వామన మహా పురాణము
అధ్యాయము 26
మార్కండేయ
1 - స్థాణుతీర్థంప్రభావంతు శ్రోతుమిచ్ఛామ్యహంమునే ।
కేనసిద్ధిరథప్రాప్తా సర్వపాపభయాపహా ॥
మార్కండేయుడు
మహామునీ! స్థాణుతీర్థమహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారు?
సనత్కుమార
2 - శృణుసర్వమశేషేణ స్థాణుమహాత్మ్యముత్తమమ్ ।
యచ్ఛ్రత్వాసర్వపాపేభ్యో ముక్తోభవతిమానవః ॥
3 - ఏకార్ణవేజగత్మస్మిన్ నష్టేస్థావరజంగమే ।
విష్ణోర్నాభిసముద్భాతం పద్మమవ్యక్తజన్మనః ।
తస్మిన్‌బ్రహ్మాసముద్భూతః సర్వలోకపితామహః ॥
4 - తస్మాన్మరీచిరభవ న్మరీచేః కశ్యపఃసుతః ।
కశ్యపాదభవద్భాస్వాం స్తన్మాన్మసురజాయత ॥
5 - మనోస్తుక్షువతఃపుత్ర ఉత్పన్నోముఖసంభవః ।
పృథివ్యాంచతురంతాయాం రాజాసీద్‌ధర్మరక్షితా ॥
6 - తస్యపత్నీబభూవాథ భయానామభయావహా ।
మృత్యోఃసకాశాదుత్పన్నా కాలస్యదుహితాతదా
7 - తస్యాంసమభవద్‌వేనో దురాత్మావేదనిందకః ।
సదృష్ట్వా పుత్రవదనం క్రుద్ధోరాజావనంయయౌ ॥
8 - తత్రకృత్వాతపోఘోరం ధర్మేణావృత్యరోదనే ।
ప్రాప్తవాన్‌బ్రహ్మసదనంపునరావృత్తిదుర్లభమ్ ॥
9 - వేనోరాజాసమభవత్ సమస్తేక్షితిమండలే ।
సమాతామహదోషేణ తేనకాలాత్మజాత్మజః ॥
10 - ఘోషయమాసనగరే దురాత్మావేదనిందకః ।
నదాతవ్యంనయష్టవ్యం నహోతవ్యంకదాచన ॥
11 - అహమేకోఽత్రవైవంద్యః పూజ్యోఽహంభవతాంసదా ।
మయాహిపాలితాయూయం నివసద్వంయథాసుఖమ్ ॥
12 - తన్మత్తోఽన్యోనదేవోఽస్తి యుష్మాకంయఃపరాయణమ్ ।
ఏతచ్ఛ్రుత్వాతువచనం ఋషయఃసర్వఏవతే ॥
13 - పరస్పరం సమాగమ్య రాజానంవాక్య మబ్రువన్ ।
శ్రుతిఃప్రమాణంధర్మస్య తతోయజ్ఞఃప్రతిష్ఠితః ॥
14 - యజ్ఞైర్వినానోప్రీయంతే దేవాఃస్వర్గనివాసినః ।
అప్రీతానప్రయచ్ఛంతి వృష్ఠింసస్యస్యవృద్ధయే ॥ ।
తస్మాద్యజ్ఞైశ్చ దేవైశ్చ ధార్యతే సచరాచరమ్ ॥
సనత్కుమారుడు
ఓ మార్కండేయ మహర్షీ! అత్యుత్తమమైననీస్థాణుతీర్థమహిమ సాకల్యంగా వినవలసినది. దీనిని వినిన నరుడు సకలపాపవిముక్తుడౌతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతానశించిపోగా అవ్యక్తజన్ముడైన ఆ విష్ణమూర్తి బొడ్డునుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడగు బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జనించగా ఆయన కమారుడుగా కశ్యపుడు పుట్టాడు. కశ్యపునకు సూర్యడుకలగగా ఆయనకు మనువు జన్మించాడు. ఆ మనువు తుమ్మగా ఆయన ముఖం నుంచి ఉద్భవించిన పుత్రుడు చతురంత భూమండలానికంతకూ రాజైనాడు. మృత్యుముఖాన్నించి కాలుని కుమార్తెగా జనించి భయాన్ని కల్గించే "భయా" అనునామె ఆ రాజు భార్య అయినది. ఆమెకు దుష్టుడు వేదదూషకుడైనవేనుడు పుట్టాడు. ఆ దుష్టుని ముఖంచూచినంతనే కోపంతో తండ్రి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కఠోర తపస్సుచేసి ధర్మంతో భూమ్యాకాశాలను నింపి పునరావృత్తిలేని బ్రహ్మ సదనానికి వెళ్ళిపోయాడు. కాలుని దౌహిత్రుడైన వేనుడు భూమికంతా పాలకుడై తన మాతామహదోషం వల్ల వేదనిందకుడై రాజ్యంలో యిలా చాటింపచేశాడు. "నా రాజ్యంలో ఎవరూ దానాలు యజ్ఞయాగాలు చేయరాదు. ఆహుతులు వ్రేల్చరాదు. నేనొక్కడినే వందనీయుడను. నన్నుమాత్రమే అందరూ పూజించాలి. ఇలా చేసినా రాజ్యంలోని మీరంతా సుఖించగలరు. నా కంటె వేరైన దేవుడెవడూ లేడు." అతని వాక్యాలకు చింతించి ఋషులంతా కలిసివెళ్ళి యిలా హితంపలికారు. రాజా! వేదాలు ధర్మానికి మూలమైన ప్రమాణాలు. అవి యజ్ఞ కర్మను విధించినవి. యజ్ఞాలుచేయకపోతే దేవతలు సంతోషించి పైరులకు అవసరమైన వర్షాలు గురిపించరు. ఆ విధంగా ఈ సృష్టి అంతా దేవతలు యజ్ఞాలమీద ఆధారపడి యున్నది.
