వామన మహా పురాణము
అధ్యాయము 43
పులస్త్య
1 - తతః స్వసైన్యమాలక్ష్య నిహతం ప్రమథైరథ ।
అంధకోఽభ్యేత్య శుక్రంతు ఇదం వచనమబ్రవీత్ ॥
2 - భగవం స్త్వాం సమాశ్రిత్య వయంబాధామ దేవతాః ।
అథాఽన్యానపివిప్రర్షే గంధర్వ సుర కిన్నరాన్ ॥
3 - తదియంపశ్య భగవన్ మయాగుప్తా వరూథినీ ।
అనాధేనయథానారీ ప్రమథైరపి కాల్యతే ॥
4 - కుజంభాద్యాశ్చనిహతా భ్రాతరోమమ భార్గవ ।
అక్షతాః ప్రమథాశ్చామీ కురుక్షేత్ర ఫలంయథా ॥
5 - తస్మాత్కురుష్వశ్రే యోనో నజీయేమయథాపరైః ।
జయేమచపరాన్ యుద్ధే తథాత్వం కుర్తుమర్హసి ॥
6 - శుక్రోఽoధకవచః శ్రుత్వా సాంత్వయన్ పరమాద్భుతమ్ ।
వచనంప్రాహదేవర్షే బ్రహ్మర్షిర్దానవేశ్వరమ్ ।
త్వద్ధితార్థం యతిష్యామి కరిష్యామి తవప్రియమ్ ॥
7 - ఇత్యేవముక్త్వా వచనం విద్యాం సంజీవనీం కవిః ।
ఆవర్తయామాసతదా విధానేన శుచివ్రతః ॥
8 - తస్యామావర్త్య మానాయాం విద్యాయామ సురేశ్వరాః ।
యేహతాః ప్రథమం యుద్ధే దానవాస్తేసముత్థితాః ॥
9 - కుజంభాదిషు దైత్యేషు భూయ ఏ వోత్థితేష్వథ ।
యుద్ధాయాభ్యాగతే ష్వేవ నందీ శంకరమబ్రవీత్ ॥
10 - మహాదేవ వచోమహ్యం శృణుత్వం పరమాద్భుతం ।
అవిచింత్య మసహ్యంచ మృతానాం జీవనం పునః ॥
11 - యేహతాః ప్రమథైర్దైత్యా యదాశక్త్యారణాజిరే ।
తేసముజ్జీవితా భూయో భార్గవేణాథ విద్యయా ॥
12 - తదిదంతైర్మహా దేవ మహత్కర్మ కృతంరణే ।
సంజాతం స్వల్పమేవేశ శుక్రవిద్యా బలాశ్రయాత్ ॥
13 - ఇత్యేవముక్తే వచనే నందినాకుల నందినా ।
ప్రత్యువాచ ప్రభుః ప్రీత్యా స్వార్థ సాధనముత్తమమ్ ॥
14 - గచ్ఛ శుక్రం గణపతే మమాంతిక ముపానయ ।
అహంతం సంయమిష్యామి యథాయోగం సమేత్యహి ॥
15 - ఇత్యేవముక్తో రుద్రేణ నందీ గణపతిస్తతః ।
సమాజగామ దైత్యానాం చమూం శుక్రజిఘృక్షయా ॥
పులస్త్యుడు
ప్రమథుల చేతిలో హతమైన తన సైన్యాన్ని చూచి ఆ అంధకుడు రాక్షసగురువైన శుక్రుని సమీపించి యిలా అన్నాడు. "భగవన్ ! తమ అండ చూచుకొని మేము దేవ కిన్నర గంధర్వాదులను సంహరిస్తున్నాము. బ్రహ్మర్షీ ! ఇటు చూడుడు. నాచే రక్షితమైన సేన అంతయు ప్రమథులచేత పరాభవింపబడి అనాథవలె పారిపోయి వచ్చినది. నా సోదరులయిన కుజంభాదులు చనిపోయారు. ఓ భార్గవా ! ఇక ప్రమథులో కురుక్షేత్ర ఫలంలాగా అక్షయంగా ఉన్నారు, కాబట్టి మేము శత్రువుల చేతిలో పరాజయం పొందకుండా తగిన ఉపాయం చేయండి. అంధకుని మాటలు విని, దేవర్షీ ! ఆ బ్రహ్మర్షి దానవేశ్వరునితో అద్భుత వచనాలు పలికాడు. అంధకా ఊరడిల్లుము. నీమేలుకోసం యత్నిస్తాను. నీకు ప్రియం కలిగిస్తాను. అలా ఓదార్చి ఆ కవి, శుచియై సంజీవని విద్యను విధివిధానంగా వినియోగించగా అంతకు ముందు యుద్ధంలో చనిపోయిన దైత్యదానవ శ్రేష్ఠులంతా లేచి కూర్చున్నారు. కుజంభాది దైత్యులు మరణించి మరల లేవడం యుద్ధానికి రావడం చూచి నందీశ్వరుడు