వామన మహా పురాణము
అధ్యాయము 25
పులస్త్య
1 - మేనాయాః స్తికన్యకాస్రో జాతారూపగుణాన్వితాః ।
సునాభఇతిచఖ్యాత శ్చతుర్థస్తనయోఽభవత్ ॥
2 - రక్తాంగీరక్తనేత్రాచ రక్తాంబర విభూషితా ।
రాగిణీనామసంజాతా జ్యేష్ఠామేనాసుతామునే ॥
3 - శుభాంగీపద్మపత్రాక్షీ నీలకుంచితమూర్దజా।
శ్వేతమాల్యాంబరధరా కుటిలానామచాపరా ॥
4 - నీలంజనచయప్రభ్యా నీలేందీవరలోచనా ।
రూపేణానుపమాకాలీ జఘన్యామేనకాసుతా ॥
5 - జాతాస్తాఃకన్యకౌస్తిస్రః షడబ్దాత్‌పరతోమునే ।
కర్తుంతపఃప్రయాతాస్తా దేవాస్తాదదృశుఃశుభాః ॥
6 - తతోదివాకరైఃసర్వైర్వసుభిశ్చతపస్వినీ ।
కుటిలాబ్రహ్మలోకంతు నీతాశశికరప్రభా ॥
7 - అథోచుర్దేవతాస్సర్వాః కింత్వియంజనయిష్యతి ।
పుత్రంమహిషహంతారం బ్రహ్మన్‌వ్యాఖ్యాతుమర్హసి ॥
8 - తతోఽబ్రవీత్‌సురపతిర్నేయంశక్తాతపస్వినీ ।
శార్వంధారయితుంతేజో వరాకీముచ్యతాంత్వియమ్ ॥
9 - తదస్తుకుటిలాక్రుద్ధా బ్రహ్మాణంప్రాహనాతద ।
తథాయతిష్యేభగవన్ యథాశార్వంసుదుర్ధరమ్ ॥
10 - ధారయిష్యామ్యహంతేజ స్తథైవశృణునత్తమ ।
తపసాహంసుతప్తేన సమారాధ్యజనార్దనమ్ ॥
11 - యథాహరస్యమూర్జానం సమాయిష్యేపితామహ ।
తతాక్షేవకరిష్యామి సత్యంసత్యంమయోదితమ్ ॥
12 - తతఃపితామహఃక్రుద్ధః కుటిలాంప్రాహదారుణామ్ ।
భగవానాదికృద్‌బ్రహ్మా సర్వేశోఽపిమహామునే ॥
పులస్త్యుడు
ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రునొకనిని కనినది. వారలలో ఎర్రని కాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రనివస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీ! తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాల బోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేనిఅందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల తర్వాత ఆ ముగ్గురు బాలికలు తపస్సు చేయసాగారు. ఆ సుందరాంగులను దేవతలు చూచారు. చంద్రకిరణాల శోభతో వెలిగే కుటిలయను కన్యను ఆదిత్య వసువులు దేవలోకానికి గొనిపోయి బ్రహ్మకు చూపించి ప్రభూ! ఈమె మహిషాసురుని చంవగల పుత్రునికనగలదా చెప్పుడన్నారు. అందుకు బ్రహ్మ ఈ తపస్విని శివ వీర్యాన్ని ధరించజాలదు. కనుక ఈ చిన్నదానిని వదలిపెట్టండి అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు కోపించిన ఆ కుటిల ఓ నారదా! బ్రహ్మతో - భగవన్! నేను జనార్ధనుని గూర్చి తీవ్రమైన తపస్సుచేసి శివవీర్యం ధరించగల శక్తి సంపాదించి శివుని పాదాక్రాంతుని చేసుకోగలను. అందుకు తీవంగా పయత్నించగలననెను. ఆడి విని కోపించిన విరించి, ధూర్తయైనకుటిలతో ఇలా అన్నాడు.
