అధ్యాయము 49

పులస్త్య

1 - తతో గతేషు దేవేషు బ్రహ్మలోకం ప్రతిద్విజ!

 త్రైలోక్యం పాలయామాస బలి ర్ధర్మాన్వితః సదా

2 - కలి స్తదా ధర్మయుతం జగ ద్దృష్ట్వా కృతయుగే యథా

 బ్రహ్మాణం శరణం భేజే స్వభావస్య నిషేవణాత్

3 - గత్వా స దదృశే దేవం సేంద్రై ర్దేవైః సమన్వితం

 స్వ దీప్త్యా జ్యోతయంతం చ స్వదేశం ససురాసురమ్

4 - ప్రణిపత్య తమాహా థ తిష్యో బ్రహ్మాణ మీశ్వరమ్

 మమ స్వభావో బలినా నాశితో దేవసత్తమ!

5 - తం ప్రాహ భగవాన్ యోగీ స్వభావం జగతోఽపి హి

 న కేవలం హి భవతో హృతం తేన బలీయసా

6 - పశ్యస్వ తిష్య! దేవేంద్రం వరుణం చ సమారుతం

 భాస్కరోఽపి హి దీనత్వం ప్రయాతో హి బలా ద్పలేః

7 - న తస్య కశ్చిత్ త్రైలోక్యే ప్రతిషేద్ధాఽస్తి కర్మణః

 ఋతే సహస్రం శిరసం హరిం దశ శతాంఘ్రికమ్

8 - సభూమిం చ తథా నాకం రాజ్యం లక్ష్మీం యశోఽవ్యయః

 సమాహరిష్యతి బలేః కర్తుః సద్ధర్మ గోచరమ్

9 - ఇత్యేవ ముక్తో దేవేన బ్రహ్మణా కలి రవ్యయః

 దీనాన్ దృష్ట్వా స శక్రాదీన్ విభీతకవనం గతః

10 - కృతః ప్రావర్తత తదా కలే ర్నాశాత్ జగత్త్రయే

 ధర్మోఽభవ చ్చతుష్పాద శ్చాతుర్వర్ణ్యేఽపి నారద!

11 - తపోఽహింసా చ సత్యం చ శౌచ మింద్రియ నిగ్రహః

 దయా దానం త్వానృశంస్యం శుశ్రూషా యజ్ఞ కర్మ చ

12 - ఏతాని సర్వ జగతః పరివ్యాప్య స్థితాని హ

 బలినా బలవాన్ బ్రహ్మన్! తిష్యోఽపి హి కృతః కృతః

13 - స్వధర్మస్థాయినో వర్ణా హ్యాశ్రమాం శ్చావిశన్ ద్విజాః

 ప్రజా పాలన ధర్మస్థాః సదైవ మనుజర్షభాః

14 - ధర్మోత్తరే వర్తమానే బ్రహ్మ న్నస్మిం జగత్త్రయే

 త్రైలోక్య లక్ష్మీ ర్వరదా త్వాయాతా దానవేశ్వరమ్

15 - తా మాగతాం నిరీక్ష్యైవ సహస్రాక్ష శ్శ్రియం బలిః

 పప్రచ్ఛ కాఽసి మాం బ్రూహి కేనాస్యర్ధేన చాగతా?

