వామన మహా పురాణము
అధ్యాయము 66
నారద
1 - శ్రుతం యధా భగవతా బలి ర్బద్ధో మహాత్మనా ।
కిం తస్యన్యత్తు ప్రష్టవ్యం తచ్ఛ్రుత్వా కథయాऽద్య మే ।
2 - భగవాన్ దేవరాజాయ విష్ణు ర్దత్వా త్రివిష్టపమ్ ।
అంతర్థానం గతః క్వాऽసౌ సర్వాత్మా తాత! కథ్యతామ్ ।
3 - సుతలస్థశ్చ దైత్యేంద్రః కిమకార్షీత్ తధా వద ! ।
కా చే ష్టా తస్యవిప్రర్షే! తన్మే వ్యాఖ్యాతు మర్హసి ।
నారదుడు
భగవన్! మహాత్ముడగు వాసుదేవుడు బలిని బంధించిన గాధ విన్నాను అయితే యింకొక విషయం అడుగు తున్నా. దయ చేసి చెప్పండి. దేవేంద్రునకు త్రిష్టప రాజ్యం తిరిగి యిచ్చి అంతర్హితుడైన విష్ణుడు ఎక్కడకు వెళ్లాడు? సుతలానకి వెళ్లిన దైత్యపతి ఏమి చేశాడు? యిదంతా విపులంగా చెప్పండి.
పులస్త్య
4 - అంతర్థాయ సురావాసం వామనోऽభూ దవామనః ।
జగామ బ్రహ్మ సదన మధిరుహ్యోరగాశనమ్ ।
5 - వాసుదేవం సమాయాం తం జ్ఞాత్వా బ్రహ్మాऽవ్యయాత్మకః ।
సముత్థాయా థ సౌహార్దాత్ సస్వజే కమలాసనః ।
6 - పరిష్వజ్యాऽర్చ్య విధినా వేధాః పూజాదినా హరిమ్ ।
పప్రచ్ఛ కిం చిరేణేహ భగతా గమనం కృతమ్ ।
7 - అథోవాచ జగ త్స్వా మీ మయా కార్యం మహత్కృతమ్ ।
సురాణాం క్రతు భాగార్థం స్వయంభో ! బలి బంధనమ్ ।
8 - పితామహ స్తద్వచనం శ్రుత్వా ముదిత మానసః ।
కథం కథ మితి ప్రాహ త్వం మాం దర్శితు మర్హసి ।
9 - ఇత్యేవ ముక్తే వచనే భగవాన్ గరుడధ్వజః ।
దర్మయా మాస తద్రూపం సర్వ దేవ మయం లఘు ।
10 - తం దృష్ట్వా పుండరీకాక్షం యోజనాయుత విస్త్రుతమ్ ।
తావా నే వోర్ధ్వ మానేన తతో ऽజః ప్రణతో ऽభవత్ ।
11 - తతః ప్రణమ్య సుచిరం సాధు సాధ్విత్యు దీర్య చ ।
భక్తి నమ్రో మహాదేవం పద్మజః స్తోత్ర మైరయత్ ।
పులస్త్య బ్రహ్మ
నారదా! అంతర్ధాన మైన వెంటనే వామనుడు తన మరుగుజ్జు రూపం వదలి పెట్టి నిజ రూపం తో గరుడారూఢుడై దేవతల కావాసమైన బ్రహ్మ సదనానకి వెళ్లాడు. అవ్యయుడగు నా బ్రహ్మ వాసుదేవాగమనం చూచి లేచి ప్రేమతో ఎదురేగి ఆలింగనం చేసికొని లోనికి గొని వచ్చి విధ్యుక్తంగా పూజించి బహుకాలం తర్వాత వచ్చిన కారణ మేమని అడిగాడు. అందుల కాజగత్పతి దేవతలకు వారల క్రతు భాగా ల నిప్పించుటకై బలిని బంధించి మహత్కార్యం గావించా నని చెప్పగా, నా కమలాసనుడు సంతోషించి బలి బంధనమెలా గావించారో ఆ వివరాలు నాకు చూపి అనుగ్రహించండని ఆర్ధించాడు. అంతట నా గరుడధ్వజుడు సద్వ దేవతా మయ మైన ఆ విశ్వరూపాన్ని లఘు ప్రమాణం లో (చిన్నదిగా) బహ్మకు చూపించాడు. పదివేల యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో వ్యాపించి నిలచిన ఆ పుండరీ కాక్షుని చూచి విధాత భక్తి నమ్రుడై ప్రణమిల్లాడు. చాల సేపు అలా సాగిల పడి ఆహా ఆహాహా!!! అంటూ లేచి ఆ పద్మజుడు చేతులు జోడించుకుని ఆ మహాదేవుని యిలా స్తోత్రం చేశాడు.
