అధ్యాయము 16

లోమహర్షణ

1 - పవనస్య హ్రదేస్నాత్వా దృష్ట్వాదేవం మహేశ్వరమ్

 విముక్తః కలుషైః సర్వైః శైవం పదమవాప్నుయాత్

2 - పుత్రశోకేన పవనో యస్మింల్లీనో బభూవాహ

 తతః స బ్రహ్మకైర్దేవైః ప్రసాద్య ప్రకటీకృతః

3 - తతోగచ్చేత అమృతం స్థానం తచ్చూల పాణినః

 యత్రదేవై స్సగంధర్వైః హనుమాన్ ప్రకటీకృతః

4 - తత్రతీర్థేనరః స్నాత్వా అమృతత్వ మవాప్నుయాత్

 కులోత్తారణ మాసాద్య తీర్థసేవీ ద్విజోత్తమః

5 - కులానితారయే త్సర్వాన్ మాతామహ పితామహాన్

 శాలిహోత్రస్య రాజర్షే స్తీర్థే త్రైలోక్య విశ్రుతమ్

6 - తత్రస్నాత్వా విముక్తస్తు కలుషైర్దేహసంభ వైః

 శ్రీకుంజంతు సరస్వత్యాం తీర్థం త్రైలోక్య విశ్రుతమ్

7 - తత్రస్నాత్వానరో భక్త్యా అగ్నిష్టోమ ఫలంలభేత్

 తతో నైమిషకుంజంతు సమాసాద్య నరః శుచిః

8 - నైమిషస్య చ స్నానేన యత్పుణ్యం తత్ సమాప్నుయాత్

 తత్రతీర్థం మహాఖ్యాతం వేదవత్యా నిషేవితమ్ 

9 - రావణేన గృహీతాయాః కేశేషు ద్విజసత్తమాః

 తద్వధాయ చ సాప్రాణాన్ ముముచే శోకకర్శితా

10 - తతోజాతాగృహేరాజ్ఞో జనకస్య మహాత్మనః

సీతానామేతి విఖ్యాతా రామపత్నీ పతివ్రతా

11 - సాహృతారావణే నేహ వినాశాయాత్మనః స్వయమ్

 రామేణ రావణంహత్వా అభిషిచ్య విభీషణమ్

12 - సమానీతా గృహంసీతా కీర్తిరాత్మవతాయథా

 తస్యాస్తీర్థేనరః స్నాత్వా కన్యాయజ్ఞఫలం లభేత్

లోమహర్షణ

పవనకుండంలో స్నానంచేసి మహేశ్వరదర్శనం చేసుకున్నవాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివపదవిని పొందుతాడు. పుత్ర శోకంతో వాయువు అందులో లీనుడై పోగా బ్రహ్మాదిదేవతలు ప్రసన్నులై మరల ప్రతిష్ఠింపజేసారు. అక్కడ నుండి దేవగంధర్వుల ద్వారా హనుమంతుడెచ్చట ప్రకటింపబడినాడో, ఆ పవిత్ర శివక్షేత్రం, అమృత క్షేత్ర్రానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసినచో అమృతత్వం లభిస్తుంది. అంతట తైర్థికుడు కులోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరను తరింపచేస్తాడు. రాజర్షిశాలిహోత్రతీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అక్కడ స్నానం చేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీతటాన ముల్లోకవిఖ్యాతమైన శ్రీకుంజతీర్థం ఉంది. దానిలో భక్తితో స్నానంచేస్తే అగ్నిష్టోమఫలం కలుగుతుంది: అక్కడనుండి నైమిష కుంజాన్ని దర్శిస్తే నైమిషంలో స్నానం చేసిన ఫలకం కలుగుతుంది. అక్కడే మహిమోపేతమైన వేదవతీ తీర్థముంది. అక్కడ రావణుడామే కేశాలు పట్టుకోగా శోకంతో ఆమె అతని వధార్థం శరీరత్యాగం చేసింది. సీత అనే పేరుతో జనకునకు పుట్టి రామపత్నిగా విఖ్యాతి వహించింది. ఆ పతివ్రతను రావణుడు ఆత్మనాశనానికై అపహరించికొనిపోగా రాముడాతనిని వధించి విభీషణుడిని లంకాధిపతిని చేశాడు. ఆ సాధ్విని మరల తన యింటికి గొనిపోయినాడు. అలాంటి పవిత్రవేదవతి తీర్థంలో స్నానంచేస్తే సమస్తపాపాలు పోయి కన్యాయజ్ఞఫలం కలుగుతుంది. పరమపదం లభిస్తుంది.

