అధ్యాయము 15

ఋషులు

1 - యచ్చవర్జ్యం మహాబాహో సదా ధర్మస్థితై ర్నరైః

 యద్భోజ్యం చ సముద్దిష్టం కథయిష్యామహే వయమ్

2 - భోజ్యమన్నం పర్యుషితం స్నేహాక్తం చిరసంభృతమ్

 అ స్నేహా వ్రీహయః శ్లక్ష్ణ వికారాః పయసస్తథా

3 - శశకః శల్యకో గోధా శ్వావిధో మత్స్యకచ్చపౌ

 తద్వద్ ద్విదలకాదీని భోజ్యాని మనురబ్రవీత్

4 - మణిరత్నప్రవాళానాం తద్వన్ముముక్తాఫలస్యచ

 శైలదారుమయానాంచ తృణమూలౌషధాన్యపి

5 - శూర్పధాన్యాజినానాం చ సంహతానాంచ వాససామ్

 వల్కలానా మశేషాణా మంబునా శుద్ధిరిష్యతే

6 - సస్నేహానా మథోష్ణేన తిలకల్కేన వారిణా

 కార్పాసికానాం వస్త్రాణాం శుద్ధిః స్యాత్సహభస్మనా

7 - నాగదంతాస్థిశృంగాణాం తక్షణా చ్చుద్దిరిష్యతే

 పునఃపాకేన భాండానాం మృన్మయానాంచ మేధ్యతా

8 - శుచిభైక్షం కారుహస్తః పణ్యం యోషిన్ముఖం తథా

 రథ్యాగత మవిజ్ఞాతం దాసవర్గేణ యత్కృతమ్

9 - వాక్ప్రశస్తం చిరాతీతమనేకాంతరితం లఘు

 చేష్టితం బాలవృద్ధానాం బాలస్యచ ముఖంశుచి

10 - కర్మాంతాంగారశాలాసు స్తనందయసుతాః స్త్రియః

 వాగ్విప్రుషో ద్విజేంద్రాణాం సంతప్తాశ్చాంబు బిందవః

ఋషులు

మహావీరా! ఎల్లప్పుడు ధర్మమునందు నిలకడ గల మానవుడు భుజింప దగినవేవో వర్జింప దగినవేవో చెప్పుచున్నాము వినుము. నూనె లేక నేతిలో బాగావండబడిన అన్నము చాలాకాలము క్రిందటిదైనను తినవచ్చును. నూనె నేయి తగలకుండ వండబడిన బియ్యపుటన్నము, పాయసాన్నము, కుందేలు, ఏదుపంది, మొసలి, ముళ్ళపంది, తాబేలు మాంసము, చేపలు పప్పులు కూరలు మొదలగు వానిని తినవచ్చునని మనువు ఆదేశం. మణిరత్న ప్రవాళాలు శిలా దారుమయాలు, తృణధాన్యాలు, గడ్డలు, జల్లెడ, జింక చర్మము, నూతనవస్త్రాలు, అన్ని రకముల నారగుడ్డలు ( చెట్ల బెరడుతో చేసినవి) నీటితో కడిగి శుద్ధిచేయాలి. జిడ్డు తగిలిన వస్తువులన్నింటిని నువ్వుల నూనెతో కాచిన కషాయంలో శుభ్రం చేయాలి. నూలు ఉన్ని బట్టలను బూడిద కలిసిన నీటితో శుధ్ధిచేయాలి. ఏనుగుదంతాలు, కొమ్ములు పరిశుద్ధములే. మట్టిపాత్రలకు అగ్ని సంస్కారం శుద్ధిసాధనం. భిక్షాటనవల్ల తెచ్చిన అన్నం పనివాని(శిల్పి) చేయి, స్త్రీ ముఖము, బజారు నుండి కొనితెచ్చినవి, దాసదాసీలు తెచ్చినవి, ప్రశంసించబడిన వస్తువులు, చాలచేతులు మారినవి, తెలికవస్తువులు, బాలవృద్ధుల కృత్యాలు, బాలల ముఖాలు, యివన్నియు పరిశుద్ధాలే. ధాన్యపు కొట్లు, బొగ్గు నిల్వ చేయు కొట్లు, బాలింతస్త్రీలు, పాలుత్రాగే శిశువులు, బ్రాహ్మణుల నోటినుండి వెలువడు తుంపరలు ఉష్ణోదకములు ఇవన్నియు పరిశుద్ధములే.