15 - ఏత్వచ్ఛ్రుత్వాక్రోధదృష్టి ర్వేనఃప్రాహపునఃపునః ॥
16 - నయష్టవ్యంనదాతస్య మిత్యాహక్రోధమూర్ఛితః ।
తతఃక్రోధసమావిష్టా ఋషయఃసర్వఏవతే ॥
17 - నిజఘ్నుర్మంత్రపూతైస్తే కుశైర్వజ్రసమన్వితైః ।
తతస్త్వరాజకేలోకే తమసాసంవృతేతదా ॥
18 - దస్యుభిఃపీడ్యమానాంస్తాన్ ఋషీంస్తేశరణంయయుః ।
తతస్తేఋషయస్సర్వే మమంథు స్తస్యవైకరమ్ ॥
19 - సవ్యం తస్మాత్సముత్తస్ఠౌపురుషోహ్రస్వదర్శనః ।
తతస్తేఋషయఃసర్వే నిషీదతుభవానితి ॥
20 - తస్మాన్నిషాదాఉత్పన్నా వేనకల్మషసంభవాః ।
తతస్తేఋషయస్సర్వే మమంథుర్దక్షిణంకరమ్ ॥
21 - మథ్యమానేకరేతస్మిన్ ఉత్పన్నఃపురుషో ఽపరః ।
బృహత్సాలప్రతీకాశో దివ్యలక్షణలక్షితః ॥
22 - ధనుర్బాణాంకితకర శ్చక్రధ్వజసమన్వితః ।
తముత్పన్నంతదాదృష్ట్వా సర్వేదేవాఃసవానవాః ॥
23 - అభ్యషించన్‌పృథివ్యాంతం రాజానం భూమిపాలకమ్ ।
తతఃసరంజయామాస ధర్మేణపృథివీంతదా ॥
24 - పిత్రా ఽపరంజితాతస్య తేనసాపరిపాలితా ।
తత్రరాజే తిశబ్దోఽస్య పృథివ్యారంజనాదభూత్ ॥
25 - సరాజ్యంప్రాప్తతేభ్యస్తు చింతయామాసపార్థివః ।
పితామమధర్మిష్ఠో యజ్ఞవిచ్ఛిత్తికారకః ॥
26 - కథంతస్యక్రియాకార్యా పరలోకసుఖావహా ।
ఇత్యేవంచింతయానస్య నారదోఽభ్యాజగామహ ॥
27 - తస్మైసచాసనందత్వా ప్రణిపత్యచపృష్టవాన్ ।
భగవన్‌సర్వలోకస్య జానాసిత్వంశుభాశుభమ్ ॥
28 - పితామమదురాచారో దేవబ్రాహ్మణనిందకః ।
స్వకర్మరహితోవిప్రః పరలోకమవాప్తవాన్ ॥
29 - తతోఽబ్రవీన్నారదస్తం జ్ఞాత్వాదివ్యేనచక్షుషా ।
మ్ణేచ్ఛమధ్యేసముత్పన్నం క్షయకుష్ఠసమన్వితమ్ ॥
30 - త్రచ్ఛుత్వావచనంతస్య నారదస్య మహాత్మనః ।
చింతయామాసదుఃఖార్తఃకథంకార్యంమయాభవేత్ ॥
31 - ఇత్యేవంచింతయానస్య మతిర్జాతామహాత్మనః ।
పుత్రఃసకథ్యతేలోకే యఃపితౄంస్త్రాయతేభయాత్ ॥
32 - ఏవంసంచింత్యసతదానారదంసృష్టవాన్‌మునిమ్ ।
తారణంమత్పితుస్తన్య మయాకార్యంకథంమునే ॥
ఋషుల మాటలువిని కోపంతో పిచ్చివాడై దురాత్మడగు వేనుడు యజ్ఞాలు చేయరాదు. దానాలు యివ్వకూడదు. అంటూ మాటిమాటికీ గర్జించాడు. దానితో ఆ మునులందరూ కోపించి అభిమంత్రించిన వజ్రోపమాలైన కుశలతో నా దుష్టుని ప్రహరించి సంహరించారు. అంతట రాజులేని ప్రజలంతా, దస్యులు తమను పీడించగా నానా బాధలకు లోనై ఘోషిస్తూ మహర్షులను శరణు వేడుకున్నారు. అంతట నా ఋషులా వేనుని ఎడమ చేతిని మథించగా దానినుంచి ఒక మరుగుజ్జు పుట్టాడు. వారంతట నతనితో నీవిక్కడ కూర్చోమని చెప్పారు. ఆ పొట్టినానినుండి వేనుడి పాప ఫలంగా నిషాదులు జన్మించారు. అంతట ఋషులు ఆ వేనుని కుడి చేతిని మథించారు. దానినుంచి సాలవృక్షమంత పొడవుగలిగి దివ్య లక్షణాలతో కూడిన పురుషుడుద్భవించాడు. అతని చేతులలో ధ్వజ ధనుర్బాణ శంఖ చక్రాది రేఖలున్నవి. ఆ పురుషుని చూచి ఇంద్రుడు మొదలయిన దేవతలందరు, పృథ్వీ పాలకునిగా అతనికి అభిషేకం చేశారు. అతడు ధర్మాత్ముడై భూమిని రంజింప చేశాడు. తన తండ్రి పెట్టిన బాధలకు క్షోభించిన పృథివిని అతడు తన పాలనతో రంజింపజేసి 'రాజు' అనే శబ్దాన్ని సార్థకం గావించాడు. ప్రజల నుంచి రాజ్యం స్వీకరించిన తదుపరి అతనిలా ఆలోచనలో పడ్డాడు- నా తండ్రి ఆధార్మికుడు. యజ్ఞ విఘాతకుడు. ఆయనకు ఉత్తమలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఆలా చింతావ్యాకులుడైన రాజు వద్దకు నారద మహర్షి రాగా నా రాజు తగిన ఆసనం యిచ్చి నమస్కరించి యిలా ప్రశ్నించాడు- భగవన్! తమరు సర్వజ్ఞులు. శుభాశూభ కర్మల రహస్యం తెలిసినవారు. నా తండి దుష్టుడు, లోకవేద నిందకుడు, విహితకర్మలు చేయకుండానే మరణించాడు. అంతట దివ్యదృష్టితో అంతా గ్రహించి నారదుడిలా అన్నాడు. రాజా! నీ తండ్రి క్షయ కుష్ఠు రోగాలతో మ్లే చ్ఛులలో జనించాడు. మహాత్ముడగు నారదుని మాటలు విని ఆ రాజు చాలా దుఃఖించి తాను ఏమి చేయవలెనా అని ఆలోచనలో దిగాడు. పుత్రుడనగా పితరులను భయాలనుంచి రక్షించువాడే నన్న భావం ఆయనకు తోచింది. అంతట మరల నామహామునిని తన తండ్రి తరించుటకు తానేమి చేయవలెనో వివరించమని వేడుకున్నాడు.
