వామన మహా పురాణము
అధ్యాయము 23
భగవానుడు
1 - తస్యాం తపత్యాం నరసత్తమేన జాతఃసుతః పార్తివలక్షణస్తు ।
సజాతకర్మాదిభిరేవ సంస్కృతో వ్యవర్ధ తాజ్యేనహుతో యథా_గ్ని, ॥
2 - కృతో_స్యచూడాకరణశ్చదేవా విప్రేణమిత్రావరుణాత్మజేన ।
నవాబ్దికస్యవ్రతబంధనం చ వేదేచశాస్త్రే విధిపారగో_భూత్ ॥
3 - తతశ్చతుఃషడ్భిరపీహ వర్షెః సర్వజ్ఞతా మభ్యగమ త్తతో_సౌ ।
ఖ్యాతఃపృథివ్యాంపురుషోత్తమో_సౌ నామ్నా కురుః సంవరణన్య పుత్రః ॥
4 - తతోనరపతిర్దృష్ట్వా ధార్మికం తనయం శుభమ్ ।
దారక్రియార్థమకరోద్ యత్నం శుభకులే తతః ॥
5 - సౌదామినీం సుదామ్నస్తు సుతాం రూపాధికాం నృపః ।
కురోరర్థాయ వృతవాన్ సప్రదాత్ కురవే_పి తామ్ ॥
6 - సతాంనృపసుతాం లబ్ధ్వా ధర్మార్థా వవిరోధయన్ ।
రేమేతన్వ్యా సహ తయా పౌలోమ్యా మఘవానివ ॥
7 - తతోనరవతిః వుత్రం రాజ్యభారక్షమం బలీ ।
విదిత్వా యౌవరాజ్యాయ విదానేనా_భ్యషేచయత్ ॥
8 - తతోరాజ్యే_భిషిక్తస్తు కురుః పిత్రా నిజేపదే ।
పాలయామాస సమహీం పుత్రవచ్చ స్వయంప్రజాః ॥
9 - సఏవక్షేత్రపాలో_భూత్ పశుపాలః సఏవహి ।
ససర్వపాలకశ్చాసీత్ ప్రజాపాలో మహాబలః ॥
10 - తతో_స్య బుద్ధిరుత్పన్నా కీర్తిర్లోకే గరీయసీ ।
యావత్కీర్తిః సుసంస్థాహి తవద్వాసః సురైస్సహ ॥
11 - సత్వేవంనృపతిశ్రేష్టో యాథా తథ్య మవేక్ష్యచ ।
విచచారమహీంసర్వాం కీర్త్యర్థంతు నరాధిపః ॥
12 - తతోద్వైతవనంనామ పుణ్య౦ లోకేశ్వరో బలీ ।
తదాసాద్యసుసంతుష్టో వివేశాభ్యంతరం తతః ॥
13 - తత్రదేవీందదర్శాథ పుణ్యాం పాపవిమోచనీమ్ ।
ప్లక్ష్మజాంబ్రహ్మణః పుత్రీం హరిజిహ్వాంసరస్వతీమ్ ॥
14 - సుదర్శనస్యజననీం హ్రదం కృత్వా సువిస్తరమ్ ।
స్థితాంభగవతీం కూలే తీర్థకోటిభిరాప్లుతామ్ ॥
15 - తస్యాస్తజ్జలమీక్ష్యైవ స్నాత్వా ప్రీతో_భావన్నృపః ।
సమాజగామచ పునః బ్రహ్మణో వేదిముత్తరామ్ ॥
16 - సమంతపంచకంనామ ధర్మస్థాన మనుత్తమమ్ ।
ఆసమంతాద్యోజనాని పంచపంచచ సర్వతః ॥
భగవానుడు
