అధ్యాయము 42

పులస్త్య

1 - ఏతస్మిన్నంతరేప్రాప్తః సమందైత్యై స్తదాంఽధకః

మందరం పర్వతశ్రేష్ఠం ప్రమథాశ్రిత కందరమ్

2 - ప్రమథా దానవాన్‌దృష్ట్వా చక్రుః కిలకిలాధ్వనిమ్

ప్రమథాశ్చాపి నంరబ్ధా జఘ్నుస్తూర్యాణ్యనేకశః

3 - సచావృణోన్మహా నాదో రోదసీ ప్రలయోపమః

శుశ్రావ వాయుమార్గస్థో విఘ్నరాజో వినాయకః

4 - సమభ్యయాత్సు సంక్రుద్ధః ప్రమథైరభి సంవృతః

మందరంపర్వత శ్రేష్ఠం దదృశేపితరం తథా

5 - ప్రణిపత్య తథాభక్త్యా వాక్యమాహ మహేశ్వరమ్

కింతిష్ఠసి జగన్నాథ సముత్తిష్ఠ రణోత్సుకః

6 - తతోవిఘ్నేశ వచనా జ్జగన్నాథోఽo బికాంవచః

ప్రాహయాస్యేఽoధకం హంతుం స్థేయమేవా ప్రమత్తయా

7 - తతోగిరిసుతా దేవం సమాలింగ్య పునఃపునః

సమీక్ష్య సన్నేహహరం ప్రాహగచ్ఛ జయాంధకమ్

8 - తతోఽమరగురో ర్గౌరీ చన్దనంరోచనాంజనమ్

ప్రతివంద్యసుసంప్రీతా పాదావేవాభ్యవందత

9 - తతోహరః ప్రాహవచో యశస్యం మాలినీమపి

జయాంచ విజయాంచైవ జయంతీంచా పరాజితామ్

10 - యుష్మాభిరప్ర మత్తాభిః స్థేయంగేహే సురక్షితే

రక్షణీయా ప్రయత్నేన గిరిపుత్రీ ప్రమాదతః

11 - ఇతిసందిశ్యతాః సర్వాః సమారుహ్యవృషం విభుః

నిర్జగామగృహాత్తుష్టో జయేప్సుః శూలధృగ్‌బలీ

12 - నిర్గచ్ఛతస్తు భవనా దీశ్వరస్య గణాధిపాః

సమంతాత్పరి వార్యైవ జయశబ్ధాంశ్చ చక్రిరే

13 - రణాయనిర్గచ్ఛతి లోకపాలే మహేశ్వరే శూలధరేమహర్షే

శుభానిసౌమ్యాని సుమంగలాని, జాతాని చిహ్నాని జయాయశంభోః

14 - శివాస్థితా వామతరేఽథభాగే ప్రయాతిచాగ్రే స్వనమున్నదంతి

క్రవ్యాద సంఘాశ్చతథాఽమిషైషిణః ప్రయాంతి హృష్టాస్తృషితాసృగర్థే

15 - దక్షిణాంగంనఖాంతంవై సమకంపతశూలినః

శకునిశ్చాపి హారీతో మౌనీయాతి పరాఙ్‌ముఖః

16 - నిమిత్తానీదృశాన్ దృష్ట్వా భూతభవ్య భవోవిభుః

శైలాదిం ప్రాహవచనం సస్మితం శశిశేఖరః

పులస్త్యుడు