పులస్త్యుడు

ఓ నారదా ! అలా దేవత లంతా స్వర్గం వదలిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్లిన తర్వాత బలి రాజేంద్రుడు ముల్లోకాలను ధర్మం తప్పకుండా పరిపాలించాడు. జగత్తు నంతా కృతయుగంగా మారి పోవడం గమనించిన కలి భయంతో తన స్వభావానికి తగినట్టుగా సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ కాళ్లు పట్టుకున్నాడు. అక్కడ యింద్రాది దేవతలు రాక్షసులతో కూడి బ్రహ్మ తన తేజస్సుతో, పరిసరాన్నంతా వెలిగింపజేస్తూ దర్శన మిచ్చాడు. బ్రహ్మ రెండు పాదాలు పట్టుకొని ఆ కలి, 'ప్రభో! రక్షించండి. బలి నా స్వభావాన్నే నాశనం చేశాడని గోలపెట్టాడు. అది విని ఆ మహాయోగి విరించి, "పిచ్చివాడా! నీవొక్కడి స్వభావాన్నే కాదు, ఆ మహాబలి, మొత్తం లోక స్వభావాన్నే నశింపజేశాడు. చూడటం లేదా? ఇరుగో యింద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, చివరకు సూర్యుడు కూడ ఎలా తేజస్సు కోల్పోయి కూర్చున్నారో! చూడు. ఈనాడు ఆ ఒక్క సహస్రశీర్షుడు సహస్రపాదుడు నగు శ్రీహరి దక్క ఆ బలి అభ్యుదయాన్ని నిరోధించగలవా డీమూడులోకాల్లో మరొకడు లేడు. ఆ అవ్యయుడైన లక్ష్మీపతియే, ధర్మనిరతుడైన ఆ బలి చక్రవర్తి రాజ్యం - భూలోకం స్వర్గం - సంపద కీర్తి అన్నీ హరించగల సమర్ధుడని చెప్పగా విని ఆ కలి దీనవదనాలతో ఉన్న యింద్రాది దేవతలను చూచి చేయునది లేక విభీతక అరణ్యానికి వెళ్లాడు. నారదా! అలా నాకలి వినిర్గమించిన తర్వాత ముల్లోకాల్లో కృతయుగం వ్యాపించ, చాతుర్వర్ణాల వారిలోనూ ధర్మం నాలుగు పాదాలా నిలచింది. అహింస, తపస్సు, సత్యం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దయ, దానం, అక్రౌర్యం, సేవ, త్యాగరూపాలైన యజ్ఞకర్మలు సర్వత్రా వెల్లివిరిశాయి. బలవంతుడైన బలి, కలినే కృతయుగంగా మార్చేశాడు! ద్విజులు స్వధర్మ నిరతులై తమ ఆశ్రమ ధర్మాల్లో స్థిరులైపోయారు. నరపతులు అప్రమత్తులై ప్రజాపాలనం చేయ సాగారు. అలా ముల్లోకాలూ ధర్మంలో స్థిరపడి నిలవడంతో, వరదాత్రి అయిన త్రిలోకలక్ష్మి ఆ దానవేశ్వరుని కడుకు వెళ్లింది. ఇంద్రుని వదలి తన వద్దకు వచ్చిన ఆ లక్ష్మిని చూచి బలి -'అమ్మా నీ వెవరు? ఎందుకు వచ్చినా వని ప్రశ్నించాడు.