12 - ఓం నమస్తే దేవాధి దేవ! వాసుదేవ!! ఏకశృంగ! బహురూప! వృషాకపే! భూతభావన! సురాసురవృష! సురాసురమథన! పీతవాసః! శ్రీనివాస! అసురనిర్మితాంత! అమిత! నిర్మిత! కపిల! మహాకపిల! విష్వక్సేన! నారాయణ!
13 - ధ్రువధ్వజ! సత్య! ధ్వజ! ఖడ్గధ్వజ! తాలధ్వజ! వైకుంఠ! పురుషోత్తమా! వరేణ్య! విష్ణో! అపరాజిత! జయ! జయంత! విజయ! కృతావర్త! మహాదేవ! అనాదే! అనంత!ఆద్యంత మధ్య ని ధన! పురంజయ! దనం జయ! శుచిశ్రవ! పృశ్నిగర్భ! ।
14 - కమలగర్భ! కమలాయతాక్ష! శ్రీపతే! విష్ణుమూల! మూలాధివాస! ధర్మాధివాస! ధర్మవాస! ధర్మాధ్యక్ష! ప్రజాధ్యక్ష! గదా ధర! శ్రీధర! శ్రుతిధర! వనమాలాధర! లక్ష్మీధర! ధరణీ ధర! పద్మనాభ! ।
15 - విరించే! ఆర్ప్టిషేణ! మహాసేన! సేనాధ్యక్ష! పురుష్టుత! బహుకల్ప! మహాకల్ప! కల్పనా ముఖ! అనిరుద్ద! సర్వగ! సర్వాత్మణ్! ద్వాదశా త్మక! సూర్యా త్మక! సోమా త్మక! కాలా త్మక! వ్యోమా త్మక భూతా త్మక! ।
16 - రసాత్మక! పరమాత్మన్! సనాతన! మంజుకేశ! హరికేశ! గుడాకేశ! కేశవ! నీల! సూక్ష్మ స్థూల! పీత! రక్త! శ్వేత! శ్వేతాధివాస! రక్తాం బర! ప్రియ! ప్రీతికర! ప్రీతివాస! హంస! నీలవాస! సీరధ్వజ! సర్వలోకాధివాస! ।
17 - కుశేశయ! అధోక్షజ! గోవింద! జనార్దన! మధుసూదన! వామన! నమస్తే! సహస్రశీర్షోऽసి! సహస్రదృగసి! సహస్రపాదోऽసి త్వం! కమలోऽసి! మహా పురుషోऽసి! సహస్ర బాహు రసి సహస్ర మూర్తి రసి త్వం దేవాః ప్రాహుః సహస్ర వదనం తే నమస్తే! ।
ఓం (ప్రణవశబ్దస్వరూపివగునో) దేవాధి దేవా! వాసుదేవా ! ఏకశృంగ ! బహురూపా! వృషాకపీ ! సర్వస్రష్టా! సురాసుర శ్రేష్ఠా! సురాసుర నాశక! పీతాంబరధరా శ్రీనివాసా ! రాక్షసనిర్మాణ నాశకా ! అమితనిర్మాణకర్తా ! కపిలా ! మహా కపిలా! విష్వక్సేనా! నారాయణా! ధ్రువధ్వజా ! సత్యధ్వజా ! ఖడ్గ ధ్వజా ! తాళధ్వజా ! వైకుంఠా! పురుషోత్తమా ! వరేణ్యా ! విష్ణూ !అపరాజితా ! జయా ! జయంతా ! విజయా! కృతావర్తా! (పాలభాగాన రెండుసొట్టలు గలవాడా)మహాదేవా! ఆదిలేని వాడా! అంతరహితా! ఆదిమధ్యాంతరహితా! పురంజయా! ధనంజయా ! పవిత్రశ్రవణా ! పృశ్నిగర్భా (పృశ్నికడుపునపుట్టిన వాడా)కమలగర్భా! కమలాయతనేత్రా ! శ్రీపతి ! విష్ణుమూలా ! మూలాధివాసా ! ధర్మాధివాసా ! ధర్మవాసా ! ధర్మాధ్యక్షా! గదాపాణే ! లక్ష్మీధరా ! వేదధరా! వనమాలా ధరా ! ధరణీ ధరా ! పద్మనాభా ! విరించీ! ఆర్షిషేణా ! మహాసేనా ! సేనాధ్యక్షా ! బహుస్తుతా ! బహుకల్పా ! మహాకల్పా(బాగా అలంకృతుడైన వాడా) కల్పనాముఖా ! అనిరుద్దా! సర్వగ ! సర్వాత్మా! ద్వాదశ ! సూర్యాత్మకా ! చంద్రరూపా! కాలరూపా ! వ్యోమాత్మకా ! జీవరూపా! రసాత్మకా ! పరమాత్మా! సనాతనా ! ముంజకేశా ! హరికేశా ! గుడాకేశా (నిద్రను జయించినవాడా) కేశవా (కేశములు గలవాడా) నీలా! సూక్ష్మా ! స్థూలా ! పీతా (పసుపురంగు) రక్తా! శ్వేతా! శ్వేతద్వీపాధివాసా! రక్తాంబరప్రియా! ప్రీతికరా! ప్రీతివాసా! ప్రీతియే నివాసమైనవాడా) ! హంసా! నీలవాసా! (నీలవస్త్రధరా) ! సీరధ్వజా (నాగలి పతాకగా కలవాడా)! సర్వలోకాధివాసా ! కుశేశయా ! అధోక్షజా (దిగువ అంగాన్నుంచి పుట్టిన వాడా) గోవిందా (యింద్రియాలకు ఆనందం యిచ్చువాడా) జనార్దనా! జనుల నుమర్దించువాడా ! మధుసూదనా ! వామనా నీకు నమస్సులు! నీవు వేయి తలలు గలవాడవు. వేయి కన్నుల స్వామివి. వేయి పాదాలు గల ప్రభువవు. తామర పుష్పానివి. మహా పురుషుడవు. వేయి చేతుల దేవుడవు. వేయి రూపాల స్వామివి ! నిన్ను దేవతలు సహస్ర వదనుడ వని కీర్తిస్తారు. అట్టి నీకు ప్రణామాలు.
18 - ఓం నమస్తే విశ్వేదేవ! విశ్వభూః! విశ్వాత్మక! విశ్వరూప! విశ్వసంభవ! త్వత్తోవిశ్వ మిద మభవద్ బ్రాహ్మణా స్త్వన్ము ఖే భ్యోऽభవన్, క్షత్రియా దోః సంభూతాః ।
ఊరు యుగ్మాద్ విశోऽభవన్, శూద్రా శ్చరణ కమలేభ్యః ।
19 - నాభ్యా భవతోऽతరి క్ష మజాయత ।
ఇంద్రాగ్నీ వక్త్రతో ।
నేత్రాద్ భాను రభూ న్మనసః శశాంకః అహం ప్రసాదజస్తవ, క్రోధాత్ త్య్రుంబకః ।
ప్రాణా జ్జాతో భవతో మాతరిశ్వా, శిరసో ద్యౌ రజాయత, శ్రోత్రా ద్దిశో ।
భూ రియం చరణా దభూత్ శ్రోత్రోద్భవా దిశో భవతః స్వయం ఖే నక్షత్రా స్తే జోద్భవాః ।
20 - మూర్తయ శ్చా మూర్తయశ్చ సర్వే త్వత్తః సముద్భూతాః అతో విశ్వాత్మకోऽసి ।
ఓం నమస్తే పుష్టహాసోऽసి ।
మహా హాసోऽసి ।
పరమోऽసి, ఓం కారొऽసి, వషట్కారోऽసి, స్వాహాకారోऽసి, వౌషట్ కారోऽసి ।
స్వధాకారోऽసి ।
వేదమయోసి ।
తీర్ధ మయోऽసి ।
యజమాన మయోऽసి ।
21 - యజ్ఞ మయోऽసి ।
సర్వధాతాऽసి, యజ్ఞ భోక్తాऽసి ।
శుక్ర ధాతాऽసి ।
భూర్భు వర్య స్వర్గ స్వర్ణద గోద! అమృత దోऽసీతి ।
ఓం బ్రహ్మాది రసి ॥ బ్రహ్మమయోऽసి ॥ యజ్ఞోऽసి, వేద కామోऽసి, వేద్యోऽసి, యజ్ఞ ధారోऽసి ॥, మహామీనోసి, మహా సేనోऽసి ॥, మహాశిరా అసి ।
