వామన మహా పురాణము
అధ్యాయము 29
పులస్త్య
1 - కస్యపస్యదనుర్నామ భార్యాసీద్ద్విజసత్తమ ।
తస్యాః పుత్రత్రయంచాసీత్ సహస్రాక్షాదృలాధికమ్ ॥
2 - జ్యేష్ఠఃశుంభ ఇతిఖ్యాతో నిశుంభశ్చాపరోఽసురః ।
తృతీయో నముచిర్నామ మహాబలసమన్వితః ॥
3 - యోఽసౌనముచిరిత్యేవం ఖ్యాతోదనుసుతోఽసురః ।
తంహంతుమిచ్ఛతిహరిః ప్రగృహ్యకులిశంకరే ॥
4 - త్రిదివేశంసమాయాంతం నముచిస్తద్భయాదథ ।
ప్రవివేశరథంభానో స్తతోనాశకదచ్యుతః ॥
5 - శక్రస్తేనాథసమయం చక్రేసహమహాత్మనా ।
అవధ్యత్వంవరంప్రాదా చ్ఛస్త్రైరస్త్రైశ్చనారద ॥
6 - తతోఽవధ్యత్వమాజ్ఞాయ శస్త్రాదస్త్రాచ్చనారద ।
సంత్యజ్యభాస్కరరథం పాతాళముపయాదథ ॥
7 - సనిమజ్జన్నపిజలే సాముద్రంఫేనముత్తమమ్ ।
దదృశేదానవపతి స్తంప్రగృహ్యేదమబ్రవీత్ ॥
8 - యదుక్తందేవపతినా వాసవేనవచోఽస్తుతత్ ।
అయంస్పృశతుమాంఫేనః కరాభ్యాం గృహ్యదానవః ॥
9 - ముఖనాసాక్షికర్ణాదీన్‌సంమమార్జ యథేచ్ఛయా ।
తస్మిన్‌శక్రోఽసృజద్‌వజ్ర మంతర్హితమపీశ్వరః ॥
10 - తేనాఽసౌభగ్ననాసాస్యః పపాతచమమారచ ।
సమయేచతథానష్టే బ్రహ్మహత్యాఽస్పృశద్ధరిమ్ ॥
11 - సవై తీర్థంసమాసాద్య స్నాతఃపాపాదముచ్యత ।
తతోఽస్యభ్రాతరౌవీరౌ క్రుద్ధేశుంభనిశుంభకౌ ॥
12 - ఉద్యోగంసుమహత్కృత్వా సురాన్‌బాధితుమాగతౌ ।
సురాస్తేఽపిసహస్రాక్షం పురస్కృత్యవినిర్యయుః ॥
13 - జితాస్త్వాక్రమ్యదైత్యాభ్యాం సబలాఃసంపదానుగాః ।
శక్రహ్యిహృత్యచగజం యామ్యంచమహిషంబలాత్ ॥
14 - వరుణస్యమణిచ్ఛత్రం గదాంవై మరుతస్యచ ।
నిధయఃపద్మశంఖాద్యా హతాస్త్వాక్రమ్యదానవైః ॥
15 - త్రైలోక్యంవశగంచాస్తే తాభ్యాంనారదసర్వతః ।
తదాజగ్ముర్మహీపృష్ఠం దదృశుస్తేమహాసురమ్ ॥
16 - రక్తబీజమధోచుస్తే కోభవానితిసోఽబ్రవీత్ ।
సచాహదైత్యోఽస్మివిభో సచివోమహిషస్యచ ॥
17 - రక్తబీజేతివిఖ్యాతో మహావీర్యోమహాభుజః ।
అమాత్యౌరుచిరౌవీరౌ చండముండావితిశ్రుతౌ ॥
18 - తావాస్తాంసలిలేమగ్నౌ భయాద్దేవ్యామహాభుజౌ ।
యస్త్వాసీత్ప్రభురస్మాకం మహిషోనామదానవః ॥
19 - నిహతః స మహాదేవ్యా వింధ్యశైలేసువిస్తృతే ।
భవంతౌకస్యతనయౌ కావానామ్నాపరిశ్రుతౌ ।
కింవీర్యౌకింప్రభావౌచ ఏతచ్ఛంసితుమర్హతః ॥
పులస్త్యుడు
నారదా! కశ్యప మహర్షి భార్యదనువు. ఆమెకు ఇంద్రునికన్న బలవంతులగు మువ్వురు కుమారులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు శుంభుడు, రెండవవాడు శుంభుడు మూడవవాడు మహాబలినముచి. ఇంద్రుడు వజ్రాయుధంతోనముచిని చంపుటకుద్యమింపగా నతడు సూర్యుని రథంలో ప్రవేశించాడు. అంచేత అతడిని చంపనలవిగాక వాడితో యింద్రుడు సంధిచేసుకొని వాడికి అస్త్రశస్త్రాలతో చావులేకుండునట్లు వరమిచ్చాడు. ఆ విధంగా అవధ్యుడై వాడు సూర్యరథం వదలి పాతాళానికి చేరుకున్నాడు. నీళ్ళలో మునిగి న వానికి సముద్రపు నురుగు (ఫేనం) కనిపించగా ఇంద్రుడు చెప్పినట్లు జరుగగాక అని