16 - సా తద్వచన మాకర్ణ్య ప్రాహ శ్రీః పద్మమాలినీ

 బలే! శృణుష్వ యాఽస్మి త్వా మాయాతా మహి షీ బలాత్

17 - అప్రమేయ బలో దేవూ యోఽసౌ చక్ర గదాధరః

 తేన త్యక్తస్తు మఘవాన్ తతోఽహం త్వా మిహాగతా

18 - స నిర్మమే యువతయ శ్చతస్రో రూపసంయుతాః

 శ్వేతాంబర ధరా చైవ శ్వేత స్రగనులేపనా

19 - శ్వేత బృందారకారూడా సత్వాఢ్యా శ్వేత విగ్రహా

 రక్తాంబర ధరా చా న్యా రక్తస్రగను లేపనా

20 - రక్త వాజి సామారూఢా రక్తాంగీ రజసాన్వితా

 పీతాంబరా పీత వర్ణా పీత మాల్యాను లేపనా

21 - సౌవర్ణ స్యందన చరా తామసం గుణ మాశ్రితా

 నీలాంబరా నీలమాల్యా నీలగంగధానులేపనా

22 - నీల వృష సమారూఢా త్రిగుణా సా ప్రకీర్తితా

 యా సా శ్వేతాంబరా శ్వేతా సత్వాఢ్యా కుంజర స్థితా

23 - సా బ్రహ్మాణం సమాయాతా చంద్రం చంద్రాపుగానపి

 యారక్తా రక్త వసనా వాజిస్థా రాజసాన్వితా

24 - తాం ప్రాదా ద్దేవరాజాయ మనేవ తత్సమేషు చ

 పీతాంబరా యా సుభగా రథస్థా కనకప్రభా

25 - ప్రజాపతిభ్య స్తాం ప్రాదాత్ శుక్రాయ చ విశఃసు చ

 నీలవస్త్రా నీలదేహా యా చతుర్థీ వృష స్థితా

26 - సా దానవాన్ నైఋతాంశ్చ శూద్రాన్ విద్యాధరా నపి

 విప్రాద్యాః శ్వేతరూపాం తాం కథయంతి సరస్వతీమ్

27 - స్తువంతి బ్రహ్మణా సార్థం మఖే మంత్రాదిభిః సదా

 క్షత్రియా రక్తవర్ణాం తాం జయశ్రీ మితి శంసిరే

28 - సా చంద్రేణా సురశ్రేష్ఠ! మనునా చ య శస్వినీ

 వైశ్యా స్తాం పీతవసనాం కనకాంగీం చ సదైవ హి

29 - స్తువంతి లక్ష్మీ మిత్యేవం ప్రజాపాలా స్తధైవ హి

 శూద్రా స్తాం నీలవర్ణాంగీం స్తువంతి చ సుభక్తితః

30 - శ్రియా దేవీతి నామ్నా తాం సమం దైత్యైశ్చ రాక్షసైః

 ఏవం విభక్తా స్తా నార్య స్తేన దేవేన చక్రిణా

ఆ బలి మాటలు విని కమలాల మాల ధరించిన ఆ లక్ష్మీదేవి యిలా అన్నాది. "ఓబలీ! నేనెవరైనదీ, రాణి నైన నేను విధి లేక నీ వద్దకు ఎందుకు వచ్చినదీ చెబుతున్నా వినుము. అప్రమేయ బలశాలి అయన చక్రగదాధరుడు యింద్రుని వదలి వెళ్లి పోవడంతో నేను నీవద్దకు వచ్చాను. ఆ జనార్ధనుడు సౌందర్యవంతులైన నలుగురు యువతులను నిర్మించాడు. వారిలో నొకతె తెల్లని రూపంతో తెల్లని వస్త్రాలు, తెల్లని మాలలు, పరిమళ వ్యాలు ధరించి సత్వ గుణ ప్రధానయై తెల్లని ఏనుగు మీద ఆసీనురాలై యుంటుంది. రెండవ యువతి రాజసగుణ ప్రధానయై ఎర్రని దేహకాంతితో, ఎర్రని వస్త్రాలు, పూల మాలలూ ఎర్రని చందన లేపనాలూ ధరించి ఎర్రని అశ్వాన్ని ఎక్కి ఉంటుంది. ఆక తామస గుణాశ్రమురాలైన మూడవ యామె పసపు పచ్చని శరీర కాంతతో, పీతాంబరం, పీతమాల్యాలు, పీత గంధానులేపనం ధరించి బంగారు రథం మీద ఉంటుంది. నాలుగవ రమణి త్రిగుణాత్మకురాలై నీల వస్త్ర నీలమాల్య నీలగంధ లేపనం ధరించి నల్లని వీషభం మీద శోభిస్తూ ఉంటుంది. వీరిలో సత్వగుణాత్మికయై శ్వేతవర్ణంలో శ్వేత గజారూఢయైయున్న సరస్వతి విరించి, చంద్రుడు, ఆయన అనుచరుల కడకు వెళ్లి చేరింది. రక్తవర్ణంతో రక్త వస్త్రాదులతో ఎర్రని గుర్రం మీద విరాజిల్లే రజో గుణాత్మికను దేవరాజైన యింద్రునకు మనువునకు ఆయన లాంటి వారలకు ప్రదానం చేశాడు (హరి). పీతాంబరాన్ని ధరించిన కనకస్యందనం మీద నుండే సుందరిని ప్రజాపతులకు శుక్రాచార్యునకు వైశ్యులకూ యిచ్చాడు. నల్లని తుమ్మెద కాంతితో నీల వస్త్రాదులు ధరించి నీల వృషభా న్నెక్కిన నాలుగవ యాపెను దానవులు, నిరృతులు, విద్యాధరులు, శూద్రులూ గ్రహించారు. బ్రాహ్మణులు శ్వేతవర్ణాంగిని సరస్వతి అని పిలుస్తూ బ్రహ్మతో కలసి యజ్ఞయాగాల్లో మంత్రాలతో స్తోత్రం చేస్తారు. ఓ దైత్యశ్రేష్ఠా! రక్తాంబర ధారిణిని క్షత్రియులు జయలక్ష్మి అని పేర్కొని మనువు యింద్రుడాదిగా గలవార లాయశస్వినిని కొని యాడుతుంటూరు. బంగారు కాంతి గల సుందరిని వైశ్యులు ప్రజాపతులు, శుక్రుడూ లక్ష్మి అనే పేరుతో ఆరాధిస్తారు. దైత్య, విద్వాధర, శూద్రాదులు నీలవర్ణాంగిని శ్రీదేవి అంటూ భక్తితో స్తోత్రం చేస్తారు. ఈవిధంగా ఆ శంఖ చక్ర గదాధరుడా నలుగరనూ వేర్వేరుగా విభజించాడు.