శంకరునితో ఇలా అన్నాడు. మహాదేవా ! ఈ అద్భుతాన్ని ఆలకించండి. అనూహ్యంగా అసంభవమైనది. చచ్చిన వారలు మరల బతుకుట సంభవించినది. ప్రమథుల శక్తిశౌర్యాల వల్ల యుద్ధంలో మరణించిన దైత్యులనందరనూ భార్గవుడు తన విద్యచేత బ్రతికించాడు. ఆ విధంగా మేము గావించిన మహత్ సంగ్రామమంతా వ్యర్థం గావించబడింది. నంది మాటలు విని శివుడు స్వకార్యసిద్ధికై అతనితో నీవు వెళ్ళి ఆ శుక్రుని నా ఎదుట గొనిరమ్ము. నేను సమయోచితంగా మాటలాడి అతనిని నిరోధించెదనని, వానిని పంపాడు. అలా శంకరునిచే ఆదేశింపబడి ఆ గణాధిపతి అయిన నంది, శుక్రుని పట్టుకొనుటకై రాక్షస సైన్యం వద్దకు వెళ్ళాడు.
16 - తందదర్శా సురశ్రేష్ఠో బలవాన్ హయకంధరః ।
సంరురోధతదామార్గం సింహస్యేవ పశుర్వనే ॥
17 - సముపేత్యాహన న్నందీ వజ్రేణ శతపర్వణా ।
సపపాతాథనిఃసంజ్ఞో యయౌనందీ తతస్త్వరన్ ॥
18 - తతః కుజంభోజంభశ్చ బలోవృత్రస్త్వయః శిరాః ।
పంచదానవ శార్దులా నందినం సముపాద్రవన్ ॥
19 - తథాఽన్యే దానవశ్రేష్ఠా మయహ్లాద పురోగమాః ।
నానా ప్రహరణాయుద్ధే గణనాథ మభిద్రవన్ ॥
20 - తతోగణానామధిపం కుట్యమానం మహాబలైః ।
సమపశ్యంతదేవాస్తం పితామహ పురోగమాః ॥
21 - తందృష్ట్వా భగవాన్ బ్రహ్మా ప్రాహశక్ర పురోగమాన్ ।
సాహాయ్యం క్రియతాంశంభో రేతదంతర ముత్తమమ్ ॥
22 - పితామహోక్తం వచనం శ్రుత్వాదేవాః సవాసవాః ।
సమాపతంతవేగేన శివసైన్య మథాంబరాత్ ॥
23 - తేషామాపతతాం వేగః ప్రమథానాం బలేబభౌ ।
ఆపగానాం మహావేగం పతంతీనాం మహార్ణవే ॥
24 - తతోహలహలా శబ్దః సమజాయతచోభయోః ।
బలయోర్ఘో రసంకాశో సురప్రమథ యోరథ ॥
25 - తమంతర ముపాగమ్య నందీసంగృహ్యవేగవాన్ ।
రథాద్ భార్గవమాక్రామ త్సింహః క్షుద్రమృగంయథా ॥
26 - తమాదాయ హరాభ్యాశ మాగమద్ గణనాయకః ।
నిపాత్యరక్షిణః సర్వా నథశుక్రం న్యవేదయత్ ॥
27 - తమానీతం కవింశర్వః ప్రాక్షిపద్వదనే ప్రభుః ।
భార్గవంత్వావృతతనుం జఠరేసంన్యవేశయత్ ॥
28 - సశంభునా కవిశ్రేష్ఠో గ్రస్తో జఠరమాస్థితః ।
తుష్టావ భగవంతంతం మునిర్వాగ్భి రథాదరాత్ ॥
అలా వస్తూన్న నందిని చూచి రాక్షసవీరుడైన హయకంధరుడాయనను అడ్డగించాడు. అడివిలో సింహాన్నెదిరించిన లేడిలాగ తనకెదురైన ఆ దైత్యునిమీదకు లంఘించి నంది, నూరు అంచులుగల తన వజ్రాయుధంతో మోది మూర్ఛ బడగొట్టాడు. వానిని తప్పించుకొని వస్తూన్న నందిని కుజంభ, జంభ, బలి, వృత్ర, అయఃశిరులను అయిదుగురు దైత్య శార్దూలాలు చుట్టుముట్టారు. మయుడుహ్లాదుడాదిగా గల యితర దానవ వీరులు గూడ అనేక ఆయుధాలు చేపట్టి నందిమీద దాడిచేశారు. అలా ఆ రాక్షసవీరులచే దెబ్బలు తింటూన్న ఆ గణాధిపతిని ఆకాశంలో నిలబడి బ్రహ్మమొదలయిన దేవతలు చూచారు. ఆ పరిస్థితి గమనించిన బ్రహ్మ యింద్రునితో, వెళ్ళండి మీరంతా వెళ్ళి ఈ అదనున శంకరునకు సహాయపడండని