బ్రహ్మ
13 - యస్మాన్మద్వచనంపాపే నక్షాంతంకుటిలేత్వయా ।
తస్మాన్మచ్ఛాపనిర్దగ్ధా సర్వాఆపోభవిష్యసి ॥
14 - ఇత్యేవంబ్రహ్మణాశప్తా హిమవద్దుహితామునే ।
ఆపోమయీబ్రహ్మలోకం ప్లావయామానవేగినీ ॥
15 - తాముద్‌వృత్తజలాందృష్ట్వా ప్రబబంధపితామహః ।
ఋక్సామాథర్వయజుభి ర్వాజ్ మయైర్బంధనైర్ధృఢమ్ ॥
16 - సాబద్ధాసంస్థితాబ్రహ్మన్ తత్రైవగిరికన్యకా ।
ఆపోమయీప్లావయంతీబ్రహ్మణోవిమలాజటాః ॥
17 - యాసారాగపతీనామ సాపినీతాసు రైర్ధివమ్ ।
బ్రహ్మణేతాంనివేద్యైవం తామప్యాహప్రజాపతిః ॥
18 - సాఽపిక్రుద్దాఽబ్రవీన్నూనం తథా తప్స్యే మహ త్తపః ।
యథామన్నామసంయుక్తో మహిషఘ్నా భవిష్యతి ॥
19 - తామప్యథాశపద్‌బ్రహ్మా సంధ్యాపాపే భవిష్యసి ।
యామద్వాక్యమలభ్యాంవై సురైర్లంఘయ సేబలాత్ ॥
20 - సాపిజాతామునిశ్రేష్ఠ సంధ్యారాగవతీతతః ।
ప్రతీచ్ఛత్‌కృత్తికాయోగం శైలేయా విగ్రహంధృడమ్ ॥
21 - తతోగతేకన్యకేద్వే జ్ఞాత్వామేనాతపస్వినీ ।
తపసోవారయామాస ఉమేత్యేవాబ్రవీచ్చసా ॥
22 - తదేవమాతానామాస్యా శ్చక్రేపితృసుతాశుభా ।
ఉమేత్యేవహికన్యాయాః సాజగామ తపోవనమ్ ॥
23 - తతఃసామనసాదేవం శూలపాణింవృషధ్వజమ్ ।
రుద్రంచేతసిసంధాయ తపస్తే పే పేసుదుష్కరమ్ ॥
24 - తతోబ్రహ్మాఽబ్రవీద్దేవాన్ గచ్ఛధ్వంహిమవత్సుతామ్ ।
ఇహానయధ్వంతాంకాళీం తపస్యంతీంహిమాలయే ॥
25 - తతోదేవాఃసమాజగ్ము ర్దదృశుఃశైలనందినీమ్ ।
తేజసావిజితా స్తస్యా నశేకురుపనర్పితుమ్ ॥
26 - ఇంద్రోఽమరగణైస్సార్ధం నిర్ధూతస్తేజసాతయా ।
బ్రహ్మణోఽధికతేజోఽస్యా వినివేద్య ప్రతిష్ఠితః ॥
27 - తతోబ్రహ్మాఽబ్ర వీద్‌సాహిధ్రువంశంకరవల్లభా ।
యూయంయ త్తేజసానూనం విక్షిప్తాస్తుహతప్రభాః ॥
28 - తస్మాద్భజధ్వంస్వంస్వంహి స్థానంభోవిగతజ్వరాః ।
సతారకంహిమహిషం విదధ్వం నిహతంరణే ॥
29 - ఇత్యేవముక్తాదేవేన బ్రహ్మణాసేంద్రకాఃసురాః ।
జగ్ముఃస్వాన్యేవధిష్ణ్యాని సద్యోవై విగతజ్వరాః ॥
బ్రహ్మ
పాపిష్ఠవైన కుటిలా! నాహిత వచనాన్ని ధిక్కరించినందుకు నిన్ను నా శాపాగ్నిలో దహించి వేస్తాను. నీవు ఈ క్షణమే నీరుగా మారిపోతావు. అలా బ్రహ్మ శాపానికి గురియై ఆ కుటిల నీరుగామారి బ్రహ్మలోకాన్ని ముంచివేయబోగా నా పితామహుడు ఋగ్యజుస్సామాథర్వణ వేదాలతో నామెను గట్టిగా బంధించాడు. ఆమెయు అక్కడే బ్రహ్మదేవుని జటామండలాన్ని తడుపుతూ ఉండిపోయింది. అంతట