అధ్యాయము 33

నారద

1 - యోఽసౌమంత్రయతాం ప్రాప్తో దైత్యానాంశతడాడితః

సకేనవద నిర్భిన్నః శరేణదితిజేశ్వరః

పులస్త్య

2 - ఆసీత్ నృపోరఘుకులే రిపుజిన్ మహర్షే తస్యాత్మజో గుణగణైకనిధి ర్మహాత్మా

శూరోఽరిసైన్యదమనో బలవాన్ సుహృత్సు విప్రాంధ దీనకృపణేషు సమానభావః

3 - ఋతధ్వజోనామ మహాన్మహీయాన్ సగాలవార్థేతురగాధిరూఢః

పాతాళకేతుం నిజఘానపృష్ఠే బాణేన చంద్రార్ధనిభేనవేగాత్

నారద

4 - కిమర్థం గాలవస్యాసౌ సాధయామాససత్తమః

యేనాఽసౌ పత్రిణాదైత్యం నిజఘాననృపాత్మజః

పులస్త్య

5 - పురాతపస్తప్యతి గాలవర్షి ర్మహాశ్రమేస్వేసతతం నిష్టః

పాతాళకేతుస్తపసోఽస్యవిఘ్నం కరోతిమౌఢ్యాత్ససమాధి భంగమ్

6 – Missing content (Slokas 6 to 30)

మందరపర్వతాన సఖులతో కూర్చున్న గిరి కుమారిగౌరి సౌందర్యం చూచి ఆ కామాంధుడు బుద్ధిహీనుడై యిలా ప్రశ్నించాడు. ఈ వనంలో విహరించే ఈ లావణ్య రాశి ఎవరు ? ఈమె నా అంతఃపురవాసిని కాని నాడు నాయీ జీవితం వ్యర్థం. ఈతనుమధ్యను కౌగలించుకొనని నా రూప సంపద నిరర్థకం కదా. ఈ మృగ నేత్రినీ నన్ను కూర్చగలవాడే నాకు నిజమైన బంధువు మిత్రుడు సోదరుడూ నాసర్వస్వమూను. అంటూ వదరుతున్న ఆ దైత్యేంద్రుని మాటలకు రెండు చెవులు చేతులతో మూసికొని తలపంకిస్తూ బుద్ధిసాగరుడైన ప్రహ్లాదుడిలా హితబోధ చేశాడు. దైత్యేంద్రా! అలాంటి మాటలనకుము. ఆమె ఎవరనుకుంటివి ? జగజ్జనని! లోకేశ్వరుడు శూలపాణియగు శంకరుని ఇల్లాలు. వంశక్షయానికి దారితీసే యిలాంటి దుష్టాలోచనలు మానుము. ఈమెపరదార. రసాతలంలో పడిపోకుము. దుర్మార్గులకే కాదు సజ్జనులకు గూడ యిలాంటి దుష్ట సంకల్పం మంచిదికాదు. ఇలాంటి పరదారగ్రహణం నీ విరోధులు చేయుదురుగాక, నీవీ ప్రయత్నాన్ని విరమించుకో. గాధిరాజు విప్రుల ధేనువులను అపహరించిన సైనికులను చూచి పలికిన హిత వాక్యాలు నీవు వినలేదా ? ఇతరుల మీద చాడీలు చెప్పటం కన్నా మరణించుట మేలు. అబద్ధం చెప్పడం కన్నా నోరు మూసుకొని ఉండటం మంచిది. ఇతరుల భార్యలను కోరడం కన్నా నపుంసకత్వం ఉత్తమం. పరధనాపహరణం కన్నా బిచ్చమెత్తుకోవడం శ్రేష్ఠం. మోహంతో క్రోధంతో కండ్లు మూసుకొనిపోయిన ఆ దుష్టుని మీద ఆ హితవచనాలు ఏమి పనిచేయలేకపోయాయి. ఈ స్త్రీ నా విరోధి తల్లి. అని అరుస్తూ ఆమె ఉన్న వైపు పరుగుతీశాడు.