22 - నృకేసర్యసి ॥ హోతాऽసి ॥ హోమ్యోऽసి ॥ హవ్యోऽసి ॥ హూయమానోऽసి ॥ హయ మేధోऽసి ॥ పోతాऽసి ॥ పావయితాऽసి ॥ పూతోऽసి ॥ పూజ్యోऽసి ॥ దాతాऽసి ॥ హన్యమానోऽసి ॥ హ్రియమాణోऽసి ॥ హర్తా సీతి ॥ ఓం నీతి రసి నేతాऽసి ॥ అగ్య్రోऽసి ॥ విశ్వధామాऽసి ॥ శుభాండోऽసి ॥ ధ్రువోऽసి ॥ ఆరణేయోऽసి ।
ఓం రూపా! నీకు నమస్కారము. విశ్వదేవేశా ! విశ్వస్రష్టా ! విశ్వాత్మకా ! విశ్వరూపా ! విశ్వసంభవా ! నీనుంచియే ఈ విశ్వం అవిర్భవించింది. బ్రాహ్మణులు నీ ముఖాన్నుంచి పుట్టారు. బాహువుల నుంచి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, చరణాల నుండి శూద్రులు ఉద్భవించారు. నీ నాభి నుండి అంతరిక్షం, నోటి నుండి యింద్రాగ్నులు, కన్నుల నుండి సూర్యుడు, మనస్సు నుంచి చంద్రుడు జన్మించారు. నీ ప్రసాదం వల్ల నేను కలిగాను. నీకోపం నుంచి త్రినేత్రుడు, ప్రాణాల నుండి మాతరిశ్వుడు, శిరస్సు నుండి దివి పుట్టినవి. చెవుల నుండి దిక్కులు, చరణాల నుండి ఈ భూమి కలిగాయి. ఓ స్వయంభూ ! చెవుల నుండి దిశలు, తేజస్సు నుండి నక్షత్ర గణం జనించాయి. సాకార నిరాకార వస్తు జాల మంతా నీ వల్ల ఉద్భవించినదే. కనుక నీవు విశ్వాత్మకుడవు. ఓం స్వరూపా! నీకు నమస్కారము. పుష్పాల హాసం నీవే. వికటాట్ట హసం నీవు. పరముడవు. ఓంకార రూపివి నీవు. వషట్కారం, స్వాహాకారం, వౌషట్కారం, స్వధాకారం, నీవే. వేద మయుడవు నీవు. తీర్ద మయుడవు (యజ్ఞం చేయు). యజమానుడవు. నీవు యజ్ఞం. నీవే సర్వం నడపునది. నీవే మఖ భోజివి. శుక్రం నీ వల్లనే కలుగును. భూమి, భువము, స్వర్గము, స్వర్ణము, గోవులు, అమృతము అన్నీయిచ్చునది నీవే. ప్రణవస్వరూపా ! బ్రహ్మకు మూల కారణం నీవు. బ్రహ్మ మయుడవు నీవు. నీవు యజ్ఞానివి. వేద కాముడవు. వేద్యుడవు. యజ్ఞ ధారకుడవు. మహా మత్స్య మూర్తివి. మహాసేనుడవు. మహా శిరుడవు. నరకేసరివి. హోతవు. హోమానికి లక్ష్యానివిహవ్యానివి. హూయమానుడవు. అశ్వమేధయజ్ఞానివి. పోత (పురోహితుడు) వు. పవిత్రం చేయువాడవు. పవిత్రుడవు. పూజ్యుడవు. దాతవు. చంపబడు వాడవు. హరింపబడువాడవు. హరించువాడవు నీవే. ప్రణవరూపా! నీవు నీతివి. నేతవు. ప్రధముడవు(అగ్య్ర) విశ్వ ధాముడవు. శుభాండుడవు. ధ్రువుడవు. అరణి వల్ల జనించిన(అగ్ని) వాడవు.