నారద
33 - గచ్ఛత్వంతస్యతందేహం తీర్థేషుకురునిర్మలమ్ ।
యత్రస్థాణోర్మహాతీర్థం సరః సంవిహితంప్రతి ॥
34 - ఏతచ్ఛ్రుత్వాతువచనం నారదస్య మహాత్మనః ।
సచివేరాజ్యమారాయ రాజాసతుజగామహ ॥
35 - సగత్వాచోత్తరాంభూమిం మ్లేచ్ఛమధ్యేదదర్శహ ।
కుష్ఠరోగేణ మహతాక్షయేణ చసమన్వితమ్ ॥
36 - తతఃశోకేనమహతా సంతప్తోవాక్యమబ్రవీత్ ।
హేమ్లేచ్ఛాః నౌమీపురుషం స్వగృహంచనయామ్యహమ్ ॥
37 - తత్రాహమేనంనిరుజం కరిష్యేయదిమన్యథ ।
తథేతిసర్వేతేమ్లేచ్ఛాః పురుషంతందయాపరమ్ ॥
38 - ఊచుఃప్రణతసర్వాంగా యథాజానాసితత్కురు ।
తత ఆనీయపురుషాన్ శిబికావాహనోచితాన్ ॥
39 - దత్వాశుల్కంచ ద్విగుణం సుఖేననయతద్విజం ।
తతఃశ్రుత్వాతువచనం తస్యరాఙ్ఞోదయావతః ॥
40 - గృహీత్వాశిబికాంక్షిప్రం కురుక్షేత్రేణయాంతితే ।
తత్రనీత్వాస్థాణుతీర్థే అవతార్యచతేగతాః ॥
41 - తతఃసరాజామధ్యాహ్నే తంస్నాపయతివై తదా ।
తతోవాయురంతరిక్షే ఇదంవచనమబ్రవీత్ ॥
42 - మాతాతః సాహసం కార్షీ స్తీర్థం రక్షప్రయత్నతః ।
అయంపాపేన ఘోరేణ అతీవ పరివేష్ఠితః ॥
43 - వేదనిందా మహత్పాపం యస్యాంతో నైవలభ్యతే ।
సోఽయం స్నానాన్మహత్తీర్థం నాశయిష్యతి తత్ క్షణాత్ ॥
44 - ఏతద్వాయోర్వచః శ్రుత్వా దుఃఖేని మహతాఽన్వితః ।
ఉవాచ శోకసంతప్త స్తన్య దుఃఖేన దుఃఖితః ।
ఏషఘోరేణ పాపేన అతీవ పరివేష్టితః ॥
45 - ప్రాయశ్చిత్తం కరిష్యే ఽహం యద్వదిష్యంతి దేవతాః ।
తతస్తాదేవతాః సర్వ ఇదం వచనమబ్రువన్ ॥
46 - స్నాత్వా స్నాత్వాచ తీర్థేషు అభిషించస్వ వారిణా ।
ఓజసాచులుకంయావత్ ప్రతికూలే సరస్వతీమ్ ॥
47 - స్నాత్వాశుద్ధి మవాప్నోతి పురుషః శ్రద్ధయాన్వితః ।
ఏష స్వపోషణ పరో దేవదూషణతత్పరః ॥
48 - బ్రాహ్మణైశ్చ పరిత్యక్తో నైషశుద్ధ్యతి కర్హిచిత్ ।
తస్మాదేనం సముద్ధిశ్యస్నాత్వా తీర్థేషు భక్తితః ।
అభిషించస్వ తోయేన తతః పూతో భవిష్యతి ।
నారదుడు
నీవు తీర్ధాలన్నింటిని దర్శించి అచట నీళ్ళతో ఈతని దేహాన్ని శుద్ధి చేయము. వానితో సన్నిహిత సరోవరం దగ్గర ఉన్న స్థాణు తీర్థానికి గూడ వెళ్ళుము. నారద మహర్షి వచనాలు విని ఆ రాజు తన రాజ్య భారాన్ని మంత్రుల కప్పగించి తాను బయలుదేరాడు. అచట నుండి ఉత్తర భూములకు వెళ్ళి అక్కడ మ్లేచ్ఛుల మధ్య కుష్ఠ క్షయ వ్యాధులతో బాధపడుతున్న తండ్రిని చూచి చాలా దుఃఖించి ఆ మ్లేచ్ఛులతో యిలా అన్నాడు. ఓ మ్లేచ్ఛులారా! నేనీ పురుషునకు నమస్కరించి యీయననింటికి తీసికొనిపోయి రోగముక్తుణ్ణి చేసుకుంటాను. మీరనుమతినివ్వండి. అందులకా మ్లేచ్ఛులంతా ప్రణామం చేసి అలాగే మీ యిష్ట ప్రకారం చేసుకోవచ్చని అన్నారు. అంతట నారాజు పల్లకీ బోయీలకు యిబ్బడి కూలి యిచ్చి తన తండ్రిని ఒక శిబికలో ఎక్కించుకుని యింటికి తీసుకొని పోయినాడు. బోయీలా దయామయుని కోర్కె మన్నించి ఆ శిబిక నెత్తుకొని త్వరిత గతిని కురుక్షేత్రంలోని స్థాణ తీర్థం వద్ద దించి వెళ్ళిపోయారు. అంత నా రాజు మధ్యాహ్న కాలాన అతనిని నదిలో స్నానం చేయించాడు. ఆ సమయాన ఆకసాన్నుంచి వాయువేతెంచి యిలా అన్నది. వత్సా! తొందరపడవద్దు. తీర్థ పవిత్రతను కాపాడుము. ఇతన్ని మహా ఘోరమైన పాపాలు చుట్టుకొని ఉన్నవి. వేదనింద అనే పాపానికి నిష్కృతి లేదు. అలాంటి దుష్టుడు స్నానం చేస్తే తీర్థ పవిత్రత నశించి పోతుంది. వాయువు మాటలు విని మరింతగా దుఃఖిస్తూ, అయ్యో! ఈయన ఎంతటి భయంకర పాపాలకు నెలవైనాడని విలపించాడు. యీ పాప పరిహారానికేదైనా ప్రాయశ్చిత్తం ఉంటే నేనది తప్పక చేయగలను. దయతో దేవతలు సెలవియ్యండి. అని ఆర్థించాడు. అంతట దేవతలందరు యిలా సలహాయిచ్చారు. నీవు వరసగా ఒక్కొక్క తీర్థంలో స్నానంచేసి ఆ నీళ్ళతో యీతణ్ణి అభిషేకించుము. ఇలా ఓజస తీర్థం నుంచి సరస్వతి కావలనున్న చులుక తీర్థం వరకు చేయుము. శ్రద్ధాశువులిలా తీర్థ స్నానం చేస్తే ముక్తులౌతారు. ఇక ఇతడో, అతి స్వార్థపరుడు దేవ దూషకుడు. బ్రాహ్మణులితణ్ణి పరిత్యజించారు. అంచేత పవిత్రుడు కానేరడు. కనుక యితని నుద్దేశించి నీవు తీర్థాలలో మునిగి ఆ నీటితో మార్జనం చేస్తే శుద్ధుడౌతాడు.