31 - ఏతాసాం చ స్వరూపస్థా స్తిష్టంతి నిధయోఽవ్యయాః

 ఇతిహాస పురాణాని వేదాః సాంగా స్తధోక్తయః

32 - చతుఃషష్టికలాః శ్వేతా మహాపద్మో నిధిః స్థితః

 ముక్తా సువర్ణ రజతం రథాశ్వ గజ భూషణమ్

33 - శస్త్రాస్త్రాదిక వస్త్రాణి రక్తాపద్మోనిధిః స్మృతః

 గో మహిష్యః ఖరోష్ట్రం చ సువర్ణాంబర భూమయః

34 - ఓషధ్యః పశవః పీతా మహానీలో నిధిః స్థితః

 సర్వాసా మపి జాతీనాం జాతి రేకా ప్రతిష్ఠితా

35 - అన్యేషా మష్ఠ సంహర్త్రీ నీలా శంఖో నిధిః స్థితః, ఏతాసు సంస్థితానాం చ యాని రూపాణి దానవ!

 భవంతి పురుషాణాం వై తాన్ నిబోధ వదామి తే

36 - సత్య శౌచాభి సంయుక్తా మఖ దానోత్సవే రతాః

 భవంతి దానవపతే! మహాపద్మాశ్రితా నరాః

37 - యజ్వినః సుభగా నృపా మానినో బహు దక్షిణాః

 సర్వసామాన్య సుఖినో నరాః పద్మాశ్రితాః స్మృతాః

38 - సత్యానృత సమాయుక్తా దానాహరణ దక్షణాః

 న్యాయాన్యాయ వ్యయో పేతా మహానీలా శ్రితా నరాః

39 - వాస్తికాః శౌచరహితాః కృపణాః భోగవర్జితాః

 స్తే యాన్విత కధాయుక్తా నరాః శంఖశ్రితా బలే!

