అధ్యాయము 20

పులస్త్యుడు

1 - తతస్తు తాం తత్ర సదావసంతీం కాత్యాయనీం శైలవరస్యశృంగే

 అపశ్యతాం దానవసత్తమౌద్వౌ చండశ్చమున్డశ్చ తపస్వినీంతామ్     

2 - దృష్ట్వేవశైలాదవతీర్యశీఘ్ర మాజగ్మతుః స్వంభవనం సురారీ

 దృష్ట్వోచతుస్తౌమహిషాసురస్య దూతావిదం చండముండౌదితీశమ్

3 - స్వస్థోభవాన్ కింత్వసురేంద్రఃసాంప్రత మాగచ్చ పశ్యామచతత్రవింధ్యమ్

 తత్రాస్తిదేవీసుమహానుభావా కన్యా సురూపా సురసుందరీణామ్

4 - జితా స్తయాతోయధరాలకైర్హి జితః శశాంకో వదనేన తన్వ్యాః

 నేత్రైస్త్రిభిస్త్రీణిహుతాశనాని జితాని కంఠేన జితస్తుశంఖః       

5 - స్తనౌతువృత్తావథమగ్నచూచుకౌ స్థితౌ విజిత్యేవ గజస్య కుంభౌ

 త్వాంసర్వజేతారమితిప్రతర్క్య కుచౌ స్మరేణైవ కృతౌ సుదుర్గౌ 

6 - పీనాఃసశస్త్రాఃపరిఘోపమాశ్చ భుజాస్తథాష్టాదశ భాంతి తస్యాః

 పరాక్రమంవైభవతోవిదిత్వా కామేన యంత్రా ఇవతేకృతాస్తు

7 - మధ్యంచ తస్యాస్త్రివలీతరంగం విభాతిదైత్యేంద్రసురోమరాజి

 భయాతురారోహణకాతరస్య కామస్యసోపానమివ ప్రయుక్తమ్

8 - సారోమరాజీసుతరాంహితస్యా విరాజతే పీనకుచావలగ్నా

 ఆరోహణేత్వద్భయకాతరస్య స్వేదప్రవాహో_సురమన్మథస్య

9 - నాభిర్గభీరాసుతరాంవిభాతి ప్రదక్షిణా_స్యాః పరివర్తమానా

 తస్యైవలావణ్యగృహస్యముద్రా కందర్పరాజ్ఞా స్వయమేవదత్తా

10 - విభాతిరమ్యంజఘనంమృగాక్ష్యాః సమంతతో మేఖలయా_వజుష్టమ్

 మన్యామతంకామనరాధిపస్య ప్రాకారగుప్తం నగరంసుదుర్గమ్       

11 - వృత్తావరోమౌచమృదూకుమార్యాః శోభేత ఊరూసమనుత్తమోహి

 ఆవాసనార్థంమకరధ్వజేన జనస్య దేశావివసన్నివిష్టౌ

12 - తజ్జానుయుగ్మంమహిషాసురేంద్ర అర్దోన్నతం భాతితథైవతస్యాః

 సృష్ట్వావిధాతాహినిరూపణాయ శ్రాంతస్తథా హస్తతలేదదౌహి

13 - జంఘేసువృత్తే_పి చ రోమహీనే శోభేత దైత్యేశ్వరతేతదీయే

 ఆక్రమ్యలోకానివనిర్మితాయా రూపార్జితస్యైవ కృతాధరౌహి

14 - పాదౌచతస్యాఃకమలోధరాభౌ ప్రయత్నతస్తౌ హి కృతౌవిధాత్రా

 ఆజ్ఞాపితాభ్యాంనఖరత్నమాలా నక్షత్రమాలాగగనేయథైవ

15 - ఏవంస్వరూపాదనునాథకన్యా మహోగ్రశస్త్రాణిచ ధారయంతీ

 దృష్ట్వాయథేష్టంనచవిద్మకాసా సుతా_థవాకస్య చిదేవ బాలా

16 - తద్భూతలేరత్నమనుత్తమం స్థితం స్వర్గం పరిత్యజ మహాసురేంద్ర

 గత్వా_థవింధ్యంస్వయమేవ పశ్య కురుష్వయత్ తే_భిమతం క్షమంచ       

పులస్త్యుడు