13 - విముక్తః కలుషైః సర్వైః ప్రాప్నోతి పరమంపదమ్

 తతో గచ్చేతసుమహద్ బ్రహ్మణః స్థానముత్తమమ్

14 - యత్రవర్ణావరః స్నాత్వా బ్రాహ్మణ్యం లభతేనరః

 బ్రాహ్మణశ్చ విశుద్ధాత్మా పరంపద మవాప్నుయాత్

15 - తతోగచ్చేత సోమస్య తీర్థం త్రైలోక్య దుర్లభమ్

 యత్రసోమస్తవస్తప్త్వా ద్విజరాజ్య మవాప్నుయాత్

16 - తత్ర స్నాత్వా_ర్చయిత్వా చ స్వపితౄన్ దైవతాని చ

 నిర్మలః స్వర్గమాయాతి కార్తిక్యాం చంద్రమాయథా     

17 - సప్తసారస్వతం తీర్థం త్రైలోక్య స్యాపిదుర్లభమ్

 యత్ర సప్త సరస్వత్య ఏకీభూతావహంతి చ

18 - సుప్రభాకాం చ నాక్షీ చ విశాలామానస ప్రదా

 సరస్వత్యోఘనామా చ సువేణుర్విమలోదకా

19 - పితామహస్య యజతః పుష్కరేషు స్తితస్యహ

 అబ్రువన్ ఋషయస్సర్వే నాయం యజ్ఞో మహాఫలః

20 - నదృశ్యతే సరిచ్చ్రేష్టా యస్మాదిహసరస్వతీ

 తచ్చ్రుత్వా భగవాన్ ప్రీతః స స్మారాథ సరస్వతీమ్

21 - పితామహేనయజతా ఆహూతాపుష్కరేషువై

 సుప్రభానామ సా దేవీ యత్రఖ్యాతా సరస్వతీ

22 - తాందృష్ట్వా మునయః ప్రీతా వేగాయుక్తాం సరస్వతీమ్

 పితామహం మానయంతీం తేతుతాం బహుమేనిరే

23 - ఏవమేషా సరిచ్చ్రేష్టా పుష్కరస్థా సరస్వతీ

 సమానీతా కురుక్షేత్రే మంకణేన మహాత్మనా

అచటనుంచి బ్రహ్మకు ఉత్తమస్థానమైన క్షేత్రానికి పోవాలి. అక్కడ స్నానంచేసినచో నిమ్న వర్ణాలవారు కూడా బ్రాహ్మణ్యం పొందుతారు. పరమపదం పొందుతారు. తర్వాత త్రైలోక్య దుర్లభమైన సోమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ తపస్సు చేసి సముడు ద్విజరాజ్యాన్ని పొందాడు. అక్కడ స్నానం చేసి దేవపితృ తర్పణములు చేస్తే పాపరహితుడై కార్తీకపూర్ణిమా చంద్రుడిలాంటి స్వర్గాన్ని పొందుతాడు. సుప్రభ కాంచనాక్షి విశాల, మానసహ్రదా, సరస్వత్యోఘనామ సువేణా, విమలోదక అనే సప్తసరస్వతులు ఏకమై ప్రవహించే సప్తసారస్వత తీర్థం ముల్లోకాల్లో ఎన్నదగినది. పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేస్తున్న బ్రహ్మనుచూచి ఋషులు, నదీ శిరోమణి అయిన సరస్వతి లేని చోట తల పెట్టిన ఆ యజ్ఞం సత్ఫలం యివ్వదని వచింపగా సంప్రీతుడై పితామహుడు సరస్వతిని స్మరించాడు. అలా బ్రహ్మచే పిలువబడి సుప్రభాదేవి సరస్వతిగా పుష్కరక్షేత్రానికి చేరుకుంది. బ్రహ్మ మీది గౌరవంతో వడివడిగా వచ్చిన ఆ సరస్వతిని చూచి సంతోషించి ఋషులు గౌరవించారు. పుష్కర క్షేత్రంలో ఉన్న సరస్వతి మహాత్ముడగు మంకనుని ద్వారా కురుక్షేత్రానికి కొనిరాబడినది.

24 - నైమిషేమునయః స్థిత్వా శౌనకాద్యాస్తపోధనాః

 తేపృచ్చంతి మహాత్మానం పౌరాణంలోమహర్షణమ్

25 - కథంయజ్ఞఫలో_స్మాకం వర్తతాంసత్పథేభవేత్ :

