అధ్యాయము 19

ఋషులు

1 - వసిష్ఠస్యాపవాహో-సౌ కథంవైసంబభూవాహ

 కిమర్థంసాసరిచ్చ్రేష్టాతం రుషింప్రత్య వాహయత్

ఋషులు

వశిష్టుని సరస్వతీనదికొనిపోవుట ఎలా జరిగినది? ఆ సర్వోత్తమమైన నది ఆ మహర్షిని ఎందుకు తన జలాల్లో లాగికొనిపోయినది.

లోమహర్షణ

2 - విశ్వామిత్రస్య రాజర్షే ర్వసిష్టస్య మహాత్మనః

 భ్రుశంవైరంబభూవేహ తవఃస్పర్దాకృతేమహత్

3 - ఆశ్రమోవై వసిష్టస్య స్థాణుతీర్థే బభూవహ

 తస్యపశ్చిమదిగ్భాగే విశ్వామిత్రస్యదీమతః

4 - యత్రేష్ట్వాభగవాన్స్థాణుః పూజయిత్వాసరస్వతీమ్

 స్తాపయామాసదేవేశో లింగాకారంసరస్వతీమ్

5 - నవసిష్టస్యతపసా ఘోరరూపేణ సంస్థితః

 తస్యేహతపసాహీనో విశ్వామిత్రోబభూవహ    

6 - సరస్వతీంసమాహూయ ఇదంవచనమబ్రవీత్

 వసిష్టంమునిశార్దూలం స్వేనవేగేనఆనయ  ॥    

7 - ఇహాహంతం ద్విజశ్రేష్టం హనిష్యామినసంశయః

 ఏతచ్చ్రుత్వాతు వచనం వ్యథితాసామహానదీ   

8 - తథాతాంవ్యథితా దృష్ట్వా వేపమానాంమహానదీమ్

 విశ్వామిత్రో-బ్రవీత్క్రుద్దో వసిష్టంశీఘ్రమానయ  ॥

9 - తతోగత్వానరిచ్చ్రేష్టా వశిష్టంమునిత్తమమ్

 కథయామాసరుదతీ విశ్వామిత్రస్య తద్వచః  ॥

10 - తపఃక్రియా విశీర్ణాంచ భ్రుశంశోకసమన్వితామ్

 ఉవాచసనరిచ్చ్రేష్టాం విశ్వామిత్రాయమాంవహ  ॥

లోమహర్షణ

తమతమ తపోబలాలను పురస్కరించుకొని రాజర్షియైన విశ్వామిత్రునకు, బ్రహ్మర్షియగు వసిష్టునకు మధ్య చిరకాలంగా శత్రుత్వం ఉంది. వసిష్టుని ఆశ్రమం ఉండేది. అక్కడ భగవంతుడగు స్థాన్వీశ్వరుడు యజ్ఞం చేసిన సరస్వతీ నదిని పూజించి ఆమెనొక లింగాకారంలో ప్రతిష్టించాడు. వసిష్టుడచట ఘోరమైన తపోనిష్టలో ఉండిపోగా పిలిచి మునిశ్రేష్టుడగు వసిష్టుని గొనిరమ్మనియూ తానాయనను తప్పకచంపి వైతుననీ ఆజ్ఞాపించాడు. ఆ మాటవిని ఆ మహానది మహావ్యథతో నిలచిపోయినది. అందుకు మరింతకుపితుడై విశ్వామిత్రుడు వసిష్టుని వెంటనేపోయి కొనిరమ్ము పొమ్మని గర్జించెను. అంతట నా ఉత్తమనదీమతల్లి వసిష్టుని సమీపించి విలపిస్తూ విశ్వామిత్రుని వాక్యములు వినిపించింది. తపంవల్ల కృశించి, శోకంతో విలవిలలాడుతున్న చూచి వసిష్టుడు విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు తననాతని వద్దకు తీసికొనిపొమ్మనెను,