40 - ఇత్యేవం కథిత స్తుభ్యం తేషాం దానవ నిర్ణయః

41 - అహం సాగరిణీ నామ జయశ్రీ స్త్వా ముపాగతా

 మమాస్తి దానవపతే! ప్రతిజ్ఞా సాధు సమ్మతా

42 - సమాశ్రయామి శౌర్యాఢ్యం న చ క్లీబం కథంచన

 న చాస్తి భవత స్తుల్యో త్రైలోక్యేషు బలాధికః

43 - త్వయా బలవిభూత్యా హి ప్రీతి ర్మేజనితా ధ్రువా

 యత్త్వయా యుధి విక్రమ్య దేవరాజో వినిర్జితః

"అక్షయాలైన నిధులు ఈ నలువురు నిన్నాశ్రయించి యున్నవి. ఆ ప్రకారం ఇతహాస పురాణాలు, వేదాలు, వేదాంగాలు అరువది నాలుగు కళలు, శ్వేతకు సంబంధించినవి, మహాపద్మధిగా రూపొందినవి. వెండి, బంగారాలు, ముత్యాలు, రథాశ్వ గజ భూషణాలు, శస్త్రాస్త్రాదికాలు, వస్త్రాలు 'పద్మ'నిధి అనుపేర రక్తవర్ణాంగికి చెందినవి. గోమహిష సంతతులు, ఖర ఉష్ట్రాదులు, భూమి, ఓషధులు, పశువులు 'పీత'కు చెందిన మహానీలనిధి లోనివి. ఈ జాతులన్నింటికీ చెందినవి యింకా మిగిలి యున్నవీ అన్నీ కలిసి, నీలవర్ణాంగికి చెందినవై 'శంఖ' నిధిగా పరిగణింప బడతాయి. ఓ దానవ వీరా! ఈ నాలుగు శ్రేణులకు చెందిన మానవుల ప్రత్యేక లక్షణాలు యిక తెలుసు కొనుము. చెబుతున్నాను. సత్య, శౌచ, నిరతులై, మఖ దానాది క్రియలలో వినోదించు నరులు మహాపద్మనిధి నాశ్రయించువారు. దర్పం అభిమానాలతో యజ్ఞాలు చేస్తూ స్ఫురద్రూపులై ఉదారంగా దక్షిణలొసగుచూ సర్వసామాన్య సుఖాలనుభవించు వారు పద్మనిధికి చెందినవారు. మహానీలనిధికి చెందిన నరులు సత్యాలు, అసత్యాలు పలుకుతూ, దానం చేయుటలోను, సంపాదనలోను ఆసక్తి కలవారై, న్యాయ, అన్యాయపరులై ఉంటారు. ఇక శంఖనిధికి సంబంధించిన వారలు నాస్తికులు, శౌచహీనులు, కృపణులు (లోభులు) భోగవిముఖులై చౌర్య, అనృతాల పట్ల ఆసక్తిగలిగి ఉంటారు. ఓబలీ! ఈ నిధులకు చెందిన మానవుల స్వరూప స్వభావాలు చెప్పాను. ఆ నలుగురు యువతులలో రజో ప్రాధాన్యం కలిగిన 'జయశ్రీ' అను దానను నేను. నిన్నాశ్రయించ వచ్చతిని. సాధు జనులను మోహించిన నా ప్రతిజ్ఞ ప్రకారం నేను మహాశార్య నిధులగు వారినే దప్ప నపుంసకుల ఎడ కన్నెత్తి గూడా చూడను. శౌర్యంలో నీతో సమానుడుగా నిన్ను మించిన వాడు గానీ ముల్లోకాలలో ఎవడూ లేడు. నీ యీ బలాధిక్యాన్ని చూచి మురిసి పోయి వచ్చాను. యుద్ధంలో విక్రమించి యింద్రుని సైద్యం నిర్ధించిన మహావీరుడవు.

