వామన మహా పురాణము
అధ్యాయము 11
ఋషులు
1 - కథమేషా సముత్పన్నా నదీనాముత్తమా నదీ ।
సరస్వతీ మహాభాగా కురుక్షేత్రప్రవాహినీ ॥
2 - కథంసరః సమాసాద్యకృత్వా తీర్థాని పార్శ్వతః ।
ప్రయాతా పశ్చిమామాశాం దృశ్యాదృశ్యగతిః శుభా ।
ఏతద్విస్తరతో బ్రూహితీర్థవంశం సనాతనమ్ ॥
ఋషులు
కురుక్షేత్రం గుండా ప్రవహించే నదులలోకెల్ల ఉత్తమమైన సరస్వతినది ఎలా పుట్ట్టింది ?సరోవరంలో చేరి, తన తటాన అనేక తీర్థాలు నెలకొల్పి, దృశ్యాదృశ్య గమనంతో ఈ పవిత్ర స్రోతస్విని, పశ్చిమాభిముఖంగా ఎల్లా ప్రవహించింది? అతి ప్రాచీనమైన తీర్థముల వంశ క్రమమంతా మాకు వివరంగా చెప్పండి.
లోమహర్షణ
3 - ప్లక్షవృక్షాత్సముద్భూతా సరిచ్చేష్ఠా సనాతనీ ।
సర్వపాపక్షయకరీ స్మరణాదేవ నిత్యశః ॥
4 - సైషాశైలసహస్రాణి విదార చమహానదీ ।
ప్రవిష్టాపుణ్యతోయౌఘా వనం ద్వైతమితిస్మృతమ్ ॥
5 - తస్మిన్ ప్లక్షేస్థితాం దృష్ట్వా మార్కండేయోమహామునిః ।
ప్రణిపత్యతదా మూర్ద్నా తుష్టావాథ సరస్వతీమ్ ॥
6 - ‘త్వందేవీ : సర్వలోకానాం మాతా దేవారణి ! శుభా ।
సదసద్దేవీ ! యత్కించిన్మోక్షదాయ్యర్థవత్ పదమ్ ॥
7 - తత్సర్వంత్వయి సంయోగి యోగివద్ దేవి సంస్థితమ్ ।
అక్షరం పరమం దేవి యత్ర సర్వంప్రతిష్ఠితమ్ ।
అక్షరం పరమం బ్రహ్మ విశ్వంచైతత్ క్షరాత్మకమ్ ॥
8 - దారుణ్యవస్థితో వహ్ని ర్భూమౌ గంధో యథాధ్రువమ్ ।
తథాత్వయి స్థితం బ్రహ్మ జగచ్చేద మశేషతః ॥
9 - ఓంకారాక్షరసంస్థానం యత్ తద్దేవి స్థిరాస్థిరమ్ ।
తత్రమాత్రాత్రయం సర్వమస్తియాద్ దేవి నాస్తి చ ॥
10 - త్రయోలోకాస్త్రయో వేదాస్త్రైవిద్యం పావకత్రయంమ్ ।
త్రీణీజ్యోతీంషివర్గాశ్చ త్రయో ధర్మాదయ స్తథా ॥
11 - త్రయోగుణాస్త్రయో వర్ణాస్త్రయో దేవా స్తథాక్రమాత్ ।
త్రైదాతవస్థథా_వస్థాః పితరశ్చైవ మాదయః ॥
12 - ఏతన్మాత్రాత్రయం దేవి ! తవ రూపం సరస్వతి ।
విభిన్నదర్శనామాద్యాం బ్రహ్మణో హి సనాతనీమ్ ॥
లోమహర్షణ
“స్మరణ మాత్రాన్నే సర్వపాపాలు పోగొట్టునదీ, అతిప్రాచీనమైనది అయిన సరస్వతీ ప్లక్ష (మేడి) వృక్షం నుంచి ఉద్భవించింది. వేల పర్వతాలను చీల్చుకుంటూ, ఆ మహానది తన పుణ్య జలాలతో ద్వైత వనంలోకి చేరింది. ప్లక్ష వృక్షంలో ఉండగా నామేను చూచిన మార్కండేయ మహాముని శిరసా ప్రణామం చేసి ఆ దేవిని స్తోత్రం చేశాడు. “దేవీ! నీవు సర్వలోక జననివి. మంగళ మూర్తివైన దేవమాతవు (దేవారణివి) సదసద్రూపమైనదంతయూ, మోక్షదాయి అయినదీ, అర్థవంతమైన పదమేదైతే కలదో అదంతయూ యోనిలో సర్వంనిహితమైనట్లు, నీలో