నారదా! ఆ పర్వత శిఖరాన తపస్వినిగా ఉన్న కాత్యాయనిని చండుడు, ముండుడు అనే యిద్దరు రాక్షస వీరులు చూచారు. వెంటనే ఆ అసురులు పర్వతం దిగి తమ భవనానికి వెళ్లి రాక్షస రాజైన మహిషాసురునితో ఇలా అన్నారు –ప్రభూ! నీవిలా సుఖంగా చేతులు ముడుచుకొని కూర్చొని ఉండుటకు కారణమేమి? అలా వింధ్యకు వెళ్లి చూతము పద. ముల్లోకాల్లో సౌందర్యవతీ, మహామహిమాన్వితురాలై, సురకాంతల తలదన్నే ఒక కన్యారత్నం అక్కడ ఉన్నది. ఆమె కేశాలు మేఘాలను జయించాయి. చంద్రుని ఆమె ముఖం ధిక్కరిస్తుంది. మూడు నేత్రాలు త్రేతాగ్నులను వెక్కిరిస్తాయి. కంఠానికి శంఖం దాసోహమంటుంది. ఆమె గుండ్రని స్తనాలు ఏనుగు కుంభస్థలాలను జయించాయి. ముల్లోకాలను జయించిన నీ వృత్తాంతం విని మన్మధుడామె కుచాలను తనకు చక్కని దుర్గాలుగా చేసుకున్నాడు. పరిఘలులాగా కండలు దీరిన పద్దెనిమిది బాహువులలో వివిధ శస్త్రాస్త్రాలు ధరించి ఉంది. ణీ పరాక్రమాన్ని గ్రహించిన మన్మధుడు వాటిని వివిధ యంత్రాలుగా మలుచుకున్నాడనిపిస్తుంది. మూడువళులతో, రోమసమూహంతో అందమైన ఆమె నడుము చూస్తే భయంతో మన్మధుడు ఎక్కుటకేర్పరచుకున్న సోపానపంక్తిలా ఉంటుంది. ఆమె పీనకుచాల క్రింద ఉన్న చక్కని రోమ పంక్తి నీ ప్రతాపోద్ధతికి భయతురుడైన మన్మధుని వంటి నుండి జారిన చెమట బిందువుల్లాగా కనిపిస్తుంది. కుడివైపు ప్రదక్షిణంగా తిరిగి లోతైన నాభి, సౌందర్య గృహంమీద దానికి రాజైన మన్మధుడు వేసినముద్ర (తాళము) గా భాసిస్తుంది. వడ్డాణంతో పరివేష్టితమైన ఆమె జఘన (పిరుదు) ప్రదేశం చూస్తే మన్మధుడు ఎత్తైన ప్రహరీగోడతో నిర్మించుకున్న శత్రుదుర్భేద్యమైన దుర్గమా అనిపిస్తుంది. రోమరహితాలై, గుండ్రనివై , మృదువుగా ఉన్న ఊరువులు, మన్మథ నరేశ్వరుడు తన వారలకై ఏర్పరచుకొన్న నివేశన స్థలాముల్లాగా కనిపిస్తవి. మహిషేశ్వరా! కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న ఆమె అందమైన మోకాళ్లను చూస్తే బ్రహ్మ ఆమెను సృష్టించి అలసిపోయి, తన సృష్టి సౌందర్య సమగ్రతను నిరూపించుటకు తన రెండు అరచేతులను వానిపై పెట్టుకున్నట్లు తోస్తుంది. ఆ సుందరి వట్రువలై, రోమరహితాలైన జంఘలు (పిక్కలు) ప్రపంచంలోని సౌందర్య సృష్టినంతటినీ అధఃకరిస్తాయి. తామరపూల లోవలి మృదుత్వాన్ని తలతన్నే ఆమె పాదాలనైతే విధాత ఎంతో శ్రమపడి నిర్మించాడు. ఆమె అంగుళ్యాభరణాల సౌరు, నక్షత్రాల కాంతిని మరపిస్తుంది. ఇంతటి అందాల రాశి అయిన ఆ బాలిక ఓ ధనుజేశ్వరా! భయంకరమైన శస్త్రాస్త్రాలు ధరిస్తుంది! మేమెంతో దీక్షగా ఆమెను చూచాము. అయినప్పటికీ ఆమె ఎవరి కుమార్తెయో, ఎవరో, ఏమో తెలుసుకొనలేకపోయాము! దివి నుండి భువికి దిగిన అనర్ఘ రత్నం ఆ బాలిక! స్వయంగా నీవే వెళ్లి వింధ్య శిఖరాన ఆమెను చూడుము. అనంతరం నీకు తోచినట్టుగా చేతనైనది చేయుము.”