11 - తస్య తద్వచనం శ్రుత్వా కృపాశీలస్యసాసరిత్

 చాలయామాసతంస్తానాత్ ప్రవాహేణాంభసస్తదా  ॥

12 - నచకూలాపహారేణ మిత్రావరుణయోఃసుతః

 ఊహ్యమానశ్చతుష్టావ తదాదేవీం సరస్వతీమ్  ॥

13 - పితామహస్యసరసః ప్రవృత్తాసి సరస్వతీ

 వ్యాప్తంత్వయాజగత్సర్వం తవైవాంభోభిరుత్తమైః  ॥

14 - త్వమేవాకాశగా దేవీ మేఘేషుసృజసేపయః సర్వాస్త్వాపస్త్వమేవేతి త్వత్తోవయమదీమహే  ॥

15 - పుష్టిర్ద్రుతి స్తథాకీర్తిః సిద్ధిః కాంతిః క్షమాతథా

 స్వదాస్వాహాతథావాణీ తవాయత్తమిదంజగత్  ॥

16 - త్వమేవసర్వభూతేషు వాణీరూపేణ సంస్థితా

 ఏవం సరస్వతీతేన స్తుతాభగవతీతదా  ॥ 

17 - సుఖేనోవాహతం విత్రం విశ్వామిత్రాశ్రమం ప్రతి

 న్యవేదయత్తదాఖిన్నా విశ్వామిత్రాయతంఋషిమ్

18 - తమానీతంసరస్వత్యా దృష్ట్వాకోపసమన్వితః

 అథాన్విషత్ ప్రహరణం వశిష్టాంతకరంతదా

19 - ఆపోవాహవసిష్టంతం మధ్యే చైవాంభసస్తదా

 ఉభయోః కుర్వతీవాక్యం వంచయిత్వాచగాదిజమ్

20 - తతో-పవాహితందృష్ట్వా వశిష్ఠమృషిసత్తమమ్

 అబ్రవీత్ క్రోదరక్తాక్షో విశ్వామిత్రో మహాతపాః  ॥

21 - యస్మానాంసరితాంశ్రేష్టే వంచయిత్వావినిర్గతా

 శోణితం వహకల్యాణిరక్షో గ్రామణిసంయుతా  ॥

22 - తతః సరస్వతీశప్తా విశ్వామిత్రేణధీమతా

 అవహచ్చోణితోన్మిశ్రం తోయంసంవత్సరంతదా

ఆ కరుణామయుని వచనానుసారం ఆ నది ఆయనను తన ప్రవాహజలాల్లో కొనిపోసాగెను. అలా నదీప్రవాహంలో కొట్టుకొనిపోతూ ఆ వసిష్ఠముని సరస్వతీ నదిని యీ విధంగా స్తుతించాడు. “బ్రహ్మ సరస్సు నుంచి ఉద్భవించిన పావనసరస్వతీ! నీ పవిత్ర జలాలతో జగత్తునంతను ముంచితివి. నీవే ఆకాశాన ప్రవహించి మేఘాలకు నీరు ప్రసాదిస్తున్నావు. జలములన్నియు నీ రూపమే. పుష్టి, కీర్తి, సిద్దులు, కాంతి, క్షమాగుణం, స్వాహా, స్వధా, వాణి యిత్యాదులతో కూడిన ఈ జగత్తంతటికీ నీవే ఆధారము. అన్ని జీవరాసుల్లోనూ వాణిరూపంలో నీవే నెలకొని ఉన్నావు. నీకు నమస్సులు.” ‘వసిష్ఠుని స్తోత్రానికి సంతసించి సరస్వతీనది ఆయనను సుఖంగా తన ప్రవాహంతో విశ్వామిత్రుని కడకు కొనిపోయి ఖిన్నురాలై ఆ విషయం విశ్వామిత్రున కెరిగించినది. అలా వచ్చిన వసిష్టుని చూచి కోపంతో, ఆయనను సంహరించుటకు విశ్వామిత్రుడు ఆయుధము తీసికొనిరాగా తన ప్రవాహం మధ్య భాగాన ముంచివేసింది. ఆ విధంగా యిద్దరి ఆదేశాలను గౌరవించింది. ప్రవాహమధ్యంలో ముంచబడిన వసిష్ఠుని కానక విశ్వామిత్రుడు సరస్వతి చేసిన మోసానికి కోపించి, ఓ ఉత్తమ స్రోతస్వినీ! కల్యాణీ! నన్నీవిదంగా వంచించి నందుకు ప్రతిఫలంగా నీవు నీళ్ళకుబదులుగా రక్తం ప్రవహిస్తూ రాక్షసులకు నిలయమైయుండగలవని శపించెను. ఆ శాప ఫలంగా ఆ సరస్వతీ నది ఒక సంవత్సరకాలం రక్తం ప్రవహింపజేస్తూ ఉండినది.