49 - ఇత్యేతద్వచనం శ్రుత్వా, కృత్వాతస్యాశ్ర మంతతః ॥
50 - తీర్థయాత్రాం యయౌరాజా ఉద్దిశ్యజనకం స్వకం ।
సతేషు ప్లావనం కుర్వం స్తీర్థేషు చ దినేదినే ॥
51 - అభ్యషించత్ స్వపితరం తీర్థతోయేవ నిత్యశః ।
ఏతస్మిన్నేవకాలేతు సారమేయోజగామహ ॥
52 - స్థాణోర్మఠే కౌలపతి ర్దేవద్రవ్యస్య రక్షితా ।
పరిగ్రహస్యద్రవ్యస్య పరిపాలయితా సదా ॥
53 - ప్రియశ్చ సర్వలోకేషు దేవకార్య పరాయణః ।
తస్యైవం వర్తమానస్య ధర్మమార్గే స్థితస్య చ ॥
54 - కాలేన చలితాబుద్ధి ర్దేవద్రవ్యస్య నాశనే ।
తేనాధర్మేణ యుక్తస్య పరలోకగతస్య చ ॥
55 - దృష్ట్వాయమోఽబ్రవీద్వాక్యం శ్వయోనిం వ్రజమాచిరం ।
తద్వాక్యానంతరం జాతః శ్వావైసౌగంధికే వనే ॥
56 - తతః కాలేన మహతా శ్వయూథ పరివారితః ।
పరిభూతః సరమయా దుఃఖేన మహతావృతః ॥
57 - త్వక్త్వా ద్వైతవనం పుణ్యం సాన్నిహిత్యం యయౌనరః ।
తస్మిన్‌ప్రవిష్ణ మాత్రస్తు స్థాణోరేవ ప్రసాదతః ॥
58 - అతీవతృషయా యుక్తః సరస్వత్యాం మమజహ్జ ।
తత్ర సంఫ్లుత దేహస్తు విముక్తః సర్వకిల్బిషైః ॥
59 - ఆహారలోభేనతదా ప్రవివేశకుటీరకమ్ ।
ప్రవిశంతంతదాదృష్ట్వా శ్వానంభయసమన్వితః ॥
60 - సతంపన్పర్శనకైః స్థాణుతీర్థేమమజ్జహ ।
పతతఃపూర్వతీర్థేషు విప్రుషైఃపరిషించతః ॥
61 - శునోఽస్యగాత్రసంభూతై రబ్బిందుఖిఃససించితః ।
విరక్తదృష్టిశ్చశునః క్షేపేణచతతఃపరమ్ ॥
62 - స్థాణుతీర్థస్యమాహాత్మ్యాత్ సపుత్రేణచతారితః ।
నియత స్తత్‌క్షణాజ్జాతో దివ్యదేహసమన్వితః ।
ప్రణిపత్యతదాస్థాణుం స్తుతింకర్తుంప్రచక్రమే ॥
ఆ మాటలు విన్న ఆ రాజు ఆయనకొక కుటీర మచ్చట నిర్మించి అందతని నుంచి, తాను మనస్సులో తండ్రి ముక్తిని కాంక్షిస్తూ తీర్థాటనానికి బయలుదేరాడు. ప్రతిరోజూ ఆయా తీర్థాల్లో మునిగి అందలి పవిత్రోదకాలు తెచ్చి తండ్రి మీద ప్రోక్షణం చేసేవాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకచటకొక కుక్క వచ్చింది. అది పూర్వ జన్మలో స్థాణుమఠంలో కాల స్వామియొక్క ద్రవ్యరక్షణా బాధ్యత అప్పగించబడిన అధికారిగా ఉండేది. మొదట్లో దేవద్రవ్య రక్షణ, పరిగ్రహం, వినియోగం మొదలయిన విషయాలలో చాలా నిక్కచ్చిగా, పవిత్రంగాఉంటూ అందరి మన్ననలకు పాత్రుడైన అధికారి కాలాంతరంతో బుద్ధి చెడిపోయి దేవద్రవ్య నాశనానికి కారకుడైనాడు. ధర్మదూరుడై మరణించిన అతడు పరలోకానికి పోగా యమడాతనిని చూచి తత్‌క్షణమే వెళ్ళి కుక్కవై జన్మించమని శిక్షించాడు. అతడు మరుక్షణం సౌగంధిక వనంలో శునక జన్మ యెత్తి అనేక శునకాలతో కలిసి తిరుగసాగాడు. కొన్నాళ్ళకొక ఆడకుక్క (సరమ) చేత అవమానం పొంది ఎంతగానో దుఃఖించాడు. ఆద్వైతవనాన్ని వదలి వంటరిగా పవిత్రమైన సంనిహిత్య సరోవరానికి పారిపోయాడు. అక్కడ స్థాణ్వీశ్వరుని దయవల్ల విపరీతమైన దాహం తీర్చుకోవడానికి సరస్వతీనదిలో మునిగాడు. దాహశాంతికి నీళ్ళలో మునిగిన ఆ కుక్క సకల పాపాల నుంచి విముక్తి పొందింది. స్నానం చేయగానే కరకర ఆకలి వేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ అది రాజు తండ్రి ఉన్న గుడిసెలో దూరింది. రాజా కుక్కనుచూచి భయంతో మెల్లగా తాకాడు. వెంటనే స్థాణుతీర్థంలో మునిగాడు. వెనకటి తీర్థంలో మునిగిన శరీరాన్ని ఆ కుక్క విదిలించుకొనగా అవి రాజుమీద పడినాయి. కుక్క వంటిమీది నీటిబిందువులు తన మీదపడగా ఆ రాజు భయపడినాడు. స్థాణుతీర్థ మహిమవల్ల ఆ విధంగా కుమారుని మూలాన ఆయన తరించాడు. వెంటనే ఇంద్రియ జయంకలిగి దివ్యశరీరాన్ని పొందాడు. అంతమహానందంతో ఆ వేనుడు ప్రణమిల్లి స్థాణు భగవానుని స్తోత్రం చేయసాగాడు.
వేన
63 - ప్రపద్యేదేవమీశానం త్వామజంచంద్రభూషణమ్ ।
మహాదేవంమహాత్మానం విశ్వస్యజగతఃపతిమ్ ॥
64 - నమస్తేదేవదేవేశ సర్వశత్రునిషూదన ।
దేవేశబలవిష్టంభ దేవదైత్యేశపూజిత ॥
65 - విరూపాక్షసహస్రాక్షత్ర్యక్షయక్షేశ్వరప్రియః ।
సర్వతఃపాణిపాదాంత సర్వతోఽక్షిశిరోముఖ ॥
66 - సర్వతఃశ్రుతిమల్లోకే సర్వమావృత్యతిష్ఠసి ।
శంకుకర్ణమహాకర్ణ కుంభకర్ణార్ణవాలయ ॥
67 - గజేంద్రకర్ణగోకర్ణ పాణికర్ణనమోఽస్తుతే ।
శతజిహ్వశతావర్త శతోదరశతానన!
68 - గాయంతిత్వాంగాయత్రిణో హ్యర్చయంత్యర్కమర్చిణః ।
బ్రహ్మాణంత్వాంశతక్రతో ఉద్వంశమివమేనిరే ॥
69 - మూర్తౌహితేమహామూర్తే సముద్రాంబుధరాన్తథా ।
దేవతాఃసర్వఏవాత్ర గోష్ఠేగావఇవాసతే ॥
70 - శరీరేతవపశ్యామి సోమమగ్నింజలేశ్వరమ్ ।
నారాయణం తథా సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిమ్ ॥
71 - భగవాన్ కారణంకార్యం క్రియాకారణమేవతత్ ।
ప్రభవఃప్రలయశ్చైవ సదసచ్చాపిదైవతమ్ ॥
వేనుడు
నమస్కారం, పయ (జలం) స్వరూపా, తుండపతీ (వక్త్రాధిపతి) అన్నదాతా, అన్నపతీ, నానాన్న భోజీ నీకు ప్రణామములు. సహస్ర శీర్షా! సహస్ర చరణా, సహస్రోద్యత శూలీ, సహస్రాభరణా, బాలానుచర గోప్తా (చిన్న పిల్లలను రక్షించువాడా) బాలలీలావిలాసీ, బాలరూపా, వృద్ధరూపా, క్షోభించినవాడా, క్షోభింపజేయువాడా, గంగాలులిత కేశా (గంగాధర), ముంజకేశా, నమస్కారము. షట్కర్మ సంతోషీ, కర్మత్రయనిరతా, నగ్నప్రాణా, చండా! కృశా! స్ఫోటనా (సాక్షాత్కరించువాడా) చతుర్విధ పురుషార్థరూపా, చతుర్విధ పురుషార్థ ప్రతిపాదకా నీకు నమోవాకములు.