23 - ధ్యానోऽసి, ద్యేయోऽసి, జ్ఞేయోऽసి, జ్ఞానోऽసి, యష్టాऽసి, దానోऽసి, భూమాऽసి, ఈక్ష్యోऽసి, బ్రహ్మాऽసి, హోతాऽసి, ఉద్గాతాऽట, గతిమతాం గతిరసి, జ్ఞానినాం జ్ఞాన ముపి, యోగినాం యోగోऽసి, మోక్ష గామినాం మోక్షోऽసి, శ్రీమతాం శ్రీ రసి, గృహ్యోసి, పాతాऽసి, పర మసి ।
24 - సోమోऽసి, సూర్యోऽసి, దీక్షాऽసి, దక్షిణాऽసి, నరోऽసి, త్రినయనోऽసి, మహానయనోऽసి, ఆదిత్య ప్రభవోऽసి, సురోత్తమోऽసి, శుచిరసి, శుక్రోऽసి, నభోऽసి, నభస్యోऽసి, ఇషోऽసి, ఊర్జోऽసి, సహోऽసి, సహస్యోऽసి, తపోऽసి, తపస్యోऽసి, మధు రసి ।
25 - మాధవోऽసి, కాలోऽసి, సంక్రమోऽసి, విక్రమోऽసి, పరాక్రమోऽసి, అశ్వగ్రీవోऽసి, మహా మేధోऽసి, శంకరోऽసి, హరీశ్వరోऽసి, శంభు రసి, బ్రహ్మేశోऽసి, సూర్యోऽసి, మిత్రా వరుణోऽసి, ప్రాగ్వంశకా యోऽసి, భూతాదిరసి, మహా భూతోऽసి, ఊర్ద్వ కర్మాऽసి కర్తాऽసి ।
సర్వ పాప విమోచనోऽసి త్రివిక్ర మోऽసి ఓం నమస్తే ।
ఓ మహాత్మా! నీవు ధ్యాన స్వరూపివి, ద్యేయుడవు, తెలిసికో దగిన వాడవు, తెలివిని యజ్ఞం చేయువాడవు, దానానివి, భూమా వాచ్యుడవు (సమృద్దివి), చూడ దగిన వాడవు, బ్రహ్మవు, హోతవు, ఉద్గాత (యజ్ఞంలో సామగానం చేయు వాడు)వు, కదలే వారిలోని కదలికవు, జ్ఞానులలోని జ్ఞానానివి, యోగి జనులలో యోగానివి, మోక్షగాములకు లభించే మోక్షానివి, శ్రీమంతులలోని సంపదవు, గ్రహింప బడు వాడవు, రక్షకుడవు, పరముడవు, నీకు నమస్సులు. దేవా! సోమ సూర్యులు నీవు. (యజ్ఞ) దీక్ష దక్షిణలు నీవు. నీవు నరుడవు, త్రినేత్రుడవు, మహా నేత్రుడవు, ఆదిత్యులను, స్వజించు వాడవు, దేవోత్తముడవు, పవిత్రుడవు, శుక్రుడవు, శ్రావణ భాద్రపద మాసములు నీవు. ఆశ్వయుజము, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఛైత్రం, వైశాఖ, మాసముల, రూపాన విరాజిల్లే కాలానివి. సంక్రమణానివి. విక్రమం, పరాక్రమానివి. అశ్వగ్రీవుడవు, మహామేధం (యజ్ఞం) నీవే. నీవు మంగళ కరుడవు. హరీశ్వరుడవు, శంభుడవు, బ్రహ్మేశ్వరుడవు, సూర్యుడవు (మిత్రావరుణుడు), వసిష్ఠుడవు, ముందటి వంశ రూపివి, సకల భూత గణానికి ఆదివి, మహా భూతానివి, మహాత్కార్యాలు చేయు వాడవు, కర్తవు, సర్వ పాప విమోచకుడవగు త్రివిక్రమ దేవుడవు, ప్రణవరూపా నీకు నమస్సులు !!!