11 - భూమిర్విశుధ్యతే ఖాతదాహమార్జనగోక్రమైః

 లేపాదుల్లేఖనాత్ సేకాద్ వేశ్మ సమర్జనార్చనాత్

12 - కేశకీటావపన్నేన్నే గోఘ్రాతే మక్షికాన్వితే

 మృదంబుభస్మక్షారాణి ప్రక్షే ప్తవ్యాని శుద్ధయే

13 - ఔదుంబరాణాం చామ్లేన క్షారేణ త్రపుసీసయోః

 భస్మాంబుభిశ్చ కాంస్యానాం శుద్ధిః ప్లావో ద్రవస్యచ

14 - అమేధ్యాక్తస్యమృత్తోయై ర్గంధాపహరణేనచ

 అన్యేషామపిద్రవ్యాణాం శుద్ధిర్గంధాపహారతః

15 – మాతుఃప్రస్రవణే వత్సః శకునిః ఫలపాతనే

 గర్ధభో భారవాహిత్వే శ్వామృగగ్రహణే శుచిః

16 - రథ్యాకర్దమతోయాని నావః పథి తృణానిచ

 మారుతేనైవ శుధ్యంతి పక్వేష్టకచితానిచ

17 – శృతంద్రోణఢకస్యాన్న మ మేధ్యాభిప్లుతం భవేత్

 అగ్రముద్ధృత్య సంత్యాజ్యం శేషస్య ప్రోక్షణం స్మృతమ్

18 - ఉపవాసం త్రిరాత్రం వా దూషితాన్నస్య భోజనే

 అజ్ఞాతేజ్ఞాతపూర్వేచ నైవశుద్ధి ర్విధీయతే

భూమిశుద్ధి, పారతో గడ్డిగాదం తొలగించిగాని, పైనున్న చెత్త కాల్చిగాని చీపురుతో చిమ్మిగాని, ఒకరాత్రిపగలు ఆవుల చేత త్రొక్కించిగాని, ఆవుపేడతో అలికించిగాని, ఆవు పంచతం చల్లిగాని చేసుకోవచ్చు. యింటిని ఊడ్చిగాని అందులో పూజచేసిగాని శుద్ధిచేసుకోవలె. వెంట్రుకలు పడినా మక్షికాది కీటకాలు వాలినా, ఆవులు వాసనచూచినా, అలంటి అన్నం మీద మృత్తిక భస్మాక్షారాలు కలిపిన జలం చిలికించి పవిత్రం చేసుకోవలెచు. సత్తు గిన్నెలు సీసపు పాత్రలు క్షారజలంతోను రాగి పాత్రలను పులుసుతోను, కంచుపత్రాలను బూడిద కలిపిన నీటితోను, శుద్ధి చేయవలె. మలస్పర్శ కలిగిన వస్తువులను దుర్వాసన వదిలే వరకు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవలె. ఇతర వస్తువులను కూడా దుర్గంధం వదిలేవరకు అట్లే చేసుకోవలెను. చనుబ్రాలు త్రాగే శిశువు పవిత్రుడు. పక్షి (చిలుక) కొరికి పడవేసిన పండు, బరువుమోయుచున్న గాడిద, లేడిని పట్టుకున్న కుక్క పరిశుద్ధాలు, దారి, బురద, నీరు, పడవలు, దారిలో పెరిగిన గడ్డి, వీనిని గాలి శుభ్రపరచును. కాల్చిన ఇటుకలు గూడ నట్లే. అమేధ్యంలాంటి అపవిత్ర వస్తుస్పర్శ గలిగిన భోజనం (అన్నం) , అడ్డెడు మానెడు వండినది, ఎక్కువ ప్రయాణంలో ఉన్నప్పుడు దానిపై పొరతీసి పారవైచి మిగిలిన దానిపై నీరు ప్రోక్షింఛి శుద్ధి చేసుకోవలెను. ఆశుద్దాన్నం తెలియక తినినచో ఒకరాత్రిగాని, మూడు రాత్రులుగాని ఉపవాసం చేసి దోషం పోగొట్టుకోవచ్చు. తెలిసిగూడ దూషితాన్నం తింటే దానికి శుద్దియేలేదు.