పంపాడు. దానితో యింద్రాదులంతా వాయువేగంతో శివసైన్యానికి బాసటగా ఆకాశాన్నుంచి ఊడిపడి నిలచారు. మహానదులంతా త్వరత్వరగా మహాసముద్రంలోపడి కలిసినట్లా దేవతలు శివసైన్యంలో పడి కలిసిపోవడంతో భయంకరమైన ఘోషతో యిరువర్గాలు తలపడ్డాయి. ఆ గందరగోళంలో తప్పించుకుని ఆ నందీశ్వరుడు వెళ్ళి రథంమీద నుంచి సింహం కుందేలును లాగినట్లు శుక్రుణ్ణి ఒడిసి పట్టుకొని, ఆయన రక్షణ కోసం వచ్చిన వారందరినీ నేలబడగొట్టి శివుని ముందుతెచ్చి పడవేశాడు. ఆ శుక్రుని అమాంతంగా శివుడు తన నోటిలో వేసికొని మింగివేశాడు. అలా శివుని ఉదరంలో బంధింపబడి ఆ భార్గవుడు భక్త్యాదరాలతో నా మహాదేవుని యిలా స్తుతించాడు.
శుక్ర
29 - వరదాయ నమస్తుభ్యం హరాయ గుణశాలినేః ।
శంకరాయ మహేశాయ త్య్రంబకాయ నమోనమః ॥
30 - జీవనాయ నమస్తుభ్యం లోకనాథ వృషాకపే ।
మదనాగ్నే కాలశత్రో వామదేవాయతే నమః ॥
31 - స్థాణవే విశ్వరూపాయ వామనాయ సదాగతే ।
మహాదేవాయ శర్వాయ ఈశ్వరాయ నమో నమః ॥
32 - త్రినయన హరభవ శంకర ఉమాపతే జీమూతకేతో ।
గుహాగృహ శ్మశాన నిరత భూతివిలేపన శూలపాణే పశుపతే ।
గోపతే తత్పురుష సత్తమ నమోనమస్తే ॥
33 - ఇత్ధంస్తుతః కవివరేణ హరోఽథభక్త్యా ప్రీతోవరం వరయదద్మిత వేత్యువాచ ।
సప్రాహ దేవవర దేహివరం మమాద్య యద్వైతవైవ జఠరాత్ప్రతి నిర్గమోఽస్తు ॥
34 - తతోహరోఽక్షీణి తదానిరుధ్య ప్రాహద్విజేంద్రాద్య వినిర్గమస్వ ।
ఇత్యుక్తమాత్రో విభునాచచార దేవోదరే భార్గవ పుంగవస్తు ॥
35 - పరిభ్రమన్ దదర్శాథ శంభో రేవోదరేకవిః ।
భువనార్ణవ పాతాళాన్ వృతాన్ స్థావరజంగమైః ॥
36 - ఆదిత్యాన్ వసవోరుద్రాన్ విశ్వేదేవాన్ గణాంస్తథా ।
యక్షాన్ కింపురుషాద్యాదీన్ గంధర్వాప్సరసాంగణాన్ ॥
భార్గవుడు
"హరా ! వరదా ! గుణశాలీ నీకు నమస్కారము. శంకరా త్య్రంబకా మహేశా నీకు నమస్సులు, జీవనా ! లోకేశ్వరా ! వృషాకపీ ! మదనాంతకా! కాలనాశనా ! వామదేవా నీకు అంజలులు ! స్థాణూ, విశ్వరూపా, సదాగతీ, వామనా, మహాదేవా శర్వా ! ఈశ్వరా నమోవాకములు. త్రినేత్రా హరా, భవా శంకరా ఉమాధవా జీమూతకేతూగుహావాసీ, శ్మశానప్రియా, భస్మధరా, శూలధరా పశుపతీ గోపతీ తత్పురుషోత్తమా ! నీకు మాటిమాటికీ నమస్సులు. ఇలా స్తోత్రం చేసిన శుక్రుని పట్ల ప్రీతుడై శంకరుడు వరము కోరుకోమనగా నతడు నీ ఉదరం నుండి బయటపడునట్లనుగ్రహించమని వేడుకొన్నాడు. అంతట హరుడు తన నేత్రాలు మూసికొని, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా ! నా కడుపులోనుండి బయటకు వెళ్ళమని ఆదేశించాడు. అలా శివుని ఉదరంలో నుంచి బయటకు వచ్చుటకు ప్రయత్నిస్తూ అందులో పాతాళాది భువనాలను సాగరాలను సచరాచర జీవులను ఆదిత్య రుద్ర వసు విశ్వదేవాదులను యక్షకిన్నర గంధర్వాప్సరస సమూహాలను, మునులను, మనుష్యులను చూచి, పరిభ్రమించసాగాడు.