23 - ఆథర్ష యశ్చదేవాశ్చ గండర్వాప్సరసస్తదా

 సరస్వతీంతదాదృష్ట్వా బభూపుర్బ్రు శదుఃఖితాః  ॥

24 - తస్మింస్తీర్థవారేపుణ్యేశోణితంసముపావహత్

 తతోభూతపిశాచాశ్చ రాక్షసాశ్చసమాగతాః  ॥

25 - తతస్తేశోణితం సర్వే పిబంతఃసుఖమాసతే

 తృప్తాశ్చసుభ్రుశంతేన సుఖితావిగతజ్వరాః

 నృత్యంతశ్చహసంతశ్చ యథాస్వర్గజితస్తథా  ॥

26 - కస్యచిత్త్వథకాలస్య ఋషయఃసతపోధనాః

 తీర్థయాత్రాంసమాజగ్ముః సరస్వత్యాంతపోదనాః

27 - తాందృష్ట్వా రాక్షసైర్ఘోరైః పీయమానాం మహానదీమ్

 పరిత్రాణే సరస్వత్యాః పరంయత్నంప్రచక్రిరే     

28 - తేతుసర్వేమహాభాగాః సమాగమ్యమహావ్రతాః

 ఆహూయసరితాం శ్రేష్టా మిదం వచనమబ్రువన్  ॥

29 - కింకారణంసరిచ్చ్రేష్టే శోణితేన హ్రదోహ్యయమ్

 ఏవమాకులతాంయాతాః శ్రుత్వా వేత్స్యామహేవయమ్  ॥

30 - తతః సాసర్వమాచష్ట విశ్వామిత్రవిచేష్టితమ్

 తతస్తేమునయః ప్రీతాః సరస్వత్యాంసమానయన్

 అరుణాం పుణ్యతోయౌఘాం సర్వదుష్క్రుతనాశనీమ్

అలా రక్త జలాలతో నిండిన సరస్వతిని చూచి దేవగంధర్వాప్సరసలు ఎంతో దుఃఖించారు. రక్తంతో నిండిన ఆనదీ చుట్టూ భూత పిశాచరాక్షసులు మూగికొని మహాసంతోషంతో ఆ రక్తం త్రాగుతూ తృప్తిగా ఎలాటి విచారం లేకుండా వికటాట్ట హాసాలు చేస్తూ స్వర్గాన్ని జయించినట్లుగా ఆనందించసాగారు. ఆమీద కొన్నాళ్ళకు కొందరు ఋషులూ తపోధనులూ యాత్రార్థంగా బయలుదేరి సరస్వతీనదిని సమీపించారు. రక్తమై రాక్షసులతో నిండిన ఆ పుణ్యనదిని చూచి ఆమెను రక్షించాలని సంకల్పించుకొని ఆ మహానదిని పిలిచి ఆ తపిధనులిలా అన్నారు. ఓ నదీశ్రేష్టమా! యిలా రక్తజలాలతో నిండియుండుటకు కారణమేమి? మాకంతయు చెప్పవలసినది. అందులకు సరస్వతి విశ్వామిత్రుడి ఆగడాన్ని వివరించి చెప్పింది . అంతట నామునులందరు సంతోషించి సమస్త పాపాలను పోగొట్టే అరుణానదీ పవిత్ర జలాలను తెచ్చి సరస్వతిలో కలిపారు. ఆమెను పవిత్రను గావించారు.