సంకల్పించి ఆ నురుగును చేతులో పట్టుకొని గట్టిగా నోటిని ముక్కును చెవులను కన్నులను దానితో గట్టిగా రుద్దుకున్నాడు. ఆ నురుగలో ఇంద్రుడు రహస్యంగా తన వజ్రాయుధం సృష్టించాడు. అంచేత వాడిముక్కు చెవులు కండ్లు భిన్నాలైపోయి మరణించాడు. నియమ విరుద్ధంగా జరిగిన ఆ దనుజవధ వల్ల ఇంద్రుడికి బహ్మహత్య చుట్టుకోగా తన తీర్థంలో మునిగి ఆ పాపం పోగొట్టుకున్నాడు. ఆ సంగతి తెలిసిన ఆ నముచిసోదరులు శుంభనిశంభులు కోపాతిరేకంతో గొప్ప సన్నాహాలుచేసి దేవతలను బాధించసాగారు. దేవతలు యింద్రుని నాయకత్వంలో వారలతో పోరి ఓడిపోయారు. ఆ దానవులు యింద్రుని ఐరావతాన్ని యముని మహిషాన్ని వరుణుడి ఛత్రాన్ని మరుత్తులగదను కుబేరుడి శంఖపద్మాది నిధులనూ బలప్రదర్శనం చేసి అపహరించారు. ఆ విధంగా మల్లోకాలు వశంచేసుకొని ఆ రాక్షస వీరులు భూలోకానికివచ్చి అక్కడ మహా అసురుడు రక్తబీజునిచూచి నీ వెవ్వడవని ప్రశ్నించారు. అందుకువాడు నేను రక్తబీజునిగా పేరొందిన మహాబలుడను మహిషాసురుని సచివుడను. మా ప్రభువు మంత్రులు చండముండులనే వీరులు దేవికి భయపడి ఈ సముద్ర జలాల్లో దాగుకున్నారు. కాగా మా ప్రభువైన మహిషుడు దేవిచేత వింధ్య శైలం మీద వధింపపడినాడు. అని తన కథ చెప్పి మీరెవరు, ఎవరి కుమారులు మీ పేరులు బలపౌరుషాలు తెలుపమని అర్థించాడు.
శుంభనిశుంభ
20 - అహంశుంభఇతి ఖ్యాతో దనోఃపుత్రస్తథౌరసః ।
నిశుంభోఽయంమమభ్రాతా కనీయాన్‌శత్రుపూగహా ॥
21 - అనేనబహుశో దేవాః సేంద్రరుద్రదివాకరాః ।
సమేత్యనిర్జితావీరా యేఽన్యేచబలవత్తరాః ॥
22 - తదుచ్యతాంకయా దైత్యోనిహతో మహిషాసురః ।
యావత్తాంఘాతయి ష్యావః స్వసైన్యపరివారితౌ ॥
23 - ఇత్థంతయోస్తుదదతోర్నర్మదాయాస్తటే మునే ।
జలవాసాద్వినిష్క్రాంతో చండముండౌచదానవౌ ॥
24 - తతోఛ్యేత్యా సురశ్రేష్ఠౌ రక్తబీజంసమాశ్రితౌ ।
ఊచతుర్వచనంశ్లక్ష్ణంకోఽయంతవపురస్సరః ॥
25 - సచోభౌ ప్రాహదైత్యోఽసౌశుంభోనామసురార్దనః ।
కనీయానస్యచభ్రాతాద్వితీయోహినిశుంభకః ॥
26 - ఏతావాశ్రిత్యతాందుష్టాంమహిషఘ్నీం న సంశయః ।
అహంవివాహయిష్యామి రత్నభూతాం జగత్రయే ॥
శుంభనిశుంభులు
నేను దనువు ఔరసపుత్రుడను, పేరు శుంభుడు. ఇతడు నా అనుజుడు నిశుంభుడనువాడు. ఇంద రుద్ర దివాకరాది దేవతలెందరనో ఇతడు జయించాడు. సరే ఇక చెప్పుము. మహిషాసురుని వధించినదెవరు? యీ క్షణాన్నే సైన్యంతో వెళ్ళి వధించి వస్తాను. "నారదా! వారిద్దరూ నర్మదతీరాన అలా మాటాడుకుంటూండగానే చండ ముండులనే రాక్షసులు జలావాసంవదలి అక్కడకు వచ్చి రక్తబీజుని ఆశ్రయించి, మృదువైన భాషలో, నీవెవరితో మాటాడుతున్నావని అడిగారు. అందుకతడు వీరిద్దరు శుంభనిశుంభులను దైత్యులు మహాబలశాలురు. వీరిద్దరి సాయంతో మహిషుని చంపిన ఆ దుష్టురాలిని జయించి, ఆ మహిళారత్నాన్ని వివాహమాడతానన్నాడు. అందుకు చంద్రుడు యిలా అన్నాడు.