19 - ఉదాక్యాశ్వాననగ్నాంశ్చ సూతికాంత్యావసాయినః

స్పృష్ట్వా స్నాయీత సౌచార్థం తథైవ మృతహారిణః

20 – నస్నేహ మస్థి సంస్పృశ్య సవాసాః స్నానమాచరేత్

 ఆచమ్యైవతు నిః స్నేహం గామాలభ్యార్క మీక్ష్యచ

21 - నలంఘయే త్పురీషాసృక్ ష్టీవనోద్వర్తనానిచ

 గృహాదుచ్చిష్టవిణ్మూత్రపాదాంభాంసి క్షి పేద్ బహిః

22 - పంచపిండా ననుద్ధృత్య నస్నాయాత్ పరవారిణి

 స్నాయీత దేవఖాతేషు సరోహ్రదసరిత్సుచ

23 - నోద్యానాదౌ వికాలేషు ప్రాజ్ఞస్తిష్ఠేత్ కదాచన

 నాలపేద్ జనవిద్విష్టం వీరహీనాం తథాస్త్రియం

24 - దేవతాపితృసచ్చాస్త్రయజ్ఞవేదాదినిందకైః

 క్రుత్వాతు స్పర్శమాలాపం శుధ్యతే_ర్కావలోకనాత్

25 - అభోజ్యాః సూతికాషండమార్జారాఖుశ్వకుక్కుటాః

 పతితాపవిద్ధనగ్నా శ్చాండాలాద్యధమా శ్చయే

రజస్వల అయిన స్త్రీని, కుక్కను, దిగంబరుడిని, ప్రసూతయగు స్త్రీని, అంత్యజులను, శవవాహకులను తాకినచో స్నానంతో శుద్ధియగును. మాంసంతో కూడిన ఎముకలు తాకినచో సచేల స్నానం చేయాలి. ఎండిన ఎముక అయితే ఆచమనంచేసి గాని ఆవును తాకిగాని సూర్యుని చూచిగాని శుద్ధిచేసుకోవచ్చు. మలం రక్తం ఉమ్మి నలుగుపెట్టి పారవేసిన పిండి వీనిని దాటకూడదు. ఎంగిలి, చెత్త చెదారం, పెద్దలకు పాద ప్రక్షాళనం చేసిన నీరు, మూత్రాదులు యింటికి దూరంగా పారవేయాలి. ఇతరులకు చెందిన జలాశయాల్లో స్నానం చేసేముందు అయిదు దోసిళ్ళ నీరు బయటకు చిమ్మవలెను. ప్రకృతి సిద్ధాలయిన చెరువుల్లో జలాశయాల్లో నదీనదాల్లోను స్నానంచేయాలి. అనుచిత సమయాల్లో ప్రాజ్ఞుడు ఉద్యానవనాలలో నిలవదు, జనవిద్వేషియయిన వ్యక్తితో మాటాడదు, విధవలతో వ్యర్థ స్త్రీలతో మాట్లాడడు. దేవపితృనిందకులను వేదశాస్త్ర యజ్ఞాది దూషకులను తాకినను సంభాషించినను, వెంటనే సూర్యుని చూచి పవిత్రులు కావచ్చును. సూతికులు, షండులు, మార్జార, మూషిక, శునక, కుక్కుట, పతితులు, అపవిద్ధులు, నగ్న చండాలాది హీనుల నుండి భోజనం గ్రహించరాదు.

