అధ్యాయము 4

పులస్త్యుడు

1 - ఏవం కపాలీ సంజాతో దేవర్షే భగవాన్ హరః

 అనేన కారణేనసౌ దక్షేణ న నిమంత్రితః

2- కపాలిజాయేతి సతీ విజ్ఞాయాథ ప్రజాపతిః

 యజ్ఞేచార్హాసి దుహితా దక్షేణ న నిమంత్రితా

3 - ఏతస్మిన్నంతరే దేవీం ద్రష్టుం గౌతమనందినీ

 జయాజగామ శైలేంద్రం మందరం చారుకందరమ్

4 - తామాగతాం సతీ దృష్ట్వా జయా మేకా మువాచహ

 కిమర్థం విజయా నాగాజ్జయంతీ చాపరాజితా

5 - సా దేవ్యా వచనం శ్రుత్వా ఉవాచ పరమేశ్వరీమ్

 గతానిమంత్రితాః సర్వా మఖే మాతామహస్య తాః

6 - సమం పిత్రా గౌతమేన మాత్రా చైవాప్యహల్యయా

అహం సమాగతా ద్రష్టుం త్వాం తత్ర గమనోత్సుకా     

7 - కింత్వంనవ్రజసే తత్ర తథా దేవో మహేశ్వరః

 నా-మంత్రితాసి తాతేన ఉతాహోస్విద్ ప్రజిష్యసి        

8 - గతాస్తూ ఋషయన్సర్వే ఋషి పత్న్యః సురా స్తథా

 మాతృష్వనః శశాంకాశ్చ సపత్నీకో గతఃక్రతుమ్

9 - చతుర్దశ సు లోకేషు జంతవో యే చరాచరాః

 నిమంత్రితాః క్రతౌ సర్వే కింనాసి త్వం నిమంత్రితా

పులస్త్యుడు

దేవర్షీ! ఈ విదంగా భగవంతుడగు హరుడు కపాలియయ్యెను. అది కారణంగా దక్షుడాయనను ఆహ్వనించడాయెను. యజ్ఞంలో పాల్గొనుట కర్హురాలైనను కపాలి భార్యయగుటచే తన కుమార్తె సతిని గూడా నాహ్వానించలేదు. ఈ లోపుగా గౌతమ దుహిత జయ అందమైన గుహలతో కూడిన మందర పర్వతమునకు వెళ్ళి తీదేవిని దర్శించెను. ఒంటరిగా వచ్చిన జయను చూచి దాక్షాయణి, విజయ, జయంతీ, అపరాజితలేరీ? నీ వొక్కతెవే ఏల వచ్చితివనెను. పరమేశ్వరితో జయ, “వారందరు మన మాతామహుడొ నరించుచున్న యజ్ఞమున కాహ్వానితులై వెళ్ళిరి. నేను నిన్ను చూడవలెనని మా తల్లి దండ్రులు అహల్యా గౌతములతో కలిసి వెళ్ళుచూ దారిలో యిటు వచ్చితిని. మరి నీవు మహేశ్వరునితో కలిసి వచ్చుట లేదా? మీ తండ్రి పిలువనంపలేదా? లేక తరువాత వచ్చెదవా? ఋషులు వారి భార్యలు, దేవతలు, సపత్నీతుడై చంద్రుడు, పదునాలుగు భువనాల్లో గల చరాచర ప్రాణులందరూ ఆహ్వనితులై యజ్ఞానికి వెళ్ళగా నీ వేల బయలుదేరకుంటివి పిన్నీ ? నిన్ను మీ తండ్రి పిలువా లేదా ?” యనెను.

