సరో మహాత్మ్యం - అధ్యాయము 1

దేవతలు

1 - సరస్వతీదృషద్వత్యో రంతరే కురుజాంగలే

 మునిప్రవరమాసీనం పురాణం లోమహర్షణమ్

 అపృచ్చంత ద్విజవరాః ప్రభావం సరసస్తదా

2 - ప్రమాణం సరసో బ్రూహితీర్థానాంచ విశేషతః

 దేవతానాంచ మాహాత్మ్యముత్పత్తిం వామనస్యచ

3 - ఏతచ్చ్రుత్వా వచస్తేషాం రోమహర్షసమన్వితః

 ప్రణిపత్యపురాణర్షి రిదంవచన మబ్రవీత్

దేవతలు

కురుజాంగల క్షేత్రంలో సరస్వతీ దృషద్వతీ వదులమధ్య ఆసీనుడైన రోమహర్షణ మునిని బ్రాహ్మణులా పవిత్ర సరోవర ప్రభావం తెలుపవలసినదిగా అర్థించారు. మహర్షే! ఆ సరోవర ప్రమాణం, అందలి తీర్థాలు, వాటి ప్రమాణం, అందలి దేవతల వివారంతో బాటు వామనుని జనన వృత్తాంతం కూడ తెలియజేయనగును. బ్రాహ్మణుల మాట విని ఆనందంతో దేహం గగుర్పాటు చెందిన రోమహర్షణుడు ప్రణమిల్లి యిట్లనియెను.

లోమహర్షణ

4 - బ్రహ్మాణమగ్ర్యం కమలాసనస్థం విష్ణుంతథాలక్ష్మి సమన్వితంచ

 రుద్రంచదేవంప్రణిపత్య మూర్ధ్నాతీర్థం మహద్బ్రహ్మసరఃప్రవక్ష్యే

5 - రంతుకాదౌజసం యావత్పావనాచ్చ చతుర్ముఖమ్

 సరఃసన్నిహితం ప్రోక్తం బ్రహ్మణాపూర్వమేవతు

6 - కలిద్వాపరయోర్మధ్యేవ్యాసేనచమహాత్మనా

 సరః ప్రమాణంయత్ ప్రోక్తం తచ్చృణుద్వం ద్విజోత్తమాః  ॥

7 - విశ్వేశ్వరాదస్థిపురం తథాకన్యా జరద్గవీ

 యావదోఘవతీ ప్రోక్తా తావత్సన్నిహితం సరః

8 - మయాశ్రుతం ప్రమాణం యత్పఠ్యమానం తు వామనే

 తచ్ఛృణుధ్వం ద్విజశ్రేష్టాః పుణ్యం వృద్ధికరంమహత్

9 - విశ్వేశ్వరాద్ దేవవరా నృపావనాత్ సరస్వతీ

 సరఃసంనిహితం జ్ఞేయం సమంతా దర్ధయోజనమ్

10 - ఎతదాశ్రిత్యదేవాశ్చ ఋషయశ్చ సమాగతాః

 సేవంతేముక్తికామార్థం స్వర్గార్థే చాపరేస్థితాః

11 - బ్రహ్మణాసేవిత మిదం నృష్టికామేన యోగినా

 విష్ణునాస్థితికామేన హరిరూపేణ సేవితమ్

12 - రుద్రేణచసరోమధ్యం ప్రవిష్టేన మహాత్మనా

 సేవ్యంతీర్థంమహాతేజాః స్థాణుత్వం ప్రాప్తవాన్ హరః

13 - అద్యైషాబ్రహ్మణోవేది స్తతోరామహ్రదః స్మృతః

 కురుణాచయతః కృష్టంకురుక్షేత్రం తతః స్మృతమ్

14 - తరంతుకారంతుకయోర్యదంతరం యదంతరం రామహ్రదచ్చతుర్ముఖమ్

 ఏతత్కురుక్షేత్రశమంతపంచకం పితామహస్యోత్తరవేది రుచ్యతే

లోమహర్షణ

కమలాసీనుడైన బ్రహ్మకు లక్ష్మీసహితుడగు నారాయణునకు రుద్రదేవునకు నమస్కరించి బ్రహ్మసరోవర మహిమను చెప్పుచున్నాను. బ్రహ్మ పూర్వం, రంతుకం నుంచి ఔజసం వరకు పావనం నుంచి చతుర్ముఖ పర్యంతం వ్యాపించి సరస్సును సంనిహిత సరోవరమని చెప్పియున్నారు. ద్వాపరకలియుగాల మధ్య కాలంలో మహాత్ముడైన వ్యాస భగవానుడు సరోవర ప్రమాణం చెప్పియున్నాడు. అది వినండి. విశ్వేశ్వరం నుంచి ఆస్థిపురం వరకు జరద్గవికన్యనుండి ఓఘపతి వరకు సన్నిహిత సరస్సు వ్యాపించి ఉన్నది. నేను వామనపురాణం నుండి తెలుసుకున్న ప్రమాణ వివరాలు పరమ పుణ్యప్రదాలు. అవి కొద వినండి. విశ్వేశ్వరం నుండి దేవవరం, నరపావనం నుండి సరస్వతీ, వీనికి మధ్య విస్తరించిన అర్ధయోజన సరస్సే సంనిహితం. దాని నాశ్రయించుకొని దేవతలు ఋషులు తదితరులు స్వర్గమోక్షప్రాప్తికై ఆ పావన తీర్థాన్ని సేవిస్తారు. సృష్టి కార్యం సాగించుటకై యోగానిష్టుడై బ్రహ్మ దీనిని సేవించాడు. స్థితి కార్య నిర్వహణకై విష్ణువు యిచట తపించాడు. రుద్రుడీ సరోవర మధ్య భాగంలో ప్రవేశించి మహాతేజోవంతమైన స్థాణుపదాన్ని సంపాదించాడు. మొదట దానిపేరు బ్రహ్మవేది. తర్వాత రామహ్రదం. అనంతరం కురుమహారాజు దున్నినందున కురుక్షేత్రమైంది. ఆ కురుక్షేత్రం తరంతుక అరంతుక, రామహ్రద చతుర్ముఖాల మధ్య భాగాన విస్తరించి ఉంది. దానినే కురుక్షేత్ర సమంత పంచకమనీ, బ్రహ్మ ఉత్తరవేది అనీ అంటారు.