అధ్యాయము 6

లోమహర్షణ

1 - నారాయణస్తుభగవాం చ్చ్రుత్త్వైవం పరమంస్తవమ్

 బ్రహ్మజ్ఞేనద్వి జెంద్రేణ కశ్యపేన సమీరితమ్

2 - ఉవాచవచనం సమ్యక్ తుష్టః పుష్టపదాక్షరమ్

 శ్రీమాన్ప్రీతమనా దేవో యద్వదేత్ ప్రభురీశ్వరః

3 - వరంవృణుధ్వం భద్రంవో వరదో_సమిసురోత్తమాః

 ప్రీతో_సినః సురశ్రేష్టః సర్వేషామేవ నిశ్చయః

4 - వాసవస్యానుజోభ్రాతా జ్ఞాతినాం నందివర్ధనః

 ఆదిత్యాఆపిచశ్రీమాన్ భగవానస్తు వైసుతః

5 - అదితిర్దేవ మాతాచ ఏతమే వార్థ ముత్తమమ్

 పుత్రార్థంవరదంప్రాహ భగవంతం వరార్థినీ

6 - నిః శ్రేయసార్థం సర్వేషాం దైవతానాంమహేశ్వరః

 త్రాతాభర్తాచదాతాచ శరణం భవ నః సదా

7 - తతస్తానబ్రవీద్విష్ణుర్దేవాన్ కశ్యపమేవచ

 సర్వేషామేవ యుష్మాకం యే భవిష్యంతి శత్రవః

 ముహూర్తమపి తే సర్వేనస్థాస్యంతి మమాగ్రతః  ॥

8 – హత్వా సురగణాన్ సర్వాన్ యజ్ఞ భాగాగ్రభోజినః

 హవ్యాదాంశ్చసురాన్ సర్వాన్ కవ్యాదాంశ్చ పితౄనపి

9 - కరిశ్యేవిబుధశ్రేష్ఠాః పారామేష్ఠ్యేన కర్మణా

 యథాయాతేన మార్గేణ నివర్తధ్వం సురోత్తమాః  ॥

లోమహర్షణ

బ్రాహ్మణ శ్రేష్టుడు బ్రహ్మజ్ఞుడునైన కశ్యపుడొనర్చిన ఆ ఉత్తమ స్తోత్రాన్ని విని సంతోషించి నారాయణుడు స్పష్టంగా చక్కని మాటలలో, ఓ దేవతలారా ! మీకు కావలసిన వరమడుగుడు; యిచ్చేదను. మీకు కల్యాణమగుగాక యనెను. అప్పుడు కశ్యపుడిట్లనెను. ఓ దేవశ్రేష్టా ! మీరు మాయందు ప్రసన్నులగుట నిశ్చయము. దయచేసి యింద్రునకు తమ్ముడవుగా, అదితికి పుత్రుడవుగా, జ్ఞాతిలోకాని కానందవర్ధనుడవుగా జన్మించుము. దేవమాత అదితి కూడా నాడే సంకల్పంతో ణా వరదేశ్వరుని తన గర్భమున జన్మించుమని యాచించినది. దేవతలందరు ణా మహేశ్వరుని తమకు అధినాతుడుగా రక్షకుడుగా నుండవలసినదని శరణువేడిరి. అంతట ణా విష్ణుడు కశ్యపునితో సమస్త దేవతలలో , మీ శత్రువులనందరను ముహూర్తమాత్రాన సలహరించి యజ్ఞభాగభక్కులైన దేవతలకుహవ్యాలు, పితృదేవతలకు కావ్యాలు మరల యిప్పించగలను. మీరు మీమీ ప్రదేశాలకు మరలి వెళ్ళుడనెను.

లోమహర్షణ

10 - ఏవముక్తేతు దేవేన విష్ణునా ప్రభవిష్ణునా

 తతఃప్రహృష్టమనసః పూజయంతిస్మతం ప్రభుమ్

11 - విశ్వేదేవామహాత్మానః కశ్యపో_దితిరేవచ

 నమస్కృత్య నురేశాయ తస్మైదేవాయరంహసా

12 - ప్రయాతాఃప్రాగ్దిశం సర్వే విపులంకశ్యపాశ్రమమ్

 తేకశ్యపాశ్రమం గత్వా కురుక్షేత్రవనం మహత్

13 - ప్రసాద్యహదితం తత్రతపసే తాం న్యయోజయన్

 సాచచారతపోఘోరం వర్షాణామయుతం తదా

14 - తస్యానామ్నావనం దివ్యం సర్వకామప్రదం శుభమ్

 ఆరాధనాయకృష్ణస్య వాగ్జితా వాయుభోజనా

15 - దైత్యైర్నిరాకృతాన్ దృష్ట్వాతనయాన్ ఋషిసత్తమాః

 వృథాపుత్రా_హమితిసా నిర్వేదాత్ ప్రణయాద్ధరిమ్

16 - శరణ్యంశరణంవిష్ణుం ప్రణతా భక్తవత్సలమ్

 దేవదైత్యమయం చాదిమధ్యమాంతస్వరూపిణమ్

లోమహర్షణ

ప్రభవిష్ణుడైన విష్ణుదేవుని మాటవిని సంతుష్టాంత రంగులై అదితి కశ్యపులతో కూడిన విశ్వీదేవతలందరు నా దేవదేవునికి పూజా నమస్కారాదు లర్పించి త్వరగా తూర్పు దిశగా పయనించి విశాలమైన కశ్యపాశ్రమానికి వెళ్ళారు. కురుక్షేత్రవనమైన ఆ ఆశ్రమానికి వెళ్లి దేవమాత అదితిని ప్రసన్నురాలిని గావించుకొని ఆమెను తపో దీక్షలో నిలిపిరి. ఆ సాధ్వియు పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. సర్వకోర్కెలు తీర్చే ఆ వనం ఆమెపేర ప్రసిద్ధి చెందింది. వాక్ నియమంతో వాయు భోజనం చేస్తూ తపించే ఆమె, రాక్షసులచే నోటువడిన తన పుత్రుల తలంచుకొని తన మాతృత్వము వ్యర్థమైనదని నిర్వేదం పొందినది. ఆవేదనకు శ్రీహరి మీద ప్రేమతోడుకాగా పరమార్థబోధకాలయిన శ్రేషవచనాలతో ఆమె సర్వలోక శరణ్యుడు, భక్త వత్సలుడు, దేవదైత్యమయుడు నాదిమధ్యాంతస్వరూపి అయిన మహావిష్ణువు నిట్లు స్తుతించెను.

అదితి

17 - నమః కృత్యార్తినాశాయ నమః పుష్కరమాలినే

 నమః పరమకల్యాణ కళ్యాణాయాదివేధసే

18 - నమః పంకజనేత్రాయ నమః పంకజనాభయే

 నమః పంకజసంభూతిసంభావాయాత్మయోనయే

19 - శ్రియః కాంతాయదాంతాయ దాంతదృశ్యాయచక్రిణే

 నమః పద్మాసిహస్తాయ నమః కనక్రతాసే

20 - తథాత్మజ్ఞానయజ్ఞాయ యోగిచింత్యాయ యోగినే:

 నిర్గుణాయవిశేషాయ హరయే బ్రహ్మరూపిణే

21 - జగచ్చతిష్ఠతే యత్ర జగతో యోనదృశ్యతే

 నమః స్తూలాతిసూక్ష్మాయ తస్మైదేవాయ శార్ఙ్గిణే

22 - యంనపశ్యంతి పశ్యంతో జగదస్యఖిలంనరాః

 అపశ్యద్భిర్జగద్యశ్చ దృశ్యతే హృది సంస్థితః

23 - బహిర్జ్యోతిరలక్ష్యో యోలక్ష్యతే జ్యోతిషఃపరః

 యస్మిన్నేవయతశ్చైవ యస్యైతదఖిలం జగత్

24 - తస్మై సమస్తజగతామమరాయ నమోనమః

 ఆద్యః ప్రజాపతిః సో_పి పితౄణాం పరమఃపతిః

 పతిఃసురాణాం యస్తస్మైనమః కృష్ణాయవేధసే

25 - యఃప్రవృత్తైర్నివృత్తైశ్చ కర్మభిస్తు విరజ్యతే

 స్వర్గాపవర్గఫలదో నమస్తస్మై గదాభృతే  ॥

26 - యస్తుసంచింత్యమానో_పి సర్వపాపంవ్యఫోహతి

 నమస్తస్మైవిశుద్ధాయ పరస్మైహరిమేధసే

27 - యే పశ్యంత్యఖిలాధార మీశాన మజమవ్యయమ్

 నపుర్జన్మమరణం ప్రావ్నువంతి నమామితమ్

28 - యోయజ్ఞేయజ్ఞపరమై రిజ్యతే యజ్ఞసంస్థితః

 తంయజ్ఞపురుషం విష్ణుం నమామి ప్రభుమీశ్వరమ్

29 - గీయతే సర్వవేదేషు వేదవిద్భి ర్విదాంగతిః

 యస్తస్మై వేదవేద్యాయ నిత్యాయ విష్ణవేనమః

30 - యతోవిశ్వంసముద్భూతం యస్మిన్ ప్రలయమేష్యతి

 విశ్వోద్భవప్రతిష్ఠాయ నమస్తస్మై మహాత్మనే

31 - ఆబ్రహ్మస్తంబపర్యంతం వ్యాప్తం యేనచరాచరమ్

 మాయాజాలసమున్నద్ధం తముపేంద్రం నమామ్యహమ్

32 - యో_త్రతోయస్వరూపస్థో బిభర్త్యఖిలమీశ్వరః

 విశ్వం విశ్వపతిం విష్ణుం తం నమామి ప్రజాపతిమ్

33 - మూర్తంతమో_సురమయం తద్విధో వినిహంతియః

 రాత్రిజంసూర్యరూపీచ తముపేంద్రం నమామ్యహమ్

34 - యస్యాక్షిణీ చంద్రసూర్యౌ సర్వలోకశుభాశుభమ్

 పశ్యతః కర్మసతతం తముపేంద్రం నమామ్యహమ్

35 - యస్మిన్ సర్వేశ్వరసర్వం సత్యమేతన్మయోదితమ్

 నానృతం తమజం విష్ణుం నమామి ప్రభవాప్యయమ్

36 - యద్యేతత్సత్యముక్తం మే భూయాశ్చాతో జనార్దనః

 సత్యేనతేనసకలాః పూర్యంతాం మీమనోరథాః

అదితి

అదితిస్తోత్రం. కృత్యాభిచారాదిపీడితుల ఆర్తి పోగొట్టు వానికి నమస్కారము. పద్మమాలాధరునకు పరమ కళ్యాణ రూపికి మొదలి బ్రహ్మకు నమస్సులు. పద్మనేత్రునకు పద్మనాభునకు పంకజ సంభవ జనకునకు ఆత్మయోనికి లక్ష్మీపతికి దాంతునకు దృశ్యజగత్తునియామకునకు, చక్రధరునకు, పద్మపాణికి, ఖడ్గదారికి హిరణ్యరేతునకు నమస్సులు. ఆత్మజ్ఞానయజ్ఞ రూపికి, యోగిధ్యేయునకు మహాయోగికి, నిర్గుణునకు విశేషునకు బ్రహ్మరూపియగు