పులస్త్యుడు

10 - జయాయా స్తద్వచః శృత్వా వజ్రపాతసమం సతీ

 మన్యునా-భిప్లుతా బ్రహ్మన్ పంచత్వ మగమత్తతః

11 - జయా మృతాం సతీం దృష్ట్వా క్రోధశోకపరిప్లుతా

 ముంచతీ వారి నేత్రాభ్యాం సస్వరం విలలాపహ

12 - ఆక్రందితద్వనిం శ్రుత్వా శూలపాణి స్త్రిలోచనః

 అః కిమేతదితీత్యుక్త్వా జయాభ్యాశ ముపాగతః

13 - ఆగతో దద్రుశే దేవీం లతామివ వనస్పతేః

 కృత్తాం పరశునా భూమౌ శ్లథాంగీం పతితాం సతీం

14 - దేవీం నిపతితాం దృష్ట్వా జయం పప్రచ్ఛ శంకరః

 కిమియం పతితా భూమౌ నిక్రుత్తేవ లతా సతీ

15 - సా శంకరవచః శ్రుత్వా జయా వచన మబ్రవీత్

 శ్రుత్వా మఖస్థాదక్షస్యః భగిన్యః పతిభిః సహ

16 - ఆదిత్యాద్యా స్త్రీలోకేశ సమం శక్రాదిభిః సురైః

 మాత్రుష్వసా విపన్నేయ మంతర్దుఃఖేన దహ్యతీ

పులస్త్యుడు

పిడుగు పాటు లాంటి ఆ మాటలు వినిన తోడనే సతీదేవి క్రోధాతిరేకంతో అక్కడకక్కడనే ప్రాణములు వదలెను. చనిపోయిన సతీదేవిని చూచి జయ దుఃఖాతిరేకంతో కన్నీరు కార్చుచు విలపింపసాగెను. ఆక్రందన ధ్వని విని పరమేశ్వరుడదరిపడి, “ఏమి జరిగిన” దనుచూ జయను సమీపించెను. పరశుఘాతానికి తెగిపడిన తీగవలె నేల కొరగిపడియున్న సతిని జూచి, “నరుకబడిన తీగ వలె ఈమె యేలపడియున్న”దని జయనడిగెను. అప్పుడు జయ ప్రభూ! తన తోబుట్టువు లెల్లరూ భర్తలతో నాహ్వానించబడి దక్షయజ్ఞమునకు వెళ్ళిన సంగతియూ ఇంద్రాది సకల దేవతలు వెళ్ళిన విషయం విని, ఈనా పిన తల్లి అంతర్దుఃఖాగ్నిలో మ్రగ్గి ఈ దశకు ప్రాప్తించిన” దనెను.