సుకేశి

26 - భవద్భిః కీర్తితా_భోజ్యా యఏతే సూతికాదయః

 అమీషాం శ్రోతు మిచ్చామితత్వతో లక్షణానిహి

సుకేశి

మహనీయులారా! సూతికాదులనుండి భోజనం గ్రహించకూడ దన్నారు. అలాంటి వారి లక్షణాలేవో వివరించండి.

ఋషులు

27 - బ్రాహ్మణీ బ్రాహ్మణస్యైవయా_వరోధత్వమాగతా

 తావుభౌ సూతికేత్యుక్తౌ తయోరన్నం విగర్హితమ్

28 - నజుహోత్యుచితేకాలే నస్నాతి నదదాతిచ

 పితృదేవార్చనాద్దీనః స షంఢః పరిగీయతే

29 - దంభార్థం జపతే యశ్చ తప్యతే యజతే తథా

 నపరత్రార్థ ముద్యుక్తో సమార్జారః ప్రకీర్తితః

30 - విభవే సతి నైవాత్తి నదదాతి జుహోతిజ

 తమాహు రాఖుం తస్యాన్నం భుక్త్వా కృచ్చ్రేణ శుద్ధ్యతి

31 - యఃపరేషాం హి మర్మాణి నికృ౦తన్నివ భాషతే

 నిత్యం పరగుణద్వేషీ సశ్వాన ఇతికథ్యతే

32 - సభాగతానాం యః సభ్యః పక్షపాతం సమాశ్రయేత్

 తమాహు కుక్కుటం దేవా స్తస్యాప్యన్నం విగర్హితమ్

33 - స్వధర్మం యః సముత్సృజ్య పరధర్మం సమాశ్రయేత్

 అనాపదిసవిద్వద్భిః పతితః పరికీర్త్యతే

34 - దేవత్యాగీ పితృత్యాగీ గురుభక్త్యరత స్తథా

 గోబ్రాహ్మణస్త్రీవధకృ దపవిద్ధః సకీర్త్యతే

35 - యేషాంకులే నవేదో_స్తి నశాస్త్రం నైవచ వ్రతమ్

 తేనగ్నాఃకీర్తితాఃసద్భి స్తేషామన్నంవిగర్హితమ్

36 - ఆశర్తానామదాతాచ దాతుశ్చప్రతిషేధకః

 శరణాగతంయస్త్యజతి సచండాలోధమోనరః

37 - యోబాంధవైః పరిత్యక్తః సాదుభిర్ బ్రాహ్మణైరపి

 కుండా శీయశ్చతస్యాన్నం భుక్త్వాచాంద్రాయణంచరేత్

38 - యోనిత్య కర్మణో హానిం కుర్యాన్నైమిత్తికస్యచ

 భుక్త్వాన్నంతస్యశుద్ధ్యేత త్రిరాత్రోపోషీతోనరః

39 - గణకశ్యనిషాదస్య గణికా భిషజో స్తథా

 కదర్యస్యాపిశుద్ధ్యేత త్రిరాత్రోపోషీతోనరః

40 - నిత్యస్యకర్మణోహానిః కేవలం మృతిజన్మసు

 నచనైమిత్తికోచ్చేదః కర్తవ్యోహికథంచన

ఋషులు