17 - శ్రుత్వైవతాభ్యాం మహిషాసురస్తు దేవ్యాః ప్రవృత్తింకమనీయరూపమ్

 చక్రేమతింనాత్రవిచారమస్తి ఇత్యేవముక్త్వామహిషో_పినాస్తి

18 - ప్రాగేవపుంసస్తుశుభాశుభాని స్థానేవిధాత్రా ప్రతిపాదితాని

 యస్మిన్ యథాయానియతో_థవిప్ర సనీయతేవా వ్రజతి స్వయంవా

19 - తతో_నుముండంనమరంసచండం బిడాలనేత్రం సపిశంగవాష్కలమ్

 ఉగ్రాయుధంచిక్షురరక్తబీజౌ సమాదిదేశాథమహాసురేంద్రః

20 - ఆహత్యభేరీంరణకర్కశాస్తే స్వర్గం పరిత్యజ మహీధరంతు

 ఆగమ్యమూలేశిబిరం నివేశ్య తస్థుశ్చసజ్జాదనునందనాస్తే

21 - తతస్తుదైత్యోమహిషాసురేణ సంప్రేషితో దానవయూథపాలః

 మయస్యపుత్రోరిపుసైన్యమర్దీ సదుందుభిర్దుందుభినిస్వనస్తు

22 - ఆభ్యేత్యదేవీం గగనస్థితో_పి సదుందుభిర్వాక్యమువాచవిప్ర

 కుమారి దూతో_స్మి మహాసురస్య రంభాత్మజస్యాప్రతిమస్య యుద్ధే

23 - కత్యాయనీదుందుభిమభ్యువాచ ఏహ్యేహి దైత్యేంద్రభయం విముచ్య

 వాక్యంచయద్రంభసుతోబబాషే వదస్వ తత్సత్యమపేతమోహః

24 - తథోక్తవాక్యేదితిజఃశివాయా స్త్యజ్యాంబరం భూమితలే నిషణ్ణః

 సుఖోపవిష్టఃపరమాసనేచ రంభాత్మజేనోక్తమువాచ వాక్యమ్ 

దేవి సౌందర్య ప్రవృత్తులను గురించి ఆ రాక్షసులు చెప్పినదంతయు విని మహిషాసురుడు “యిందులో యింకా ఆలోచించవలసినదేమి? ఏమీ లేదని” అనుకున్నాడు. నారదా! జీవుల శుభాశుభాలు ముందుగానే బ్రహ్మ ద్వారా నిర్ణయింపబడే ఉంటాయి. ఎప్పుడు ఎవడు ఎక్కడకు వెళ్ళాలో అక్కడకు స్వయంగానైనా వెళ్ళతాడు లేక తీసికొనిపోబడతాడు. అప్పుడా అసురేంద్రుడు చండ ముండ నమరబిడాల నేత్ర పిశంగ, బాష్కల ఉగ్రాయుధ చిక్షుర రక్తబీజాదులను ఆజ్ఞాపించుటతో ఆ యుద్ధోన్మాదులందరూ యుద్ధ భేరీలు మ్రోగించి స్వర్గం వదలి భూమి మీద వింధ్య పర్వతాన్ని చేరి ఆ గిరి మూలాన స్కంధా వారాలు నిర్మించుకున్నారు. అప్పుడా మహిషుడు, శత్రు సంహారకుడు, తన సేనాపతి, మయాసురుని కుమారుడు దుందుభి ఘోషం వంటి కంఠధ్వని కలిగిన దుందుభి అనే రాక్షసుని దేవి వద్దకు దూతగా పంపాడు. వాడు దేవికి సమీపంగా ఆకాశంలో నిలబడి యిలా అన్నాడు.