ఆ నరశ్రేష్టుడు తపతియందొక చక్రవర్తి లక్షణాలు గల కుమారుని కనినాడు. జాతకర్మాది విధులు జరిగి ఆ బాలకుడు ఆజ్యాహుతులతో ప్రజ్వలించు హతాశనునకు వలె ప్రవర్దమానుడైనాడు. వసిష్టుడా బాలునకు చూడాకర్మాది సంస్కారాలు జరిపించాడు. తొమ్మిదేండ్ల వయసున ఉపనయనం జరిగి వేదశాస్త్రాదులలో ప్రావీణ్యం సంపాదించాడు. పదేండ్ల వయసునకే సర్వజ్ఞత్వం గడించి ఆ పురుష శ్రేష్టుడు “కురు” అనే పేర ఖ్యాతిచెందాడు. రాజైన సవరణుడు ధర్మిష్టుడైన తన సుపుత్రునకు తగిన వధువు కొరకై ప్రయత్నాలు సాగించాడు. ఒక మంచి వంశానికి చెందిన సుధాముని కుమార్తె సౌదామిని యను రూపవతిని కుమారునకై నిశ్చయం చేసుకున్నాడు. సుధాముడు కూడ సంతోషంతో తన తనయను కురునకిచ్చి వివాహం జరిపించాడు. కురుకుమారుడా కుమార్తెతో కలిసి ధర్మార్థాలను విఘాతం లేని విధంగా పౌలోమితో యింద్రుడులా సకలభోగాలు అనుభవించాడు. తన కుమారుడు రాజ్యభారదక్షుదగుట గమనించిన సంవరణుడాతని యౌవరాజ్యపదవికి అభిషేకించాడు. అనంతరం రాజ్యాభిషేకాన్ని పొందిన ఆ కురురాజే తండ్రి అడుగుజాడలలో నడుచుకుంటూ ప్రజలనుకన్న తండ్రివలె పాలించసాగెను. ఆ మహాబలుడు తానే క్షేత్రపాలకుడుగా పశుపాలకుడుగా సర్వపాలకుడుగా మహాసమర్థతతో ప్రజాపాలనం సాగించాడు. అతడు కీర్తిని మించినదేదీలేదని గ్రహించాడు. కీర్తి పృథివి మీద నిలచినంతకాలం స్వర్గంలో దేవతలతో బాటు నిలువవీలగును. కీర్తికిగల శక్తిని గుర్తించిన ఆ రాజశ్రేష్టుడు దానిని సంపాదించుటకై ప్రపంచమంతటా పర్యటనం గావించాడు. అంతట నా పృథ్వీపతి ద్వైత వనమను పుణ్యదేశానికి చేరుకొని సంతోషంతో అందు ప్రవేశించెను. అట బ్రహ్మపుత్రిక పాపనాశిని పుణ్యరూపిణి, హరిజిహ్వ, ప్లక్ష్మజ అయిన సరస్వతిని చూచెను. ఆమెసుదర్శనుని తల్లి. ఆ భగవతి కోటి తీర్థాలతో పరివేష్ణింపబడి చక్కని సరోవరంగా విరాజిల్లుతోంది. ఆమె పవిత్ర జలాల్లో ఆ రాజు సంతోషంతో స్నానం చేసి ఉత్తరాన ఉన్న బ్రహ్మవేది వద్దకు వెళ్ళాడు. అది ఉత్తమమైన ధర్మభూమి. పేరు సమంత పంచకం. ఎటు చూచినా ఐదు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది.
దేవతలు
17 - కియంత్యో వేదయః సంతి బ్రహ్మణః పురుషోత్తమ ।
యేనోత్తరతయా వేదిర్గదితా సర్వపంచకా ॥
దేవతలు
ఓ పురుషోత్తమా! ఉత్తరాన ఉన్న సర్వపంచకవేది అంటున్నారు. ఇంతకూ బ్రహ్మవేదీలు ఎన్ని ఉన్నయేమిటి?