37 - మునీన్ మనుజసాధ్యాంశ్చ పశుకీట పిపీలికాన్ ।
వృక్షగుల్మాన్ గిరీన్ వల్ల్యః ఫలమూ లౌషధానిచ ॥
38 - స్థలస్థాంశ్చ జలస్థాంశ్చా నిమిషాన్నిమిషానపి ।
చతుష్పదాన్ సద్విపదాన్ స్థావరాన్ జంగమానపి ॥
39 - అవ్యక్తాంశ్చైవ వ్యక్తాంశ్చ సగుణాన్నిర్గుణానపి ।
సదృష్ట్వా కౌతుకావిష్టః వరిబభ్రామ భార్గవః ।
తత్రాసతో భార్గవస్య దివ్యః సంవత్సరోగతః ॥
40 - నచాంతమలభద్ బ్రహ్మం స్తతః శ్రాంతోఽభవత్కవిః సశ్రాంతం వీక్ష్యచాత్మానం నాలభన్నిర్గమంవశీ ।
భిక్తినమ్రో మహాదేవం శరణం సముపాగమత్ ॥
శివుని ఉదరంలో తిరుగుతూ ఆ భార్గవుడు పశుకీటపిపీలికాలను వృక్షగుల్మలతాదులను ఫలమూలాలను ఓషధులను జలచరాలను అనిమిషులను నిమేషులను, చతుష్పాదులను, ద్విపాదులను, వ్యక్తావ్యక్త సగుణ నిర్గుణ ప్రాణులను చూస్తూ అత్యంత కౌతుకంతో ఒకే దివ్య సంవత్సరకాలం తిరుగాడుతూ నడపినా బయట పడే దారి కనుగొనలేకపోయాడు. ఓ నారదా! అలా తిరిగి తిరిగి అలసిపోయి కర్తవ్యం తోచక భక్తితో ఆ పరమ శివునకు శరణాగతుడై ఇలా ప్రార్థించాడు.
శుక్ర
41 - విశ్వరూప మహారూపః విశ్వరూపాక్ష సూత్రధృక్ ।
సహస్రాక్ష మహాదేవ త్వామహం శరణంగతః ॥
42 - నమోఽస్తుతే శంకర శర్వశంభో సహస్రనేత్రాం ఘ్రిభుజంగభూషణ ।
దృష్ట్వైవ సర్వాన్ భువనాంస్తవోదరే శ్రాంతో భవంతం శరణం ప్రపన్నః
43 - ఇత్యేవముక్తే వచనే మహాత్మా శంభుర్వచః ప్రాహతతోవిహస్య ।
నిర్గచ్ఛపుత్రోఽసి మమాధునాత్వం శిశ్నేనభో భార్గవవంశచంద్రః ॥
44 - నామ్నాతు శుక్రేతి చరాచరాస్త్వాం స్తోష్యంతి నైవాత్ర విచార్యమన్యత్ ।
ఇత్యేవముక్త్వా భగవాన్ ముమోచ శిశ్నేనశుక్రం సచనిర్జగామ ॥
45 - వినిర్గతో భార్గవవంశ చంద్రః శుక్రత్వ మాపద్య మహానుభావః ।
ప్రణమ్య శంభుంస జగామతూర్ణం మహాసురాణాం బలముత్తమౌజాః ॥
46 - భార్గవే పునరాయాతే దానవా ముదితాభవన్ ।
పునర్యుద్ధాయ విదధు ర్మతిం సహగణేశ్వరైః ॥
47 - గణేశ్వరా స్తానసురాన్ సహామరగణైరథ ।
యుయుధుః సంకులం యుద్ధం సర్వ ఏవజయేప్సవః ॥