బ్రాహ్మణుని భ్రష్టుని గావించిన బ్రాహ్మణస్త్రీ, యిద్దరూ సూతికులనబడతారు. వారల చేతితిండి తినరాదు. సకాలంలో స్నానజప సంధ్యావందనాదులు, హోమాది కర్మలు, దేవపితృ కార్యాలు దాన ధర్మాదులు చేయనివాడు షంఢుడు. డాంబికంగా జపం తపం యజ్ఞాదులు చేస్తూ పరలోక చింతన లేనివారు మార్జారులు. సంపద కలిగి ఉండి కూడా దానహోమాదులు చేయకుండా తామే అనుభవించేవారు మూషికులు. వారల అన్నం తినరాదు. కృచ్చ్రాదులు చేస్తేనే ఆ పాపం పోతుంది. ఎల్లపుడూపరులను సూటిపోటు మాటలతో వేధిస్తూ పరులలోని సద్గుణాలను ద్వేషించేవానిని శునకుడంటారు. సభలోనున్న సభ్యులపట్ల పక్షపాత బుద్ధితో బాహాటంగా వ్యవహరించేవాడు కుక్కుబుడు. అటువంటి వాడొసగిన అన్నం తినరాదు. ఏలాంటి ఆపద కలగనప్పటికీ స్వధర్మాన్ని వదలి పరధర్మాన్ని ఆశ్రయించేవాడు పతితుడు. వాని చేతి అన్నం తినరాదు. దేవపితృకార్యాలు వదలి గురువుల పట్ల భక్తిలేక, గోవులను బ్రాహ్మణులను స్త్రీలను వధించు దుష్టుడు అపవిద్ధుడు. ఎవడి యింట్లో ఎప్పుడూ కూడ ఎలాంటి వ్రతాలుగాని వేదాధ్యయన శాస్త్ర చర్చలు గాని జరగవో వాడు నగ్నుడు (దిగంబరుడు). వాడొసగు భోజనం గర్హించదగినది. ఇతరులకు ఆశ గొలిపి దానిని పూర్తిచేయనివాడు, దానం చేసేవాడిని అడ్డగించేవాడు, తన్నాశ్రయించు వానిని నట్టేటముంచువాడు ఛండాలుడు. అధముడు. బంధు పరిత్యక్తుడు సాధువులు బ్రాహ్మణులచే విడువబడిన వాడు, దుశ్శీలునిచే తిండి తినే వాడి ఇంట భుజించినచో చాంద్రాయణం చేస్తేనే శుద్ధి. నిత్యనైమిత్తిక కర్మలు వదలిన వానింట భుజిస్తే మూడు రాత్రులు ఉపవాసం చేయాలి. గణకుడు (జ్యోతిషి), వ్యాధుడు, వేశ్య, వైద్యుడు, లోభి. వీరలోసగిన అన్నం భుజిస్తే ప్రాయశ్చిత్తంగా మూడు రాత్రులు ఉపవసించాలి. జాతశౌచమృతాశౌచములు కలిగినప్పుడు నిత్య విధులు మానుకోవచ్చు, కాని ఎట్టిపరిస్థితులలోను నైమిత్తిక కర్మలు వదులుకోరాదు.