ఈ లోపల ఆ ప్రమథులకాశ్రయాలైన కందరాలతో కూడిన ఆ మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు. ఆ దానవులను చూచి ప్రమథులందరు కిలకిల ధ్వనులు చేసి గొప్ప సంరంభంతో అనేకాలయిన తూర్యాలూ భేరీలు మోగించారు. ఆ మహానాదం ప్రళయ ఘోషలాగ భూమ్యాకాశాలను నింపివేసింది. ఆకాశమార్గాన వెళ్తున్న విఘ్నరాజైన వినాయకుని చెవిన బడినది. అదివిని క్రుద్ధుడై తన ప్రమథులతో కూడికొని పర్వతశ్రేష్ఠమైన మందరానికి వచ్చి వినాయకుడు తండ్రికి భక్తితో మొక్కి, ఓ జగన్నాథా ఇంకా కూర్చున్నారేల ? లేవండి, రణ సన్నద్ధులుకండి అని విన్నవించాడు. విఫ్నేశ్వరుని మాటలు విని పరమేశ్వరుడంబికను చూచి, 'అంధకుని సంహరించుటకు వెళ్తున్నాను. నీవప్రమత్తురాలివిగా నుండవలెను సుమా అన్నాడు. అంతట నా గిరి కుమారి మాటిమాటికి గాఢంగా కౌగలించుకొని స్నేహాతిశయంతో ప్రభూ ! వెళ్ళి అంధకుని జయించండి అన్నది. అంతటనామె చందన గోడోచనాంజనాది మంగళ ద్రవ్యాలతో భర్తను పూజించి అత్యంత ప్రేమతో ఆయన పాదాలకు నమస్కరించింది. అంతట నా హరుడు మాలిని, జయ, విజయ, జయంతి, అపరాజితలను చూచి మీరందరు యింటిలోనుండి జాగ్రత్తగా గిరి పుత్రికెలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుతూండండని ఆదేశించాడు. అలా అందరకూ చెప్పి సంతోషంతో వృషభారూఢుడై ఆ శూలపాణి ప్రమథగణాల జయజయధ్వానాల మధ్య అంధకుని జయించుటకై బయలుదేరి వెళ్ళాడు. అలా సర్వలోకేశ్వరుడు మహేశ్వరుడు శూలంధరించి రణభూమికి బయలుదేరగా నోమహర్షీ ! ఆయన విజయాన్ని సూచిస్తూ మంగళకరాలైన శుభ శకునాలెన్నో కలిగాయి. ఎడమ వైపుగా ఆడనక్క మోరయెత్తుకొని అరుస్తూ నడిచింది. క్రవ్యాదులు రక్తమాంస పిపాసువులైన మృగాలు సంతోషంతో తమదాహం తీర్చుకునేందుకు వెంబడించాయి. ఆ పరమశివుని దక్షిణాంగం నఖ శిఖ పర్యంతం కంపించింది. హారీతపక్షి మౌనంగా మెడ త్రిప్పుకొని వెళ్ళింది. ఈ శుభశకునాలను చూచి భూతభవిష్యద్వర్తమాన ప్రభులైన ఆ చంద్రశేఖరుడు నందీశ్వరునితో చిరునవ్వులు చిలుకరిస్తూ యిలా అన్నాడు.