48 - తతోఽసుర గణానాంచ దేవతా నాంచయుధ్యతామ్ ।
ద్వంద్వయుద్ధం సమభవద్ ఘోరరూపం తపోధన ॥
49 - అంధకోనందినం యుద్ధే శంకుకర్ణం త్వయః శిరాః ।
కుంభధ్వజం బలిర్ధీమాన్ నందిషేణం విరోచనః ॥
50 - అశ్వగ్రీవోవిశాఖంచ శాఖోవృత్ర మయోధయత్ ।
బాణస్తథానైగమేయం బలం రాక్షసపుంగవః ॥
51 - వినాయకో మహావీర్యః పరశ్వథ ధరోరణే ।
సంక్రుద్ధో రాక్షసశ్రేష్ఠం తుహుండం సమయోధయత్ ॥
శుక్రుడు
"ఓ మహారూపా! అక్ష సూత్రాలను ధరించిన విశ్వమూర్తీ సహస్రాక్షా మహాదేవ ప్రభో! నీకు శరణాగతుడనయ్యాను. ఓ శంకరా శర్వా శంభో సహస్ర నేత్ర చరణ ధరా భుజగభూషణా! నీ విశాల హృదయంలో సకల భువనాలను దర్శించి అలసిపోయి పాదాలకడ ఆత్మ సమర్పణం చేస్తున్నాను. నన్ను కరుణించుము". శుక్రుని దీన పరిదేవనం విని మహాత్ముడగు శంభుడు నవ్వి ఇలా అన్నాడు. "భార్గవా! నీవు నాకు పుత్రుడవైనావు. నా శిశ్నం ద్వారా బయటకు రమ్ము. ఇతర విచారాలన్నీ ?నుము. నేటి నుంచి నీవు 'శుక్రు'డనే పేరుతో చరాచర జీవులందరకు స్తపనీయుడవు అవుతావు". అలా చెప్పి శంకరుడా భార్గవుని శిశ్న మార్గాన బయటకువదిలాడు. అలాశిశ్న ద్వారాన వెలువడి భార్గవుడు శుక్రమహానుభావుడుగా ఖ్యాతుడయ్యాడు. అంతట నాతడు శర్వునకు ప్రణమిల్లి త్వరగా రాక్షస సేనలోకివెళ్ళి చేరాడు. తమ గురువు తిరిగి వచ్చినందులకా దానవులంతా సంతోషించి గణాధిపతులతో మరల యుద్ధానికి సన్నద్ధులయ్యారు.శివగణాధిపతులు గూడ దేవగణాలతో కలిసి ఆ దానవులతో విజయకాంక్షతో సంకుల సమరం గావించారు. "ఓ తపోధనా ! పరస్పర జయకాంక్షతో తలపడిన వారల పోరు భయంకరమైన ద్వంద్వ యుద్ధాలతో మరింత ఘోరమైంది. అంధకుడు నందితో, అయఃశిరుడు శంకరునితో, బలి కుంభ ధ్వజునితో, విరోచనుడు నందిషేణునితో, అశ్వగ్రీవుడు విశాఖునితో, వృత్రుడు శాఖునితో, బాణుడు నైగమేయుడగు బలునితో తలపడ్డారు. మహా వీర్యుడగు వినాయకుడు గండ్రగొడ్డలి ధరించి రాక్షస శ్రేష్ఠుడు తుహండునితో ఢీకొనగా దుర్యోధనుడు మహాబలి ఘంటాకర్ణునితో పెనగులాడ మొదలుపెట్టాడు.