రాగిణియను బాలికను గూడ దేవతలు బ్రహ్మకడకు గొనిపోగా ఆయన ఆ బాలికగూడ శివవీర్య ధారణ కనర్హురాలన్నాడు. ఆమె కూడ బ్రహ్మతో వివాదపడి ఆయన శాపానికి గురియై సంధ్యగా నాటినుండీ పిలువబడుతోంది. పర్వతంమీద కృత్రికగా గుర్తింపబడుతూంది. అలా తన కుమారై లిర్వురు చేతినుండి జారిపోవుటచూచిన మేనాదేవి మూడవ కుమార్తె కాళిని చూచి, "ఉ - మా" అమ్మా నీవు తపస్సు చేయవద్దని వారించింది. ఆనాటి నుండీ ఆ తల్లి ఆ బిడ్డను "ఉమా" అనే సంబోధించసాగింది. అంతటనా "ఉమ" అడవికి వెళ్ళిపోయింది. అక్కడ తన మనస్సులో శూలపాణి, వృషభ కేతనుడు మహాదేవుడైన రుద్రుని సంధానించుకొని ఘోరమైన తపోదీక్షలో మునిగిపోయెను. అంతట బ్రహ్మమరల హిమగిరి పుత్రికయైన ఆ కాళినిగొని తెమ్మని దేవతలను పంపగా ఆమె తపోఽగ్నికి భయపడి ఆమె దగ్గరకుగూడ వెళ్ళలేక పోయారు. ఆమె ముందర యింద్రుడు కూడ తన తేజస్సు గోల్పోయి ఆమె తేజస్సు బ్రహ్మ తేజాన్నిగూడ మించినదని వక్కాణించాడు. అది విని బ్రహ్మ మిమ్ములనందరను తన తేజస్సుతో నిర్జించిన ఆ బాలికయే శంకరుని అర్ధాంగి. ఇది తథ్యం. కనుక యిక మీరు మీ చింతలుమాని మీమీ నెలవులకు పొండ"ని ఆదేశించాడు. బ్రహ్మ వచనాలకు సంతసించి యింద్రాదిసురలు భయాందోళనలు వదలి తమ తమ యిండ్లకు వెళ్ళి పోయారు.
30 - ఉమామపితపస్యంతీం హిమవాన్ పర్వతేశ్వరః ।
నివర్త్యతపస స్తస్మాత్ సదారోహ్యనయత్ గృహాన్ ॥
31 - దేవోఽప్యాశ్రిత్యతద్రౌద్రం వ్రతంనామ్నానిరాశ్రయమ్ ।
విచచారమహాశైలాన్ మేరుప్రాగ్యాన్ మహామతిః ॥
32 - సకదాచిన్మహాశైలం హిమవంతంసమాగతః ।
తేనార్చితఃశ్రద్ధయాఽసౌతాంరాత్రిమవసద్ధరః ॥
33 - ద్వితీయేఽహ్నిగిరీశేన మహాదేవోనిమంత్రితః ।
ఇహైవతిష్ఠస్యవిభో ।
తపఃసాధనకారణాత్ ॥
34 - ఇత్యేవముక్తోగిరిణా హరశ్చక్రేమతించతామ్ ।
తస్థావాశ్రమమాశ్రిత్య త్యక్త్వావాసంనిరాశ్రయమ్ ॥
35 - వసతోఽప్యాశ్రమేతస్య దేవదేవస్యశూలినః ।
తందేశ మగమత్ కాళీ గిరిరాజసుతాశుభా ॥
36 - తామాగతాంహరోదృష్ట్వా భూయోజాతాంప్రియాంసతీమ్ ।
స్వాగతేనాభిసంపూజ్య త స్థౌయోగరతో హరః ॥
37 - సదాభ్యేత్యవరారోహాకృతాంజలిపరిగ్రహా ।
వవందేచరణౌశైవౌ సఖీభిఃసహభామినీ ॥
38 - తత స్తుసుచిరాచ్ఛర్వః సమీక్ష్యగిరికన్యకామ్ ।
నయుక్తంచైవముక్త్వాఽథ సగణోఽoతర్దధేతతః ॥
39 - సాఽపిశర్వవచోరౌద్రం శ్రుత్వా జ్ఞానసమన్వితా ।