పులస్త్యుడు

17 - ఏతచ్చ్రుత్వా వచోరౌద్రం రుద్రః క్రోదాప్లుతో బభౌ

 క్రుద్దస్య సర్వగాత్రేభ్యో నిశ్చేరుః సహసార్చిషః

18 - తతః క్రోధాత్ త్రినేత్రస్య గాత్రరోమోద్భవా మునే

 గణాః సింహముఖా జాతా వీరభద్రపురోగమాః

19 - గణైః పరివృతస్తస్మా న్మందరా ద్దిమసాహ్వాయం

 గతః కనఖలం తస్మా ద్యత్ర దక్షో-యజత్ క్రతుమ్

20 - తతో గణానామధిపో వీరభద్రో మహాబలః

 దిశి ప్రతీచ్యుత్తరాయం తస్థౌశూలధరో మునే

21 - జయా క్రోదాద్గదాం గృహ్య పూర్వదక్షిణతః స్థితా

 మధ్యే త్రిశూలధృక్ శర్వస్తస్థౌ క్రోదాన్మహామునే

22 - మృగారివదనం దృష్ట్వా దేవాః శక్రపురోగమాః

 ఋషయో యక్షగందర్వాః కిమిదం త్విత్యచింతయన్

23 - తతస్తు ధనురాదాయ శరాంశ్చా శీవిషోపమాన్

 ద్వారపాల స్తదా ధర్మో వీరభద్ర ముపాద్రవత్

24 - తమాపతంతం సహసా ధర్మం దృష్ట్వా గణేశ్వరః

 కరేణై కేన జగ్రాహ త్రిశూలం వహ్నిసన్నిభమ్

25 - కార్ముకంచ ద్వితీయేన త్రుతీయేచాథా మార్గణాన్

 చతుర్దేన గదాంగృహ్య ధర్మమభ్యద్రవద్ గణః

26 - తత శ్చతుర్బుజం దృష్ట్వా ధర్మరాజో గణేశ్వరం

 తస్థౌ నష్టభుజో భూత్వా నానాయుధధరో-వ్యయః

27 - ఖడ్గచర్మ గదాప్రాస పరశ్వథ వరాంకుశ్యై

 చాపమార్గణభ్రుతస్థౌ హంతుకామో గణేశ్వరమ్

28 - గణేశ్వరో-పి సంక్రుద్దో హంతుం ధర్మం సనాతనమ్

 వవర్ష మార్గాగణాం స్తీక్ష్ణాన్ యథాప్రావృషి తోయదః

29 - తావన్యోన్యం మహాత్మానౌ శరచాపధరౌ మునే

 రుధిరారుణ సిక్తాంగౌ కింశుకానివ రేజతుః

30 - తతో వరాస్త్రై ర్గణనాయకేన జితః సదర్మః తరసౌ ప్రసహ్య

 పరాజ్ ముఖో-భూ ద్విమనా మునీంద్రః సవీరభద్ర ప్రనివేశ యజ్ఞమ్   

పులస్త్యుడు

జయ మాటలు విన్నంతనే రుద్రుడు క్రోధతామ్రాక్షుడయ్యెను. ఆయన అంగ ప్రత్యంగమం నుండియు భయంకరమైన విస్పులింగములు బయలు వెడలెను. అట్లు క్రోదోన్మత్తుడైన త్రినేత్రుని రోమకూపాల నుంచి వీరభద్రుని పురస్కరించుకొని సింహముఖులైన రుద్రగణములు వెలువడి దక్షుడు యజ్ఞమొనర్చుచున్న కనఖల ప్రదేశానికి వెళ్ళిరి. గణాధ్యక్షుడైన వీరభద్రుడు భయంకరమైన శూలము ధరించి యజ్ఞశాలకు పశ్చిమ ఉత్తర దిశల నాక్రమించి నిలచెను. క్రోధావేశంతో కంపించిపోతూ జయ గద చేతబట్టుకొని తూర్పు దక్షిణ దిక్కుల నిలబడినది. ఓ మునీ! మధ్యభాగాన త్రిశూలధారియై శర్వుడు భయంకరాకృతితో నిలబడెను. ఇంద్ర పురోగములైన ఋషులు యక్ష గంధర్వులు భయంకరమైన సింహ ముఖము చూచి ఇదేమని చింతాకులితులైరి. అంతట ద్వారరక్షకుడగు ధర్ముడు ఆశీవిషోపమాలైన సరములు పూన్చిన విల్లు గ్రహించి వీరభద్రున కెదురుగా పరుగిడెను. ఆ విధంగా పైకివచ్చు ధర్ముని చూచి గణేశ్వరుడు అగ్ని శిఖా సదృశమైన త్రిశూలమొక చేత బట్టెను. రెండవ చేత ధనుస్సు మూడు నాలుగు చేతులలో బాణములు గద ధరించి ధర్ముని తరుమజొచ్చెను. నాలుగు భుజములతో తన్నెదిర్చిన గణాధ్యక్షుని చూచి అవ్యయుడైన ధర్ముడు తత్క్షణమే ఎనిమిది భుజములు దంరించి నానాయుధములతో నిలబడెను. ఖడ్గ చర్మ, గద, ప్రాస పరశు అంకుశ చాపమారణములతో గణేశ్వరుని జంపనుద్యుక్తుడయ్యెను. గణేశ్వరుడు కూడ సనాతనుడగు ధర్ముని సంహరించు తలంపుతో, వర్షాకాలపు మేఘము వలె తీవ్రములగు బాణములనతనిపై ప్రయోగించెను. ఓ మునీ! అట్లమ్మహాత్ములగు వీరులిర్వురు శరచాపములతో నొకరి నొకరు ప్రహరించుకొని రక్తసిక్తాంగులై పూచిన మోదుగ వలె ప్రకాశించిరి. అంతట వీరభద్రుని తీవ్ర బాణవృష్టికి నోటుపడి దీనుడై ధర్ముడు ముఖము వంచుకొని తొలగిపోగా వీరభద్రుడు యాగశాల బ్రవేశించెను.

31 - యజ్ఞవాటం ప్రవిష్టంతం వీరభద్రం గణేశ్వరమ్

 దృష్ట్వాతు సహసాదేవా ఉత్తస్థుః సాయుదామునే

32 - వసవో-ష్టౌ మహాభాగా గ్రహా నవ సుధారుణాః

 ఇంద్రాద్యా ద్వాదశాదిత్యా రుద్రా స్త్వేకాదశైవ హి        

33 - విశ్వేదేవాశ్చ సాధ్యాశ్చ సిద్దగంధర్వపన్నగాః

 యక్షాః కింపురుషా శ్చైవ ఖగాశ్చక్రదరాస్తథా

34 - రాజా వైవస్వతాద్వంశాద్ ధర్మకీర్తిస్తు విశ్రుతః

 సోమవంశోద్బవ శ్చోగ్రో భూజకీర్తి ర్మహాభుజః

35 - దితిజా దానవాశ్చాన్యే యే-న్యే తత్రసమాగతాః

 తేనర్వే-భ్యద్రవన్ రౌద్రం వీరభద్ర ముదాయుదాః

36 - తానావతత ఏవాళు చాపబాణదరోగణః

 అబిదుద్రావ వేగేన సర్వానేవ శరోత్కరై;