31 - తతోఽన్వధావన్ దైతేయా యంత్రముక్తా ఇవోపలాః

తాన్‌రురోధ బలాన్నందీ వజ్రోద్యత కరోఽవ్యయః

32 - మయతార పురోగాస్తే వారితాద్రావితా స్తథా

కులిశేనాహతా స్తూర్ణం జగ్ముర్భీతాదిశోదశ

33 - తానర్దితాన్ రణేదృష్ట్వా నందినాఽoధకదానవః

పరిఘేణసమాహత్య పాతయామాసనందినమ్

34 - శైలాదింపతితం దృష్ట్వా ధావమానంతథాంధకమ్

శతరూపాఽభవద్గౌరీ భయాత్త స్యదురాత్మనః

35 - తతః సదేవీగణ మధ్యసంస్థితః పరిభ్రమన్ భాతిమహాఽసురేంద్రః

యథావనేమత్తకరీ పరిభ్రమన్ కరేణుమధ్యే మదలోలదృష్టిః

36 - నపరిజ్ఞాతవాం స్తత్ర కాతుసాగిరికన్యకా

నాత్రాశ్చర్యంన పశ్యంతి చత్వారోఽమీసదైవహి

37 - నపశ్యతీహజాత్యంధో రాగాంధోఽపినపశ్యతి

నపశ్యతి మదోన్మత్తో లోభాక్రాంతోన పశ్యతి

 సోఽపశ్యమానో గిరిజాం పశ్యన్నపితథాంధకః

38 - ప్రహారం నాదదత్తాసాం యువత్య ఇతిచింతయన్

తతోదేవ్యాస దుష్టాత్మా శతవర్యానిరాకృతః

39 - కుట్టితః ప్రవరైః శస్త్రై ర్నిపపాత మహీతలే

వీక్ష్యాంధకం నిపతితం శతరూపా విభావరీ

40 - తస్మాత్ స్థానాదపాక్రమ్య గతాఽoతర్ధానమంబికా

పతితం చాంధకం దృష్ట్వా దైత్యదానవయూథపాః

41 - కుర్వంతః సుమహాశబ్దం ప్రాద్రవంతరణార్థినః

తేషామాపతతాం శబ్దం శ్రుత్వాతస్థౌ గణేశ్వరః

42 - ఆదాయవజ్రం బలవాన్ మఘవానివకోపితః

 దానవాన్ సమయాన్ వీరః పరాజిత్య గణేశ్వరః

43 - సమభ్యేత్యాంబికాం దృష్ట్వా వవందే చరణౌశుభౌ

దేవీచతా నిజామూర్తీః ప్రాహ గచ్ఛధ్వమిచ్ఛయా

44 - విహరధ్వం మహీపృష్ఠే పూజ్యమానానరైరిహ

వసతిర్భవతీనాంచ ఉద్యానేషు వనేషుచ

45 - వనస్పతిషు వృక్షేషు గచ్ఛద్వం విగతజ్వరాః

 తాస్త్వేవముక్తాః శైలేయ్యా ప్రణిపత్యాంబికాంక్రమాత్

46 - దిక్షుసర్వాసు జగ్ముస్తాః స్తూయమానాశ్చకింనరైః అంధకోఽపి స్మృతింలబ్ధ్వా అపశ్యన్నద్రి నందినీమ్

 స్వబలం నిర్జితం దృష్ట్వా తతః పాతాళమాద్రవాత్

47 - తతోదురాత్మా సతదాంధకోమునే పాతాళ మభ్యేత్య దివానభుం క్తే

రాత్రౌనశేతే మదనేషుతాడితో గౌరీంస్మరన్ కామబలాభిపన్నః

అంతట నా రాక్షసులంతా యంత్రాలనుంచి వెడలిన శిలలలాగా విజృంభించారు. వారలను బలపూర్వకంగా వజ్రపాణియై నందీశ్వరుడు నివారించాడు. మయుడు తారుడితోపాటు ఆ దైత్యులంతా వజ్రాఘాతాలకు తల్లడిల్లి భయంతో పది దిక్కులకు పారిపోయారు. అలా వారలను మర్దించిన నందిని చూచి కోపంతో, అంధకుడు పరిఘతో గట్టిగా ప్రహరించి నేలపడగొట్టెను. నంది మూర్ఛిల్లడం ఆ దుష్టుడు తన మీదకు రావడం చూచి గౌరి భయంతో నూరురూపాలు ధరించింది. ఆ స్త్రీల మధ్య నా దురాత్ముడు ఆడ ఏనుగుల మధ్య పరుగులు తీసే మదపుటేనుగులాగా గంతులేయసాగాడు. వాళ్ళ మధ్య అసలు గౌరి ఎవరో చూడలేక పోయాడు. అందులో ఆశ్చర్యమేముంది ? పుట్టు గుడ్డివాడు, మోహంతో కళ్లు మూసుకపోయినవాడు, మదాంధుడు, లోభంతో నిండిపోయినవాడు ఈ నలుగురూ కళ్లు తెరచుకొనినప్పటికీ చూడలేరు. అలాగే ఎదుట ఉన్న గౌరిని కూడా ఆ అంధకుడు గుర్తించలేకపోయాడు. స్త్రీలనే భావంతో వారలమీద చేయి చేసుకోలేదు. గౌరి యొక్క నూరురూపాలలో విజృంభించిన ఆ దేవీ శక్తులన్నీ వానిపైబడి శస్త్రాస్త్రాలతో మర్దించి నేలబడగొట్టారు. అంధకుడావిధంగా భూపతితుడు కాగానే శతరూపాలు ధరించిన అంబిక అంతర్ధానమై పోయింది. మట్టి గరచిన తమ నాయకుణ్ణి చూచి దైత్య దానవ వీరులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధానికి తలపడగా గణేశ్వరుడు, తన గణాలతో, వజ్రం చేతబట్టి కోపించిన యింద్రునివలె ఎదురొడ్డి నిలిచాడు. అలా విజృంభించిన దానవులందరనూ, మయునితోసహా, పారద్రోలి అంబిక సన్నిధికి వెళ్ళి నమస్కరించాడు. అంతట గౌరి తన రూపాలనన్నింటినీ విసర్జించి యిలా అన్నది. మీరంతా భూలోకంలో స్వేచ్ఛగా తిరుగుతూ మానవులచేత పూజలు స్వీకరించండి. ఉద్యానవనాల్లో అరణ్యాలలో వనస్పతులలో వృక్షాలలో నివసించండి. నిశ్చింతగా శతావరులుగా విహరించండి. ఆ గిరి నందిని ఆ దేశాన్ని తలదాల్చి ఆ శతావరులందరూ ఒకరొకరుగా నామెకు ప్రణమిల్లి, కిన్నరులంతా తమ్ము కీర్తిస్తుండగా సర్వదిక్కులకూ వెళ్ళిపోయారు. ఇంతలో అంధకుడు మూర్ఛనుండి తేరుకొని చూస్తే అచట గౌరికనిపించలేదు. తన బలాలన్నీ ఓడిపోయి పారిపోయినట్టు గ్రహించి ఆ దుష్టుడు కూడా చల్లగా పాతాళానికి జారుకున్నాడు. అప్పటినుండీ ఆ కామోపహతుడు పగలు తిండీ రాత్రులు నిద్రా మాని గౌరిని స్మరిస్తూ మతిభ్రష్టుడయ్యాడు.

అధ్యాయము 33 Complete