శ్రీహరికి ప్రణామములు. జగత్తులో ఉంటూనే దాని కగోచరుడగు వానికి స్థూలునకు అతి సూక్ష్మునకు శార్జ్గుపాణికి నమస్కారము. ప్రపంచాన్నంతా చూడగలిగిన చూపుగలవారలెవని చూడజాలరో జగద్ద్రుష్టి వదలినవారవనిని తమహృదయంలోనే చూడగలరో అట్టివానికి నమస్కారము. బయటి వెలుగులో ఎవడుకనిపించడో ఎవడు సమస్త వెలుగులకు వెలుపలి తత్వమో ఈ విశ్వమంతా ఎవనిలో ఎవని నుంచి ఎవని రూపాన విస్తరించి ఉన్నదో అట్టి సర్వజగన్మయునకు మరల మరల నమస్సులు. సర్వానికి ఆద్యుడు, ప్రజాపతి, పితరులకు పరమాధిపతి, దేవనాథుడనగు శ్రీకృష్ణునకు నమస్కరించుచున్నాను! ప్రవృత్తి నివృత్త్యాత్మకములగు కర్మలెవరినంటజాలవో, స్వర్గాపవర్గ ఫలములొసంగ గల ఆగదాధరునకు ప్రణామములు. స్మరణమాత్రాన్నే సమస్త పాపములు పోగొట్ట జాలిన శుద్ధస్వరూపియగు శ్రీహరి మేధునకు నమస్సులు. అఖిలాదారుడు ఈశ్వరుడు అజుడు అవ్యయుడైన ఏ ప్రభు దర్శనం చేయువారలు జన్మమరణాల నుండి ముక్తులగుదురో అట్టి మహానీయునకు ప్రణామములు. యజ్ఞపరములగు జ్ఞానులచే యజ్ఞ రూపాన యజ్ఞసంస్థితుడై ఆరాధింపబడు యజ్ఞపురుషుడైన విష్ణువునకు పరమేశ్వరునకు వందనములు. వేదవిదులగు జ్ఞానులచేతను కీర్తింపబడు శాశ్వతుడగు వేదవేద్యునకు విష్ణువుకు నమస్కారములు. ఎవనినుండి విశ్వం జనించునో ఎవని యందుండి ఎవనిలో లయమగునో అట్టి విశ్వోద్భవ ప్రతిష్ఠుడగు మహాత్మునకు ప్రణామము. బ్రహ్మ మొదలు గడ్డి పోచవరకు గల ఈ చరాచర ప్రపంచమంతా ఎవనిచే పరివేష్టితమైనదో అట్టి మాయా శక్తి సమన్వితుడైన ఉపేంద్రునకు నమస్కారము. ఎవడు తోయస్వరూపస్థితుడై (నారాయణుడై ) ఈ అఖిల విశ్వాన్ని ధరించి రక్షించుచున్నాడో అట్టి విశ్వరూపుడు విశ్వపతి అయిన విష్ణుదేవునకు నమస్కారము. అసుర తత్వ రూపాన దైత్యులలోని తమస్సును, నైశాంధకారాన్ని పోగొట్టు సూర్యునివలె, నశింపజేయునుపేంద్రునకు నమస్కారము. జీవుల శుభాశుభ కర్మలు, రాత్రింబవళ్ళు సూర్య చంద్రులనే నేత్రాలతో చూచుచుండు ఉపేంద్రునకు నమస్కారము. ఆ సర్వేశ్వరునియందే ఈ సకలం యిమిడియున్నదని చెప్పినది సత్యము. అది అనృతం కాదు. అలాంటి జన్మరహితునకు అవ్యయుడగు ప్రభువునకు శ్రీమహావిష్ణువుకు మాటిమాటికి నమస్కరించెదను.ప్రభూ, జనార్ధనా! నేను చెప్పినదంతయు సత్యమగుచో, ఆ సత్య ప్రభావం వల్ల ణా మనోరథాలన్నీ సఫలమగు గాక !

అధ్యాయము 6 complete