అంతర్ధుఃఖేనదహ్యంతీ పితరంప్రాహపార్వతీ ॥
40 - తాతః యాస్యేమహారణ్యే తప్తుం ఘోరంమహత్తపః ।
ఆరాధనాయదేవస్య శంకరస్య పినాకినః ॥
41 - తథే త్యుక్తంవచఃపిత్రా పాదేతస్యైవ విస్తృతే ।
లలితాఖ్యాతపస్తే పే హరారాధనకామ్యయా ॥
42 - తస్యాఃసఖ్యస్తదాదేవ్యాః పరిచర్యాంతుకుర్వతే ।
సమిత్కుశఫలంచాపిమూలాహరణమాదితః ॥
43 - వినోదనార్థంపార్వత్యా మృణ్మయఃశూలధృగ్‌హరః ।
కృతస్తుతేజసాయుక్తో భద్రమస్త్వితిసాఽబ్రవీత్ ॥
44 - పూజాంకరోతితస్యైవ తంపశ్యతిముహుర్ముహుః ।
తతోఽస్యాస్తుష్టిమగమ చ్ఛ్రద్ధయాత్రిపురాంతకృత్ ॥
45 - వటురూపంసమాధాయ ఆషాఢీముంజమేఖలీ ।
యజ్ఞోపవీతీఛత్రీచ మృగాజినధర స్తథా ॥
46 - కమండలువ్యగ్రకరో భస్మారుణితవిగ్రహః ।
ప్రత్యాశ్రమంపర్యటన్ స తంకాల్యాశ్రమమాగతః ॥
47 - తముత్థాయతదాకాళీ సఖీభిఃసహనారద ।
పూజయిత్వాయథాన్యాయం పర్యపృచ్ఛదిదంతతః ॥
పులస్త్య
68 - ఇత్యేవముక్తావరదా సముత్థాతుమథైచ్చత ।
తతోఽత్యజద్భిక్షురూపం స్వరూపస్థోఽభవచ్ఛివః ॥
69 - భూత్వోవాచప్రియేగచ్ఛ స్వమేవభవనంపితుః ।
తవార్థాయప్రహేష్యామి మహర్షీన్‌హిమవద్గృహే ॥
70 - యచ్చేహరుద్రమీహంత్యా మృణ్మయశ్చేశ్వరః కృతః ।
అసౌభద్రేశ్వరేత్యేవంఖ్యాతోలోకేభవిష్యతి ॥
71 - దేవదానవగంధర్వా యక్షాఃకింపురుషోరగాః ।
పూజయిష్యంతిసతతం మానవాశ్చశుభేప్సవః ॥
72 - ఇత్యేవముక్తాదేవేన గిరిరాజసుతామునే ।
జగామాంబరమావిశ్యస్వమేవ భవనంపితుః ॥
73 - శంకరోఽపిమహాతేజా విసృజ్యగిరికన్యకామ్ ।
పృథూదకంజగామాథ స్నానం చక్రేవిధానతః ॥
74 - తతస్తుదేవప్రవరోమహేశ్వరః పృథూదకేస్నానమపాత్తకల్మషః ।
కృత్వాసనందిఃసగణఃసవాహనోమహాగిరింమందరమాజగామ ॥
75 - ఆయాతిత్రిపురాంతకే సహగణై ర్బ్రహ్మర్షిభిః సప్తభి ।
రారోహత్సులకో బభౌగిరివరః సంహృష్టచిత్తః క్షణాత్ ।
చక్రేదివ్యఫలై ర్జలేన శుచినా మూలైశ్చ కందాదిభిః ।
పూజాం సర్వగణేశ్వరైః సహ విభో రద్రిస్త్రినేత్రస్యతు ॥
76 – Missing content
భిక్షువు
ఓ పార్వతీ! నీకీ సలహా ఎవడిచ్చాడని అడుగుతున్నాను. చిగురుటాకులను వెక్కిరించే నీ మెత్తటి చేతులెక్కడ? వీటితో ఆ పాములచేతివాడి కరగ్రహణం ఎలా చేస్తావు? నీవో చీనిచీనాంబరాలు ధరిస్తావు. అతడో పులితోలు కప్పుకనే రుద్రుడు (భయంకరుడు). నీవు చందన లేపనంచేసుకుంటే అతడు బూడిద పూసుకుంటాడు. ఈ సంబంధం నాకేమాత్రం నచ్చలేదు!