చండ
27 - నసమ్యగుక్తంభవతా రత్నార్హోఽసి న సాంప్రతమ్ ।
యఃప్రభుస్యాత్సరత్నార్హ స్తస్మాచ్ఛుంభాయయోజ్యతామ్ ॥
28 - తదాచచక్షేశుంభాయనిశుంభాయచకౌశికీమ్ ।
భూయోఽపితద్విధాంజాతాం కౌశికీంరూపశాలినీమ్ ॥
29 - తతఃశుంభోనిజందూతం సుగ్రీవం నామదానవమ్ ।
దైత్యంచప్రేషయామాస సకాశంవింధ్యవాసినీమ్ ॥
30 - సగత్వాతద్వచఃశ్రుత్వా దేవ్యాగత్యమహాసురః ।
నిశుంభశుంభావాహేదం మన్యునాభిపరిప్లుతః ॥
చండుడు
"అలా అనకుము, ఆ త్రిలోక రత్నం ప్రభువైన శుంభునకేతగి ఉంటుంది. ఆమెను శుంభునకు రూపశాలిని అయిన కౌశికిని నిశుంభునకు ఏర్పాటు చేద్దాము." అంతట శుంభుడు సుగ్రీవుడను దూతను వింధ్యవాసిని యొద్దకు పంపించాడు. ఆతడువెళ్ళి దేవితో మాటాడి కోపంతో తిరిగివచ్చి శుంభని శుంభులతో ఇలా అన్నాడు.
సుగ్రీవ
31 - యువయోర్వచనాద్దేవీం ప్రదేష్టుందైత్యనాయకౌ ।
గతవానహమద్యైవ తా మహంవాక్యమబ్రువమ్ ॥
32 - యథాశుంభోఽతివిఖ్యాతః కకుద్మీదానవేష్వపి ।
సత్వాంప్రాహమహాభాగే ప్రభు రస్మిజగత్రయే ॥
33 - యానిస్వర్గేమహిపృష్ఠే పాతాళేచాపిసుందరి ।
రత్నానిసంతితావంతి మమవేశ్మనినిత్యశః ॥
34 - త్వముక్తాచండముండాభ్యాం రత్నభూతాకృశోదరి ।
తస్మాద్భజస్వమాంవాత్వం నిశుంభంనామమానుజమ్ ॥
35 - సాచాహమాంవిహసతీ శృణుసుగ్రీవమద్వచః ।
సత్యముక్తంత్రిలోకేశః శుంభోరత్నార్హఏవచ ॥
36 - కింత్వస్తిదుర్వినీతాయా హృదయేమేమనోరథః ।
యోమాంవిజయతేయుద్దే సభర్తాస్యాన్మహాసుర ॥
37 - మయాచోక్తాఽవలిప్తాఽసి యోజయేత్ససురాసురాన్ ।
సత్వాంకథసజయతే సాత్వముత్తిష్ఠభామిని ॥
38 - సాఽథమాంప్రాహకింకుర్మి యదనాలోచితఃకృతః ।
మనోరథస్తుతద్గచ్ఛ శుంభాయత్వంనివేదయ ॥
39 - తయైవముక్తస్తభ్యాగాం త్వత్సకాశంమహాసుర ।
సాచాగ్నికోటిసధృశీ మత్వైవంకురుయత్‌క్షమమ్ ॥
సుగ్రీవుడు
"ప్రభూ! మీ తరపున నేనువెళ్ళి ఆ దేవితో రాక్షసలోకంలో సర్వోన్నతుడూ మహాపరాక్రమవంతుడునగు శుంభుడు ముల్లోకాలకూ అధినేత. ఆ మహారాజు యింట్లో ప్రపంచంలో గల రత్నాలన్నీ ఉన్నయి. ఆయన చండముండుల వలన నీవు స్త్రీ రత్నానివని విన్నాడు. నిన్ను తననుగాని తన తమ్ముడు నిశుంభుని గాని పెండ్లాడవలసినదిగా నాద్వారా సందేశం పంపాడని చెప్పాడు. ఆ మాటలకామె పకపక నవ్వి ఇలా అన్నది. సుగ్రీవా! నీవు చెప్పింది నిజమే. త్రిలోకాధిపతి