గర్భితమై ఉన్నది. అక్షరమైన పరబ్రహ్మతత్వం, క్షరాత్మకమైన(మారుతున్న) విశ్వం అంతయు పరాశక్తివగు నీలో యిమిడియున్నది. దారువు(కొయ్య)లో అగ్నివలె, భూమిలోగంధ(వాసన) గుణం మాదిరి అనంతమైన జగత్తు, బ్రహ్మతత్వం నీలో నిండియున్నది. ఓ దేవీ! ఓంకారంలోని స్థిరాస్థిరమైన త్రివర్ణమాత్రాక్రమం, ఉన్నది లేదను భావం, మూడులోకాలు, మూడువేదాలు, ధాతువులు, అవస్థాత్రయం, పితరులు, మాత్రాత్రయం మొదలుగాగల త్రిపుతి అంతా ఓ సరస్వతీదేవీ, నీ రూపమే పరతత్వం యొక్క విభిన్న దర్శనాలన్నీ సనాతనివగు నీ లీలలేనమ్మా!
13 - సోమసంస్థా హవిఃసంస్థా పాకసంస్థా సనాతనీ ।
తాస్త్వదుచ్చారణాద్దేవీ క్రియంతే బ్రహ్మవాదిభిః ॥
14 - అనిర్దేష్యపదంత్వేత దర్ధమాత్రాశ్రితం పరమ్ ।
అవికార్యక్షయందివ్యం పరిణామవివర్జితమ్ ॥
15 - తవైతత్పరమంరూపం యన్నశక్యం మయోదితుమ్ ।
నచాస్యేననవాజిహ్వా తాల్వోష్టాదిభి రుచ్యతే ॥
16 - సవిష్ణుః సవృషో బ్రహ్మా చంద్రార్కజ్యోతిరేవచ ।
విశ్వవాసం విశ్వరూపం విశ్వాత్మాన మనీశ్వరమ్ ॥
17 - సాంఖ్యసిద్ధాంతవేదోక్తం ।
బహుశాఖాస్థిరీకృతమ్ ।
అనాదిమధ్యనిధనం సదసచ్చ సదేవతు ॥
18 - ఏకం త్వనేకధాప్యేకభావవేద సమాశ్రితమ్ ।
ఆనాఖ్యం షడ్గుణాఖయం చ బహ్వాఖ్యం త్రిగుణాశ్రయమ్ ॥
19 - నానాశక్తి విభావజ్ఞం నానాశక్తివిభావకమ్ ।
సుఖాత్సుఖంమహతసౌఖ్యం రూపం తత్త్వగుణాత్మకమ్ ॥
20 - ఎవందేవి ! త్వయావ్యాప్తం సకలం నిష్కలంచ యత్ ।
అద్వైతావస్థితంబ్రహ్మ యచ్చ ద్వైతే వ్యవస్థితమ్ ॥
21 - యే_ర్థా నిత్యా యే వినశ్యంతి చాన్యే ।
యే_ర్థాః స్థూలా యే తథా సంతి సూక్ష్మాః ।
యే వా భూమౌ యేం_తరిక్షే_న్యతో వా తేషాం దేవి త్వత్త ఏవోపలబ్ధిః ॥
22 - యద్వా మూర్తం యదమూర్తం సమస్తం యద్వా భూతేష్వేకమేకం చ కించిత్ ।
యచ్చద్వైతే వ్యస్తభూతం చ లక్ష్యం తత్సంబద్ధం తత్స్వరైర్వ్యంజనైశ్చ ॥
23 - ఏవం స్తుతా తదాదేవీ విష్ణోర్జిహ్వా సరస్వతీ ।
ప్రత్యువాచ మహాత్మానం మార్కండేయం మహామునిమ్ ।
యత్ర త్వం నేష్యసే విప్రత్రత తయాస్యామ్యతంద్రితా ॥
“ఓ దేవీ! బ్రహ్మవాదులగువారు నిన్ను ఉచ్చరించిన మాత్రాన్నే సోమ, హవిర్ః పాకయజ్ఞాలు చేయగలుగుచున్నారు. అర్ధమాత్రాపరిమితమైన నీ పరమపదమట్టిదని నిర్దేశింపరాకున్నది. అది అవికారి అక్షయమైనది దివ్యమైనది సర్వపరిణామరహితమైనది అట్టినీ దివ్య రూపాన్ని నేనేకాదు యితరు లెవ్వరును వర్ణింపజాలరు. నోటికిగాని నాలుకకు గాని తాలువులు పెదవులకు గాని దానిని వర్ణించగల శక్తిలేదు.