పులస్త్యుడు
నారదా! అలా మాటాడుతున్న భిక్షువును వారిస్తూ పార్వతి "అలా అనగూడదు. హరుడు, ఓ భిక్షూ! సర్వ గుణాల్లో సర్వాధికుడు! ఆ ప్రభుడు మంగళరూపి కానీ భయంకరాకారుడు కానీ, ధనవంతుడు గానీ,దరిద్రుడు కానీ, సర్వాలంకారుడు కానీ, దిగంబరుడు కానీ ఆయనే నా భర్తకాగలడు! ఓ శశి ప్రభా! ఈతని పెదవులు కదలుచున్నవి. ఇంకా ఏమోవదరబోతున్నాడీతనిని ఆపండి. ఇతరులను నిందించే వానికన్నా ఆనిందనువినే వారలు ఎక్కువ పాపంమూటగట్టుకుంటారు" అని తన నిశ్చయం వెల్లడిచేసినది. పులస్తుడు ఓ నారదా! అలాపలికి అచటనుండి లేచిపోవనుద్యమించిన ఆ వరదాయిని ఎదుట శివుడు తననిజరూపంతో నిలచి యిలా అన్నాడు. "ప్రియురాలా! సుఖంగా యింటికి వెళ్ళిపో. నేను త్వరలోనే నిన్నుపొందుటకై మహర్షులను నీ తండ్రి యింటికి పంపుతాను. నీవుపూజించిన ఈ మృణ్మయ శంకర ప్రతిమ నేటి నుండీ భద్రేశ్వరుడుగా లోకంలో ప్రసిద్ధమౌతుంది. దీనిని దేవదానవ గంధర్వ యక్ష కింపురుష నాగ మనుష్యాదులు పూజించి శుభాలు పొందుతారు." హరుని మాటల కలరి ఆ గిరికన్య వెంటనే ఆకాశమార్గానా తన నెలవుకు వెళ్ళి పోయినది. మహాతేజస్వి అయిన శంకరుడు హిమవత్పుత్రిని వదలిపృథూదక క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. అలా పృథూదక స్నానంతో పవిత్రుడై నందీశ్వరుడు మొదలగు గణాలతో కూడికొని మందర మహాశైలానికి తరలివెళ్ళాడు. అనంతరం ప్రమథగణాలు సప్తర్షులతో కలిసి తనయింటికే తెంచిన ఆ త్రిపుర సంహరునిచూచి హర్షసంభ్రమాశ్చర్యాలతో పులకించి ఆ నగాధిరాజు, ఆ దేవునికి స్వాగతంపలికి, కందమూల ఫలాలు దివ్యజలాలు సుగంధిత కుసుమాదులతో వారలనందరను ఘనంగా పూజించాడు.
అధ్యాయము 25 Complete
Summary of chapter 25 of the Vāmana Mahā Purana is as follows:
Distressed by the plight of her heavenly children who wander stateless and deprived of their rightful offerings, Mother Aditi, the divine mother of the devas, seeks counsel from her revered husband, Maharshi Kaśyapa. Guided by his spiritual wisdom, Aditi observes the rigorous Payovrata vow, consuming only milk for twelve days while meditating with complete devotion on Bhagavān Vishṇu. Pleased by her unwavering penance, Maharshi Kaśyapa and the devas journey to the shore of Kshīrasāgara, the ocean of milk, to invoke the Supreme Being through profound Vedic hymns.