శుంభుడు రత్నాలు ఉంచుకోతగినవాడే. అయితే నేను నీతులు గాలికి వదిలేసి నన్ను యుద్ధంలో జయించినవానినే పెండ్లాడతానని నిశ్చయించుకున్నాను అని చెప్పింది. అందుకు నేను త్రిలోకాలు జయించినవాడు నిన్ను జయించలేడా? వేరుమాటాడక రావలసినదనగా అందుకామె, అందులకు నేనేమి చేయగలను? అనాలోచితంగా ఒక నిర్ణయం తీసికున్నాను. ఆమనోరథం మార్చుకోను. నీవు వెళ్ళి శుంభుడితో చెప్పమని త్రిప్పిపంపించినది స్వామీ. ఆమె మాటలు మీకు చెప్పేందుకు తిరిగివచ్చాను. ఒక్క విషయం. ఆమె కోటి అగ్నులతో సమానంగా వెలిగిపోతోంది. ఇది మనస్సులో పెట్టుకొని తర్వాత ప్రయత్నాలు చేయండి.
పులస్త్య
40 - ఇతిసుగ్రీవవచనం నిశమ్యసమహాసురః ।
ప్రాహదూరస్థితంశుంభో దానవంధూమ్రలోచనమ్।
।
పులస్త్యుడు
సుగ్రీవుని మాటలు విని ఆ మహారాక్షసుడు దూరంగా కూర్చొనిఉన్న ధూమ్రాక్షుడనే రాక్షస వీరునిచూచి,
శుంభ
41 - ధూమ్రాక్షః గచ్ఛతాంద్రుష్టాం కేశాకర్షణవిహ్వలామ్ ।
సాపరాధాంయథాదాసీం కృత్వాశీఘ్రమిహానయ।
।
42 - యస్యాస్యాః పక్షకృత్ కశ్చిత్‌భవిష్యతిమహాబలః ।
సహంతవ్యోఽవిచార్యైవ యదిహిస్యాత్‌పితామహః ॥
43 - సఏవముక్తః శుంభేన ధూమ్రాక్షోఽక్షౌహిణీశతైః ।
వృతఃషడ్భిర్మహాతేజా వింధ్యంగిరిముపాద్రవత్।
।
44 - సతత్రదృష్ట్వాతాందుర్గాం భ్రాంతదృష్షిరువాచహ ।
ఏహ్యేహిమూఢేభర్తారం శుంభమిచ్ఛస్వకౌశికీ ।
నచేద్బలాన్నయిష్యామి కేశాకర్షణవిహ్వలామ్ ॥
శుంభుడు
"ధూమ్రాక్షా! ఈ క్షణమేవెళ్ళి ఆ దుష్టురాల్ని నేరస్థురాలిని, బానిసను మాదిరి జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిధా, పో! దాని పక్షాన ఎవరైనా, పితామహుడైనా సరే, నిలబడ్డాడంటే నిర్దాక్షిణ్యంగా వధించి, ఆమెను లాగుకొని రా! అని ఆజ్ఞాపించాడు. శుంభుని ఆదేశం వింటూనే ధూమ్రాక్షుడు ఆరు వందల అక్షౌహిణుల రాక్షస బలంతో వింధ్యాద్రికి పరుగు తీశాడు. అక్కడ దుర్గాదేవిని చూడగానే దిగ్భ్రమ కలిగింది. వెంటనే ఆమెనుచూచి - ఓ మూర్ఖా! కౌకికీ! వచ్చి శుంభుణ్ని వరించలేకపోతే నిన్ను బలవంతంగా జట్టుపట్టిలాగుకొనిపోతానని గర్జించాడు.
శ్రీదేవి
45 - ప్రేషితోఽసీహశుంభేన బలాన్నేతుంహిమాంకిల ।
తత్రకింహ్యబలాకుర్యా ద్యథేచ్ఛసితథాకురు ।
దేవి
అబలనైన నేనేం చేయగలను? నీ యిష్ట ప్రకారమే చెయ్యుము.