భగవానుడు
18 - వేదయో లోకనాథస్య పంచ ధర్మస్య సేతవః ।
యాసు యష్టం సురేశేన లోకానాథేన శంభూనా ॥
19 - ప్రయాగో మధ్యమావేదిఃపూర్వావేదిర్గయాశిరః ।
విరజా దక్షిణావేదిరనంతఫలదాయినీ ॥
20 - వ్రతీచీ పుష్కరావేదిః త్రిభిః కుండైరలంకృతా ।
సమంతపంచకా చోక్తా వేది రేవోత్తరా_వ్యయా ॥
21 - తమమన్యతరాజర్షిరిదం క్షేత్రం మహాఫలం ।
కరిష్యామికృషిష్యామి సర్వాన్ కామాన్ యథేప్సితాన్ ॥
22 - ఇతి సంచిత్య మనసా త్యక్త్వా స్యందనముత్తమమ్ ।
చక్రేకీర్త్యర్థమతులం సంస్థానం పార్థివర్షభః ॥
23 - కృత్వాసీరం స సౌవర్ణం గృహ్య రుద్రవృషం ప్రభుః ।
పౌండ్రకంయామ్యమహిషం స్వయం కర్షితుముద్యతః ॥
24 - తంకర్షంతంనరవరం సమభ్యేత్య శతక్రతుః ।
ప్రోవాచరాజన్ కిమిదం భవాన్ కర్తు మిహోద్యతః ॥
25 - రాజాబ్రవీత్ సురవరం తపః సత్యం క్షమాందయాం ।
కృషామిశౌచందానంచ యోగంచ బ్రహ్మచారితామ్ ॥
26 - తస్యోవాచహరిర్దేవః కస్మాద్ బీజోనరేశ్వర ।
లబ్దోష్టాంగేతి సహసా అవహస్య గతస్తతః ॥
27 - గతే_పిశక్రేరాజర్షి రహన్యహనిసీరధృక్ ।
కృషతేన్యాన్ సమంతాచ్చ సప్తక్రోశాన్ మహీపతిః ॥
28 - తతోహమబ్రువం గత్వా కురోకిమిదమిత్యథ ।
తదా_ష్టాంగంమహాధర్మం సమాఖ్యాతం నృపేణహి ॥
29 - తతోమాయాస్యగతిదం నృపబీజం క్వతిష్టతి ।
సచాహమమదేహస్థం బీజం తమహమబ్రువమ్ ।
దేహ్యాహంవాపయిష్యామి సీరం కృషతు వైభవాన్ ॥
30 - తతోనృపతినాబాహు ర్దక్షిణః ప్రసృతఃకృతః! ।
ప్రసృతంతంభుజందృష్ట్వా మయా చక్రేణ వేగతః ॥
31 - నహస్రధాతతశ్చిద్య దత్తో యుష్మాక మేవహి! ।
తతఃసవ్యోభుజో రాజా దత్తశ్చిన్నో_ప్యసౌ మయా ॥
32 - తథైవోరుయుగంప్రాదా న్మయాఛిన్నౌచ తావుభౌ ।
తతః స మే శిరఃప్రాదాత్ తేన ప్రీతోస్మి తస్యచ ।
వరదోస్మీత్యథేత్యుక్తే కురుర్వర మయాచత ॥
భగవానుడు
లోకనాథుని వేదికలు ఈ లోకంలో అయిదున్నాయి. అవి ధర్మసేతువులు. ఆ ప్రదేశాల్లో లోకేశ్వరుడు శివుడు యజ్ఞాలు చేశాడు. వానిలో మధ్యవేది ప్రయాగ, తూర్పువేది గయా, దక్షిణాన అనంత ఫలం యిచ్చే విరజవేది ఉంది. పశ్చిమాన మూడుకుండాలతో కూడిన పుష్కరవేది. కాగా ఉత్తరాన ఉన్న దానిని అక్షయమైన సమంతపంచకవేది అంటారు. అంతట నా రాజర్షి ఈ క్షేత్రం మహాఫలదాయకం. కాబట్టి యిక్కడ కృషిచేసి అన్ని కామ్యాలను పండించుకుంటానని నిశ్చయించుకొని తన రాథాన్నుంచి క్రిందకు దిగాడు. ఆ క్షేత్రాన్ని తనకీర్తి సాధనకు నిలయం గావించుకొన్నాడు. ఆ రాజశ్రేష్టుడు. ఒక బంగారు నాగలికి రుద్రుని ఎద్దును యముని పౌండ్రకమనే మహిషాన్ని కట్టి స్వయంగా దున్నడం మొదలు పెట్టాడు. అలా సేద్యం చేస్తున్న రాజును సమీపించి యింద్రుడు ఏమిటీ ఈ వ్యవహారమంతా అని అడిగాడు. అందుకు రాజు తపస్సు, సత్యం, క్షమా, దయ, శౌచం, దానం, యోగం, బ్రహ్మచర్యం వీటిని సేద్యం చేస్తున్నానని బదులు చెప్పాడు. అప్పుడు యింద్రుడతనితో ఆ అష్టాంగ ధర్మబీజం నీకిచ్చిన వారెవ్వరని చిరునవ్వు నవ్వి అచటనుండి వెడలిపోయెను. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత గూడ నారాజు నాగలితో సేద్యం సాగిస్తూ ప్రతిదినము ఆ చుట్టుపట్ల ఏడు క్రోశాల మేర భూమిని దున్నివైచెను. అంతట నేను కురురాజు వద్దకు వెళ్లి ఏమి చేయుచున్నావని యడుగగా నా మహీపతి అష్టాంగ మహాధర్మాన్ని నాకు వివరంగా చెప్పాడు. దానికి నేనా బీజం ఎక్కడ ఉన్నదని అడుగగా తన దేహంలో ఉన్నదని అతడు సమాధానమిడెను. అంతట నేను దానిని భూమిలోనాటెదనంటిని. అంతట నా రాజు తన కుడిచేతిని చాచగా నేను వెంటనే చక్రంతో దానిని వేయి ముక్కలుగా ఖండించితిని. అంతట నారాజు చాచిన ఎడమచేతిని గూడ నదేవిధంగా ముక్కలు గావించితిని. అనంతరం రాజు తన రెండు ఊరు (తొడ)లను చూపగా వానిని ఖండించితిని. చివరికాతడు తన శిరస్సును అర్పించగా నేను మిగుల సంతోషించి వరమిచ్చెద కోరుకొమ్మనగా కురురాజిట్లనెను.
కురు
33 - యావదేతన్మ యాకృష్టం ధర్మక్షేత్రం తదస్తుచ ।
స్నాతానాంచమృతానంచ మహాపుణ్యఫలం త్విహ ॥
34 - ఉపవాసంచదానంచ స్నానం జప్యంచ మాధవ ।
హోమయజ్ఞాదికం చాన్య చ్చుభంవా ప్యాశుభంవిభో ॥
35 - త్వత్ప్రసాదాద్ధృషీ కేశ శంఖచక్రగదాధర ।
అక్షయంప్రవరేక్షేత్రే భవత్వత్రమహాఫలమ్ ॥
36 - తథాభవాన్ సురైఃసార్ధం సమందేవేనశూలినా ।
వసత్వంపుండరీకాక్ష మన్నామవ్యంజకే_చ్యుత ।
ఇత్యేవముక్తస్తేనాహం రాజ్ఞా బాఢమువాచతమ్ ॥
37 - తథాచత్వం దివ్యవపు ర్భవభూయోమహీపతే ।
తథాం_తకాలే మామేవ లయమేష్యసి సువ్రత ॥
38 - కీర్తిశ్చశాశ్వతీ తుభ్యం భవిష్యతి నసంశయః ।
తత్రైవయాజకాయజ్ఞాన్ యజిష్యంతి సహస్రశః ॥
39 - తస్యక్షేత్రస్యరక్షార్థం దదౌ స పురుషోత్తమః ।
యక్షంచ చంద్రనామానాం వాసుకిం చాపిపన్నగమ్ ॥
40 - విద్యాధరంశంకుకర్ణం సుకేశిం రాక్షసేశ్వరమ్ ।
అజావనంచనృపతిం మహాదేవం చ పాపకమ్ ॥
41 - ఏతాని సర్వతో_భ్యేత్య రక్షంతి కురుజాంగలమ్ ।
అమీషాం బలినో_న్యేచభ్రుత్వాశ్చైవానుయాయినః ॥
42 - అష్టౌసహస్రాణి ధనుర్ధరాణాం యేవారయంతీవ సుదుష్క్రుతాన్ వై ।
స్నాతుం నాయచ్చంతి మహోగ్రరూపా స్త్వన్యస్యభూతాః సచరాచరాణామ్ ॥
43 - తస్యైవమధ్యే బహుపుణ్యఉక్తః పృథూదకః పాపహరః శివశ్చ ।
పుణ్యానదీప్రాఙ్ ముఖతాం ప్రయాతా యత్రౌఘయుక్తస్యశుభాజలాఢ్యా ॥
44 - పూర్వం ప్రజేయం ప్రపితామహేన సృష్టా సమం భూతగణైః సమస్తైః ।
మహీజలంవహ్నిసమీరమేవ ఖంత్వేవమాదౌ విబభౌ పృథూదకః ॥
45 - తథాచసర్వాణిమహార్ణవాని తీర్థాని సద్యః స్రవణాఃసరాంసి ।
సంనిర్మితానీహ మహాభుజేన తచ్చైక్య మాగా త్సలిలం మహీషు ॥