హర

17 - నందిన్ జయోఽద్యమేభావీ నకథంచతి త్పరాజయః

నిమిత్తానీహదృశ్యంతే సంభూతాని గణేశ్వర

18 - తచ్ఛంభువచనం శ్రుత్వా శైలాదిః ప్రాహశంకరమ్

కఃసందేహో మహాదేవః యత్త్వం జయసిశాత్రవాన్

19 - ఇత్యేవముక్త్వా వచనం నందీరుద్రగణాం స్తథా

 సమాదిదేశ యుద్ధాయ మహాపాశుపతైః సహ

20 - తేఽభ్యేత్య దానవబలం మర్దయంతిస్మ వేగితాః

నానాశస్త్ర ధరావీరా వృక్షానశనయోయథా

21 - తేవధ్యమానా బలిభిః ప్రమథైర్దైత్య దానవాః

ప్రవృత్తాః ప్రమథాన్ హంతుం కూటముద్గర పాణయః

22 - తతోఽoబరతలే దేవాః సేంద్రవిష్ణు పితామహాః

ససూర్యాగ్ని పురోగాస్తు సమాయాతాదిదృక్షవః

23 - తతోఽoబర తలేఘోషః సస్వనః సమజాయత

గీతవాద్యాది సంమిశ్రో దుందుభీనాం కలిప్రియ

24 - తతః పశ్యత్సుదేవేషు మహాపాశుపతా దయః

గణాస్తద్దానవం సైన్యం జిఘాంసంతిస్మ కోపితాః

25 - చతురంగబలం దృష్ట్వా హస్యమానం గణేశ్వరైః

క్రోధాన్వితస్తు హుండస్తు వేగేనాభిససారహ

26 - ఆదాయపరిఘం ఘోరం పట్టోద్బద్ధ మయస్మయమ్

రాజతం రాజతేఽత్యర్థ మింద్ర ధ్వజమివోచ్ఛ్రితమ్

27 - తంభ్రామయానో బలవాన్ నిజఘాన రణే గణాన్

రుద్రాద్యాః స్కందపర్యంతా స్తేఽభజ్యంత భయాతురాః

28 - తత్ప్రభగ్నం బలందృష్ట్వా గణనాథో వినాయకః

సమాద్రవతవేగేన తుహుండం దనుపుంగవమ్

29 - ఆపతంతం గణపతిం దృష్ట్వాదైత్యో దురాత్మవాన్

పరిఘం పాతయామాస కుంభపృష్ఠే మహాబలః

30 - వినాయకస్య తత్కుంభే పరిఘం వజ్రభూషణమ్

శతధాత్వగమత్ బ్రహ్మన్ మేరోః కూట ఇవాశనిః

31 - పరిఘం విఫలందృష్ట్వా సమాయాంతంచ పార్షదమ్

బబంధ బాహుపాశేన రాహూరక్షన్ హి మాతులమ్

32 - సబద్ధో బాహుపాశేన బలాదాకృష్య దానవమ్

సమాజఘాన శిరసి కుఠారేణ మహోదరః

33 - కాష్ఠవత్సద్విధా భూతో నిపపాత ధరాతలే

తథాఽపినాత్యజద్రాహు ర్బలవాన్ దానవేశ్వరః

34 - సమోక్షార్థేఽకరోద్యత్నం నశశాక చ నారదః

హరుడు

నందీ ! ఈ శభశకునాలు, నాకీరోజు జయం కలుగుతుందని అపజయమంటూ ఉండదని చూపిస్తున్నాయి. శివుని మాటలకా గణాధ్యక్షుడు శిలాదపుత్రుడు మహాదేవా ! నీవు జయించుటకు, శాత్రవులను పరిమార్చుటకు సందేహమంటూ ఏముండునని చెప్పి మహాపాశుపతాదులతో సహా రుద్ర గణాల నందరను యుద్ధానికి ఆదేశించాడు. ఆ గణాల వారంతా

/****/

పెట్టి బ్రద్దలు గావించి నట్లుగా వజ్రాయుధంతో మధ్యలో బ్రద్దలు చేశాడు. అంతట తన ప్రాసాయుధం వ్యర్థంకావడం చూచి వాడు పిడికిలి బిగించి గణేశ్వరుని మీదకు దుమికాడు. అంతట నందీశ్వరుడు మహావేగంతో వజ్రాయుధం ప్రయోగించి వాడి తలకాయను తాటి పండులాగా ఛేదించి నేల పడగొట్టాడు. ఆ వీరుడు నేలకొరగి పోవడంతో రాక్షసులంతా భయభీతులై వెన్నిచ్చి దశదిశలకూ పారిపోయారు.