44 - అతో మమ పరా ప్రీతి ర్జాతా దానవ! శాశ్వతీ

 దృష్ట్వా తే పరమం సత్వం సర్వేభ్యోఽపి బలాధికమ్

45 - శౌండీర్యమానినంవీరం తతోఽహంస్వయ మాగతా

 నాశ్చర్యం దానవశ్రేష్ఠ! హిరణ్యకశిపోః కులే

46 - ప్రసూత స్యాసురేంద్రస్య తవకర్మ యదీదృశమ్

విశేషిత స్త్వయా రాజన్! దైతేయః ప్రపితామహః

47 - విజితం విక్రమా ద్యేన త్రైలోక్యం వై పరైర్హృతమ్

 ఇత్యేవ ముక్త్వా వచనం దానవేంద్రం తదా బలిమ్

48 - జయశ్చచంద్ర వదనా ప్రవిష్టాఽద్యోతయ చ్ఛుభా

 తస్యాం చా ధ ప్రవిష్టాయాం విధవా వ యోషితః

49 - సమాశ్రయంతి బలినం హ్రీ శ్రీ ధీ ధృతి కీర్తయః

 ప్రభా మతిః క్షమా భూతి ర్విద్యా నీతి ర్దయా తథా

50 - శ్రుతిః స్మృతిః ధృతిః కీర్తి ర్మూర్తిః శాంతిః క్రియాన్వితాః, పుష్ట స్తుష్టీ రుచి స్త్వన్యా తథా సత్వాశ్రితా గుణాః

తాః సర్వా బలి మాశ్రిత్య వ్యశ్రామ్యంత యధాసుఖమ్

51 - ఏవం గుణోఽభూ ద్దనుపుంగవోఽసౌ బలి ర్మహాత్మా శుభబుద్ధి రాత్మవాన్

యజ్వా తపస్వీ మృదురేవ సత్యవాక్ దాతా విభర్తా స్వజనాభి గోప్తా

52 - త్రివిష్టపం శాసతి దానవేంద్రే నాసీత్ క్షుధార్తో మలినో న దీనః

సదోజ్వలో ధర్మరతోఽథ దాంతః కామోపభోక్తా మనుజోఽపి జాతః

"ఏవంగుణ సంపన్నుడవైన నీ అపూర్వసత్త్వం, సర్వాధిక మానిత్వశాండీర్య వీర్యాలు చూచి పరమ ప్రీతితో నీ వద్దకు వచ్చాను. దైత్య శిరోమణీ! హిరణ్యకశిపుని వంగడంలో జన్మంచిన నీ విలాంటి ఘనకార్యాలు చేయడంలో ఆశ్చర్య మేమాత్రమూ లేదు. నీ ప్రపితామహుడైన దితిజుడు కూడ పరు లపహరించిన త్రైలోక్య రాజ్యలక్ష్మిని, శత్రు నిర్మూలనం గావించి విక్రమించి వశపరచుకున్నాడు!" ఈవిధంగా దానవేంద్రు డగు బలికి తన విషయం వివరించి సర్వత్రా వెలుగు వెన్నెలలు వెదజల్లుతూ ఆ చంద్రముఖి యగు జయలక్ష్మి ఆ చక్రవర్తి యింట్లో ప్రవేశించి విభూతులు ప్రదర్శించింది. వెంటనే హీ (లజ్జ)శ్రీ, ధీశక్తి, ధృతి (దైర్యలక్ష్మి) కీర్తి, ప్రభ, (వెలుగు) మతి, క్షమా, ఐశ్వర్యం, విద్య, నీతి, దయ, శ్రుతి, స్మృతి, యశోమూర్తి, శాంతి, క్రియాశక్తి, పుష్టి, తుష్టి, రుచి, సత్వాశ్రయాలైన యితర మంగళకర సిద్ధులన్నీ బలి అండ జేరి సుఖంగా విశ్రమించాయి. సద్భుద్ధీ సుబుద్ధీ అయిన ఆ మహనీయు డగు బలిరాజేంద్రుడు అలా సకల విభూతులు తన్నాశ్రయించగా మృదుభాషి, మధురభాషి, సత్యభాషియై తపో యజ్ఞాలు చేస్తూ భూరి దానాలు చేస్తూ, తన వారలను రక్షించుకుంటూ, త్రిలోకపాలనం గావించాడు. మహర్షే! ఆదానవేంద్రుని ఆదర్శ పరిపాలనలో ప్రజ లాకలి దప్పిక లెరుగరు. దైన్య మాలిన్యాలంటూ ఎక్కడా లేవు. మానవ సమాజ మంతా నియమ పాలనం చేస్తూ ధర్మవిహితంగా సుఖా లనుభవిస్తూ ద్విగుణీకృతమైన శోభతో విరాజిల్లింది.

అధ్యాయము 49 Complete