31 - దృష్ట్వాతోయంసరస్వత్యా రాక్షసాదుఃఖితాభ్రుశమ్

 ఊచుస్తాన్వైమునీన్ సర్వాన్ దైన్యయుక్తాఃపునః పునః  ॥

32 - వయంహిక్షుదితాస్సర్వే ధర్మహీనాశ్చశాశ్వతాః

 నచనః కామకారోయం యద్వయంపాపకారిణః  ॥

33 - యుష్మాకంచాప్రసాదేన దుష్క్రుతేనచ కర్మణా

 పక్షో-యంవర్దతే-స్మాకం యతఃస్మో బ్రహ్మరాక్షసాః  ॥

34 - ఏవం వైశ్యాశ్చశూద్రాశ్చ క్షత్రియాశ్చవికర్మభిః

 యేబ్రాహ్మాణాన్ ప్రద్వింషంతి తేభవంతీహరాక్షసాః  ॥

35 - యోషితాంచైవపాపానాం యోనిదోషేణవర్ధతే

 ఇయంసంతతిరస్మాకం గతిరేషాసనాతనీ  ॥

36 - శక్తాభవంతఃసర్వేషాం లోకానామపితారణే

 తేషాంతేమునయఃశ్రుత్వా కృపాశీలాః పునశ్చతే  ॥       

37 - ఊచుఃపరస్పరంసర్వే తప్యమానాశ్చతేద్విజాః

 క్షుతకీటావపన్నంచ యచ్చోచ్చిష్టాశితంభవేత్

38 - కేశావపన్న మాదూతం మారుతశ్వాసదూషితమ్

 ఏభిఃసంసృష్టమన్నంచ భాగంవైరాక్షాసాంభవేత్  ॥

39 - తస్మాత్జ్ఞాత్వాసదావిద్వాన్ అన్నాన్యేతానివార్జయేత్

 రాక్షసానామసౌభుం క్తే యోభుం క్తే అన్నమీదృశమ్   

40 - శోభయిత్వాతుతత్తీర్థ మృషయస్తేతపోదనాః

 మోక్షార్థంరక్షసాం తేషాం సంగమం తత్రకల్పయన్    

41 - అరుణాయాః సరస్వత్యాః సంగమేలోకవిశ్రుతే

 త్రిరాత్రోపోషితఃస్నాతో ముచ్యతేసర్వకిల్బిషై:  ॥

42 - ప్రాప్తేకలియుగేఘోరే ఆదర్మే ప్రత్యుపస్థితే

 అరుణాసంగమేస్నాత్వాముక్తిమాప్నోతిమానవః  ॥

43 - తతస్తేరాక్షసాస్సర్వే స్నాతాఃపాపవివర్జితాః

 దివ్యమాల్యాంబరధరాః స్వర్గస్థితిసమన్వితాః  ॥

ఆ పవిత్రాలైన సరస్వతీ నదీజలాలను చూచి దుఃఖితులై దీనదీనంగా ఆ రాక్షసులు మునులతో యిలా విన్నపం చేసుకున్నారు. “మేము శాశ్వతంగా ధర్మదూరులమై ఆకలితో అల్లాడుతున్నాము. మేము స్వయంగా ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. మేముచేసిన పాపకర్మలూ మీ అనుగ్రహం లభించకపోవడం యీ కారణాలవల్ల మాజాతి పెరిగిపోతూ మేము బ్రహ్మరాక్షసులమయ్యాము. బ్రాహ్మణులను ద్వేషించిన వైశ్య శూద్ర క్షత్రియులందరూ బ్రహ్మరాక్షసులౌతారు. పాపిష్టి స్త్రీలతో సంగమం చేయడం వల్ల మాసంతతి పెరిగిపోతున్నది. ఇది ఎప్పటినుంచో వస్తూన్న కర్మ. తమరో. మహాతపోధనులు! సమస్త లోకాలను తరింపచేయ సమర్థులు! ఆ రాక్షసుల దీనాలాపాలు విని ఆ దయామయులగు మునులు తమలోతాము సంప్రదించు కున్నారు. ఎంగిలి, కీటకాదులు వాలినది, వెండ్రుకలు పడినందున, గాలివల్ల నోటిశ్వాసవల్ల కలిషితమైన భోజనం రాక్షస భోజ్యం. ఆ సంగతి గుర్తించి విజ్ఞులయిన వారలట్టి ఆహారాన్ని వర్జించాలి. అలాటి తిండి తిన్న వాడు రాక్షస భోజనం చేసినట్లే. అలా ఆలోచించుకొని ఆ మహర్షులాతీర్థాన్ని పవిత్రంగావించి రాక్షసులనుద్దరించుటకై అక్కడ అరుణా సరస్వతీనదుల పవిత్ర సంగమాన్ని కన్పించారు. లోకప్రసిద్దమైన ఆ నదీసంగమంవద్ద మూడురాత్రులుపవసించి స్నానం చేస్తే సర్వకిస్బిషాలు తొలగిపోతాయి. ఘోరకలికాలంలో ధర్మం అడుగంటినరుడు అరుణా సంగమంలో స్నానం చేసి మానవులు ముక్తులు కాగలరు. అంతట ఆ రాక్షసులందరు ఆ సంగమతీర్థాల్లో మునిగిపాపముక్తులై దివ్యమాల్యాంబరాలు ధరించి స్వర్గలోకాలకు చేరుకున్నారు.

అధ్యాయము 19 complete