49 - తతోహతం స్వంతనయం నిరీక్ష్యహస్తీ తదానందినమాజగామ

ప్రగృహ్యబాణా సనముగ్రవేగం బిభేదబాణైర్యమదండ కల్పైః

50 - గణాన్ సనందీన్ వృషభధ్వజాంస్తాన్

 ధారాభిరేవాంబుధరాస్తు శైలాన్

తేఛాద్యమానాసురబాణజాలై ర్వినాయకాద్యా బలినోఽపివీరాః

 సింహప్రణున్నా వృషభాయథైవ భయాతురా దుద్రువిరే సమంతాత్

51 - పరాఙ్ ముఖాన్వీక్ష్య గణాన్ కుమారః

 శక్త్యాపృషత్కాసథ వారయిత్వా

తూర్ణం సభభ్యేత్యరిపుంసమీక్ష్య ప్రగృహ్యశక్త్యా హృదయే బిభేద

52 - శక్తి నిర్భిన్న హృదయో హస్తేభూమ్యాం పపాతహ

మమారచారి పృతనా జాతాభూయః పరాఙ్ ముఖీ

53 - అమరారి బలం దృష్ట్వా భగ్నంక్రుద్ధా గణేశ్వరాః

పురతో నందినం కృత్వా జిఘాసంతిస్మదానవాన్

54 - తేవధ్యమానాః ప్రమథై ర్దైత్యాశ్చాపి పరాఙ్‌నముఖాః

భూయోనివృత్తా బలినః కార్తస్వర పురోగమాః

55 - తాన్ నివృత్తాన్ సమీక్ష్యైవ క్రోధ దీప్తేక్షణః శ్వసన్

నందిషేణో వ్యాఘ్రముఖో నివృత్త శ్చాపివేగవాన్

56 - తస్మిన్ నివృత్తే గణపే పట్టిశాగ్ర కరేతథా

కార్తస్వరోనివవృతే గదామాదాయ నారద

57 - తమాపతంతం జ్వలన ప్రకాశం గణః సమీక్ష్యైవ మహాసురేంద్రమ్

తం పట్టిశం భ్రామ్యజఘానమూర్ధ్ని కార్తస్వరం విస్వరమున్నదంతమ్

58 - తస్మిన్ హతేభ్రాతరి మాతులేయో పాశం సమావిద్య తురంగకంధరః

బబంధవీరః సహపట్టిశేన గణేశ్వరం చాప్యథనందిషేణమ్

59 - నందిషేణం తథాబద్ధం సమీక్ష్య బలినాం వరః

విశాఖః కుపితోఽభ్యేత్య శక్తిపాణిరవస్థితః

60 - తందృష్ట్వా బలినాం శ్రేష్ఠః పాశపాణి రయశ్శిరాః

సంయోధయామాసబలీ విశాఖం కుక్కుట ధ్వజమ్

61 - విశాఖం సంనిదుద్ధం వై దృష్ట్వాఽయఃశిరసారణే

శాఖశ్చనైగమేయశ్చ తూర్ణమాద్రవతాం రిపుమ్

62 - ఏకతోనైగమేయేన భిన్నఃశక్త్యా త్వయఃశిరాః

ఏకతశ్చైవ శాఖేన విశాఖప్రియ కామ్యయా

63 - సత్రిభిః శంకర సుతైః పీడ్యమానో జహౌరణమ్

తేప్రాప్తాః శంబరం తూర్ణం ప్రేక్ష్యమాణా గణేశ్వరాః

64 - పాశంశక్త్యా సమాహత్య చతుర్భిః శంకరాత్మజైః

జగామ విలయం తూర్ణ మాకాశాదివ భూతలమ్

65 - పాశేనిరాశతాం యాతే శంబరః కాతరేక్షణః

దిశోఽథభేజేదేవర్షే కుమారః సైన్యమర్దయత్

66 - తైర్వధ్యమానా పృతనా మహర్షే సా దానవీ రుద్రసుతైర్గణైశ్చ

విషణ్ణరూపా భయవిహ్వలాంగీ జగామ శుక్రం శరణం భయార్తా