101 - సాంఖ్యాయసాంఖ్యముఖ్యాయ సాంఖ్యయోగముఖాయచ ।
నమోవిరథరథ్యాయ చతుష్పథరథాయచ ॥
102 - కృష్ణాజినోత్తరీయాయ వ్యాళ యజ్ఞోవవీతినే ।
వక్త్రసంధానకేశాయ హరికేశనమోఽస్తుతే ।
త్ర్యంబికాంబికనాథాయ వ్యక్తావ్యక్తాయవేధసే ॥
103 - కామకామదకామఘ్న తృప్తాతృప్తవిచారిణే ।
నమఃసర్వదపాపఘ్న కల్పసంఖ్యావిచారిణే ॥
104 - మహాసత్వమహాబాహో మహాబలనమోఽస్తుతే ।
మహామేఘమహాప్రఖ్య మహాకాళమహాద్యుతే ॥
105 - మేఘావర్తయుగావర్త చంద్రార్కపతయేనమః ।
త్వమన్నమన్నభోక్తాచ పక్వభుక్‌పావనోత్తమ ॥
106 - జరాయుజాండజాశ్చైవ స్వేదజోద్భిదజాశ్చతే ।
త్వమేవదేవదేవేశ భూతగ్రామశ్చతుర్విదః ॥
107 - స్రష్టాచరాచరస్యాస్యపాతాహంతాతథైవచ ।
త్యామాహుర్బ్రహ్మవిద్వాంసో బ్రహ్మబ్రహ్మవిదాంగతిమ్ ॥
108 - మనసఃపరమజ్యోతి స్త్వంవాయుర్జ్యోతిషామపి ।
హంసవృక్షేమధుకర మాహుస్త్వాం బ్రహ్మవాదినః ॥
109 - యజుర్మయోఋఙ్ఞ్‌మయస్త్వా మాహుఃసామమయస్తథా ।
పఠ్యసేస్తుతిభిర్నిత్యం వేదోపనిషదాంగణైః ॥
110 - బ్రాహ్మణాఃక్షత్రియావైశ్యాః శూద్రావర్ణావరాశ్చయే ।
త్వమేవమేఘసంఘాశ్చ విద్యుతోఽశనిగర్జితమ్ ॥
111 - సంవత్సర స్త్వమృతవో మాసోమాసార్థమేవచ ।
యుగానిమేషాఃకాష్ఠాశ్ఛ నక్షత్రాణిగ్రహాఃకళాః ॥
112 - వృక్షాణాంకకుభోఽసిత్వం గిరీణాంహిమవాన్‌గిరిః ।
వ్యాఘ్రోమృగాణాంపతతాం తార్క్ష్యోఽనంతశ్చభోగినామ్ ॥
113 - క్షీరోదోఽస్యుదధీనాంచ వ్రతానాంసత్యమేవచ ।
వజ్రంప్రహరణానాంచ వ్రతానాంసత్వమేవచ ॥
114 - త్వమేవద్వేషఇచ్ఛాచ రాగోమోహఃక్షమాక్షమే ।
వ్యవసాయోధృతిర్లోభఃకామక్రోధౌజయాజయౌ ॥
115 - త్వంశరీత్వంగదీచాపి ఖట్వాంగీచశరాననీ ।
ఛేత్తాఛేత్తాప్రహత్తాఽసి మంతానేతాసనాతనః ॥
116 - దశలక్షణసంయక్తో ధర్మోఽర్థఃకామఏవచ ।
సముద్రాఃసరితోగంగా పర్వతాశ్చసరాంసిచ ॥
117 - లతావల్ల్యస్తృణౌషధ్యః పశవోమృగపక్షిణః ।
ద్రవ్యకర్మగుణారంభః కాలపుష్పఫలప్రదః ॥
118 - ఆదిశ్చాంతశ్చ వేదానాం గాయతీప్రణవ స్తథా ।
లోహితోహరితోనీలః కృష్ణఃపీతఃసిత స్తథా ॥
119 - కద్రుశ్చకపిలశ్చైవ కపోతోమేచక స్తథా ।
సవర్ణశ్చాప్యవర్ణశ్చ కర్తాహర్తాత్వమేవచ ॥
120 - త్వమింద్రశ్చయమశ్చైవ వరుణోధనదోఽనిలః ।
ఉపప్లవశ్చిత్రభానుః (తథా) స్వర్బానురేవచ ॥
ప్రభూ! సాంఖ్య శాస్త్రం నీవే, అసాంఖ్యసారతత్వం నీవే. సాంఖ్యయోగ శాస్త్రాధినేతవు నీవే. విరథుడవు, రధ్యుడవు, చతుష్పథరథికుడవు నీవే, ఇట్టి నీకు నమస్కారము. మృగచర్మధరా, సర్పయజ్ఞోపవీతా, వక్త్ర సంధానకేశా (ముఖానికంటుకొనిన కేశములు కలవాడా) హరికేశా నీకు ప్రణామము. మూడు కన్నులుగల అంబికాపతీ, వ్యక్తావ్యక్త స్వరూపా, విరించీ నీకు నమస్కారము. కామకామదాతా, కామహరా, తృప్తాతృప్త విచారకా, సర్వదాతా, పాపనాశకా, కల్ప సంఖ్యా విచారకా నీకు నమోవాకములు. మహాసత్వా, మహాబాహో, మహాబలా, మహామేఘా, మహాప్రఖ్యా, మహాకాళా, మహాద్యుతీ, మేఘావర్తా, యుగావర్తకా, చంద్రసూర్యపతీ నీకు నమస్సులు. అన్నానివి నీవు అన్నభోక్తవు నీవు, పక్వభోజివి, పావనోత్తముడవు, జరాయుజ, అండజ, స్వేదజ ఉద్భిజాలనే నాలుగురకాల జీవసమూహంనీవే, ఈ చరాచర జగత్తు సృష్టించినది నీవు. దీనిని రక్షించి లయముచేసేదీ నీవే. బ్రహ్మవేత్తలగువారు నిన్ను సృష్టికర్తగా బ్రహ్మవేత్తలకు పరమ గమ్యముగా పేర్కొంటారు. నీవు మనస్సుయొక్క వెలుగువు. దివ్యజ్యోతులలోని వాయువు నీవే. హంస వృక్షం (జీవాత్మల) పై తిరిగే మధుకరమని నిన్ను బ్రహ్మవాదులు ప్రశంసిస్తారు. ఋగ్యజుస్సామ వేదమయుడవు నీవు, వేదోపనిషత్తు లెల్లప్పుడు నిన్నే స్తుతిచేస్తుంటాయి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర తదితర వర్ణాలునీవే, మేఘబృందం, విద్యుత్తు, అశనిపాతం, సంవత్సర ఋతుమాస పక్షములు, యుగములు, నిమేషకాష్ఠాలు, నక్షత్రగ్రహ కళలు అన్నీ నీ రూపాలే. నీవు వృక్షాల్లో అర్జున వృక్షానివి, గిరులలో హిమవంతానివి, మృగాల్లో వ్యాఘ్రానివి, పక్షులలో వైనతేయుడవు, సర్పాలలో అనంతుడవు, సముద్రాల్లో క్షీరసముద్రానివి, యంత్రాలలో ధనుస్సువు, ప్రహరణాల్లో వజ్రానివి, వ్రతాలలో సత్యానివి. ద్వేషం, కోరిక, రాగమోహాలు, క్షమాక్షమలు, వ్యవసాయం, ధృతి లోభం కామక్రోధ జయాపజయాలన్నీ నీవే. నీ వద్ద బాణాలు, గదలు, ధనుస్సులు, ఖట్వాంగాలు, తూణీరాలు ఉన్నవి, నీవు ఛేత్తవు, భేత్తవు, ప్రహర్తవు, మంతవు (మననశీలివి) నేతవు సనాతనుడవు, దశలక్షణ లక్షితమైన ధర్మానివి, అర్థకామాలు నీవే, సముద్రాలు, నదులు, గంగ, పర్వత సరోవరాలు లతలుతృణాలు, ఓషధులు పశుమృగపక్షి గణాలు అన్నీ నీవే ప్రభూ! ద్రవ్య, కర్మ గుణాల ఉద్గమం, కాలమనే పుష్పం, దాని ఫలం యిచ్చేది నీవే, వేదాల ఆద్యంతాలు, గాయత్రి, ప్రణవ ఓంకారం, లోహిత, హరిత, నీల, కృష్ణ, పీత, శ్వేత, కద్రు, కపిల, కపోత, మేచకాది వర్గాలు అన్నీ నీ విలాసాలే. వర్ణ (రంగు) రాహిత్యం, వర్ణత్వం, కర్తృత్వం, ఉపసంహరణం అంతా నీవే. నీవింద్రుడవు, యముడవు, వరుణుడవు, కుబేరుడవు, వాయువు, రాహువు, అగ్నివి.
