామి కశ్యపాత్ ॥
11 - తవగర్భేసముద్భూతః తతస్తే యేత్వరాతయః ।
తానహంచ హనిష్యామి నివృత్తాభవనందినీ ॥
భగవానుడు
దేవీ! నీ మనోభీష్టముననుగ్రహించితిని. ఇంకా ణా అంశతో కశ్యపుని ద్వారా నీ కడుపున పుట్టి శత్రులోకాన్నంతటినీ సంహరింతును. నీవు ఆనందంతో తిరిగి వెళ్ళుము.
అదితి
12 - ప్రసీదదేవదేవేశ నమస్తే విశ్వభావన ।
నాహంత్వాముదరే వోఢు మీశ శక్ష్యామి కేశవ ।
యస్మిన్ప్రతిష్టితం సర్వం విశ్వయోని స్త్వమీశ్వరః ॥
అదితి
ఓ దేవదేవ! విశ్వభావన! నన్ననుగ్రహించుము. సమస్తలోకాలను బోజ్జలోనుంచుకొన్న సర్వేశ్వరుడవగు విశ్వగర్భునిని మోయలేను తండ్రీ!
13 - అహంత్వాం చ వహిష్యామి ఆత్మానం చైవనందిని ।
నచపీడాంకరిష్యామి స్వస్తితే_స్తు వ్రజామ్యహమ్ ॥
14 - ఇత్యుక్త్వాంతర్హితే దేవే_దితిర్గర్భం సమాదధే ।
గర్భస్థితేతతః కృష్ణే చచాల సకలాక్షీతిః ।
చకంపిరేమహా శైలా జగ్ముః క్షోభంమహాబ్దయః ॥
15 - యతోయతోదితిర్యాతి దదాతి పదముత్తమమ్ ।
తతస్తతః క్షితి ఖేదాన్ననామ ద్విజపుంగవాః ॥
16 - దైత్యానామపి సర్వేషాం గర్భస్థే మధుసూదనే ।
బభూవతేజసోహాని ర్యథోక్తం పరమేష్ఠినా ॥
భగవానుడు
భయపడకు దేవీ! నేను నిన్నూ నన్నూ కూడా మోయగలను. నీకెలాంటి బాధయు కలుగనివ్వను. నీకు మేలగుగాక. నేను వెళ్లి వస్తాను. అలా అభయమిచ్చి వాసుదేవుడంతర్హితుడు కాగా అదితి గర్భంధరించినది. కృష్ణుడామె గర్భస్తుడగుటతో భూమి అంతయూ కంపించినది. మహాపర్వతాలు కదలిపోయినవి. మహాసాగరాలు సంక్షుభితాలయినవి. ఓ బ్రహ్మణోత్తములారా! ఆ మహాదేవి అదితి అడుగుపెట్టిన ప్రతిచోట భూమి బాధతో క్రుంగిపోయేది. మరొక వైపు, మధుసూదనుడు గర్భస్థుడు కావడంతో, పరమేష్టివచనానుసారం దైత్యులు తమతేజస్సు క్రమంగా కోలుకోసాగారు.
అధ్యాయము 7 complete
Summary of chapter 80 of the Vāmana Mahā Purana is as follows:
The text recounts the historical episode of King Vena, whose unrighteous deeds during his earthly reign resulted in severe karmic afflictions and a degraded post-mortal state. His noble and righteous son, King Prithu, carried the ancestral remains to the holy waters of Prithūdaka, where he performed devout ancestral libations and charity in honor of Bhagavān Nārāyaṇa. Through the pristine spiritual potency of Prithūdaka and the filial devotion of King Prithu, the soul of Vena was completely cleansed of all past sins and elevated to the celestial realms of the devas.