పులస్త్య
46 - ఏవముక్తోవిభావర్యా బలవాన్‌ధూమ్రలోచనః ।
సమభ్యధావత్ త్వరితో గదామాదాయవీర్యవాన్ ।
47 - తమాపితంతంసగదం హుంకారేణైవకౌశికీ ।
సబలంభస్మసాచ్చక్రే శుష్కమగ్నిరివేంధనమ్ ।
48 - తతోహాహాకృతమభూ జ్జగత్యస్మింశ్చరాచరే ।
సబలంభస్మసాన్నీతం కౌశిక్యావీక్ష్యదానవత్ ।
49 - తచ్చశుంభోఽపిశుశ్రావ మహచ్ఛబ్దముదీరితమ్ ।
అథాదిదేశ బలినౌ చండముండౌ మహాసురౌ ।
50 - రురుంచబలినాంశ్రేష్ఠ తథాజగ్ముర్ముదాన్వితాః ।
తేషాంచసైన్యమతులం గజాశ్వరథసంకులమ్ ।
51 - సమాజగామసహసా యత్రాస్తే కోశసంభవా ।
తదాయాంతంరిపుబలం దృష్ట్వాతొటిశతావరమ్ ।
52 - సింహోఽద్రువద్ధుతసటః పాటయన్‌దానవాన్‌రణే ।
కాంశ్చిత్‌కరప్రహారేణ కాంశ్చిదాస్యేనలీలయా ।
53 - నఖరైఃకాంశ్ఛిదాక్రమ్య ఉరసాప్రమమాథచ ।
తేవధ్యమానాఃసింహేన గిరికందరవాసినా ।
54 - భూతైశ్చదేవ్యనుచరైః చండముండౌసమాశ్రయన్ ।
తావార్తంస్వబలందృష్ట్వా కోపప్రస్ఫురితాథరౌ ।
55 - సమాద్రవేతాందుర్గాంవై పతంగా మివపాపకమ్ ।
తావాపతంతౌరౌద్రౌవై దృష్ట్వాక్రోధపరిప్లుతా ।
56 - త్రిశాఖాంభ్రుకుటీం వక్త్రే చకారపరమేశ్వరీ ।
భ్రుకుటీకుటిలాద్దేవ్యా లలాటఫలకాద్‌దృతమ్ ।
కాళీకరాళవదనా నిఃసృతాయోగినీ శుభా ।
57 - ఖట్వాంగమాదాయకరేణరౌద్ర మసించ కాలాంజనకోశముగ్రమ్ ।
సంశుష్కగాత్రారుధిరాప్లుతాంగీ నరేంద్రమూర్ధ్నాంస్రజముద్వహంతీ ॥
58 - కాంశ్చిత్‌ఖడ్గేనచిచ్ఛేద ఖట్వాంగేనపరాన్‌రణే ।
స్వషూదయభృశంక్రుద్ధా సరధాశ్వగజాన్‌రిపూన్ ॥
59 - చర్మాంకుశంముద్గరంచ సధనుష్కంసఘంటికమ్ ।
కుంజరంసహయంత్రేణ ప్రచిక్షేపముఖేంబికా ॥
60 - సచక్రకూబరరథం ససారధితురంగమమ్ ।
సమంయోధేనవదనే క్షిప్య చర్వయతేఽoబికా ॥
61 - ఏకంజగ్రాహ కేశేషు గ్రీవాయామపరంతథా ।
పాదేనాక్రమ్యచైవాన్యం ప్రేషయామాసమృత్యవే ॥
62 - తతస్తుతద్బలందేవ్యా భక్షితంసబలాధిపమ్ ।
రురుర్‌ధృష్ట్వాప్రదుద్రావ తం చండీదదృశేస్వయమ్ ॥
63 - ఆజఘానాథశిరసి ఖట్వాంగేనమహాసురమ్ ।
సపపాతహతోభూమ్యాం ఛిన్నమూలఇవద్రుమః ॥
పులస్త్యుడు
అంతట ధూమ్రలోచనుడు గదనెత్తుకొని దేవిమీదికి లంఘించాడు. తన మీదకు దూకుతున్న ఆ దుష్టునిచూచి అంబిక హుంకారంగావించింది. దానితో తన సైన్యంతోసహా వాడు అగ్నిలోబడిన సమిధల్లాగా మాడి బూడిదైపోయారు. దానితో చరాచర జగత్తంతా హాహాకారాలతో దద్దరిల్లింది. ఆ భీషణ రవాన్ని శుంభుడు కూడా విని మహాబలవంతులైన శుంభ నిశుంభులను రురుదైత్యుణ్ని యుద్ధానికి పంపాడు. వారంతా గజాశ్వరథ పదాతులతోకూడిన అసంఖ్య సేనతో ఆ కౌశికి ఉన్నచోటికి వెళ్ళారు. వందల కోట్ల సంఖ్యలో వస్తూన్న ఆ రాక్షస సేనను చూడటంతోటే కౌశికి వాహనం సింహంజూలు ఝుళిపించి పంజాచాపి గర్జిస్తూ దానవమూక మీదపడి సంహారకాండ సాగించింది. కొందరను పంజా దెబ్బలతో, కొందరను కోరలతో చీలిస్తే మరికొందరను గోళ్ళతో పరిమార్చింది. ఇలా సింహంచేతనూ గిరికందరాల్లో ఉండే భూతగణాలూ తదితర దేవి అనుచరులచేత వధింపబడి చావుదెబ్బలు తింటూ ఆ దానవులు తమ నాయకులు చండ ముండుల వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఆర్తనాదాలు చేస్తున్న తమ బలగాలను చూచి ఆ మహఽసురలు మండిపడి అగ్ని మీద దూకే శలభాల్లాగా దేవిమీదకు దుమికారు. ఆ క్రోధోన్మత్తులను చూడగానే, కోపంతో దేవి భ్రుకుటి ముడిబడింది. అంతనామె ఫాలభాగాన్నుంచే కరాళాకృతితో కళ్యాణిఅయిన కాళి ఊడిపడి ఖట్వాంగం కరవాలం ధరించి మాంసశుష్కమై రక్తసిక్తమైన శరీరంతో నరముండమాల మెడలో వ్రేలాడుతూంటే శత్రుమూకలను సంహరింపసాగింది. కొందరను కత్తితో నరుకగా కొందర తలలను ఖట్వాంగంతో నుగ్గుచేసింది. ఎందరనో రథగజాశ్వాలతో సహా యమసదనానికంపింది. అంతనాయంబిక కాళిక నోటిలోకి ఎందరనో శత్రువీరులను చర్మాంకుశ ముద్గరఘంటా గజయంత్రాలతోసహా విసిరివేయగా నాచండి తన విశాలమైన కోరలమధ్య వారందరను నమిలి పొడిపొడి గావించింది. ఒకడిని జుట్టుపట్టుకొని మరొకడిని మెడపట్టుకొని నేలబడగొట్టి కాళ్ళతో మర్దించి మృత్యువుకప్పగించింది. ఆ విధంగా దేవి సైన్యాధిపతితోసహా శత్రుబలాలన్నింటినీ భక్షించడం చూచి రురుడు కాలికి బుద్ధిచెప్పసాగాడు, అది చూచిన దుర్గ ఖట్వాంగంతో తలమీద ప్రహరించగా వాడు నరుకబడి మహావృక్షంలాగా నేలకొరిగాడు.
64 - తత స్తంపతితం దృష్ట్వా వశోరివవిభావరీ ।
కోశముత్కర్తయామాస కర్ణాదిచరణాంతికమ్ ॥
65 - సాచకోశంసమాదాయ బబంధవిమలాజటాః ।
ఏకానబంధమగమత్ తాముత్పాట్యాక్షిపద్‌భువి ॥
66 - సాజాతాసుతరాంరౌద్రీ తైలాభ్యక్తశిరోరుహా ।
కృష్టార్థమర్థశుక్లంచ ధారయంతీస్వకంవపుః ॥
67 - సాఽబ్రవీద్వరమేకంతు మారయామిమహాసురమ్ ।
తస్యానామతదాచక్రే చండమారీతివిశ్రుతమ్ ॥
68 - ప్రాహగచ్చస్వసుభగే చండముండావిహానయ ।
స్వయంహిమారయిష్యామి తావానేతుంత్వమర్హసి ॥
69 - శ్రుత్వైవంవచనందేవ్యాః సాఽభ్యద్రవతతావుభౌ ।