121 - శిక్షాహౌత్రంత్రిసౌపర్ణం యజుషాంశతరుద్రియం ।
పవిత్రంచపవిత్రాణాం మంగళానాంచమంగళమ్ ॥
122 - తిందుకోగిరిజోవృక్షో ముద్గంచాఖిలజీవనమ్ ।
ప్రాణఃసత్త్వంరజశ్చైవ తమశ్చప్రతిపత్పతిః ॥
123 - ప్రాణోఽపానఃసమానశ్చ ఉదానోవ్యానఏవచ ।
ఉన్మేషశ్చనిమేషశ్చ క్షుతంజృంభితమేవచ ॥
124 - లోహితాంతర్గతో దృష్టిః మహావక్త్రోమహోదరః ।
శుచిరోమాహరిశ్మశ్రు రూర్ధ్వ కేశశ్చలాచలః ॥
125 - గీతవాదిత్రనృత్యజ్ఞో గీతవాదిత్రకప్రియః ।
మత్స్యోజాలోజలౌకాశ్చ కాలః కేళికళాకలిః ॥
126 - అకాలశ్చనికాలశ్చ దుష్కాలఃకాలఏవచ ।
మృత్యుశ్చమృత్యుకర్తాచ యక్షోయక్షభయంకరః ॥
127 - సంవర్త కోంఽతకశ్చైవ సంవర్తకవలాహకః ।
ఘంటోఘంటీమహాఘంటీ చిరీమాలీచమాతలిః ॥
128 - బ్రహ్మకాలయమాగ్నీనాం దండీముండీత్రిముండ ధృక్ ।
చతుర్యుగశ్చతుర్వేద శ్చాతుర్హోత్రప్రవర్తకః ॥
129 - చతురాశ్రమ్యనేతాచ చాతుర్వర్ణ్యకర స్తథా ।
నిత్యమక్షప్రియోధూర్తో గణాధ్యక్షోగణాధిపః ॥
130 - రక్తమాల్యాంబరధరో గిరికోగిరికప్రియః ।
శిల్పంచశిల్పినాంశ్రేష్ఠః సర్వశిల్ప ప్రవర్తకః ॥
131 - భగనేత్రాంకుశశ్చండః పూష్ణోదంతవినాశనః ।
స్వాహాస్వధావషట్కారో నమస్కారోనమోనమః ॥
132 - గూఢవ్రతోగుహ్యతపా స్తారకస్తారకామయః ।
ధాతావిధాతాసంధాతా పృథివ్యాధరణోఽపరః ॥
133 - బ్రహ్మాతపశ్చసత్యంచ వ్రతచర్యమథార్ణవమ్ ।
భూతాత్మాభూతకృద్భూతి ర్భూతభవ్యభవోద్భవః ॥
134 - భూర్భువఃస్వర్ఋతంచైవ ధ్రువోదాంతోమహేశ్వరః ।
దీక్షితోఽదీక్షితఃకాంతో దుర్దాంతోదాంతసంభవః ॥
135 - చంద్రావర్తోయుగావర్తః సంవర్తకప్రవర్తకః ।
బిందుఃకామోహ్యణుఃస్థూలః కర్ణికారస్రజప్రియః ॥
136 - నందీముఖోభీమముఖః సుముఖోదుర్ముఖ స్తథా ।
హిరణ్యగర్భఃశకుని ర్మహోరగపతిర్విరాట్ ॥
137 - అధర్మహామహాదేవో దండధారోగణోత్కటః ।
గోనర్దోగోప్రతారశ్చ గోవృషేశ్వరవాహనః ॥
138 - త్రైలోక్యగోప్తాగోవిందో గోమార్గోమార్గఏవచ ।
స్థిరఃశ్రేష్ఠశ్చస్థాణుశ్చ విక్రోశఃక్రోశఏవచ ॥
139 - దుర్వారణోదుర్విషహో దుస్సహోదురతిక్రమః ।
దుర్ధరోదుష్ప్రకాశశ్చ దుర్దర్శోదుర్జయోజయః ॥
140 - శశాంకానలశీతోష్ణః క్షుత్తృష్ణాచచిరామయః ।
అధయోవ్యాధయశ్చైవ వ్యాధిహావ్యాధినాశనః ॥
141 - సమూహశ్చ సమూహస్య హంతాదేవఃసనాతనః ।
శిఖండీపుండరీకాక్షః పుండరీకవనాలయః ॥
142 - త్ర్యంబకోదండధారశ్చ ఉగ్రదంష్ట్రఃకులాంతకః ।
నిషాపహః సురశ్రేష్ఠః సోమపా స్త్వంమరుత్పతే ।
అమృతాశీజగన్నాథో దేవదేవగణేశ్వరః ॥
143 - మధుశ్చ్యుతానాంమధుపోబ్రహ్మ వాక్త్వంఘృతచ్యుతః ।
సర్వలోకస్యభోక్తాత్వం సర్వలోకపితామహః ॥
నీవు శిక్షాహోత్రుడవు (యజ్ఞజ్ఞానోపదేష్టవు) త్రిసుపర్ణ ఛందః స్వరూపివి. యజుర్వేదములోని శంరుద్రీయమవు, పవిత్రులలో పవిత్రుడవు, శివంకరులలో శివంకరుడవు; తిందుక, గిరిజ తరువులు, అందరకు జీవనరూపమైన ముధ్గ (పెసర) ధాన్యము, ప్రాణతత్వము, సత్వరజస్తమాలు, ప్రతిపత్పతి, ప్రాణాపాన సమానోదాన వ్యానములు, ఉన్మేషనిమేషాలు, చీదుట, ఆవులించుట అన్నియు నీవే; రక్తంలో నీవే దాగియున్నావు, దృష్టివి, మహావక్త్రుండవు, మహోదరుడవు, శ్వేతరోముడవు, హరితత్మశ్రు (పచ్చని గడ్డముగల) డవు, ఊర్ధ్వకేశివి, చలాచలుడవు. నీకు నమస్సులు. గీతవాదిత్రనృత్య జ్ఞాతవు. గీతవాదిత్రనృత్య ప్రియుడవు, మత్స్యానివి, వలవు, జలగవు, కాలుడవు, కేళికళవు, కవివి, అకాల, వికాల, దుష్కాల, కాలములు నీరూ పాలే. మృత్యువు, మృత్యుకారకుడు, యక్షుడు, యక్షులకు భయము గొల్పువాడు. సంవర్తకుడు, అంతకుడు, సంవర్తక వలాహక మేఘములు, అన్నీ నీ రూపాలే. గంటవు, గంట కలవాడవు, గొప్ప గంట కలవాడవు, మందగతి, మాలాధరుడవు, మాతలివి, బ్రహ్మవు. కాలుడవు, యముడవు, అగ్నివి, దండ ధరుడవు, కేశ రహిత శిరుడవు, త్రిమస్తకుడవు, నాల్గుయుగాలను నాల్గు వేదాలను, నాల్గు హోత్రాలను ప్రవర్తింపజేయువాడవు. నాలుగాశ్రమాలకు ఆధినాయకుడవు. చాతుర్వర్ణ్య కర్తవు, అన్నీ నీవే. ఎప్పుడూ జూదప్రియుడవు. ధూర్తుడవు, సర్వ గణాలను నిరీక్షించు వాడవు, గణాధీశ్వరుడవు, ఎర్రని మాలలు వస్త్రాలు ధరించువాడివు, కందుకానివి, కందుక ప్రియుడవు, శిల్పానివి, శిల్పులలో