41 - జాతేపుత్రేపితుఃస్నానం సచైలస్య విధీయతే

 మృతేచసర్వబంధూనా మిత్యాహభగవాన్ భృగుః

42 - ప్రేతాయసలిలందేయం బహిర్దగ్ద్వాతుగోత్రజైః

 ప్రథమే_హ్ని చతుర్థేవా సప్తమేవా_స్థి సంచయమ్

43 - ఊర్ధ్వం సంచయనాంత్తేషా మంగస్పర్శోవిధీయతే

 సోదకైస్తు క్రియాకార్యా సంశుద్ధైస్తు సపిండజైః

44 - విషోద్బంధన శస్త్రాంబు వహ్నిపాతమృతేషుచ

 బాలేప్రవాజిసంన్యాసే దేశాంతరమృతే తథా

45 - సద్యఃశౌచంభవేద్వీర తచ్చాప్యుక్తం చతుర్విధం

 గర్భస్రావేతదేవోక్తం పూర్ణకాలే న చేతరే

46 - బ్రాహ్మణానామహోరాత్రం క్షత్రియాణాం దినత్రయమ్

 షడ్రాత్రంచైవ వైశ్యానాం శూద్రాణాంద్వాదశాహ్నికమ్ 

47 - దశ ద్వాదశ మాసార్ధ మాససంఖ్యై ర్దినైశ్చ తైః

 స్వాః స్వాః కర్మక్రియాః కుర్యుః సర్వే వర్ణా యథాక్రమమ్

48 - ప్రేతముద్దిశ్య కర్తవ్య మేకోద్దిష్టం విధానతః

 సపిండీకరణం కార్యం ప్రేతే అవత్సరా న్నరైః    

49 - తతః పితృత్వ మాపన్నే దర్శపూర్ణాదిభిః శుభైః

 ప్రీణనం తస్య కర్తవ్యం యథాశ్రుతి నిదర్శనాత్ 

50 - పితురర్థం సముద్దిశ్య భూమిదానాదికం స్వయం

 కుర్యా దేనాస్య సుప్రీతాః పితరో యాంతి రాక్షస

51 - యద్యదిష్టతమం కించి ద్యచ్చాస్య దయితం గృహే

 తత్త ద్గుణవతే దేయం తదేవాక్షయ మిచ్చతా

52 - అధ్యేతవ్యా త్రయీ నిత్యం భావ్యంచ విదుషా సదా

 ధర్మతో ధన మాహార్యం యష్టవ్యం చాపి శక్తితః

53 - యచ్చ్చాపి కుర్వతో నాత్మా జుగుప్సామేతి రాక్షస

 తత్కర్తవ్య మశంకేన యన్నగోప్యం మహాజనే

54 - ఏవ మాచరతో లోకే పురుషస్య గృహే సతః

 ధర్మార్థకామసంప్రాప్తిః పరత్రేహచ శోభనమ్

55 - ఏషతూద్దేశతః ప్రోక్తో గృహస్థాశ్రమ ఉత్తమః

 వానప్రస్థాశ్రమం ధర్మం ప్రవక్ష్యామో_ వధార్యతామ్