52 - హస్తీచ కుండజఠరం హ్లాదోవీరం ఘటోదరమ్ ।
ఏతేహిబలినాం శ్రేష్ఠా దానవాః ప్రమథా స్తథా ।
సంయోధయంతి దేవర్షే దివ్యాబ్దానాం శతానిషట్ ॥
53 - శతక్రతు మథాయాంతం వజ్రపాణి మభిస్థితమ్ ।
వారయామాస బలవాన్ జంభోనామ మహాసురః ॥
54 - శంభునామాఽసురపతిః సబ్రహ్మాణ మయోధయత్ ।
మహౌజసం కుజంభశ్చ విష్ణుం దైత్యాంతకారిణమ్ ॥
55 - వివస్వంతం రణేశాల్వో వరుణం త్రిశిరాస్తథా ।
ద్విమూర్ధాపవనం సోమం రాహుః మిత్రం విరూపధృక్ ॥
56 - అష్టౌయేవసవః ఖ్యాతా ధరాద్యాస్తే మహాసురాన్ ।
అష్టావేవ మహేష్వాసాన్ వారయామాసురాహవే ॥
57 - సరభః శలభః పాకః పురోఽథవిపృథుః పృథుః ।
వాతాపీచేల్వలశ్చైవ నానాశస్త్రాస్త్ర యోధినః ॥
58 - విశ్వేదేవగణాన్ సర్వాన్ విష్వక్సేన పురోగమాన్ ।
ఏకఏవరణే రుద్రః కాలనేమిర్మహాసురః ॥
59 - ఏకాదశైవయే రుద్రా స్తానేకోఽపి రణోత్కటః ।
యోధయామాస తేజస్వీ విద్యున్మాలీ మహాసురః ॥
60 - ద్వావశ్వినౌచ నరకో భాస్కరానేవ శంబరః ।
సాధ్యాన్ మరుద్గణాంశ్చైవ నివాతకవచాదయః ॥
61 - ఏవం ద్వంద్వసహస్రాణి ప్రమథామర దానవైః ।
కృతానిచ సురాబ్దానాం దశతీః షట్ మహామునే ॥
62 - యదానశకితా యోద్ధుం దైవతైరమ రారయః ।
తదామాయాం సమాశ్రిత్య గ్రసంతః క్రమశోఽవ్యయాన్ ॥
63 - తతోఽభవచ్ఛైల పృష్ఠం ప్రావృడ భ్రసమప్రభైః ।
ఆవృతం వర్జితం సర్వైః ప్రమథైరమ రైరపి ॥
64 - దృష్ట్వా శూన్యం గిరిప్రస్థం గ్రస్తాంశ్చ ప్రమథామరాన్ ।
క్రోధాదుత్పాదయామాస రుద్రోజృంభాయికాంవశీ ॥
65 - తయాస్పృష్టా దనుసుతా అలసామందభాషిణః ।
వదనం వికృతం కృత్వా ముక్తశస్త్రం విజృంభిరే ॥
66 - జృంభమాణేషుచ తదా దానవేషు గణేశ్వరాః ।
సురాశ్చనిర్యయు స్తూర్ణం దైత్యదేహేభ్య ఆకులాః ॥
144 - తంవ్రజంతంహిగంధర్వా విశ్వావసు పురోగమాః ।
జ్ఞాత్వేంద్రస్యైవ సాహాయ్యే తేజసా సమవర్ధయన్ ॥
145 - గంధర్వతేజసాయుక్తః శిశుః శక్రం సమేత్యహి ।
ప్రోవాచైహ్యేహి దేవేశ ప్రియోయంతా భవామితే ॥
146 - తచ్ఛ్రుత్వాస్య హరిః ప్రాహ కస్యపుత్రోఽసి బాలక ।
సంయంతాఽసికథం చాశ్వాన్ సంశయః ప్రతిభాతిమే ॥
147 - సోఽబ్రవీద్దృషి తేజోత్థం క్ష్మాభవం విద్ధివాసవ ।
గంధర్వతేజసాయుక్తం వాజియాన విశారదమ్ ॥
148 - తచ్ఛ్రుత్వా భగవాన్ శుక్రః ఖంభేజేయోగినాం వరః ।
సచాపి విప్రతనయో మాతలిర్నామ విశ్రుతః ॥
149 - తతోఽధిరూఢస్తురథం శక్రస్త్రి దశపుంగవః ।
రశ్మీన్ శమీకతనయో మాతలిః ప్రగృహీతవాన్ ॥
150 - తతోమందర మాగమ్య వివేశరిపువాహినీమ్ ।
ప్రవిశన్ దదృశే శ్రీమాన్ పతితం కార్ముకంమహత్ ॥
151 - శరీరం పంచవర్ణాభం సితరక్తాసితారుణమ్ ।
పాండుచ్ఛాయం సురశ్రేష్ఠం స్తం జగ్రాహస మార్గణమ్ ॥