శ్రేష్టుడవు, సర్వ శిల్పాలను ప్రవర్తింపచేసిన ప్రభుడవు నీవు. భగుని నేత్రాలను పూషుని పండ్లను రాలగొట్టిన భయంకరుడవు, స్వాహా, స్వధా, వషట్కార నమస్కారరూపివైన నీకు శతశః నమన్సులు. నీవు, గూఢ వ్రతుడవు, గుహ్య తపస్వివి, తారవు, తారకామయుడవు, ధాతవు, సంధాతవు, పృథివికి వేరొండు ఆధారానివి. వేద బ్రహ్మ, తపస్సు, సత్యం, వ్రతాచరణం, ఆర్జవం, భూతాత్మ, భూతకర్త, ఐశ్వర్యం, భూతభవిష్యద్వర్తమానాలు, భూర్‌భుఃవసువర్లోకాలు, ఋతం, ధ్రువం, దాంతం, అన్నీ నీ రూపాలే. నీవు మహేశ్వరుడవు, దీక్షితుడవు, దీక్షా రహితుడవు, చక్కని వాడవు, దుర్దాంతుడవు, దాంతికి మూలానివి! చంద్రుని రూపాన, యుగాల రూపాన, మేఘాల రూపాన నీవే మాటి మాటికీ వస్తుంటావు. బిందురూపివి, అణు రూపిపి, స్థూలుడవు, కర్ణికార (గన్నేరు) పుష్పమాలాప్రియుడవు, నంది ముఖుడవు, భీమ ముఖుడవు, సుముఖుడవు, దుర్ముఖుడవు, హిరణ్యగర్భుడవు, పక్షివి, భయంకరమైన సర్ప శేష్టుడవు, విరాట్పురుషుడవు, అధర్మ నాశకుడవు, మహా దేవుడవు, దండధారిని, ఉత్కట గణరూపిని, ఎద్దువలె రంకె వేయువాడవు, (గోవర్ద), గోవులను దాటించువాడవు, వృషభేశ్వర వాహనుడవు, త్రిలోక రక్షకుడవు, గోవిందుడవు, గోమార్గానివి, మార్గానివి, స్థిరుడవు, శ్రేష్టుడవు, స్థాణు రూపివి, విక్రోశ, క్రోశ రూపివి అయిన నీకు నమస్సులు. నిన్నెవ్వరూ వారించలేరు, సహించలేరు అతిక్రమించలేరు, ధర్షించలేరు. నీ వెలుగు (కొందరకు) దుష్టమైనది, నిన్ను దర్శించుట కష్టము. నిన్నెవరు జయింపలేరు. నీవు విజయానివి. చంద్రాగ్నులవలె చల్లగా వేడిగా ఉంటావు నీవు. ఆకలి, దప్పిక, ఆరోగ్యము, ఆధి వ్యాధులు, వ్యాధి శమనము అంతా నీవే. సమూహాలకు సమూహాలనే సంహరిస్తావు. సనాతన దైవానివి, శిఖండివి, పుండరీకాక్షుడవు, పుండరీక వనాల్లో (సరస్సుల) ఉంటావు. త్య్రంబకుడవు, దండ ధరుడవు, ఉగ్రదంష్ట్రం కలవాడవు, కులాంతకుడవు. విషనాశకుడవు, దేవశ్రేష్టుడవు, సోమరసపాయివి, మరుత్తుల నాయకుడవు. అమృతభోజివి, దేవతలకు దేవగణాలకు అధిపతివి, మధువులొలికించువారల మధువు త్రాగువాడవు, బ్రహ్మవాణివి, నేయిరాల్చువాడవు. సర్వలోకాలు నీకు భోజ్యాలు. సర్వలోకాలకు పితామహుడవు నీవే. నీకు నమోవాకములు.
144 - హిరణ్యరేతాః పురుషస్త్వమేకః త్వంస్త్రీ పుమాంస్త్వం హి నపుంసకం చ ।
బాలో యదా స్థవిరో దేవదంష్ట్రా త్వన్మో గిరిర్విశ్వకృద్ విశ్వహర్తా ॥
145 - త్వంవైధాతావిశ్వకృతాంవరేణ్య స్త్వాంపూజయంతిప్రణతాఃసదైవ ।
చంద్రాదిత్యౌచక్షుషీ తే భవాన్‌హి త్వమేవచాగ్నిః ప్రపితామహశ్చ ।
ఆరాధ్యత్వాం సరస్వతీం వాగ్లభంతే అహోరాత్రే నిమిషోన్మేషకర్తా ॥
146 - న బ్రహ్మానచగోవిందః పౌరాణాఋషయోనతే ।
మాహాత్మ్యంవేదితుంశక్తాయాథాతతథ్యేనశంకర ॥
147 - పుంసాంశతసహస్రాణి యత్సమావృత్యతిష్ఠతి ।
మహత స్తమసఃపారే గోప్తామంతాభవాన్ సదా ॥
148 - యంవినిద్రాజితశ్వాసాః సత్వస్థాఃసంయతేంద్రియాః ।
జ్యోతిః పశ్యంతియుంజానా స్తన్శైయోగాత్మనేనమః ॥
149 - యామూర్తయశ్చ సూక్ష్మాస్తే నశక్యాయానిదర్శితుమ్ ।
తాభిర్మాంసతతంరక్షపితాపుత్రమివౌరసమ్ ॥
150 - రక్షమాంరక్షణీయోఽహం తవానఘనమోఽస్తుతే ।
భక్తానుకంపీభగవన్ భక్తశ్చాహంసదాత్వయి ॥
151 - జటినేదండినేనిత్యం ಲಂబోదరశరీరిణే ।
కమండలునిషంగాయ తస్మైతోయాత్మనేనమః ॥
152 - యస్యకేశేషుజీమూతా నద్యఃసర్వాంగసంధిషు ।
కుక్షౌసముద్రాశ్చత్వార స్తస్మైతోయాత్మనేనమః ॥
153 - సంభక్ష్యసర్వభూతాని యుగాంతేపర్యుపస్థితే ।
యః శేతేజలమధ్యస్థస్తం ప్రపద్యేఽOబుశాయినమ్ ॥
154 - ప్రవిశ్యవదనంరాహో ర్యఃసోమంపిబలేనిశి ।
గ్రసత్యర్కంచస్వర్భానూ రక్షితస్తవతేజసా ॥
155 - యేచాత్రపతితాగర్భా రుద్రగంధస్యరక్షణే ।
నమస్తేఽస్తుస్వధాస్వాహా ప్రాప్నువంతితదద్భుతే ॥
156 - యేఽOగుష్ఠమాత్రాఃపురుషా దేహస్థాఃసర్వదేహినామ్ ।
రక్షంతుతేహిమాంనిత్యం తేమామాప్యాయయంతువై ॥
157 - యేనదీషుసముద్రేషు పర్వతేషుగుహాసుచ ।
వృక్షమూలేషుగోష్ఠేషు కాంతారగహనేషుచ ॥
158 - చతుష్పథేషురథ్యాసు చత్వరేషుసభాసుచ ।
హస్త్యశ్వరథశాలాసు జీర్జోద్యానాలయేషుచ ॥
159 - యేచపంచసుభూతేషు దిశాసువిదిశాసుచ ।