ప్రదుద్రువతుర్భయార్తౌ దిశమాశ్రిత్యదక్షిణామ్ ॥
70 - తతస్తావపివేగేన ప్రాధావత్‌త్యక్తవాసనే ।
సాఽధిరుహ్యమహావేగం రాసభంగరుడోపమమ్ ॥
71 - యతోగతౌచతౌదైత్యౌ తత్రైవానుయయౌశివా ।
సాదదర్శతదాపౌండ్రం మహిషంవైయమస్యచ ॥
72 - సాతస్యోత్పాటయామాస విషాణంభుజగాకృతిమ్ ।
తంప్రగృహ్యకరేణైవ దానవావన్వగాజ్జవాత్ ॥
73 - తౌచాపిభూమింసంత్యజ్య జగ్మతుర్గగనంతదా ।
వేగేనాభిస్వతాసాచ రానభేనమహేశ్వరీ ॥
74 - తతోదదర్శగరుడం పన్నగేంద్రంచిఖాదిషుమ్ ।
కర్కోటకంసదృష్ట్వైచ ఊర్ధ్వరోమావ్యజాయత ॥
75 - భయాన్మార్యాశ్చగరుడో మాంసపిండోపమోబభౌ ।
న్యపతం స్తస్యపత్రాణి రౌద్రాణిహిపతత్రిణః ॥
76 - ఖగేంద్రపత్రాణ్యాదాయ నాగంకర్కోటకంతథా ।
వేగేనానుసరద్దేవీ చండముండౌభయాతురౌ ॥
77 - సంప్రాప్తౌచతదాదేవ్యా చండముండౌ మహాసురౌ ।
బద్ధౌకర్కోటకేనైవ బద్ధ్వావింధ్యముపాగమత్ ॥
అలావాడు పడిపోవడంచూచి ఆ దుర్గ చెవి నుంచి చరణాల వరకు గల తన కోశాన్ని (కవచం) కోసి దానితో జడ నల్లింది. అందులో ఒకటి ఉపయోగించకపోగా దాన్ని నేలకు విసిరి కొట్టింది. అందులో నుంచి నూనెకారుతున్న జుట్టుతో, సగం నలుపూ, సగం తెలుపూ అయిన దేహంతో ఒక రౌద్రాకృతి బయలుదేరి, "నేను కనీసం ఒక మహాదైత్యుడినైనా సంహరిస్తాన"ని బొబ్బ పెట్టింది. అంచేత ఆమెకు చండమారి అనే పేరు వచ్చింది. ఆమెను చూచి దేవి, "కళ్యాణీ! నీవు వెళ్ళి చండముండుల కట్టి తీసుకొని రమ్మ. నేను స్వయంగా వారలను వధిస్తా"నని ఆజ్ఞాపించింది. అంతటనా దేవి చండముండలను వెంబడించగా వాండ్లు దక్షిణ దిక్కుగా గుడ్డలూడిపోగా పరుగిడసాగారు. అంతనాదేవి గరుడునిలాంటి వేగంగల గాడిద మీదనెక్కి వారల వెంటబడినది. అంతటనామెకు యముని మహిషం పౌండ్రం కనిపించగా, కాల సర్పంలాంటిది దాని కొమ్ము పెకలించి పట్టుకొని త్వరగా రాక్షసులననుగమించింది. ఆ దైత్యులు భూమి వదలి గగనమార్గానకుపోగా దేవి కూడ గాడిదమీద వారల వెంటనే విజృంభించింది. దారిలోనొకచోట కర్కోటక మహాసర్పాన్ని తినబోతున్న గరుడపక్షి కనిపించింది. దేవిని చూడడంతో ఆ పక్షి భయంతో కంపించి మాంసం ముద్దగా అయిపోయింది. దానివంటి మీదిరెక్కలన్నీ ఊడిపడ్డాయి. అంతట ఆ చండమారి ఆ రెక్కలనూ కర్కోటక నాగాన్ని చేజిక్కించుకొని రాక్షసులను వెంబడించి భయంతో గడగడవణికిపోతున్న ఆ చండముండులను పట్టుకున్నది. వారలనాకర్కోటక నాగంతో బంధించి వింధ్యకుగొని తెచ్చింది.