పుత్రజన్మ కలుగగానే సచేలస్నానం తండ్రి చేయాలి. కుటుంబంలోని వారెవరైనను మరణించినచో బంధువులందరు స్నానం చేయాలని భృగు మహర్షి వచనం. మరణించిన వానిని యింటి బయట దూరంగా దహనం చేయాలి. సగోత్రీయులు జలతర్పణం వదలాలి. మొదటి నాడు గాని నాలుగవ లేక ఏడవ దినాన అస్తి సంచయనం చేయాలి. ఆస్థి సంచయనానంతరం సోదరులందరూ తమ అంగ స్పర్శ చేసుకోవలె. సపిండీకులు శుద్ధి అనతరం శ్రాద్ధ కర్మ చేయాలి . విష ప్రయోగం వల్ల, ఉరి, శస్త్రాల ద్వారా, అగ్ని వల్ల, నీళ్ళల్లో మునిగినందున, పైనుండి క్రింద పడినందున మృతి కలిగినప్పుడు, బాలురు, సన్యాసులు మరణించినప్పుడు దేశాంతరగతుడు చనిపోయినను యీ పరిస్థితులలో నాలుగు రకాలయిన సద్య:శుద్ధి (వెంటనే శుద్ధి) చెప్పబడింది . గర్భస్రావం జరిగినప్పుడు కూడా యింతే. ఇతరులకు మాత్రం శౌచకాల పరిసమాప్తి నుండే శుద్ధి బ్రాహ్మణుల కొకరోజు క్షత్రియులకు మూడు రోజులు, వైశ్యులకు ఆరు రోజులు, శూద్రులకు పండ్రెండు రోజులు అశుచి. ఈ అన్ని జాతుల వారునూ వారి వారి ఆచారాలననుసరించి వరుసగా పది, పండ్రెండు, పదిహేను రోజులకు శ్రాద్ధములు చేసుకోవాలి. విధివిధానంగా చనిపోయిన వారికి ఏకోద్దిష్ట కర్మ జరపాలి. సంవత్సరాంతంలో సపిండీకరణం చేయాలి. ప్రేతత్వవిముక్తి కలిగిన పితృత్వం కలిగి తర్వాత వేదవిహితంగా ధర్మపూర్ణ కర్మలు నిర్వర్తించి వారికితర్పణం చేయాలి. ఓ రాక్షసేస్వరా! పితరులకు ఉత్తరోత్తర సద్గతులు గలుగుటకు భోగో హిరణ్య దానాదులు చేయాలి. పితరులకు వారి జీవిత కాలంలో ఏయే వస్తువులు యిష్టతములో ఆయా వస్తువును దానం చేసినచొ వారల కక్షయ లోకములు కలుగును. విద్వాంసుడు ప్రతిదినం వేదాధ్యయనం చేయవలె, ధర్మం తప్పకుండా ధనార్జనం చేసి తన శక్త్యానుసారం యజ్ఞాదులు చేయాలి. తన అంతరాత్మకు జుగుప్సావహములు కానిపనులు, పెద్దలయెడ దాచనవసరం లేని పనులు గృహస్తుడైన వాడు సంకోచం లేకుండా ఆచరించాలి. భార్యా బిడ్డలతో కూడియుండియూ ఈ విధంగా సదాహరణం చేయు మానవుడు ధర్మార్థ కామములు సమకూర్చుకొని ఈ లోకంలోనూ అనంతరం పరలోకంలోను సుఖాలు పొందుతాడు. ఇంత వరకు ఉత్తమ గృహస్తధర్మాలు చెప్పితిమి. ఇక వానప్రస్థుని విధులు వివరించుకొన్నాము. జాగ్రత్తగా వినుము.