చంద్రార్కయోర్మధ్యగతా యేచచంద్రార్కరశ్మిషు ॥
160 - రసాతలగతాయేచ యేచతస్మాత్పరంగతాః ।
సమస్తేభ్యోనమస్తేభ్యో నమస్తేభ్యశ్చనిత్యశః ॥
161 - యేషాంనవిద్యతేసంఖ్యా ప్రమాణంరూపమేవచ ।
అసంఖ్యేయగణారుద్రా నమస్తేభ్యోఽస్తునిత్యశః ॥
162 - ప్రసీదమమభద్రంతే తవభావగతస్యచ ।
త్వయిమేహృదయందేవ త్వయిబుద్ధిర్మతిస్త్వయి ॥
163 - స్తుత్వైవంసమహాదేవం విరరామద్విజోత్తమః,
ప్రభూ! నీవు హిరణ్యరేతస్కుడవు! ఏకైక పరమపురుషుడవు. నీవు స్త్రీవి, పురుషుడవు, నపుంసకుడవు, బాలుడవు, ముసలివాడవు, స్థవిరుడవు ఐరావత గణానివి. సర్వమాన్యుడవైన విశ్వకారకుడవు. నీకు నమస్సులు. సృష్టిచేయు విధాతలలో నీవు సర్వశ్రేష్టుడవు. శ్రద్ధాళువు లెల్లవేళల నిన్నారాధిస్తారు. చంద్రసూర్యులు నీ నేత్రాలు, నీవే అగ్నివి బ్రహ్మవు. సరస్వతీ రూపాన నిన్నారాధించి నరులు వాక్కును సంపాదింతురు. రాత్రింబవళ్ళు నీవే, నిమేషం (కన్నులు మూయుట) ఉన్మేషం (కండ్ల తెరచుట) నీవే. ఓ మంగళ స్వరూపా! నీ మహిమను యథార్థముగా తెలిసికొనుట బ్రహ్మ విష్ణువు ప్రాచీన మహర్షులకు గూడనలవి కాదు. వేలాది ప్రజల నావరించి నిబిడీకృతమైన ఘోరాంధకారాని కవ్వల వెలుగుచు నీవు వారందరనూ రక్షిస్తూ నడుపుతూ ఉంటావు. నిద్రా ప్రాణాలను నిరోధించి, జితేంద్రియులై సత్వగుణ ప్రధానులగు మహాత్ములు జ్యోతిస్సు రూపంలో దర్శించే యోగాత్మవు, పరమాత్ముడవు నీవు, అట్టి నీకు నమస్కారము. నిర్దేశించుట కలవిగాని సూక్ష్మాతి సూక్ష్మాలయిన నీ అనంతమూర్తులతో, కన్నకొడుకును తండ్రివలె నీవు నన్ను రక్షింపుము. నే నీచే రక్షింపబడదగిన వాడను. అట్టినన్ను సదారక్షించుము. ఓ పాపరహితా నీకు నమస్సులు. భక్తుల కనికరించు భగవాన్ నే నెల్లవేళల నీకు దాసుడను. ఓ జటాధరా! ముండీ! దండధరా! లంబోదర దేహా! కమండలధరా! రుద్రరూపా నీకు నమస్కారము. నీ కేశాలలో మేఘాలున్నవి, సర్వాంగ సంధుల యందూ నదులున్నాయి, నీకుక్షి సర్వ సముద్రాలకు నిలయం, అలా జలాత్మకుడవగు నీకు ప్రణామాంజలులు! యుగాంతరవేళల్లో సకల జీవరాశినీ భక్షించి జలాల్లో విశ్రమించే జలశయానుడగు ప్రభువును శరణువేడుచున్నాను. ఆ ప్రభువు రాహువు నోటిలో ప్రవేశించి రాత్రివేళల్లో సోమపానం చేస్తాడు. నీ తేజస్సు రక్షా కవచం కాగా రాహువు సూర్యునే మ్రింగుచున్నాడు. రుద్రుని రక్షణలో యిచట గర్భపాతాలు జరుగుతున్నవి! అద్భుతానికి స్వధా, స్వాహాగా మారుతున్నది. అంగుష్ఠమాత్ర పురుషాకృతిలో సకల శరీరులలో నెలకొన్న ప్రభువు ప్రతి నిత్యము నన్ను రక్షించుగాక. ముందుకు నడుపుగాక! నదులలో, సముద్రాల్లో, పర్వత గుహలలో, వృక్షమూలాలలో, గోశాలల్లో, కీకారణ్యాలలో, చతుష్పథాలలో, రాజమార్గాలలో, సభాసదనాలలో, గజాశ్వరథశాలల్లో, శిథిలాలయాలలో, ఉద్యానవనాల్లో, పంచభూతాల్లో, దిగ్దిగంతరాలలో, చంద్ర సూర్యులలో, వారలకిరణ సమూహంలో, పాతాళ వాసులలో తదితర స్థానాల్లో సర్వత్రా ఆ విధంగా వ్యాపించియుండే ఆ ప్రభువు మూర్తులకు అహరహం నమస్సులు, ప్రణామాలు, నతులు చేయుచున్నాను. లెక్కకు మిక్కుటమైన రూపాకృతులలో, అసంఖ్యాకంగా గణాల రూపంలో సర్వత్రా వ్యాపించియున్న రుద్రులకు నమోవాక శతాంజలులు! మీరందరు నా యెడ ప్రసన్నులుకండు. మీకు కళ్యాణమగుగాక. నేను మీ వాడను. ఓ దేవదేవా! నీవే నా హృదయం, నా బుద్ధి మతి సర్వస్వమూను. నీకు నమస్సులు! ఆ విధంగా మహాదేవుడైన శంకరుని స్తుతించి ఆ ఉత్తమ ద్విజుడు వినతుడయ్యెను.
అధ్యాయము 26 Complete
Summary of chapter 98 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya explains the transcendent spiritual connection between the holy city of Avimukta Vārāṇasī and the river Sarasvatī flowing through Kurukshetra. The text reveals that bathing in river Sarasvatī while meditating upon Parameśvara Śiva yields the exact spiritual merit as departing mortal life in Vārāṇasī. This divine synthesis assures seekers that devotion at Kurukshetra grants immediate liberation from the cycle of worldly existence.