ఆ నీ రూపమే విష్ణువు, శివుడు, బ్రహ్మ, సూర్యచంద్రాగ్నులు, ప్రపంచానికి ఆశ్రయం, విశ్వమే. విశ్వం యొక్క ఆత్మ, సాంఖ్యం, బహు శాఖావిస్త్రుతమైన వేదములద్వారా అది మధ్యాంతహీనమనీ, సత్తనీ, అసత్తనీ, చెప్పబడినది. ఒకటి అయిగూడ అనేకము. ఒకే భావాన్ని ఆశ్రయించియున్నది. పేరు లేనిది, అయినా ఆరువిధాల అనేక విధాల పేర్కొనబడినది. త్రిగుణాలతో గూడినది నానాశక్తుల తత్వం తెలిసినది, నానాశక్తుల సంపుటి అయినది. సుఖాలన్నింటికి సుఖమైనది. సర్వతత్వ గుణాత్మకమైనమహా సుఖమే ణీ రూపం. సగుణ నిర్గుణాత్మకమైన ఈ విశ్వాన్నంతా ఓ భగవతీ! ఇలాంటి అద్భుతరూపంతో ఆవరించియున్నావు! అద్వయ బ్రహ్మగా, ద్వైతబ్రహ్మగా నీవే వ్యవహరిస్తున్నావు! ఈ భూమి మీద గాని, అంతరిక్షంలో గాని యితరత్రాగాని ఉన్నట్టి, శాశ్వత అశాశ్వత స్థూల సూక్ష్మాది వస్తుజాలమంతకు నాధారము నీవే! రూపు కట్టియు, కంటికగపడకయు, ఒకటి గాను, అనేకంగాను, వ్యస్తంగాను, సమస్తంగాను కనుపించే ఈ అఖిలము ఓ దేవీ! నీవగుస్వర వ్యంజనాల సమాహారమే! మనోహర విన్యాసమే!” తననీ విధంగా స్తుతించిన మహాత్ముడగు మార్కండేయ మహామునితో విష్ణు జిహ్వ అయిన ఆ సరస్వతీదేవీ యిలా పలికినది. విప్రోత్తమా! ణీ వెచ్చటకు గొనిపోవుదువో అచ్చటకల్లా నీవెంట అవిశ్రాంతంగా వస్తున్నాను. నడువుము.”
24 - ఆద్యం బ్రహ్మసరః పుణ్యం తతో రామహ్రదః స్మృతః ।
కురుణాఋషిణా కృష్టం కురుక్షేత్రం తతః స్మృతమ్ ।
తస్య మధ్యే నవైగాఢం పుణ్యాపుణ్యజలావహా ॥
మార్కండేయుడు
“తల్లీ మొదట బ్రహ్మ సరోవరం అనంతరం రామసరస్సుగా, ఆ తర్వాత మహర్షి కురువు చేతదున్నబడి కురుక్షేత్రంగా విఖ్యాతిగాంచిన పవిత్రక్షేత్రం మధ్యనీ పావన జలాలతో త్వరితంగా ప్రవహింపు” మనెను.
అధ్యాయము 11 complete
Summary of chapter 84 of the Vāmana Mahā Purana is as follows:
The narrative chronicles how the saintly King Kuru undertook intense physical and spiritual labor by personally ploughing the land of Kurukshetra with a golden plow drawn by the sacred bull of Mahādeva Śiva. King Kuru offered his own body, flesh, and blood into the furrowed earth as a supreme sacrifice, seeking a divine boon for the spiritual welfare of humanity. His unyielding devotion transformed the region into an eternal field of righteousness, forever blessed by the presence of the Supreme Divine.