అందులకామె నాధా, ఆ విషయాలు మరొకప్పుడు చెప్పెదను. నేడు కాదనగా నా బ్రాహ్మణుడలా కాదు. నాకిప్పుడే చెప్పవలయును. లేనిచో నేనీ రోజు భోజనమే చేయనని పట్టుబట్టాడు. అంతటనామె సరే మీరు గందరగోళంలో పడి అడుగుతున్నారు గనుక హిత వాక్యాలు చెబుతాను వినండి. ఈ బాలుడు రథచోదకు (కారు) డౌతాడు". అని చెప్పినది. ఆమె నోటి నుండి ఆ మాటలు వెలువడినంతనే ఆ బాలుడు ఏమీ తెలియనివాడై యుండియు పైకి ఎగిరి ఇంద్రునకు సహాయం చేయుటకు వెళ్తున్న సంగతి గ్రహించిన విశ్వావసు మొదలైన గంధర్వులంతా తమ తేజస్సునాతనికి ధారబోశారు. అలా గంధర్వ తేజోయుక్తుడై ఆ శిశువు శక్రుని సమీపించి, దేవరాజా! రండు రండు! నీకు ప్రియం కలగునట్లుగా సారథ్యం చేస్తానన్నాడు. అది విని యింద్రుడిలా అడిగాడు. "నీవెవరి పుత్రుడవు బాబూ? అశ్వాలనెలా అదుపులో పెట్టగలుగుదువా యని నాకు నందేహంగా ఉన్నది". అందులకా శిశువు- సురేశ్వరా! ఋషి తేజస్సుతో భూమి నుండి ఉద్భవించాను. గంధర్వ తేజంతో వృద్ధి నొందాను. ఆశ్వయానంలో విశారదుడనని చెప్పగా, యోగులలో శ్రేష్ఠుడగు నా యింద్రుడూ, మాతలి అని పేరు గల ఆ బాలుడూ వినువీధికి వెళ్ళారు. త్రిదశాధీశ్వరుడగు నా యింద్రుడు ఉత్తమ రథం మీద కూర్చొనగా నాబాలుడు శమీక ఋషి పుత్రుడు గుర్రాల పగ్గాలను పట్టుకొని నిలబడ్డాడు. అంతట నాదేవరాజు మందరగిరికి వెళ్ళి శత్రు సేనలోకి ప్రవేశించాడు. అక్కడ తేజస్వికి ఒక మహాధనుస్సు పంచ వర్ణాలతో - తెలుపు, ఎరుపు, గోధుమ, పసుపు రంగులలో - బాణ సమూహంతో కూడి కనిపించింది. అంత సంతోషంతో నాసురశ్రేష్ఠుడా ధనుర్బాణాలను గ్రహించాడు.
152 - తతస్తుమనసా దేవాన్ రజస్సత్వత మోమయాన్ ।
నమస్కృత్యశరం చాపే సాధిజ్యేవినియోజయత్ ॥
153 - తతోనిశ్చేరురత్యుగ్రాః శరా బర్హిణవాససః ।
బ్రహ్మేశ విష్ణునామాంకాః సూదయంతోఽసురాన్ రణే ॥
154 - ఆకాశం విదిశః పృథ్వీం దిశశ్చసశరోత్కరైః ।
సహస్రాక్షోతి పటుభి శ్ఛాదయామాస నారదః ॥
155 - గజోవిద్ధో హయోభిన్నః పృథివ్యాం పతితోరథః ।
మహామాత్రోధరాం ప్రాప్తః సద్యః సీదస్ఛరాతురః ॥
156 - పదాతిః పతితోభూమ్యాం శక్రమార్గణ తాడితః ।
హతప్రధాన భూయిష్ఠం బలంతదభవద్రిపోః ॥
157 - తంశక్రబాణాభిహతం దురాసదం సైన్యం సమాలక్ష్యతదా కుజంభః ।
జంభాసురశ్చాపి సురేశమవ్యయం ప్రజగ్మతుర్గృహ్య గదేసుఘోరే ॥
158 - తావాపతంతౌ భగవాన్ నిరీక్ష్య సుదర్శనే నారివినాశనేన ।
విష్ణుః కుజంభం నిజఘాన వేగాత్ సస్యందనాద్గామగమద్గతాసుః ॥
159 - తస్మిన్ హతేభ్రాతరి మాధవేన జంభస్తతః క్రోధవశంజగామ ।
క్రోధాన్వితః శక్రముపాద్రవద్రణే సింహంయథైణోఽతి విపస్నబుద్ధిః ॥
160 - తమాపతంతం ప్రసమీక్ష్యశక్రః త్యక్త్వైవచాపం సశరం మహాత్మా ।
జగ్రాహశక్తిం యమదండకల్పాం తామగ్నిదత్తాం రిపవేససర్జ ॥
161 - శక్తిం సఘంటాం కృతనిస్వనాంవై దృష్ట్వాపతంతీం గదయాజఘాన ।
గదాంచ కృత్వాసహ నైవభస్మసా ద్బిభేదజంభం హృదయేచ తూర్ణమ్ ॥
162 - శక్త్యాసభిన్నో హృదయేసురారిః పపాతభూమ్యాం విగతాసురేవ ।
తంవీక్ష్య భూమౌపతితం విసంజ్ఞం దైత్యాస్తుభీతా విముఖాబభూవుః ॥
163 - జంభేహతే దైత్యబలేచ భగ్నే గణాస్తు హృష్టాహరి మర్చయంతః ।
వీర్యం ప్రశంసంతి శతక్రతోశ్చ సగోత్రభిచ్ఛర్వ ముపేత్యతస్థౌ ॥