56 - ఆపత్యసంతతిం దృష్ట్వా ప్రాజ్ఞో దేహస్య చానతిమ్

 వానప్రస్థాశ్రమం గచ్చే దాత్మనః శుద్ధికారణమ్

57 - తత్రారణ్యోపభోగైశ్చ తపోభి శ్చాత్మకర్షణమ్

 భూమౌ శయ్యా బ్రహ్మచర్యం పితృదేవాతిథిక్రియా

58 - హోమ స్త్రిషవణ౦ స్నానం జటావల్కలధారణమ్

 వన్యస్నేహనిషేవిత్వం వానప్రస్థవిధి స్త్వయమ్

59 - సర్వసంగపరిత్యాగో బ్రహ్మచర్య మమానితా

 జితేంద్రియత్వ మావాసే నైకస్మిన్ వసతిశ్చిరమ్

60 - అనారంభ స్తథా_హారో భైక్షాన్నం నాతికోపితా

 ఆత్మజ్ఞానావభోదేచ్చా తథా చాత్మావభోధనమ్

61 - చతుర్దేత్వాశ్రమే ధర్మా అస్మాభిస్తే ప్రకీర్తితాః

 వర్ణ ధర్మాని చాన్యాని నిశామయ నిశాచర

62 - గార్హస్థ్యం బ్రహ్మచర్యంచ వానప్రస్థం తయాశ్రమాః

 క్షత్ర్రియస్యాపి కథీతా యేచాచార ద్విజస్యహి

63 - వైఖానసత్వం గార్హస్థ్య మాశ్రమద్వితయం విశః

 గార్హస్థ్యముత్తమం త్వేకం శూద్రస్య క్షణదాచర

64 - స్వాని వర్ణాశ్రమోక్తాని ధర్మాణీహ న హాపయేత్

 యో హాపయతి తస్యాసౌ పరికుప్యతి భాస్కరః

65 - కుపితః కులనాశాయ ఈశ్వరో రోగవృద్ధయే

 భానుర్వై యతతేతస్య నరస్య క్షణదాచర

66 - తస్మాత్ స్వధర్మం ణ హి సంత్యజేత న హాపయేచ్చాపి హి నాత్మవంశమ్

 యః సంత్యజేచ్చాపి నిజం హి ధర్మంతస్మై ప్రక్యుప్యేత దివాకరస్తు

తెలివి గల గృహమేధి పుత్రపౌత్రులు కలిగిన తర్వాత తన శరీరపాటవం తగ్గడం గమనించి వెంటనే ఆత్మశుద్ధి కోసం వాన ప్రస్థాశ్రమం స్వీకరించాలి. అరణ్యంలో దొరకే కంద మూలాదులు తింటూ యింద్రియాలను అదుపులోనుంచుకొని తపస్సు చేసుకోవాలి. భూమి మీద శయనిస్తూ బ్రహ్మచర్యం నెరపాలి. పితరులను దేవతలనుపాసిస్తూ అతిధి అభ్యాగతుల సేవ చేయాలి. హోమం త్రికాల స్నాన సంధ్యానుష్టానం జటా వల్కల ధారణం వనాల్లో లభ్యమయ్యే తైలాదులుపయోగిస్తూ వానప్రస్థ జీవితం నెరపాలి. సర్వసంగ పరిత్యాగం, బ్రహ్మచర్యం, నిరహంభావం, ఇంద్రియ విజయం, ఒకేచోట దీర్ఘ కాలం నివసించకుండుట, లౌకిక కార్యాలకు దూరంగా ఉండటం, భిక్షాన్న గ్రహణం, చీటికి మాటికి కోపించకుండుట, ఆత్మా జ్ఞానాపేక్ష, ఆత్మను తెలుసుకోవటం, తెలియజెప్పడం, ఇవి సన్యాసాశ్రమ ధర్మాలు. నిశాచరా! యిప్పుడు చతుర్వర్ణాల వారి విధులేమో చెప్పెదము. వినవలసినది; బ్రహ్మచర్య గార్హస్థ్యవాన ప్రస్థాశ్రమ విధులు బ్రాహ్మణులతోబాటు క్షత్రియులు కూడా ఆచరించాలి. ఇక గార్హస్థ్యవాన ప్రస్థ ఆశ్రమ ధర్మాలు వైశ్యులు అనుష్టించాలి. కాగా శూద్రులకు గృహస్థాశ్రమ నిర్వహణమే ఉత్తమంగా చెప్పబడినది. ఈ విధముగా తమకు విధించబడిన ఆశ్రమ ధర్మాలను నాలుగు వర్ణాలవారూ వదలకుండా ఆచరించాలి. అలా కాక తమ తమ ధర్మాలను త్యజించిన వారు ప్రత్యక్ష దైవం సూర్యుని కోపానికి గురి కాగలరు. సూర్యుడు కోపిస్తే మానవులు వ్యాధి పీడితులౌతారు. కులనాశనం సంభవిస్తుంది. కావున ఓ రాక్షస రాజా! తన క్షేమం, వంశ క్షేమం కోరిన మానవుడెట్టి పరిస్థితి లోనూ స్వధర్మాచరణం వదలకూడదు. వదలినచో భాస్కరుని కోపాగ్నికి ఆహుతి కాగలదు సుమా!”

పులస్త్యుడు

67 - ఇత్యేవ ముక్తో మునిభిః సుకేశీ ప్రణమ్యతాన్ బ్రహ్మనిధీన్ మహర్షీన్

 జగామ చోపత్యపురం స్వకీయం ముహుర్ముహు ద్దర్మ మవేక్షమాణః 

పులస్త్యుడు

నారదా! ఆవిధంగా ఋషులచే ప్రబోధింప బడి ఆసుకేశి వారాలకు ప్రణమిల్లి, వారల యుపదేశములను మాటి మాటికి నెమరు వేసుకొంటూ ఆకాశ మార్గాన తన నగరికి తిరిగి వెళ్ళాడు.

అధ్యాయము 15 complete