37 - తే శస్త్రవర్షమతులం గణేశాయ సముత్ప్రుజన్

 గణేశో –పు వరాస్త్రైస్తాన్ ప్రచిచ్చేద బిఖేదచ

38 - శరైః శస్త్రైశ్చ సతతం వధ్యమానా మహాత్మనా

 వీరభద్రేణ దేవాద్యా అవహారమకుర్వత

39 - తతో నివేశ గణపో యజ్ఞ మద్యం సువిస్త్రుతమ్

 జుహ్వానా ఋషయో యత్ర హవీంషి ప్రవితన్వతే

40 - తతో మహర్షయో దృష్ట్వా మృగేంద్రవదనం గణమ్

 భీతా హోత్రం పరిత్యజ్య జగ్ముః శరణ మచ్యుతమ్

41 - తానార్తాం శ్చక్రభృద్దృష్ట్వా మహర్షీం స్త్రస్తమానసాన్

 నభేతవ్య మితీత్యుక్త్వా సముత్తస్థౌ వరాయుదః

42 - సమానమ్య తతః శార్జ్ఞం శరా నగ్ని శిఖోపమాన్

 ముమోచ వీరభద్రాయ కాయావరణదారణాన్

43 - తే తస్యకాయ మాసాద్య అమోఘావై హరేః శరాః

 నిషేతు ర్భువి భగ్నాశా నాస్తికాదివ యాచకాః

44 - శరాంస్త్వమోఘా న్మోఘత్వ మాపన్నా న్వీక్ష్య కేశవః

 దివ్యై రస్త్రై ర్వీరభద్రం ప్రచ్చాదయితు ముద్యతః

45 - తా నస్త్రాన్వాసుదేవేన ప్రక్షిప్తా న్గణనాయకః

 వారయామాస శూలేన గదయా మార్గ ణైస్తథా

46 - దృష్ట్వా విపన్నన్యస్త్రాణి గదాం చిక్షేప మాధవః

 త్రిశూలేన సమాహత్య పాతయామాన భూతలే 

47 - ముసలం వీరభద్రాయ ప్రచిక్షేప హలాయుదః

 లాంగలంచ గణేశో –పి గదయా ప్రత్యవారయత్      

48 - ముశలం సగదం దృష్ట్వా లాంగలంచ నివారితం

 వీరభద్రాయ చిక్షేప చక్రం క్రోదాత్ ఖగాద్వజః

49 - తమాపతంతం శతసూర్యకల్పం సుదర్శనం వీక్ష్య గణేశ్వరస్తు

 శూలం పరిత్యజ్య జగారచక్రం యథామదుం మీనవపుః సురేంద్రః

50 - చక్రేనిగీర్ణే గణనాయకేన క్రోదాతిరిక్తో- సితచారునేత్రః

 మురారిరభ్యేత్య గణాదిపేంద్ర ముత్తిప్య వేగాద్ భువి నిష్పి షేష

51 - హారిబాహూరు వేగేన వినిష్పిష్టస్య భూతలే

 సహితం రుదిరోద్గారై ర్ముఖా చ్చక్రం వినిర్గతమ్

52 - తతో నిఃసృత మాలోక్య చక్రం కైటభనాశనః

 సమాదాయ హృషీకేశో వీరభద్రం ముమోచహ

53 - హ్రుశషీకేశేన ముక్తస్తు వీరభద్రో జటాదరమ్

 గత్వా నివేదయామాన వాసుదేవాత్పరాజయమ్        

54 - తతో జటాధరో దృష్ట్వా గణేశం శోణితాప్లుతమ్

 నిశ్వనంతం యథా నాగం క్రోధం చక్రే తదావ్యయః

55 - తతః క్రోదాభిభూతేన వీరభద్రో-థ శంభునా

 పూర్వోద్దిష్టే తదాస్తానే సాయుధస్తు నివేశితః

56 - వీరభద్ర మథాదిశ్య భద్రకాళీంచ శంకరః

 నివేశ క్రోధతామ్రాక్షో యజ్ఞవాటం త్రిశూలభృత్

57 - తతస్తు దేవప్రవరే జటాధరే త్రిశూలపాణౌ త్రిపురాంతకారిణి

 దక్షస్యయజ్ఞం విశతి క్షయంకరే జాతో ఋషీణామ్ ప్రవరోహి సాద్వసః