పులస్త్య
26 - ఇత్ధం స్తుతః పద్మభవేన విష్ణు స్తపస్విభి శ్చాద్భుత కర్మకారీ ।
ప్రోవాచ దేవం ప్రపితామహం తు వరం వృణీ ష్వామల సత్వవృత్తే! ।
27 - తమబ్రవీత్ ప్రీతి యుతః పితామహో ।
వరం మమేహా ద్య విభో! ప్రయ చ్చ ।
రూపేణ పుణ్యేన విభో! హ్యనేన సంస్థీయతాం మద్బవనే మురారే! ।
28 - ఇత్థం వృతే దేవవరేణ ప్రాదాత్ ప్రభు స్తథాస్త్వితి తమవ్యయాత్మా ।
తస్థౌ హి రూపేణ హి వామనేన సంపూజ్యమానః సదనే స్వయంభోః ।
29 - నృత్యంతి తత్రా ప్సర సాం సమూహా ।
గాయంతి గానాని సురేంద్ర గాయనాః ।
విద్యాధరా స్తూర్య వరాంశ్చ వాదయన్ ।
స్తువంతి దేవాసుర సిద్ధ సంఘాః ।
30 - తతః సమారాధ్య విభుం సురాధిపః ।
పితామహో దౌత మనః సశుద్దః ।
స్వర్గే విరించిః సదనా త్సుపుష్టా ణ్యానీయ పూజాం ప్రచకార విష్ణోః ।
31- స్వర్గే సహస్రం స తు యోజనానాం ।
విష్ణోః ప్రమాణేన హి వామనోऽభూత్ ।
తత్రా స్య శక్రః ప్రచకార పూజాం స్వయంభువ స్తుల్య గుణాం మహర్షే! ।
32 - ఏత త్తవో క్తం భగవాం స్త్రి విక్రమ ।
శ్చకార య ద్దేవ హితం మహాత్మా ।
రసాతలస్దో దితిజ శ్చకార యత్తచ్చ్రుణుష్వా ద్య వదామి విప్ర! ।
పులస్త్యుడు
ఓ నారదా ! పద్మభవు డీవిధం గా స్తుతించిన మీదట పరమాద్భుత కర్ము డగు విష్ణుడు ప్రసన్నుడై పితామహునితో వరము కోరుకోమన్నాడు. అందుల కా బ్రహ్మ ప్రీతి యుతుడై ఓ విభో ! ఇప్పుడు నాకు చూపిన ఈ పుణ్యావహమైన రూపం తో నా భవనంలో సదా నివసింపు మని ప్రార్ధించాడు. అంత నా దేవశ్రేష్ఠు డగు ముర మధనుడు తధాస్తని అదే వామన రూపం తో స్వయంభువుడగు బ్రహ్మగా వించు పూజ లందుకుంటూ విరించి గృహంలో ఉండి పోయాడు. అచట అప్సరో మణులు గుంపులు గట్టి నాట్యాలు చేస్తుంటారు. దేవ గాయకులు మధుర గీతాలు పాడు తుంటారు. విద్యాధరులు వివిధా లయిన మంగళ వాద్యాలు మ్రోగిస్తుంటారు. దేవ దానవ సిద్దులు గుములు గట్టి ప్రభువును స్త్రోత్రం చేస్తూంటారు. ఆ విధంగా పరమేశ్వరుని ఆరాధించి సురాధిపతి యగు పితామహుడు కల్మష రహితు డయ్యాడు. స్వర్గంలో సహస్ర యోజన పరిమితమైన వామనుడుగా విష్ణుడు ఆవిర్భవించ గా యింద్రుడు కూడా విరించి చేసినట్లా మురహరునకు దేవ సంఘ హితార్థం సకలోపచార పూజలు చేశాడు. ఓ నారదా ! ఈ విధంగా దేవ కార్యం సిద్దింప జేయుటకు మహాత్ముడగు వాసుదేవు డొనర్చిన అద్భుత కర్మను నీకు తెలియ చెప్పినాను. ఇక రసాతలానకి వెళ్లిన దాతలలో శ్రేష్ఠు డగు దైత్యేశ్వరుడు చేసిన కార్య వివరణ వినుము.
అధ్యాయము 66 Complete
Summary of chapter 70 of the Vāmana Mahā Purana is as follows:
Following His birth ceremonies, Vāmana Prabhu instructs Mother Aditi and Maharshi Kaśyapa on the divine structure of His cosmic abodes, detailing the spiritual realms of Swarga, Sutala, and transcendental Vaikuṇṭha. He explains how each realm is governed by specific divine laws and how His supreme energy pervades all fourteen worlds simultaneously. Revealing that His upcoming interaction with King Bali is designed to bestow ultimate grace upon the demon king while restoring the devas, Vāmana Prabhu sets forth toward the sacrificial grounds on the banks of the Narmadā river.