78 - నివేదయిత్వాకౌశిక్యై కోశమాదాయభైరవమ్ ।
శిరోభిర్దానవేంద్రాణాం తార్క్ష్యపత్రైశ్చశోభనైః ॥
79 - కృత్వాస్రజమనౌపమ్యాం చండికాయైన్యవేదయత్ ।
ఘర్ఘరాంచమృగేంద్రస్య చర్మణఃసాసమర్పయత్ ॥
80 - స్రజమన్యైఃఖగేంద్రస్య పత్రైర్మూర్ధ్నినిబధ్యచ ।
ఆత్మనాసాపపౌపానం రుధిరందానవేష్వపి ॥
81 - చండాత్వాదాయచండంచ ముండంచాసురనాయకమ్ ।
చకారకుపితాదుర్గా విశిరస్కౌమహాసురౌ ॥
82 - తయోరేవాహినాదేవీ శేఖరంశుష్కరేవతీ ।
కృత్వాజగామకౌశిక్యాః సకాశంమార్యయాసహ ॥
83 - సమేత్యసాఽబ్రవీద్దేవి గృహ్యతాంశేఖరోత్తమః ।
గ్రథితోదైత్యశీర్షాభ్యాం నాగరాజేనవేష్టితః ॥
84 - తంశేఖరం శివాగృహ్య చండాయామూర్ధ్నివిస్తృతమ్ ।
బబంధప్రాహచైవైనాంకృతంకర్మసుదారుణమ్ ॥
85 - శేఖరంచండముండాభ్యాం యస్మాద్ధారయసేశుభమ్ ।
తస్మాల్లోకేతవఖ్యాతి శ్చాముండేతిభవిష్యతి ॥
86 - ఇత్యేవముక్త్వావచనంత్రినేత్రా సాచండముండస్రజధారిణీంవై ।
దిగ్వాససంచాభ్యవదత్‌ప్రతీతా నిషూదయస్వారిబలాన్యమూని ॥
87 - సాత్వేవముక్తాఽథవిషాణకోట్యా సువేగయుక్తేనసరాసభేన ।
నిషూదయంతీరిపుసైన్యముగ్రం చచారచాన్యానసురాంశ్చఖాద ॥
88 - తతోఽoబికాయాస్త్వథచర్మముండయా మార్యాచసిం హేనచభూతసంఘైః ।
నిపాత్యమానాదనుపుంగవాస్తే కకుద్మినంశంభుముపాశ్రయంత ॥
అంతటనా భయంకరమైన కోశా (కవచా)న్ని దేవికి సమర్పించి, గరుడుని ఈకలతో అలంకరించబడిన ఆ రాక్షసుల తలలను తులలేని మాలగా చండికకు యిచ్చింది. వానితోబాటు సింహం చర్మంతోచేసిన వడ్డ్యాణాన్నిగూడ సమర్పించుకొని కడుపార రాక్షస రుధిరం త్రాగింది. ఆ చండమారి సమర్పించిన ఆ చండముండుల శిరస్సులను ఆ దుర్గాదేవి మహాక్రోధంతో ఖండించింది. అంతట శుష్కరేవతీదేవి వారల సర్పాలతో నొకశిరోవేష్టనం తయారుచేసి చండమారితో కౌశికివద్దకు వెళ్ళి "భగవతీ! దైత్యుల శిరస్సులను నాగరాజుతోగూర్చి చేసిన ఈ ఉత్తమ శిరోవేష్టనాన్ని స్వీకరించు" మనెను. దేవి దానిని తీసికొని చండమారి శిరస్సున అలంకరించి "నీప భయంకరమైన కార్యం సాధించావు. ఈ చండముండుల శిరోమాలను ధరించి నేటి నుండీ 'చాముండ’ అనే శుభనామంతో ఖ్యాతిని గాంచగలవనెను. ఈ మాటలు చెప్పి ఆ త్య్రంబకేశ్వరి చండముండుల శిరోమాల ధరించి దిగంబరంగా ఉన్న ఆ చాముండతో యికవెళ్ళి మిగిలిన శత్రువులనందరను మట్టుపెట్టుమని ఆదేశించింది. అట్లేయని ఆ దాసభవాహిని దున్నపోతు కొమ్ముతో విజృంభించి శత్రుసైన్యాన్ని సంహరించింది. మిగిలిన వారలందరను మ్రింగివేసింది. ఆ విధంగా అంబిక, చర్మముండ, సింహంభూతగణాలచేతుల్లో నిశ్శేషంగా వధించబడి ఆదనుపుంగవులంతా శంభులోకానికి చేరారు.
అధ్యాయము 29 Complete
Summary of chapter 29 of the Vāmana Mahā Purana is as follows:
The narrative depicts the subtle turn of cosmic events as King Bali's pride increases with his endless victories, leading to slight oversights during his grand sacrificial assemblies. Sage Śukrāchārya perceives ominous signs foretelling the arrival of Bhagavān Vishṇu in disguise and warns King Bali to refrain from promising gifts to the dwarf brāhmaṇa who approaches his arena. When King Bali insists on maintaining his vow of charity regardless of the consequences, Śukrāchārya, angered by his disciple's disregard for his guru's warning, pronounces a curse that Bali's royal prosperity and kingdom shall soon be stripped away.