దుందుభి

25 - ఏవం సమాజ్ఞాపయతే సురారి స్త్వాందేవిదైత్యోమహిషాసురస్తు

 యథామరాహీనబలాఃపృథివ్యాం భ్రమంతి యుద్ధే విజితా మయాతే 

26 - స్వర్గంమహీవాయుపథాశ్చవశ్యాః పాతాళమన్యేచ మహేశ్వరాద్యాః

 ఇంద్రో_స్మిరుద్రో_స్మిదివాకరో_స్మి సర్వేషులో కేష్వధిపో_స్మిబాలే

27 - నసో_స్తినాకే న మహీతలే వా రసాతలే దేవభటో_సురోవా

 యోమాంహిసంగ్రామ ముపేయివాంస్తుభూతో నయక్షో న జిజీవిషుర్యః

28 - యాన్యేవరత్నాని మహీతలేవాస్వర్గే_పి పాతాళ తలే_థముగ్ధే

 సర్వాణిమామద్యసమాగతాని వీర్యార్జితానీహవిశాలనేత్రే

29 - స్త్రీరత్నమగ్ర్యంభవతీచ కన్యాప్రాప్తో_స్మి శైలం తవకారణేన

 తస్మాద్భజస్వేహ జగత్పతిం మాం పతిస్తవార్హో_స్మి విభుః ప్రభుశ్చ

దుందుభి

 “ఓ కుమారీ! ఆప్రతిమ వీరుడు రంభ దైత్యుని కుమారుడు అసురలోకాధిపతి అయిన మహిషాసురుని దూతను నేను.” ఆ మాట వింటూనే కాత్యాయని, రావయ్యా దైత్యేంద్రా! రా! నిర్భయంగా జంకు లేకుండా నీ యజమాని రంభ పుత్రుడు పంపిన సందేశం చెప్పుమనెను. దేవి మాటలు విని దుందుభి ఆకాశం నుంచి భూమికి దిగి దేవి కెదురుగా సుఖోపవిష్టుడై మహిషాసురుని సందేశాన్ని యిలా వినిపించాడు. “దేవి! మహిషదైత్యుడు నీకిలా ఆజ్ఞాపించాడు. “యుద్ధంలో నాతో ఓడిపోయి హీనబలులై అమరులు భూమి మీద తిరుగుతున్నారు. స్వర్గమర్త్య పాతాళాలు వాయుమండలం అక్కడి రాజులు, అంతా నాకు వశ్యులైనారు. నేనే యింద్రుణ్ని, రుద్రుణ్ని, సూర్యుణ్ని పరలోకాధిపతిని! ఓ బాలా! స్వర్గమర్త్య పాతాళాలలో ఎవ్వరు కూడా, దేవాసుర యక్షభూతగణాల్లో, యుద్ధంలో నన్నెదురుకొని జీవింపగలవారులేరు. స్వర్గమర్త్య పాతాళాలలో ఉన్న అనర్ఘరత్నాలన్నీ యీనాడు ణా ప్రతాపానికి లోబడి నన్ను చేరాయి. స్త్రీ జాతి కంతకూ ఓ విశాలనేత్రా! నీవు రత్నానివి. అలాంటి ణీ కోసం నేను ఈ వింధ్య మూలానికి వచ్చాను. జగత్పతినీ సర్వప్రభువునూ అయిన నన్ను కన్యా రత్నమువైన నీవు వరించి భజించుము.