 తతో_బ్రవీన్మహాభాగః ప్రణమ్యశిరసాఋషీన్

26 - సరస్వతీ స్థితాయత్ర తత్రయజ్ఞఫలంమహత్

 ఏతచ్చ్రుత్వాతుమునయో నానాస్వాధ్యాయవేదినః

27 - సమాగమ్యతతస్సర్వే సస్మరుస్తేసరస్వతీమ్

 సాతుధ్యాతాతతస్తత్ర ఋషిభిఃసత్రయాజిభిః

28 - సమాగతాప్లావనార్థం యజ్ఞేతేషాంమహాత్మనామ్

 నైమిషేకాంచనాక్షీతు స్మృతామంకణకేనసా

29 - సమాగతాకురుక్షేత్రం పుణ్యతోయాసరస్వతీ

 గయస్యయజమానస్య గయేష్వేవమహాక్రతుమ్

30 - ఆహూతాచసరిచ్చ్రేష్ఠా గయయజ్ఞేసరస్వతీ

 విశాలాంనామతాంప్రాహుః ఋషయః సంశితవ్రతాః

31 - సరిత్పాహిసమాహూతామంకణేనమహాత్మనా

 కురుక్షేత్రంసమాయాతా ప్రవిష్టాచమహానదీ

శౌనకాది మహామునులు నైమిశారణ్యంలో పౌరాణికోత్తముడైన లోమహర్షుణుని అడిగారు. “మేము సన్మార్గాన నడుస్తూ యజ్ఞఫలం పొందేమార్గం తెలుపండి. అంతటనా మహానీయుడా ఋషులకు శిరసాప్రణామంచేసి అన్నాడు. సరస్వతీనదీ ఉన్న ప్రదేశం గొప్పయజ్ఞ ఫలాన్ని యిస్తుంది. అంతట స్వాధ్యాయపరులయిన ణా ఋషులు ఒకచోట చేరి సరస్వతిని స్మరించారు. సత్రయాగ నిష్ఠులగువారు ధ్యానించగానే వారల స్నానార్థం సరస్వతీ వారియజ్ఞ స్థలాన్ని చేరుకుంది. మంకజ మహర్షి ధ్యానించగానే కాంచనాక్షియను సరస్వతి నైమిషంనుండి కురుక్షేత్రానికి వచ్చి చేరింది. గయుడను రాజు గయలో మహాక్రతువు ఆరంభించి అచటకు నదీశిరోమణి సరస్వతిని ఆహ్వానించాడు. అలా గయను చేరిన సరస్వతిని విశాల అంటారు. అ సరస్వతే మంకణుని ప్రార్థన మన్నించి కురుక్షేత్రం చేరింది.

32 - ఉత్తరేకోశలాభాగే పుణ్యేదేవర్షిసేవితే

 ఉద్దాల కేనమునినా తత్రధ్యాతాసరస్వతీ

33 - ఆజగామసరిచ్చ్రేష్ఠాతం దేశంమునికారణాత్

 పూజ్యమానామునిగణైర్వల్కలాజినసంవృతైః

34 - మనోహరేతివిఖ్యాతా సర్వపాపక్షయావహా

ఆహూతాసామంకణేన కురుక్షేత్రేమహాత్మనా

 ఋషేఃసంమాననార్థాయ ప్రవిష్టాతీర్థముత్తమమ్

35 - సువేణురితివిఖ్యాతా కేదారేసాసరస్వతీ

 సర్వపాపక్షయాజ్ఞేయా ఋషినిద్ధనిషేవితా

36 - సాపితేనేహమునినాఆరాధ్యపరమేశ్వరమ్

 ఋషీణాముపకారార్థం కురుక్షేత్రంప్రవేశితా

37 - దక్షేణయజతాసాపి గంగాద్వారేసరస్వతీ

 విమలోదాభగవతీ దక్షేణప్రకటీకృతా

38 - సమాహూతాయయౌ తత్ర మంకణేనమహాత్మనా

 కురుక్షేత్రేతు కురుణాయజితాచ సరస్వతీ

39 - సరోమధ్యేసమానీతా మార్కండేయేన ధీమతా

 అఖిష్టూయమహాభాగాం పుణ్యతోయం సరస్వతీమ్

40 - యత్ర మంకణకఃసిద్ధః సప్తసారస్వతేస్థితః

 నృత్యమానశ్చదేవేన శంకరేణ నివారితః

దేవర్షిసేవితమైన ఉత్తరకోశల పుణ్యభూమికి ఉద్ధాలకముని ధ్యానించగా సరస్వతి వచ్చి చేరినది. అచట నా శ్రేష్ఠ తరంగిణిని వల్కలాజిన ధారులైన మునిసమూహం పూజించినది. సర్వపాపహారిణి అయిన ఆ నది మనోహరగా పిలువబడినది. ఆ నది మంకణుని ప్రార్థన నంగీకరించి ఋషులపట్ల గౌరవంతో కురుక్షేత్రానికి వచ్చింది. కేదార తీర్థంలో ఉన్న సరస్వతిని సువేణు అంటారు. ఋషులు సిద్దులచే సేవింపబడిన ఆమె సర్వపాపహారిణి. ఆ మునియే పరమేశ్వరుని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్రకురుక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతీ పుణ్యనదియే యజ్ఞదీక్షితుడైన దక్షునిచేత గంగాద్వారంలో విమలోదక రూపాన వెలువరింపబడింది మహాత్ముడైన మంకణుని పిలుపునందుకొని ఆమె కూడ కురురాజు యజ్ఞస్థలమైన కురుక్షేత్రం చేరుకొంది. మహానుభావుడైన మార్కండేయ ముని స్తోత్రానికి సంతోషించి ఆ పుణ్యోదక సరస్వతీ సరోవర మధ్యస్థలానికి వచ్చి చేరింది. మహాదేవుని చేత నివారింపబడిన సిద్ధుడు మంకణుడా సప్తసారస్వత క్షేత్రంలో ఆనంద నటనం చేస్తూ ఉన్నారు.

అధ్యాయము 16 complete