తన కుమారుడట్లు హతుడగుట నిరీక్షించి, వాని తండ్రి హస్తి భయంకరమై బాణాసనం ధరించి నందీశ్వరుని మీదకురికి, యమదండాల్లాంటి బాణాలు వదలి ఆయన శరీరాన్ని చిల్లులుబడజేశాడు. మేఘాలనడ్డుకౌని వాన జలధారల్లో మునిగిన కొండల్లాగ నందీశ్వరునితో బాటు వృషభధ్వజులైన గణాలవారంతా ఆబాణధారల్లో మునిగిపోయారు. ఆ బాణ వృష్టికి తట్టుకొనలేక బలవంతులైనప్పటికీ వినాయకాది వీరులుకూడ సింహాన్ని చూచిబెదరిన వృషభాల్లాగ నలువైపులా భయార్తులై పారిపోయారు. అలా తమ గణాధిపతులు తిరోగాములవడం చూచి, తన శక్త్యాయుధంతో ఆ బాణవృష్టిని నివారించి ప్రచండ వేగంతో శత్రువును సమీపించి శక్తితో వాని వృక్షాన్ని చీల్చాడు, కుమారస్వామి. స్కందుని శక్తిపాతానికి హస్తి నేలకొరిగి మరణించగా శత్రుసైన్యం మరల పలాయనం చిత్తగించింది, అసుర సైన్యమలాకకావికలై పోవడంచూచి నంది మొదలైన గణ ముఖ్యులు మహాక్రోధంతో విజృంభించి దానవమూకలను చెండాడసాగారు. అలా ప్రమథుల ధాటికి వెన్నువిరిగి పారిపోయే దానవులు కార్తస్వరదైత్యనాధుని నాయకత్వంలో మరలి యుద్ధభూమికి వచ్చారు, అలా తిరిగివచ్చిన దైత్య సేనలను చూచి ప్రచండ క్రోధంతో బుసలు కొడుతూ వ్యాఘ్రముఖుడైన నందిషేణుడు కూడ తిరిగి యుద్ధానికి ఉపక్రమించాడు. వాడిమొనదేరిన పట్టిశాయుధంతో నందిషేణుడు, గదచేతబట్టుకొని కార్తస్వరుడూ తలపడ్డారు. అలా అగ్ని శిఖలా దూకుతున్న కార్తస్వర మహాదైత్యుని చూచి నందిషేణుడు పట్టిశాన్ని గిరగిర త్రిప్పి ప్రచండ వేగంతో వాని నుదుటి మీద ప్రహరించాడు. దానితో ఆ కార్తస్వరుడు వికృతస్వరంతో చావుకేకపెట్టి నేలకొరిగాడు. తన మేనమామ కుమారుడలా హతుడు కావడంతో కాలపాశంలాంటి పాశం ధరించి, తురంగకంధరుడను వీరుడు ముందుకురికి ఆ పాశంతో ఆ నందిషేణుడిని పట్టిశాయుధంతో సహా బంధించాడు. క్రుద్ధుడైన నందిషేణుని చూచి రోషించి మహాబలశాలి అయిన విశాఖుడు శక్తి ఆయుధంతో వచ్చి నిలచాడు. అది చూచి మేటివీరుడైన అయఃశిరుడను వాడు పాశం ధరించి కుక్కుట ధ్వజుడైన విశాఖునితో తలపడ్డాడు. అదిచూచి విశాఖునికి తోడుగా శాఖుడు నైగముడు వచ్చి అయఃశిరుని ఎదుర్కొన్నారు. విశాఖునికి ప్రియం చేసేందుకై శాఖ నైగమేయులిద్దరూ తమ శక్త్యాయుధాలతో అయఃశిరుని దేహాన్ని చెరొక వైపునా ఛేదించారు. అలా ఆహర కుమారులు మువ్వురూ పీడించగా వాడు రణభూమి వదలి పారిపోయి గణేశ్వరులు చూస్తూండగా, శంబరాసురుని మరుగుచేరాడు. ఆ శంబరుని పాశాన్ని శివుని నలుగురు పుత్రులూ నాలుగు ముక్కలుగా తమ శక్త్యాయుధాలతో ఖండించారు. అలా ఆకాశం నుంచి క్రిందబడిన తనపాశపు ముక్కలను చూచి భయంతో గడగడలాడుతూ శంబరుడు పారిపోయాడు. కుమారుడు రాక్షసులను మర్దించాడు. రుద్రగణాలచేత మర్దింపబడిన ఆ దానవసేన విషణ్ణవదనంతో భయాందోళనతో పారిపోయి శుక్రాచార్యుని అండజేరింది.

అధ్యాయము 42 Complete