పులస్త్యుడు

30 - ఇత్యేవముక్త్వా దితిజేన దుర్గా కాత్యాయనీ ప్రాహ మయస్యపుత్రమ్

 సత్యం ప్రభుర్దానవరాట్ పృథివ్యాం సత్యంచ యుద్ధే విజితామరాశ్చ

31 - కింత్వస్తి దైత్యేశ కులే_స్మదీయే ధర్మోహిశుల్కాఖ్యఇతిప్రసిద్ధః

 తంచేత్ప్రదద్యా న్మహిషో మమాద్య భజామిసత్యేనపతింహయారిమ్

32 - శ్రుత్వా_థవాక్యం మయజో_బ్రవీచ్చ శుల్కంవదస్వాంబుజపత్రనేత్రే

 దద్యాత్స్వమూర్దానమపిత్వదర్థే కింనామ శుల్కం యదిహైవ లభ్యమ్

33 - ఇత్యేవముక్త్వా దనునాయకేన కాత్యాయనీ సస్వనమున్నదిత్వా

 విహస్యచైతద్వాచనంబభాషే హితాయ సర్వస్య చరాచరస్య

పులస్త్యుడు

మయ పుత్రుడు దుందుభి మాటలు విని కాత్యాయని వానితో నిట్లనెను. నిజమే! మీ ప్రభువు దానవేశ్వరుడు. దేవతలను యుద్ధంలో జయించిన మాట వాస్తవం. అయితే ఓ దైత్యపతీ! మా కులాచారం ప్రకారం ధర్మ శుల్కం అంటూ చెల్లించి కన్యను వివాహమాడవలసి యున్నది. మీ మహిషుడది చెల్లించునో వానిని తప్పక పెండ్లాడెదను. కాత్యాయనీ మాటలు విని దుందుభి “పద్మనేత్రీ !ఆశుల్కమేదో చెప్పుము. ణీ కొరకై మా ప్రభువు తన శిరస్సునైనా సంర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన వివాహ శుల్కం ఏదియు యుండజాల” దనెను. మయ పుత్రుని మాటలు విని కాత్యాయని పకాలున నవ్వి ఉచ్చైస్వరంతో చరాచర జీవులందరకు కళ్యాణము కలుగజేయు పలుకులు పలికెను.

దేవి

34 - కులేస్మదీయే శృణుదైత్యశుల్కం కృతంహి యత్పూర్వతరైః ప్రసహ్య

 యోజేష్యతే_స్మత్కులజాం రణాగ్రే తస్యాః సభరాప్తి భవిష్యతీతి

దేవి

 “ఓ రాక్షసా ! మా కుల కన్యను పెండ్లాడనెంచిన వాడు ముందుగా ఆ కన్యను యుద్ధంలో జయించాలి. ఇది అనూచానంగా మా పెద్దల ఆచారము.”