యజ్ఞశాలలో ప్రవేశించిన వీరభద్రుని చూడగనే అందున్న దేవతలందరు – అష్టవసువులు, నవగ్రహాలూ, ఇంద్రాది ద్వాదశాదిత్యులు ఏకాదశరుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, సిద్ధగంధర్వ కింపురుషులు పన్నగులు యక్షులు, ఖగములు చక్రధరులు మొదలగు వారెల్లరు లేచి నిలబడిరి. వైవస్వత వంశానికి చెందిన లబ్ధ ప్రతిష్టుడగు ధర్మకీర్తి, ఉగ్రుడు మహాబాహువునగు సోమ వంశోద్భవుడు భోజకీర్తి. అక్కడ చేరిన దైత్యులు దానవులు తదితరు లెల్లరు తమతమ ఆయుధములతో రుద్రమూర్తియగు వీరభద్రు నెదుర్కొనిరి. అంతట వీరభద్రుడు తన తీవ్రశరపరంపరతో వారలందరను చెల్లాచెదరు కావించెను. వారందరు తమ అసమాన శస్త్రాలను వీరభద్రునిపై కుప్పింపగా నా గణాదిపుడు కూడ తన శ్రేష్టమైన ఆయుధాలతో వానినన్నింటిని తుత్తునియణగావించెను. వీరభద్రుని అస్త్రములచే తీవ్రముగ నొప్పింపబడి చేయునది లేక నాదేవత లందరు నాతనికి లొంగిపోయిరి. అంతట వీరభద్రుడు మహర్షుల ఆజ్యాహుతులతో వెలుగుచున్న విశాలమగు యజ్ఞశాలలో ప్రవేశించెను. భాయంకరాకారులై వచ్చు నా సింహముఖ గణాలను చూచినంతనే హడలిపోయి ఋత్విక్కులందరూ తమతమ యజ్ఞ వేదికలు వదలిపారిపోయి నారాయణుని శరణు వేడిరి. భయకంపితులగు నామహర్షులకభయ మొసగి విష్ణువు తన ఉత్తమమగు శార్గ్నధనువు నెత్తికొని వీరభద్రునిపై అభేద్యకవచములను సైతము చించి చెండాడ గలిగిన అగ్ని బాణములను వర్షించెను. అమోఘాలయిన ఆబాణాలన్నీ వీరభద్రుని శరీరామును తాకి నాస్తికులను యాచించి విఫల మనోరథులయిన యాచకులవలె వ్యర్థములై నేలబడిపోయెను. తన బాణములట్లు వ్యర్థములగుట చూచి కేశవుడు దివ్యాస్త్రాలతో వీరభద్రుని ముంచి వైచుట కుద్యమించెను. శ్రీహరి ప్రయోగించిన అస్త్రాలన్నింటిని వీరభద్రుడు త్రిశూలంతో గదతో మార్గణాలతో నివారించెను. తన దివ్యాస్త్రములు వ్యర్తముకాగా మాధవుడాతనిపైకి గదవిసరెను. ఆగదను త్రిశూలముతో భూమిపై బడగొట్టెను. అంతట హరి వీరభద్రునిపై హలము ముసలము ప్రయోగింపగా దానిని గణేశుడు గదతో నివారిత మొనర్చెను. అంతట మహాక్రోధంతో ఖగధ్వజుడు వీరభద్రునిపై చక్రము ప్రయోగించెను. శత సూర్యుల కాంతితో వచ్చే ఆ సుదర్శనాన్ని చూచి వీరభద్రుడు తనశూలాన్ని వదలివైచి, మీన శరీరం ధరించి ఇంద్రుడు మధురాక్షనుని మ్రింగినట్లుగా, చక్రాన్ని మ్రింగివైచెను. అంతట క్రోధంతో నల్లబడిన సుందర నేత్రాలతో విష్ణువు వీరభద్రుని సమీపించి మెరుపు వేగంతో నతని భూమిపై బడగొట్టి బాహువులతో తీవ్రంగా మర్ధించెను. అట్లు భయంకరంగా మర్థింప బడిన వీరభద్రుడు రక్తము గ్రక్కి పడిపోవుటతో నాతని శరీరము నుండి చక్రము వెలికివచ్చెను. అంతట తన చక్రాన్ని తాను తీసికొని విష్ణువు వీరభద్రుని వదలి వైచెను. వాసుదేవునికి ఓడిపోయి వీరభద్రుడా విషయము శంకరునకు నివేదించెను. నెత్తుట దోగిన వీరభద్రుని చూచి శివుడు క్రోదోన్మత్తుడై వీరభద్రుని భద్రకాళిణి వారినిర్దిష్ట స్థానాల్లో నిలిపి తాను స్వయంగా త్రిశూలపాణియై దక్షుని యజ్ఞశాలలోనికి జొరబడెను. ఆ విధముగా వచ్చిన త్రిపురాంతకుడగు మహాదేవుని చూచి మునులందరు బయకంపితులయిరి.

అధ్యాయము 4 complete