తర్వాత, సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులకు మనసానమస్కరించి, ఆ మహాచాపాన్ని సంధించి బాణం తొడిగాడు. అంతనా శతక్రతువు ధనుస్సు నుంచి నెమలి ఈకల రెక్కలతో రెపరెపలాడుతూ పుంఖానుపుంఖాలుగా మహోగ్ర శరాలు వెలువడి శత్రు సంహారకాండ సాగించాయి. బ్రహ్మ విష్ణు శివనామాంకితాలయి శత్రువులనుదునుమాడుతూ వెడలిన ఆ బాణాలు భూమ్యాకాశాలను దిశవిదిశనూ కప్పివేశాయి. నారదా! వాని తాకిడికి ఏనుగులు పీనుగులయ్యాయి, రథాలు విరిగిపోయాయి. అశ్వాల శ్వాసలెగిరిపోయాయి. మావటివాండ్రు విలవిల్లాడుతూ నేలకొరిగిపోయారు. శత్రువాహినిలో అత్యధిక భాగం హతమైపోయింది. ఇంద్రుని బాణాగ్నికి దహించుకపోతున్న తమ సైన్యాన్ని చూచి కుజంభ జంభిలులిద్దరూ భయంకరమైన గదాదండాలు త్రిప్పుతూ క్రోధోన్మత్తులై ఆ మహాత్ముడగు సురనాయకుని సమీపించారు. అలా యింద్రుని మీద కురుకుచున్న వారలను చూచి శ్రీహరి శత్రు వినాశకరమైన సుదర్శన చక్రం వేగంగా త్రిప్పి కుజంభుని మీదకు వదలగా దాని అగ్ని జ్వాలలకు వాడు ప్రాణాలుగోల్పోయి రథం మీద నుంచి క్రిందబడిపోయాడు. అలా మాధవుని చేతిలో తన సోదరుడు చచ్చుట చూచి జంభుడు కోపంతో నిప్పులుమియుచూ, చావుమూడిన లేడి సింహం మీదకు లంఘించినట్టులా దేవరాజు మీద విరుచుకపడ్డాడు. అలా ఎత్తి వస్తూన్న జంభుని చూచి శక్రుడు ధనుర్బాణాలు వదలి మృత్యుదండంలాంటి అగ్నిదత్తమైన శక్తిని తీసికొని వానిమీదికి గట్టిగా విసిరాడు. గంటలు గలగల ధ్వనులతో తనమీదకు వస్తున్న ఆ శక్తిమీదకు వాడు గదను ప్రయోగించాడు. ఆ గదను క్షణకాలంలో భస్మంచేసి ఆ శక్తి సూటిగా వెళ్లి జంభుడి వక్షాన్ని చీల్చివేసింది. దాంతో ఆ దేవ విరోధి విగత ప్రాణుడై నేలకొరగిపోయాడు. వాని మరణం చూచి రాక్షసులు కూడ పలాయనం గావించారు. జంభుడు హతుడై రాక్షస బలాలు విరిగిపోవుటతో ప్రమథ దేవగణాలు జనార్దనుని పూజించారు. ఇంద్రుణ్ణి ప్రశంసించారు. అంతటనా పర్వతభేది శర్వుని ఎదుటకు వెళ్ళి నిలచాడు.
అధ్యాయము 43 Complete
Summary of chapter 44 of the Vāmana Mahā Purana is as follows:
The text details the righteous life of King Suratha, a noble monarch of the Chaitra dynasty who was defeated in battle by rebellious ministers and forced to wander alone in the dense forest. King Suratha found refuge at the peaceful hermitage of Maharshi Medhā, where he met the merchant Samādhi and received profound teachings regarding the divine play of Goddess Mahāmāyā. Interwoven with his journey is the romantic and spiritual narrative of Chitrāṅgadā, highlighting how devotion to the Mother Divine brings restoration of kingdom, spiritual clarity, and divine grace to those who endure adversity with faith.