పులస్త్యుడు

35 - తచ్చ్రుత్వా వచనం దేవ్యాః దుందుభిర్ధానవేశ్వరః

 గత్వా నివేదయామాస మహిషాయ యథాతథమ్

36 - సచాభ్యగాన్మహాతేజాః సర్వదైత్యపురఃసరః

 ఆగత్యవింధ్యశిఖరం యోద్దుకామః సరస్వతీమ్

37 - తతఃసేనాపతిర్దైత్యో చిక్షురో నామనారద

 సేనాగ్రగామినం చక్రే నమరం నామదానవమ్

38 - సచాపితేనాధికృతశ్చతురంగం సమూర్జితమ్

 బలైకదేశమాదాయ దుర్గాం దుద్రావవేగితః

39 - తమాపతతంవీక్ష్యాథ దేవా బ్రహ్మపురోగమాః

 ఊచుర్వాక్యం మహాదేవీం వర్మహ్యాబంధచాంబికే

40 - అథోవాచసురాన్ దుర్గా నాహం బధ్నామి దేవతాః

 కవచం కో_త్ర సంతిష్టేత్ మమాగ్రే దానవాదమాః

41 - యదానదేవ్యా కవచం కృతం శాస్త్రనిబర్హణమ్

 తదారక్షార్థమస్యాస్తు విష్ణుపంజరముక్తవాన్

42 - సాతేనరక్షితాబ్రహ్మన్ దుర్గా దానవసత్తమమ్

 అవధ్యందైవతైః సర్వైర్మహిషం ప్రత్యపీడయత్

43 - ఏవంపురాదేవవరేణ శంభునా తద్వైష్ణవంపంజరమాయతాక్ష్యాః

 ప్రోక్తంతయాచాపి హి పాదఘాతై ర్నిషూదితో_సౌమహిషాసురేంద్రః

44 - ఏవంప్రభావో ద్విజవిష్ణుపంజరః సర్వాసురక్షాస్వధికోహిగీతః

 కస్తస్య కుర్యాద్యుధిదర్పహానిం యస్య స్థితశ్చేతసి చక్రపాణిః

పులస్త్యుడు

నారదా! శ్రీదేవి మాటలు విని దుందుభి యథా తథంగా తన స్వామి మహిషుని వద్దకు వెళ్లి చెప్పాడు. అంతట మహా తేజస్వి అయిన ఆ రాక్షసుడు తన సమస్త దైత్య సేనతో కాత్యాయనిని జయించుటకై బయలుదేరి వింధ్య పర్వత మూలమును జేరేను. సేనాధ్యక్షుడయిన చిక్షురుడు నమర దైత్యవీరుని సేనా ముఖాన నిలబెట్టెను. వాడు కూడా చతురంగ బలాలతో మరొకవైపు నుంచి దుర్గాదేవితో యుద్ధానికి తలపడెను. వాని యుద్ధాతికి వెరగుపడి బ్రహ్మ పురస్సరులైన దేవతలు దేవితో “అమ్మా! కవచం ధరించు తల్లీ!” యని విన్నవించిరి. అంతట నా దుర్గ దేవతలతో “కవచం నా కెందులకు? ఈ రాక్షస కీటకాలు నా యెదుట అసలు నిలబడగలవా?” అంటూ కవచం ధరించకుండానే విష్ణుపంజర స్తోత్రాన్ని స్మరించింది. ఆ స్తోత్ర ప్రభావంతో ఓ నారదా! ఆ తల్లి సర్వ దేవతలకు నవధ్యుడైన ఆ మహిషదైత్యుని నేల బెట్టి కాలరాచి సంహరించింది! ఆ విధంగా పురాసమయాన దుర్గాదేవికి విష్ణు పంజర కవచాన్ని పరమశివుడుపదేశించాడు. ఆమె దాని ప్రభావంతో సకల రాక్షస సంహారం గావించింది. విప్రోత్తమా! లోకంలోని సమస్త రాక్షాకవచాలన్నింటిలోనికి విష్ణు పంజరం సర్వోత్తమంగా కీర్తింపబడుతోంది. ఆ చక్రధారి విష్ణువును హృదయంలో ప్రతిష్టించుకున్న వానిని యుద్ధంలో ఎదుర్కొనగలవాడెవ్వడు?

అధ్యాయము 20 complete