కురు
నేను సేద్యం చేసిన (దున్నిన) ఈ నేల అంతా ధర్మ క్షేత్రం కావాలి. ఇక్కడ స్నానం చేసినా చనిపోయినా సరే అందరూ మహా పుణ్యఫలం పొందాలి. ప్రభూ మాధవా! హృషీకేశా! చక్రధరా! ఈ చోట గావింపబడిన ఉపవాస దాన స్నాన జపహోమయజ్ఞాది శుభాశుభ కర్మలన్నియు నీ అనుగ్రహం వల్ల అక్షయ ఫలదాయకాలు కావాలి. అంతే కాదు. నా పేర వ్యవహరింపబడునట్టి ఈ ప్రదేశాన సమస్త దేవతలు, త్రిశూలధారియగు శంకరునితో కూడి ఓ పుండరీకాక్షా! నీవు సదా నివసించుము. అంతట నేనా రాజుతో – రాజా! అట్లే అగుకాక! నీవు మరల దివ్యదేహం ధరించుము. అంత్యకాలాన వేలాది యాజ్ఞికులు క్రతువులొనరింతురు. అని చెప్పితిని. ఆ క్షేత్రాన్ని రక్షించుటకై శ్రీమన్నారాయణుడు చంద్రుడను యక్షుని, వాసుకి పన్నగుని, శంకుకర్ణుడను విద్యాధరుని, సుకేశియను రాక్షసేశ్వరుని అజావనుడను నరపతిని పావకమహాదేవుని నియమించెను. అప్పటినుండియు వారలు వారి శక్తి శాలురైన భృత్యులు అనుచరులు కలసి ఈ కురుజాంగల భూమిని కంటికి రెప్పవలె కాపాడుచున్నారు. పాపులు దుర్మార్గులు ఈ క్షేత్రాన్ని సమీపించకుండా ఎనిమిదివేల మంది ధనుర్ధరులు కాపాడుతున్నారు. అట్టివారిని యిచట స్నానం చేయకుండా నిరోధించుచున్నారు. ఆ కురుజాంగల క్షేత్రం మధ్యగా పైన చెప్పిన పాపహారి, పవిత్రమూ మంగళకరమూ నైన పృథూదక తీర్థం ఉంది. అక్కడ స్వచ్చజలాలతో నిండిన ఒక పవిత్ర నది తూర్పు ముఖంగా పారుతుంటుంది. ప్రాచీనకాలంలో బ్రహ్మ భూతజాలంతో కూడిన ఈ సృష్టినంతటినీ గావించాడు. అనాది కాలం నుంచి భూమి నీరు తేజస్సు వాయు ఆకాశాలతో బాటు ఈ పృథూదక క్షేత్రం గూడ విరాజిల్లుతోంది. అంతేకాక ఆ మహాభుజుని(విష్ణువు) సంకల్పంవల్ల సమస్త మహార్ణవాలు, తీర్థాలు, నదులు, తటాకసరోవరాలన్నీ తమతమ జలాలతో యీ ప్రదేశాన సమీకరింపబడి ఐక్య భావాన్ని భజిస్తున్నాయి.
అధ్యాయము 23 complete
Summary of chapter 23 of the Vāmana Mahā Purana is as follows:
The chronicle shifts to the glorious rise of King Bali, the grand-nephew of Prahlāda, who is crowned as the sovereign king of the asuras amidst elaborate Vedic rituals and demonic splendor. Guided by the wise preceptor Śukrāchārya, King Bali performs numerous Ashvamedha sacrifices, maintains strict adherence to truthfulness, and bestows boundless charity upon brāhmaṇas and seekers. Under his righteous yet ambitious rule, the demon kingdom attains unprecedented wealth, power, and prosperity, setting his sights on the conquest of the heavenly realms.